" ఏడు రోజులు " 32వ భాగం

" ఏడు రోజులు " 32వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి       ఆయా ఎవరో ఇన్ పేషెంట్ తో మాట్లాడుతోంది. నెమ్మదిగా ఆమెవైపు నడిచాడు అతడు.     "పెద్ద డాక్టరు ఇప్పుడు దొరకడు అని చెప్పాను కదా" అతడ్ని చూడగానే అంది ఆయా.     "చిన్న డాక్టర్ వస్తాడు కదా" అన్నాడు యువకుడు.     "ఇద్దరూ ఆపరేషన్ థియేటర్ లోనే వున్నారు"     "ఇదేం హాస్పిటల్? ఈ సమయంలో ఇన్ పేషెంట్ ఎవ్వరికైనా సీరియస్ అయితే?"     "లోపలికి నంబరుంది. సీరియస్ అనుకుంటే కలుపుతాను" అంది ఆయా.     "మంచిది" అని కాసేపాగి, "అవునూ, ఉదయాన్నే ఎవరైనా టైఫాయిడ్ పేషెంట్ వచ్చారా ఇక్కడికి?" అడిగాడు అతడు.     "ఎవ్వరూ రాలేదే" అంది ఆయా.     "ఇప్పుడు వస్తాడు" అంటూ వెళ్ళి అక్కడున్న విజిటర్ చెయిర్స్ వరసలో కూర్చున్నాడు అతడు.     పదిహేను నిముషాలు గడిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్ లోంచి కాంపౌండర్ వెలుపలికివచ్చి, ఆయాకు మందుల చీటి ఇస్తూ, "ఈ మందులు మన మెడికల్ హాల్లో లేవు. అవతలి వీధిలో వున్న మెడికల్ హాల్లో ఈ మందులు దొరుకుతాయి. వెంటనే వెళ్ళి తీసుకురాపో" అని చెప్పి, ఆ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు.     ఆయా వడివడిగా బయటకు నడిచింది. అట్లాంటి అవకాశంకోసమే ఎదురుచూస్తున్న అతగాడు, ఆయా అలా బయటకు వెళ్ళగానే ఇలా గౌసియా దగ్గరకి నడిచాడు.     "ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు?" అడిగింది గౌసియా.     "ఫోన్లో అన్నయ్యతో మాట్లాడాను. తను ఎమర్జెన్సీ కేసులో వున్నాడు కాబట్టి నామీద తీవ్రంగా కోప్పడ్డాడు. ఆ కోపంలోనే 'ఆ అమ్మాయి ఇక్కడే వుండాలి. ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు' అని చెప్పాడు" అన్నాడు అతడు.     "మరి ఇప్పుడెలా?"     "ఇంకేం ఆలోచించేది లేదు, వెళ్దాం"     "సరే"     "నేను ఆటో తీసుకువస్తాను" అంటూ మెరుపు వేగంతో బయటకు నడిచి, రోడ్డెంబడి వెళ్తున్న ఆటోని చప్పట్లు చరుస్తూ "ఆటో" పిలిచాడు.     ఆటో ఇటు తిరిగింది. అతడు వెంటనే లోపలికి నడిచాడు.     "ఆయాకు చెప్పాలా?" అడిగింది గౌసియా.     "చెప్పాను. తీసుకువెళ్ళమంది"     "నాకు నడవడం చేతకాదు. పట్టుకుని మెల్లగా నడిపించు"     "ఎత్తుకు వెళ్తాలే" అంటూనే గౌసియాని తన రెండుచేతులమీదకు గబుక్కున ఎత్తుకున్నాడు అతడు.     అతడి ఓ చేయి నడుందగ్గరి ఆమె గాయంమీద ఒత్తిడిని పెంచింది. ఆమె భరించలేకపోయింది.     "అ...మ్మా..." బాధగా అరిచింది.     "ఏమయ్యింది?" గాభరాపడ్డాడు.     "ఈ చేయి తీయండి..." బాధపడుతూనే అతడి చేతిని దూరం జరుపుకుంది.     అప్పుడు గమనించాడు అతడు ఆమె గాయాన్ని. "ఓ సారీ! చూళ్ళేదు" అంటూ తనచేయిని దూరం జరిపి, ఆ వెంటనే డోర్ దాకా నడిచి, అటూఇటూ చూసి, ఎవ్వరూ తమని గమనించడం లేదు. ఆయా కూడా రావడంలేదు అని నిర్ధారించుకున్నాక, పరుగున వెలుపలికి నడిచాడు.             *    *    *     మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాడు ముంతాజ్.     "ఏమంటోందిరా నీ లవ్వర్?" ముంతాజ్ రాగానే, తన చేతిలోని ఏదో మేగజైన్ ను పక్కకు పెడుతూ అడిగాడు భవానీశంకర్.     "ప్చ్... డిస్చార్జి అయ్యింది" నిరాశగా చెప్పాడు ముంతాజ్.     "భగ్న ప్రేమికుడివి అన్నమాట" టీజ్ చేసాడు భవానీశంకర్.     "ఏదోగాని, గోపాల్ గాడు ఫోన్ చేసాడు" చెప్పాడు ముంతాజ్.     "ఏమన్నాడు?" ఆత్రంగా చెయిర్ లోంచి లేచి ముంతాజ్ చేతుల్ని పట్టుకున్నాడు భవానీశంకర్.     "గౌసియా ఇంకా హైద్రాబాద్ కు రాలేదట"     "అదేం?"     "నాకేం తెల్సురా?"     "ఇంకా ఏం చెప్పాడు?"     "మీ అమ్మా, నాన్నలకు నీ గురించి చెప్పగానే చాలా సంతోషించారట! నిన్ను ఇప్పుడే ఇంటికి రావొద్దని చెప్పారంట! గౌసియా వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉందట! వాళ్ళ తండ్రి మరణం వాళ్ళను విపరీతంగా కృంగదీస్తుంటే మనుషులు కాలేకపోతున్నారంట"     "బిడ్డను అమ్ముకుని మాత్రం ధైర్యంగా ఉండగలిగారా?" వెంటనే కసిగా అన్నాడు భవానీశంకర్.     "అదే నాకు అర్థంకాలేదు" అన్నాడు ముంతాజ్.     "మొత్తానికి గౌసియా ఇంకా బాంబేలోనే వుందేమో?" అన్నాడు భవానీశంకర్.     "ఇంక అక్కడే వుంటుంది కదా" అంటూ చొక్కా గుండీలు తీసుకోసాగాడు ముంతాజ్.     "ఇంకా ఏమేం మాట్లాడాడు?" భవానీశంకర్ లో ఆసక్తి.     "ఇంకేం మాట్లాడలేదు. మళ్ళీ రేపు ఫోన్ చేస్తానన్నాడు. మరి కనీసం రేపైనా దవఖానకు వస్తే బాగుంటుంది" అంటూ చొక్కా వదిలి హ్యాంగర్ కు తగిలించాడు ముంతాజ్.     "రావాలనే వుంది. కాని భయంగా వుందిరా! అయినా రావడానికి ప్రయత్నిస్తాను! కాపోతే ఇప్పుడు ఒక నంబరు ఇస్తాను. ఆ నంబరుకు ఒకసారి ట్రై చేసి వివరంగా మాట్లాడు. అక్కడ సిరాజ్ అని నా ఫ్రెండు వుంటాడు. వాడు లేకపోతే వాడి అక్క పర్వీనా వుంటుంది. ఇద్దరిలో ఎవరు వున్నా అక్కడి పరిస్థితి గురించి పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు వుండేది మాకు దగ్గరే, పైగా వాళ్ళు గౌసియా వాళ్ళకు బాగా తెలుసు" చెప్పాడు భవానీశంకర్.     "వాళ్ళు ముస్లింలు కదా?" అన్నాడు ముంతాజ్.     "నీలాగే వాళ్ళకు కూడా హిందూముస్లీం తేడాలులేవు. మంచి మనసే మతం, కలిసి వుండటమే కులం అని అనుకుంటారు. ఇంకో విషయం తెల్సా? మా ప్రేమలో సహాయపడింది కూడా వాళ్ళే" చెప్తూనే అదే హ్యాంగర్ కు తగిలించి వున్న తన ప్యాంటు జేబులోని పర్సును ఫోన్ నంబర్ కోసం బయటకు తీయబోయాడు భవానీశంకర్ కాగా, పర్సు పొరపాటున జారి కిందపడిపోయింది.     "నీ పర్స్ బాగుందిరా" అంటూ వంగి కిందబడిన పర్సును చేతుల్లోకి తీసుకుని తెరిచి చూసిన ముంతాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.     "ఏమయ్యిందిరా?" కలవరపడ్డాడు భవానీశంకర్.     "ఈ... ఈ... మె...?" ముంతాజ్ తడబడ్డాడు.     "గౌసియా" చెప్పాడు భవానీశంకర్.     "సారీరా" వెంటనే స్నేహితుడి చేతుల్ని పట్టుకున్నాడు ముంతాజ్.     అర్థంకానట్టుగా చూశాడు భవానీశంకర్.     "దవఖానాకు వచ్చింది ఈ అమ్మాయేరా" ఆయాసపడినట్లుగా చెప్పాడు ముంతాజ్.     "ఆ?" నమ్మలేకపోయాడు భవానీశంకర్.     "నిజం! ఈ అమ్మాయే! నేను బాగా గుర్తుపట్టగలను"     "బాంబేలో వున్న గౌసియా ఇక్కడికి ఎలా వస్తుంది?"     "అదంతా నాకు తెలీదు. నేను చూసింది ఈ అమ్మాయినే, పొరపాటున మనసు పారేసుకున్నదీ ఈ అమ్మాయిపైనే! నీకు నమ్మకం కుదరకపోతే స్వయంగా వెళ్ళి చూసాకే నమ్ము"     "డిస్చార్జి అయ్యింది అన్నావు కదా"     "ఇదే వూర్లో వేరే దవాఖానలో వుంటుంది. ఇప్పుడే వెళ్దాం" అంటూనే తిరిగి చొక్కా వేసుకున్నాడు ముంతాజ్.     "ఏంచేస్తుంది అక్కడ?" అడిగాడు భవానీశంకర్.     "ఏంచేయదు. అక్కడ కూడా తను పేషెంటే" చెప్పాడు ముంతాజ్.     అర్థంకానట్టుగా చూశాడు భవానీశంకర్.     "ఆలస్యం అమృతం...విషం... పదరా" అంటూనే బయటకు నడిచాడు ముంతాజ్.     వెనకే నడిచాడు భవానీశంకర్.             *    *    *

" ఏడు రోజులు " 31వ భాగం

" ఏడు రోజులు " 31వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి      "నీకు ఎవ్వరూ సహాయం చేయకపోయినా నేను సహాయం చేస్తాన్రా" అన్నాడు ముంతాజ్.     "గోపాల్ గాడు ఒకవేళ ఫోన్ చేయకపోతే నువ్వొకసారి హైదరాబాద్ వెళ్లిరావాలి"     "ఎలాగూ రేపు పనిమీద వెళ్తున్నాను. మీ అమ్మావాళ్లను కూడా కల్సివస్తాను"     "గోపాల్ గాడిని కూడా కలిసి నా గురించి ఎక్కడా చెప్పవద్దని చెప్పు. ఈ మాట మా అమ్మవాళ్లకు కూడా చెప్పు"     "వాళ్లకు అంతా తెల్సులే" ముంతాజ్ అంటుంటేనే "బేటా! కాళ్లు కడుక్కోండి. నాస్టా చేద్దురుగానీ" పిలుస్తూ వచ్చింది ముంతాజ్ తల్లి హుస్సేన్ బీ.     భవానీశంకర్, ముంతాజ్ ఇద్దరూ లేచి లోపలికి నడిచారు. హుస్సేన్ బీ బోటీ కలిపిన గోంగూర కూరను, చపాతీల్ని, చాపపై సర్దసాగింది. చేతులు కడుక్కుని వచ్చి చాపపై అభిముఖంగా కూర్చుని తినడం ఆరంభించారు మిత్రులు ఇద్దరూ.     "రాత్రి ఒక సంఘటన జరిగింది. ఎవరో హైదరాబాద్ కు చెందిన అమ్మాయి మా దవాఖానాకు వచ్చింది. పాపం.. ఆ పోరిది చాలా చిన్న వయసు. నిన్న హైదరాబాద్ లో జరిగిన మతకలహాల్లో గాయపడిందంట. ఆ పోరి పరిస్థితి చూస్తుంటే నిజంగా మస్తు జాలి అన్పిస్తుంది" తింటూ చెప్పాడు ముంతాజ్.     "..." తింటూ తలాడించాడు భవానీశంకర్.     "అట్లాంటి పరిస్థితి శతృవులకు కూడా రాకూడదురా! ఎందుకంటే ఒకవైపు గాయాలు, మరోవైపు కడుపునొప్పి. నిజంగా చాలా ఘోరం!" అన్నాడు ముంతాజ్.     "ఒక్కొక్కరిది ఒక్కో బాధ" అన్నాడు భవానీశంకర్.     "మా కులం పోరీనే! మస్తుగ వుంది. కాపోతే గొప్పింటి దానిలా వుంది. అందుకే బాధ" కూర వేసుకుంటూ అన్నాడు ముంతాజ్.     "అదేంట్రా?" నవ్వాడు భవానీశంకర్.     "నాకు సరిపోయే కుంటుంబం అయివుంటే షాది చేసుకునేవాడ్ని"     "అంత నచ్చిందా?"     "నిజంరా! నాకైతే బాగా నచ్చింది.     "నచ్చితే ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చేసుకోగాని ముందు నా గురించి ఆలోచించురా! నేను ఇప్పుడు అగ్గికణికలమీద నిలబడి వున్నాను. నా పరిస్థితి ఒక కొలిక్కి వచ్చేలా చూడు"     "చెప్పాను కదా నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను"     "థాంక్స్ రా" అని కాసేపాగి, "అవున్రా నీ ఉద్యోగం పర్మనెంటు అయినట్లేనా?" అడిగాడు భవానీశంకర్.     "అది మా నాన్న ఉద్యోగం కదా పర్మనెంటు అయినట్టే లెక్క" చెప్పాడు ముంతాజ్.     "జీతం ఎంత?"     "మానాన్నకు రెండు వేలు వచ్చేవి. నాకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. మున్ముందు పెంచుతారంట" అంటూ చేయి కడుక్కున్నాడు ముంతాజ్.     భవానీశంకర్ కూడా చేయి కడుక్కున్నాడు.       ఇద్దరూ లేచి బయటి గదిలోకి నడిచారు.     "దవాఖానకు వెళ్దామా?" అడిగాడు ముంతాజ్.     "వద్దు" అన్నాడు భవానీశంకర్.     "ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు?"     "నేను బయటకి వెళ్లడం అంతమంచిది కాదు"     "దవాఖాన ఇక్కడికి దగ్గరే. ఈ పక్క గల్లీలోంచి వెళ్దాం. నిన్ను ఎవ్వరూ పోల్చుకోరు"     "వద్దురా! నువ్వెళ్లు"     "రారా"     "ఏం నీ లవ్వర్ ను చూపిస్తావా?"     "పోరా" ముంతాజ్ లో కొద్దిగా సిగ్గు.     "పిచ్చోడా! నిన్ననేగా ఆ పిల్లను చూసింది అప్పుడే మనసు పారేసుకున్నావా?" నవ్వాడు భవానీశంకర్.     "ఆ సంగతి వదిలిపెట్టుగాని నువ్వు ముందు వస్తావా? రావా?" అడిగాడు ముంతాజ్.     "నన్ను అర్థం చేసుకోరా" అన్నాడు భవానీశంకర్.     "అయితే నీ ఇష్టం నాకు డ్యూటీ టైమ్ అయింది వెళ్లొస్తాను" అంటూ బయటకు నడిచాడు ముంతాజ్.     "గోపాల్ గాడు ఫోన్ చేస్తే చేయొచ్చు. అన్ని విషయాలు వివరంగా మాట్లాడి తెలుసుకో" గుమ్మందాకా వచ్చి చెప్పాడు భవానీశంకర్.     "సరే" అంటూ లూనా స్టార్టు చేసుకుని ఎక్కి కూర్చుని "బోర్ అన్పిస్తే అమ్మను అడిగి పక్కింటివాళ్ల దగ్గర్నుండి పుస్తకాలు తెప్పించుకో" చెప్పి వెళ్లిపోయాడు ముంతాజ్.     భవానీశంకర్ లోపలికి నడిచాడు.             *    *    *     "గౌసియా! ఎలా వుంది ఆరోగ్యం?" హాస్పిటల్ కు రాగానే అడిగాడు కమలాకర్.     "బాగుంది" చెప్పింది గౌసియా.     "మరి వెళ్దామా?" అడిగాడు.     "వెళ్దాం"     "ముంతాజ్" ఆ వెంటనే ముంతాజ్ కోసం చూశాడు కమలాకర్.     "అన్నా" అంటూ వచ్చాడు ముంతాజ్.     "ఏమీ అనుకోకుండా ఆటో తీసుకువస్తావా?"     "ఆటో ఎందుకు అన్నా?"     "మేము ఇక వెళ్ళద్దా?"     "అప్పుడే వెళ్తున్నారా?" కొద్దిగా బాధనిపించింది ముంతాజ్ కు.     "మా డాక్టర్ సాబ్ ఇప్పటికే నాపై కోప్పడ్తున్నాడు" చెప్పాడు కమలాకర్.     "మీ డాక్టర్ బుద్ధిమంతుడైతే ఇలా బాధ పడాల్సిన అవసరమేలేదు" అంటూ బయటకు నడిచాడు ముంతాజ్.     పది నిముషాల్లో ఆటో వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. కమలాకర్ గౌసియాను జాగ్రత్తగా తీసుకువెళ్లి ఆటోలో కూర్చోబెట్టాడు.     "డాక్టర్ సాబ్ వస్తే అమ్మాయిని తీసుకువెళ్లానని చెప్పు" ముంతాజ్ కు చెప్పాడు కమలాకర్.     సరే అన్నట్టుగా తలాడించాడు ముంతాజ్. ఆ తర్వాత ఆటో ముందుకు కదిలింది.             *    *    *         "అమ్మాయీ నీకు వస్తాను అనే చెప్పాను కదా? చెప్పినా కూడా ఆ కమలాకర్ వెంట వెళ్లడం ఏంటీ? దిసీజ్ టూమచ్" కమలాకర్ రౌండ్స్ కు వెళ్లగానే గౌసియాపై కోప్పడ్డాడు డాక్టర్ దినేష్.     "బాధ ఎక్కువైతే" చెప్పుకోబోయింది గౌసియా.     "డోంట్ టాక్ ఐసే" కఠినంగా అన్నాడు డాక్టర్.     గౌసియా కిమ్మనలేదు. గొణుక్కుంటూ వెళ్లిపోయాడు డాక్టర్. తన మీద తనకే జాలికలుగుతుంటే గౌసియా గుడ్లనిండా నీళ్లు తిరిగాయి.     'అంతా నా ఖర్మ' మనసులో అనుకుంటూ కళ్లనీళ్లు తుడ్చుకుంది. అదే సమయంలో హాస్పిటల్ కు సీరియస్ కేసు ఒకటి రావడం, డాక్టర్ తోపాటుగా కాంపౌండర్, నర్సులు, అందరూ అప్రమత్తులు కావడం జరిగిపోయింది.     బాధపడుతూ మౌనంగా పడుకున్న గౌసియాను పిలుస్తూ వచ్చింది ఆయా.     "గౌసియా"     "ఏంటన్నట్లుగా చూసింది గౌసియా.     "నీకు బొంబాయి నుండి ఫోను" అంటూ కార్డులెస్ అందించింది ఆయా. కార్డ్ లెస్ అందుకుని ఆతృతగా మాట్లాడింది గౌసియా. ఫోన్ చేసింది ఆమెను హాస్పిటల్లో చేర్పించిన మోహన్. అతడు ఎవరో అయినప్పటికీ మళ్లీ ఫోన్ చేసి ఆమె యోగక్షేమాల్ని తెల్సుకోవడం ఆయాను విస్మయ పరిచింది.     "నిజంగా ఆ మనిషి ఎంతో పుణ్యాత్ముడు అనుకోవాలి" గౌసియా మాట్లాడ్డం పూర్తయ్యాక అంది ఆయా.     "ఇది సరేగాని నాకో సహాయం చేస్తావా ఆయా?" అడిగింది గౌసియా.     "ఏం సహాయం?"     "నువ్వు చేస్తానంటేనే చెప్తాను"     "నావల్ల అయ్యేది వుంటే తప్పకుండా చేస్తాను"     "డాక్టరుకి చెప్పి నన్ను హైద్రాబాద్ హాస్పిటల్ కు పంపించే ఏర్పాటు చేయి"     "ఇక్కడ బాగానే వుంది కదా? ఇప్పుడే హైద్రాబాదు ఎందుకు?"     "అలా అని కాదు, నన్ను ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళాడే మోహన్ భయ్యా, వాళ్ళ అన్నయ్య కూడా హైద్రాబాద్ లో డాక్టరుగా పనిచేస్తున్నాడంట. నాకు ఇక్కడ ఇబ్బంది వుంటే ఈ డాక్టరును అడిగి అక్కడికి వెళ్ళమన్నాడు. అందుకు అయ్యే ఖర్చుల్ని ఆ డాక్టరే భరించుకుంటాడంట.     "మోహన్ భయ్యా చాలా మంచివాడు. నా గురించి వాళ్ళ ఇంటివాళ్ళకు ఇంతక్రితమే ఫోన్ చేసి చెప్పాడంట కూడా! నాకు అక్కడికే వెళ్ళాలని వుంది. దయచేసి ఈ సహాయం చేసి పెట్టవా?" అభ్యర్థనగా అడిగింది గౌసియా.     "చిరునామా వుందా?" అడిగింది ఆయా.     "నాకు కార్డు ఇచ్చివెళ్ళాడు కదా...అదే చిరునామా"     "ఏం కార్డు ఇచ్చివెళ్ళాడో ఏమో!? ఇక్కడ ఏం తక్కువయ్యిందని అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు?" గొణిగినట్లు అంది ఆయా.     "నాకు ఈ డాక్టరును చూస్తుంటే భయమనిపిస్తుంది" అంది గౌసియా.     "ఎందుకు భయం? డాక్టరుసాబు చాలా మంచివాడు" అంది ఆయా.     "వద్దు! నేను ఇక్కడ వుండను"     "అయితే ఆ విషయం నువ్వే అడగరాదూ? నాతో ఎందుకు?"     "డాక్టరు నన్ను ఇంతక్రితమే తిట్టాడు. అందుకే అడిగేందుకు భయం"     "డాక్టరు ఆపరేషన్ రూములో వున్నాడు. బయటకి వచ్చేవరకు చాలా సమయం పడుతుంది. వచ్చాక చూద్దాంలే" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఆయా.     ఆమె అలా వెళ్ళిపోయిందో లేదో ఒక యువకుడు గౌసియా బెడ్ దగ్గరకు వచ్చాడు. అతడు ఔట్ పేషెంట్.     "నీకు ఇక్కడ ఎవ్వరూ లేరా?" అడిగాడు ఆ యువకుడు.     "లేరు" చెప్పింది గౌసియా.     "నేను హైద్రాబాద్ వెళ్తున్నాను. వీళ్ళు నిన్ను తీసుకువెళ్ళకపోతే నేను తీసుకువెళ్తాను" అన్నాడు యువకుడు.     "నువ్వెవరు?"     "నాపేరు శ్యామ్. నేను డాక్టరు తమ్ముడ్ని"     "అలాగా! మరి మీరెప్పుడు వెళ్తున్నారు"     "ఈ సాయంత్రం వెళ్తాను"     "అయితే నన్ను తీసుకువెళ్ళవా?"     "అన్నయ్య కోప్పడ్తాడేమో అని భయంగా వుంది? అయినా అన్నయ్యకు సర్దిచెప్పుకుంటాను"     "అంటే మీ అన్నయ్యకు చెప్పకుండా తీసుకువెళ్తావా?"     "ముందే చెప్పాను కదా! వీళ్ళు ఒప్పుకుంటే సరి, లేదంటే నా వెంట తీసుకెళ్ళిపోతాను. అయినా అన్నయ్య చాలా స్ట్రిక్టు. కాబట్టి ఒప్పుకోరేమో అనిపిస్తుంది! అందుకే అన్నయ్యకు చెప్పకుండా అయితేనే నీవు ఇక్కడ్నుంచి బయటపడగలవు. ముందు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు"     "నాకోసం నువ్వెందుకు ఇబ్బందిని ఎదుర్కోవడం?"     "నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి అన్పిస్తోంది. నీలాంటి వాళ్ళకు సహాయం చేస్తేనే ఆ దేవుడు నన్నూ, మా అన్నయ్యను చల్లగా చూస్తాడు అని కూడా అన్పిస్తోంది" అని.     "ఇప్పుడే వస్తాను" అంటూ అక్కడ్నుంచి బయటకు నడిచాడు.

