మూల్యం
posted on Jan 20, 2017
మూల్యం
సూర్యుడు అస్తమించాక కూడా పని చేసుకోవాలనుకున్న మనిషి ....
విద్యుత్ ను కనుగొన్నాడు!
బల్బులు వెగిలించాడు!
రాత్రిని పగలు చేసేశాడు!
ఆ మాయలో పడి ఇప్పుడు సూర్యుడు ఉదయించాక మాత్రం పని చేయటం మానేశాడు!
పడుకోవాల్సిన వేళ లేచి వుంటున్నాడు!
లేచి వుండాల్సిన సమయంలో పడుకుంటున్నాడు!
కరెంట్ బిల్లు... హాస్పిటల్ బిల్లు... రెండు చెల్లిస్తున్నాడు!
'మూల్యం' చెల్లించటం అంటే ఇదే!
-జేఎస్ చతుర్వేది