కరిగిపోవాలనుంది .ప్రియా - దాసరి సులోచన

కరిగిపోవాలనుంది....ప్రియా

 

దాసరి సులోచన

 

 

ఉదయం నుండి అలసిపోయిన

సూర్యుడు చిన్నగా యింటికి

దారిపడుతున్న వేళ ..యిదే అదనుగా

చల్లని చిరుగాలి చొరవగా

 

ఆదమరిచి మేనుని మెల్లగా

తాకుతుంటే తుంటరి కోరికలు

రెక్కలు కట్టుకుని

ఎక్కడికో ఎగిరిపోతున్నాయి

 

ఏవో జ్ఞాపకాల నీడలో

కన్నీళ్ళు నెమ్మదిగా జాలువారుతున్నాయి

నీ వెచ్చని కౌగిలిలో

కరిగిపోవాలనుంది ప్రియా

 

మెత్తని ఒత్తిడుల మధ్య

మత్తుగా ఒరిగి పోవాలనుంది