" ఏడు రోజులు " 30వ భాగం

" ఏడు రోజులు " 30వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి                  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మద్రాసు నుండి వస్తున్న రైలు దిగాడు భవానీశంకర్.     జుట్టుచెదిరి, బట్టలు మాసిపోయి పీక్కుపోయిన మొహంతో పిచ్చివాడులా తయారై వున్నాడు అతడు.     బాగా పొద్దుపోయింది కాబట్టి స్టేషన్ లో జనాలు పూర్తిగా పలచబడి వున్నారు. కొందరు ప్రయాణికులు అప్పటికే గురకలు కొడుతూ పడుకుని వున్నారు.     భవానీశంకర్ స్టేషన్ దాటి ఇవతలకి నడిచాడు. అతడి నడక ఒంట్లో శక్తి లేనట్లుగా తడబడుతోంది.     "రేయ్... ఎవడ్రా అక్కడా?" స్టేషన్ బయట నిల్చుని వున్న రైల్వే పోలీసు కేకేశాడు.     భవానీ శంకర్ భయపడలేదు. నేరుగా పోలీసు వైపు నడిచాడు.     "ఎవడ్రా నువ్వు? తాగి తిరుగుతున్నావా ఏం?" దగ్గరగా వచ్చాడు పోలీసు.     "నమస్తే సార్! మద్రాసు నుండి ఒస్తున్నాను" పోలీసు దగ్గరగా రాగానే నీరసంగా చెప్పాడు భవానీశంకర్.     పోలీసు ఒకమారు భవానీశంకర్ ను ఆపాదమస్తకం పరిశీలనగా చూసి "నీది మద్రాసు నుండి వస్తున్న ఫేసేనట్రా?" ఎగాదిగా చూస్తూ అన్నాడు.     అందుకు ఏం అనలేక ఇబ్బందిగా కదిలాడు భవానీశంకర్.     "రేయ్ నీ మొహం చూస్తుంటే ఫుట్ పాత్ వెధవలా కనబడుతున్నావు. ఇంకొక్క నిముషం కూడా నా కళ్ల ఎదురుగా నిలబడొద్దు. చల్ బే చల్" గదమాయింపుగా అన్నాడు పోలీసు.     "వెళ్తున్నాను సర్" అన్నాడు భవానీశంకర్.     "చల్ బే" అన్నాడు పోలీసు.     ముందుకు నడిచాడు భవానీశంకర్.     "రేయ్" మళ్లీ పిలిచాడు పోలీసు.     ఆగి వెనక్కి చూశాడు భవానీశంకర్.     "ఇట్టారా" పిలిచాడు పోలీసు.     దగ్గరగా వచ్చాడు భవానీశంకర్.     "నీవు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడకూడదు. పొరపాటున కనబడ్డావనుకో రైల్వే దొంగ కింద కేసుబుక్ చేసి... బొక్కలో తోయిస్తాను కొడకా" బెదిరించాడు పోలీసు.     "వెళ్లిపోతున్నాను" అంటూనే ముందుకు నడిచి "ఈ పోలీసునాయాళ్లకి జులుం చేయడం ఒక్కటి బాగా తెలుసు" మనసులో అనుకున్నాడు భవానీశంకర్.     బస్టాపును దాటి ముందుకు నడిచాక ఎస్టీడీ బూతు ఒకటి కనబడింది. ముగ్గురు వ్యక్తులు కంటే ఎక్కువలేరు అక్కడ. వెళ్లి వాళ్ల మధ్యలో కూర్చున్నాడు భవానీశంకర్.     అరగంట తర్వాత భవానీశంకర్ ఛాన్సు వచ్చింది. గ్లాస్ క్యాబిన్ లోకి వెళ్లి స్నేహితుడు గోపాల్ కు నంబర్ కలిపాడు భవానీశంకర్. ఎంగేజ్ వచ్చింది. అంతలో మరెవ్వరో కస్టమర్ వచ్చాడు.     "బాయ్... నీది లోకలేకదా, తర్వాత చేసుకో" క్యాబిన్ తెరిచి మరీ చెప్పాడు ఎస్టీడీ యజమాని.     "వీడొకడు" మనసులో తిట్టుకుంటూ వెలుపలికి వచ్చాడు.     పావుగంట తర్వాత వచ్చిన కస్టమర్ వెళ్లిపోయాడు. అందుకోసమే టెన్షన్ గా ఎదురుచూస్తున్న వాడు వెంటనే క్యాబిన్ లోకి వెళ్లి తనక్కావల్సిన నంబర్ మరోసారి ప్రయత్నించాడు. అవతల రెండురింగులు రాగానే డైరెక్టుగా గోపాలే లైన్లోకి వచ్చాడు.     "హలో"     "అరే గోపాల్ నేనురా భవానీశంకర్" స్నేహితుడి గొంతును వెంటనే గుర్తుపట్టాడు భవానీశంకర్.     "ఎక్కడున్నావురా?" గోపాల్ లో ఆతృత.     "సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఎక్కడికి వెళ్లాలో తెలీడంలేదు" అన్నాడు భవానీశంకర్.     "అసలు నీవు నిజంగా ఎక్కడున్నావురా? నువ్వు ఘనకార్యం చేసివెళ్లాక ఇక్కడ పరిస్థితులు పూర్తిగా విషమించి పోయాయి" కొద్దిగా కోప్పడ్డాడు గోపాల్.     "రోజూ పేపర్ చూస్తున్నాను. నాకు అన్ని విషయాలు తెల్సు. ఈ రోజు పేపర్లో గౌసియా గురించి చదివాను"     "గౌసియా గురించి చదివావు సరే. కాని ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ మళ్లీ అల్లర్లు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నీవు చేసిన పని ఇంతదూరం వచ్చింది"     "అదంతా సరే ముందు నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పు?"     "ఎక్కడికి వెళ్లాలని వచ్చావు?"     "గౌసియా హైదరాబాద్ వచ్చివుంటుందనె ఆశతో వచ్చాను. మా ఇంటికి మాత్రం వెళ్లాలనుకోలేదు. అమ్మానాన్నా క్షేమంగా వుంటే చాలు. కనబడితే నా గురించి చెప్పు.     "ముఖ్యంగా నేను కబడితే నన్ను పోలీసులు అరెస్టు చేస్తారు. అందుకే ఎక్కడైనా రహస్యంగా వుండిపోయి మీ అందరి సహాయంతో గౌసియాను తీస్కుని ఎక్కడికైనా వెళ్లిపోవాలని వుంది"     "అరే పిచ్చోడా నీ కారణంగా తండ్రిని కోల్పోయి కూడా ఆ పిల్ల మళ్లీ నీ వెంట వస్తుందా?     "తప్పకుండా వస్తుంది"     "ఏంటోరా నీ పిచ్చి. రోజురోజుకి బాగా ముదిరిపోతున్నట్టుంది"     "గౌసియాను మర్చిపోలేను"     "ప్చ్... ఏం చూసి ఆ పిల్లను అంత ఇదిగా ఇష్టపడుతున్నావురా? ఆస్తిమంతురాలు కాదు, అక్షరం ముక్కరాదు. ఏదో కాసింత అందం వుంది. ఆ అందాన్ని పట్టుకుని తింటావా?"     "నీవు ఏమైనా మాట్లాడు గోపాల్! గౌసియా నా ప్రాణం! ఆమె లేకుండా నేను బతకలేను. ఈ పరిస్థితిలో కూడా నన్ను, నా ప్రేమను నిందించే ప్రయత్నం చేయొద్దు.     "దయచేసి నన్ను అర్థం చేసుకోరా! నేను గౌసియాను ఇష్టపడి పొరపాటు చేశానేమో తెలియదుకాని ఇప్పుడు ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను"     "ఆమె లేకుండా నీవు బతకలేవు సరే! మరి ఒకవేళ గౌసియా అరబ్బుషేకు వెంట చిరునామా లేకుండా వెళ్లిపోయి వుంటే ఏం చేసేవాడివి?"     "నీకు తెలీదురా! ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ అనుకోకుండా పేపరు చదవడం, గౌసియా గురించి తెలవడం, నిజంగా నాకు పునర్జన్మ లాంటిది"     "సర్లేగాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రిపూట ఎక్కడికీ వెళ్లలేవు కూడా! కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు బండి తీసుకుని వస్తాను"     "వద్దురా! మీ ఇంటికి రావడం కూడా అంత మంచిదికాదు"     "మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు?"     "రాబర్ట్ వాళ్ల ఇంటికి వెళ్తాను. అక్కడ వుంటే నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు"     "రాబర్ట్ వాళ్లు నిన్ననే వూరెళ్ళారు"     "ఓ గాడ్! మరి ఇప్పుడు ఎలా?"     "అందుకే మా ఇంటికి వచ్చేయ్"     "కాదురా, ముంతాజ్ గాడి దగ్గరకి వెళ్తే?"     "ఈ టైమ్ లో వాడి దగ్గరకి ఎలా వెళ్తావు"     "ఇప్పుడు పన్నెండు గంటలకు ట్రెయిన్ వుందికదా"     "చార్జీకి డబ్బులు వున్నాయా?"     "వున్నాయి"     "నిజం చెప్పు"     "వున్నాయిరా"     "ఎంతవుంది?"     "వంద రూపాయలు వున్నాయి"     "సరిపోతాయిలే! అక్కడికి వెళ్లాక ఒకవేళ డబ్బు అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయి! లేదంటే ముంతాజ్ గాడిని అడిగి తీసుకో"     "అట్లాగే"     "ఇంకో విషయం! అది వేరే వూరుకదాని బయట తిరుగొద్దు"     "నాకు అన్నీ తెల్సుగాని గౌసియా గురించి ఏ విషయం తెల్సుకుని రేపు నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను" అన్నాడు భవానిశంకర్.     "తప్పకుండా" అన్నాడు గోపాల్.     భవానీశంకర్ ఇంకేం మాట్లాడలేదు. ఫోన్ కట్ చేసి క్యాబిన్ లోంచి వెలుపలికి వచ్చి బిల్ చెల్లించి తిరిగి రైల్వేస్టేషన్ వైపు నడిచాడు.

" ఏడు రోజులు " 29వ భాగం

 " ఏడు రోజులు " 29వ భాగం         కానీ గౌసియా నడవలేకపోతోంది. ఆమె పరిస్థితిని గ్రహించిన అతడు ఆమెను రెండు చేతులమీదకు ఎత్తుకుని, గబాగబా వెలుపలకి నడిచి, తన స్కూటర్ పై కూర్చోబెట్టుకుని, పది నిముషాలలో వేరే హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు.     అది గవర్నమెంట్ హాస్పిటల్. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూలేరు. కాంపౌండరే వెళ్ళి డాక్టరును తీసుకువచ్చాడు.     డాక్టర్ వచ్చేసరికి హాస్పిటల్ మెట్లపై మెలికలు తిరుగుతూ పడివుంది గౌసియా.     "అరెరే..." గాబరాగా గౌసియాను తిరిగి తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని, డాక్టర్ వెంట లోపలికి నడిచాడు కాంపౌండర్.     "అసలు ఈ అమ్మాయికి ఏమయ్యింది?" షర్టు పైకి తొలగి నడుముకు కట్టివున్న బ్యాండేజీ కనబడుతుంటే కనుబొమలు ముడిచి చూస్తూ అడిగాడు డాక్టరు.     "ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన మతకలహాల్లో ఈ అమ్మాయి గాయపడింది. ఎవరో పుణ్యాత్ముడు ఈ అమ్మాయిని తీసుకు వచ్చి మా హాస్పిటల్లో చేర్పించాడు. అప్పుడే అనుకున్నా ఎలాగూ ఖర్చు పెట్టుకుంటున్నావు. ఆ పుణ్యం దక్కాలీ అంతే వేరే ఆస్పత్రికి తీసుకు వెళ్లకూడదా నాయనా అని.     "అయినా మా డాక్టర్ సంగతి కొత్తవాళ్లకు ఏం తెలుస్తుంది? తెల్సిన పాతవాళ్లు మాత్రం రావడం తగ్గించారు" చెప్పుకుపోయాడు కాంపౌండర్.     డాక్టర్ ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. గౌసియాను అక్కడ టేబుల్ పై పడుకోబెట్టించి వెంటనే తన చికిత్సను ఆరంభించాడు.     మొదట అపెండిసైటిస్ అని అనుమానపడ్డారు కాంపౌండర్, డాక్టరూ. కాని చికిత్స తర్వాత అది సాధారణ కడుపునొప్పిగా తేలింది.     "అంటే ఇంక నాకేం కాదా?" ఏ విషయాన్ని డాక్టర్ కాంపౌండర్ తో చెప్పాక ఆతృతగా డాక్టర్ వైపు చూసింది గౌసియా.     "ఏం కాదు" చిరునవ్వుగా చెప్పాడు డాక్టర్.     "నాకు అప్పుడప్పుడూ సన్నగా కడుపునొప్పొస్తుంటుంది. ఆ నొప్పి కూడా రాకుండా మందులు ఇవ్వండి" అంది గౌసియా.     "తప్పకుండా ఇస్తాను" చెప్పి మందుల కోసం తన గదివైపు నడిచాడు డాక్టరు. వెంటే వెళ్తూ "డాక్టర్! నాకు అవతల పని వుంది. నేను వెళ్లవచ్చా?" అడిగాడు కాంపౌండర్.     "నువ్వెళ్లు. ఈ అమ్మాయితో ఆయాను ఉంచుతాను" చెప్పాడు డాక్టర్.     కాంపౌండర్ తిరిగి వెనక్కివచ్చి "పాపా! నేను వెళ్తాను. మళ్లీ రేపు ఉదయాన్నే వస్తాను" గౌసియాతో చెప్పాడు.     "మరి నా దగ్గర ఎవ్వరూ వుండరా?" అడిగింది గౌసియా.     "ఆయా వస్తుంది" చెప్పి, నీకేం భయం లేదు. అక్కడ హాస్పిటల్లో ఎంత ధైర్యంగా వున్నావో, ఇక్కడ కూడా అంతే ధైర్యంగా వుండాలి" గౌసియా తల నిమురుతూ చెప్పి వెళ్లిపోయాడు కాంపౌండర్.     "అమ్మాయీ" కాసేపటి తర్వాత పిలుస్తూ వచ్చాడు డాక్టరు. ఏంటన్నట్లుగా నెమ్మదిగా తల తిప్పి చూసింది గౌసియా.     "నీకు అప్పుడప్పుడు కడుపునొప్పొస్తుంది అన్నావుకదా! ఏటైమ్ లో వస్తుంది?" ఆమె కడుపును మృదువుగా వత్తుతూ అడిగాడు.     "టైం అనేది వుండదు. ఒక్కోసారి రాత్రి పూట... ఒక్కోసారి పగలుపూట... ఎప్పుడంటే అప్పుడే" చెప్పింది గౌసియా.     "అదికాదు, పీరియడ్స్ టైమ్ లో నొప్పొస్తుందా అని అడుగు తున్నాను"     "పీరియడ్ అంటే?"     "బహిష్టు"     "ఛీ..." ఇబ్బంది పడిపోయింది గౌసియా.     "డాక్టర్ దగ్గర సిగ్గు పడకూడదు. ఫ్రీగా మాట్లాడాలి" అన్నాడు డాక్టర్.     "అవును" ఇబ్బందిపడుతూనే చెప్పింది గౌసియా.     "ఐసీ" అంటూ తన చేతుల్ని ఆమె రొమ్ముల మీదకు పోనిచ్చి "ఆ టైమ్ లో ఇక్కడ కూడా నొప్పిగా వుంటుంది కదూ?" అడిగాడు.     "ఊహూ" తల అడ్డంగా వూపింది.     "బాగా గుర్తు తెచ్చుకో" అంటూ ఆమె రొమ్ముల్ని మృదువుగా నొక్కాడు.     "లేదు" అతడి చేతులు తన ఎదమీద తచ్చాడుతుంటే ఆమె శరీరం కుంచించుకు పోసాగింది.     అతడు ఆ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్. ఆడపిల్లల పిచ్చి ఎక్కువ. సీనియర్ డాక్టర్ ప్రతి స్త్రీలోనూ తల్లినో చెల్లినో చూస్తాడు కాని అతడు ప్రస్తుతం సెలవు మీద వూరెళ్లాడు. లేదంటే ఇప్పుడు తనే వచ్చేవాడు. తను లేడు. పైగా ఒక అందమైన అమ్మాయి హాస్పిటల్ కి వచ్చింది. అందుకే ఆ డాక్టరు హృదయం ఆనందంతో ఎగసిపడుతోంది.     "నీ పేరేంటి?" అడిగాడు.     "గౌసియా" చెప్పింది.     "అమ్మాయి గౌసియా! కమలాకర్ మీకు బంధువు అవుతాడా?" అతి తెలివిగా ప్రశ్నించాడు డాక్టర్.     "కమలాకర్ ఎవరు?" అడిగింది గౌసియా.     "అదే నిన్ను ఇప్పుడు తీసుకు వచ్చాడే"     "ఏం కాదు"     "అలాగా" అంటూ పొరపాటున ఆమె రొమ్ముల్ని గట్టిగా నొక్కాడు.     "అమ్మా" ఆమె బాధగా అరిచింది.     "ఎవరికి ఏం అయింది డాక్టర్?" అప్పుడే అడుగుతూ వచ్చాడు ఆ హాస్పిటల్ కాంపౌండర్ దినకర్.     "కడుపునొప్పి పేషెంట్" అంటూనే తన చేతుల్ని గౌసియా కడుపు మీదకు చటుక్కున తీసుకువచ్చాడు డాక్టర్.     "దవాఖానా తెరిచి వుంటేనూ, ఎవరికి ఏం జరిగిందా అని పరేషాన్ అయ్యాను నేను" అన్నాడు దినకర్.     "ఈ అమ్మాయికి నో ప్రాబ్లమ్! కాకపోతే సెలైన్ అవసరం. వెళ్లి ఆయాను తీసుకురండి" చెప్పాడు డాక్టర్.     "మీరు గమ్మత్తుగా మాట్లాడ్తుండరు. ఆయా ప్రొద్దుటే గదా వూరెళ్లింది" అన్నాడు దినకర్.     "ఓ అవును కదూ? మరి ఈ అమ్మాయికి సెలైన్ ఎక్కిస్తే దగ్గరగా ఎవరు వుంటారు?" అన్నాడు డాక్టర్.     "ముంతాజ్ గాడ్ని తీసుకువస్తాగానీ ఈ అమ్మాయి తాలూకు వాళ్లు ఎవ్వరూ లేరా?" అడిగాడు దినకర్.     "ఎవ్వరూ లేరు"     "అదేంటీ?"     "అవన్నీ తర్వాత ముందు ముంతాజ్ ను పిల్చుకురండి"     "వాడు రెండో ఆట సిన్మాకు వెళ్లాడు. రాగానే ఇక్కడికి పంపిస్తాను" అని "ఈ అమ్మాయిది ఏం నొప్పి?" అడిగాడు దినకర్.     "బ్లడ్ ఎక్కువగా పోవడం, శరీరం కదలికలకు గురికావడంవల్ల కడుపులో నొప్పి వచ్చింది అంతే" చెప్పాడు డాక్టర్.     అర్థం కానట్లుగా చూశాడు దినకర్. అతడి చూపులు గౌసియాకు అర్థమయ్యాయి. హైదరాబాద్ అల్లర్ల దగ్గర్నుండి, తనను హాస్పిటల్లో జాయిన్ చేసిన కథ వరకు వివరంగా చెప్పుకుంది.     ఈలోగా ఇన్ పేషెంట్స్ కొందరు అక్కడికి వచ్చారు. దినకర్ తో పాటుగా అందరూ గౌసియాపట్ల జాలి కనబర్చారు. అందరూ రావడంతో డాక్టరు బుద్ధుమంతుడిగా మారాడు. ఆడపిల్లల పిచ్చి తప్పిస్తే అతడు నిజంగా బుద్ధిమంతుడే అని చెప్పాలి. అదే విషయాన్ని దినకర్ మనసులో అనుకున్నాడు.     "వీడి బుద్ధికి బ్రేకులు పడ్డాయి. వెధవ సన్యాసి".

