posted on Jan 10, 2012
సగటు ఉద్యోగిని
-బి.ఎల్.ఎన్.సత్యప్రియ
ఆఫీసుల్లో-
బాస్ చూపులు-
బాకుల్లా దిగుతాయి-
రోడ్లపై-
ఈవ్ టీజింగ్ లు-
ఈటెల్లా పొడుస్తాయి-
ఇక-
ఇరుగు పొరుగుల
ఈర్ష్యాసూయలు
ఏ.కె.ఫార్టీసెవెన్
గన్స్ లా పేల్తాయి-
అందుకే-
అనుక్షణం
ఆమె హృదయం
సలపరింతలవ్రణం-