తాజ్మహల్ - నవీన్
posted on Jan 10, 2012
తాజ్ మహల్
నవీన్
అందమైన చరితమున్న పాలరాతి భవనమా!
విశ్వంలో వింతైన ప్రేమికుల చిహ్నమా
వెన్నెల్లో నిరూపానికింత సౌందర్యమా?
వైదొలిగి చంద్రుని రామణియతనందించుమా !
వెన్నేలేదని అడిగింది రేయి
రావే ఓ చంద్రమా రాతిరొచ్చింది!
నీమోము చూపించి పలికించు నామది కాంతను
కలవరపర్చక రావే ఓ వెండి వెన్నెలా!
మనుసుని మురిపించి వెన్నెల
కురిపించే జజిని మించిన జాబిల్లి
మగువను మించిన సౌందర్యమా !
ఓ వర్ణనకందని వయ్యారమా!
ఓ కంతకందని కావ్యమా!
గాలిపాటగా నీకు జోలపాడతా
నిదురలోకి నిన్ను సాకగా.