" ఏడు రోజులు " 28వ భాగం

" ఏడు రోజులు " 28వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి           అతడి మాటలు పూర్తికాకముందే గౌసియా స్తంభించిన ప్రకృతిలా తయారయ్యింది.     "అ...ది..." తండ్రి మరణం ఆమెను కలిచివేయసాగింది.     "ఈరోజు గొడవలు ఈ విషయమై తలెత్తాయి. థూ... పొరపాటున మనుషులుగా పుట్టారీ మతపిచ్చి వెధవలు" పళ్ళ బిగువున అన్నాడు అతడు.     ఆమె మామూలు మనిషి కాలేకపోతోంది. కళ్ళ వెంబడి నీళ్ళు ధారాపాతమౌతున్నాయి. ఏదో మాట్లాడాలనుకుంటూ మాట్లాడలేకపోతోంది.     "భయపడవద్దమ్మా! ఇట్లాంటి గొడవలు సహజమే కదా?" అన్నాడు అతడు.     "అ... అ... ఆ యువకుడికి ఏం కాలేదా?" వణుకుతున్న గొంతును బలవంతాన పెగల్చుకుని అడిగింది.     అంతలోనే డాక్టర్ నుండి అతడికి పిలుపు వచ్చింది. "ఇప్పుడే వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు అతడు. కాసేపటి తర్వాత డాక్టర్ తో కలిసి వచ్చాడు మోహన్. ఇద్దరూ కల్సి గౌసియా వివరాల్ని అడిగారు.     "నేను ఈ గొడవలమధ్య ఇంటికి వెళ్తే మరిన్ని గొడవలు జరుగుతాయి. వెళ్ళకపోవడమే మంచిది" మనసులో అనుకుని, "నన్ను మీ వెంట బొంబాయికి తీసుకెళ్ళండి. అక్కడ మరియా ఆశ్రమంలో ఫాదర్ వుంటాడు. మదర్లు వుంటారు" చెప్పింది గౌసియా.     "ముందు నీ పేరేంటో చెప్పు?" డాక్టర్ అన్నాడు.     "నా పేరు గౌసియా"     "మీ నన్న పేరు?"     "సాయిబు"     "మీ నాన్న ఏం చేస్తాడు?"     "పత్తర్ బజార్ లో చాయ్ బండి అమ్ముతుంటాడు" ఏడుస్తూ చెప్పింది.     ఆమెను వలలు ఇంకేం అడగలేదు. ఆమె చెప్పిన ఆ మూడు వివరాలే ఆ ఇద్దరిలో అనుమానం తెప్పించాయి.     "అంటే... నువ్వు ఆ అమ్ముడుపోయిన అమ్మాయిఅయా?" ఆరా తీసినట్టుగా అడిగాడు డాక్టర్.     "అ... వు...ను..." ఏడుస్తూనే చెప్పింది.     "ఐసీ..." అని కిందిపెదవి పైపంటితో బిగించి, "మిస్టర్, చాలామంచిపని చేశావు" అంటూ మోహన్ భుజం తట్టి, "అవునూ, బాంబేనుండి హైద్రాబాద్ కి ఎవరివెంట వచ్చావు?" కనుబొమ్మలు ముడిచాడు డాక్టర్.     అక్కడ తన పరిస్థితిని వివరించుకుంది గౌసియా.     "షిట్! ఈ నయవంచకులకు కామమే తప్ప మరేం తెలీనట్టుంది. కోరికలు ఎవ్వరికైనా వుంటాయి. అలాగని ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో తెలీదా ఈ రాక్షసులకి? అయినా రక్షకభటులైవుండి కూడా బాధ్యతా రహితంగా ప్రవర్తించారంటే ఆ వెధవల్ని నరికిపోగులు పెట్టాల్సిందే" పిడికిళ్ళు బిగించాడు మోహన్.     "ఈ సమాజంలో అట్లాంటివాళ్ళు సహజమే. కాలమే వాళ్ళకు బుద్ధి చెప్తుంది" అని గౌసియాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చి, "ఆ మిస్టర్ మోహన్! ఈ అమ్మాయి కోలుకునే వరకు ఇక్కడే వుంటుంది. మీరు అర్జెంటు పనిమీద బాంబే వెళ్తున్నాను అన్నారుకదా. ఇక మీరు వెళ్ళొచ్చు! మంచి మనసుతో ఈ అమ్మాయిని కాపాడినందుకు, మీరు వెళ్ళే పని సక్సెస్ అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్! మీకూ మీ మంచితనానికి హాట్సాఫ్..." డాక్టర్ మాటల్లోనే కాదు, ఆ కళ్ళల్లోనూ ప్రస్ఫుటమౌతున్న ఎంతో ఉన్నతమైన ప్రశంస.     "అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి పోలీసుల సహాయం తీసుకొనైనాసరే, అవసరమైతే అమ్మాయి ఇంటికి చేరుకునేవరకు మీరు కూడా వెంటే వుండండి" చెప్పాడు మోహన్.     "తప్పకుండా" అన్నాడు డాక్టర్.     మరి కాసేపటి తర్వాత డాక్టర్ వద్ద, గౌసియావద్ద సెలవు తీసుకుంటూ ఇద్దరికీ తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు మోహన్.     మోహన్ గురించే ఆలోచిస్తూ పడుకుంది గౌసియా. అతడు ఆమెకు దేవుడిలా తోస్తున్నాడు. వెళ్ళేముందు తనకు స్వంత చెల్లెలు అన్న భావనతో జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, బాంబేనుండి తిరిగి వచ్చాక తప్పకుండా కలుస్తానని మరీమరీ చెప్పి వెళ్ళిపోయిన అతడి వాత్సల్యం... ఆమె మనసును ద్రవింపచేస్తోంది.     "ఈ పాలు, బ్రెడ్ తీసుకో" కాసేపటి తర్వాత బన్నుముక్కలు, పాల గ్లాసుతో వచ్చింది నర్సు.     "ఆకలిగా లేదు" చెప్పింది గౌసియా.     "లేకపోయినా పాలు తాగి, కొద్దిగా బ్రెడ్డు తిను. ఎందుకంటే... ముందే నీరసంగా వున్నావు. తినకపోతే మరింత నీరసమైపోతావు" అంది నర్సు.     గౌసియా ఇంకేం మాట్లాడలేదు. నర్సు సహాయంతో నెమ్మదిగా లేచి కూర్చుంది. పాలల్లో బ్రెడ్ కలిపి స్పూన్ తో మెల్లగా తినిపించసాగింది నర్సు. రెండు స్పూన్లు అలా తిందో లేదో భవానీశంకర్ గుర్తొచ్చాడు ఆమెకు.       "వద్దు" ముంచుకొస్తున్న దుఃఖంతో నర్సును దూరం జరిపింది.     "ప్చ్! విసిగించొద్దు" అంది నర్సు.     "నా భవానీ శంకర్ కి ఏంకాలేదు కదా. అతడు క్షేమంగా వున్నాడు కదా?" అడిగింది గౌసియా.     "భవానీశంకర్ ఎవరు?" కనుబొమ్మలు ముడిచింది నర్సు.     ఏం చెప్పలేకపోయింది గౌసియా. ధారాపాతమౌతున్న కన్నీళ్ళను తుడ్చుకుంటూనె, మరోవైపు నర్సు తినిపిస్తున్న బ్రెడ్ ను బలవంతంగా మింగసాగింది.         *    *    *     రాత్రి పదిగంటలు కావొస్తోంది. నెత్తుటి గాయాలు శరీరాన్ని బాధిస్తుంటే గౌసియాకు నిద్రపట్టడంలేదు. తోడుగా భవానీశంకర్ గూర్చిన ఆలోచనలు ఆమె హృదయాన్ని వేదనతో ఉడికిస్తున్నాయి. కాగా, తండ్రి మరణం మాత్రం ఆమెను పెద్దగా కృంగదీయడంలేదు.     "కనికరం లేకుండా నన్ను అమ్ముకున్న అబ్బా గురించి నేనెందుకు బాధపడాలి? అబ్బా కారణంగానే నేను ఇప్పుడు ఇన్ని అవస్థల్ని ఎదుర్కొంటున్నాను. అట్లాంటి అబ్బా కోసం నేనెందుకు ఏడవాలి? కాకపోతే అమ్మా... చెల్లెళ్ళు... ఎలా వున్నారో?     