posted on May 5, 2013
మనసు చిత్రాల నానీలు
రచన - డాక్టర్ వై రామకృష్ణారావు
పువ్వులే నవ్వులని
మోసపోకు
భూమి గుండెల్ని
చీలుస్తోంది చెట్టు.
అందరి కళ్ళూ
సాగరాలయ్యాయి
అందుకే
కన్నీళ్లు ఉప్పగా.
వంక లేకుండా
ఎవరుంటారు ?
శంకరుడుకీ ఉంది
నెలవంక.