వ్యసనాలు మూడు రకాలు

వ్యసనాలు మూడు రకాలు...

 


1. సమాజం ఛీ కొట్టేవి : డ్రగ్స్ తీసుకోవటం, వేశ్యల వద్దకి వెళ్లటం వగైరా వగైరా
2. సమాజం పట్టించుకోనివి : సిగరెట్ , మందు తాగటం, పొగాకు నమలటం వగైరా వగైరా
3. సమాజం వ్యసనంగా అసలు గుర్తించనవి : అతిగా తినటం, మాట్లాడటం, డ్రెస్సింగ్ చేసుకోటం, సెంట్లు, పర్ఫ్యూమ్ లు కొట్టుకోవటం వగైరా వగైరా


మూడు రకాల వ్యసనాల మీదా మనిషికి ఆశ వున్నా... సమాజం ఛీ కొట్టేవాటికి మనిషి ఎక్కువ దూరంగా వుంటాడు! సమాజం పట్టించుకోని వాటికి తెగించి దగ్గరవుతాడు! సమాజం వ్యసనంగా గుర్తించని వాటికి విచ్చలవిడిగా బానిసవుతాడు!
అందుకే, ఎక్కువ నష్టం... మూడో రకం వ్యసనాలతోనే వస్తుంటుంది!