నా భవానీశంకర్ ఎక్కడున్నాడు? ఎలా వున్నాడు? పోలీసులు పట్టుకువెళ్ళి తనను హింసించడంలేదు కదా? పాపం నా కోసం తను ఎంత తెగించాడు" మనసులో మౌనంగా తలుస్తూ రూఫ్ కేసి చూస్తున్న గౌసియా, ఎవరో వస్తున్నట్టనిపించి డోర్ వైపు చూసింది.     ఎవరో ఇద్దరు వ్యక్తులు డాక్టర్ తో కలిసి లోపలికి వచ్చారు. ఎటూ చూడకుండా నేరుగా లోపలికి నడిచారు. కాసేపటితర్వాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు కూడా లోపలికి నడిచారు.     గౌసియా ఎవ్వర్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఎటూ నిలవడంలేని మనసు మెదడును గందరగోళం చేస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంది.     కాసేపటి తర్వాత అనుకోకుండా కడుపులో నొప్పి ఆరంభమైందామెకు. తనకు అప్పుడప్పుడూ కడుపు నొప్పొస్తుంటుంది. కానీ ఇంత విపరీతంగా ఎప్పుడూ నొప్పి రాలేదు.     బాధ చెప్పనలవి కానిదిగా వుంది. భరించడం చేతకావడంలేదు. "అమ్మా... అమ్మా..." తాళలేక అటూ ఇటూ కదులుతుంటే గాయాలపై ఒత్తిడి పెరుగుతూ ప్రత్యక్ష నరకం కనబడుతోంది.     ఆమె ఇక ఎంతోసేపు బాధను ఓర్చుకోలేక అతి ప్రయాసగా బెడ్ దిగి డాక్టర్ కోసం ముందుకు నడిచింది. వెళ్ళేందుక్కూడా ఆమెకు శక్తి చాలనట్లుగా వుంది. గోడను ఆసరాగా పట్టుకుని, అటూ ఇటూ వున్న గదుల్లో డాక్టర్ ను వెదుక్కుంటూ... లోపలికి నడిచి వెళ్ళసాగింది.     కొంతదూరం వెళ్ళాక విశాలంగా వున్న హాలు ఒకటి వచ్చింది. "డాక్టర్" పిలుస్తూ ఆ హాల్లోకి ప్రవేశించింది గౌసియా.     అది ఔట్ పేషెంట్స్ కు ఉద్దేశించిన హాలు. అదేమీ ఆమెకు తెలీదు. హాలును దాటి ముందుకు నడిచింది. అక్కడ ఒక గదిలో వచ్చినవాళ్ళతో కూర్చుని హాయిగా పేకాడుతూ కన్పించాడు డాక్టర్. వాళ్ళు మందు కూడా సేవిస్తున్నారు.     "డాక్టర్" ఆయాసపడుతూ ఆ గదిలోకి వెళ్ళింది గౌసియా. అందరూ ఒకేసారి గౌసియా వైపు చూశారు.     "డాక్టర్... కడుపులో నొప్పి" అతి కష్టంగా చెప్పింది గౌసియా.     "వెళ్ళి పడుకో వస్తాను" తాగిన మత్తులో వంకరగా చెప్పాడు డాక్టర్.     "చాలా నొప్పిగా వుంది డాక్టర్" ఏడుస్తూ చెప్పింది గౌసియా.     "మరేం కాదులే. వెళ్ళి పడుకో" డాక్టర్ లో మార్పులేదు. ఏడుస్తూనే తిరిగి బయటకు నడిచింది గౌసియా. మధ్యలో ఎదురయ్యాడు హాస్పిటల్ కాంపౌండరు.     "ఏంటమ్మా?" గౌసియాను చూడగానే అతడిలో ఆతృత.     "కడుపులో నొప్పి" చెప్పింది గౌసియా.     "అయ్యో...! ఎంతసేపయ్యింది?"     "ఇప్పుడే! డాక్టర్ దగ్గరకి వెళ్తే... వెళ్ళి పడుకో వస్తానని చెప్పాడు" కడుపును గట్టిగా పట్టుకుంటూ చెప్పింది గౌసియా.     "ప్చ్...! వీడు ఇంతేనమ్మా! పగలు పూట మాత్రమే వీడు మనిషి. రాత్రి కాగానే వీడికి పేకాట, మందు వుంటేచాలు. ఇలాంటి సమయంలో వీడితో చికిత్స చేయించుకుంటే చచ్చిపోవాల్సిందే. ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా! నిన్ను వేరే హాస్పిటల్ కు తీసుకువెళ్తాను పదమ్మా" చెప్తూనే తను కూడా గౌసియా వెంబడే ముందుకు నడిచాడు కాంపౌండర్.

నిజమైన దీపం (దీపావళి స్పషల్ స్టోరీ)

 నిజమైన దీపం (దీపావళి స్పషల్ స్టోరీ)     అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది. ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు. రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు. ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు. ఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.     ఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు. “నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది. జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు. మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.

" ఏడు రోజులు " 27వ భాగం

" ఏడు రోజులు " 27వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి           బయటకు వెళ్ళగానే తెల్సినవాళ్ళు ఎవ్వరైనా కనిపిస్తారేమోనన్న ఆతృత ఆమెలో రెట్టింపు అయ్యింది. ఎందుకంటే ఒకచోట జనాలు గుమిగూడి వున్నారు. వాళ్ళకు సమీపంగా వెళ్ళి అందర్నీ కలియచూసింది గౌసియా.     వాళ్ళంతా ఒక షాపుముందు నిల్చుని టీవీలో క్రికెట్ చూస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కరు కూడా తెల్సినముఖం కనబడలేదు.     "ప్చ్! ఎవరైనా కనిపిస్తే బాగుణ్ణు" అనుకుంటూ మెడికల్ షాపు దగ్గరికి అలా వెళ్ళిందోలేదో,దూరంనుండి అరుపులు వినబడ్డాయి.     ఎవరన్నట్టుగా కంగారుపడిపోతూ అటు కేసి చూసింది గౌసియా.     కొందరు యువకులు కత్తులు పట్టుకుని వికృతంగా అరుస్తూ పరుగెట్టుకొస్తున్నారు. అది చూసి భయంతో దుకాణాలు మూసుకుంటున్నారు అందరూ. మొదట కొందరు యువకులే కనిపించారు కానీ, చూస్తుండగానే గుంపులు గుంపులుగా పుట్టుకొచ్చారు అల్లరిమూకలు. క్షణాల్లో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారిపోయింది. అమాయక జనాలు చెల్లాచెదురవుతున్నారు. కొన్ని వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అల్లరిమూకలు కొందరు వాటి అద్దాల్ని విచక్షణారహితంగా పగలగొట్టడమే కాదు, వాహనదారుల్ని రాక్షసంగా కిందికి లాగి చితకబాదుతున్నారు.     మరికొన్ని వాహనాలు పక్కనవున్న సందుల్లోకి వేగంగా జొరబడిపోతున్నాయి. ఇంకొందరు వాహనదారులైతే వాహనాల్ని వదిలేసి పారిపోతున్నారు.     అంతా భీభత్సం... గందరగోళం... అయోమయం... రోడ్లమీద నిలిచిపోయిన వాహనాలు. పరుగెడుతున్న జనాలు, ప్రాణభయాన్ని వ్యక్తంచేస్తూ వినిపిస్తున్న హాహాకారాలు, వికృతాన్ని చాటిచెబుతున్న కేకలు, అంతా ఒక కురుక్షేత్రంలా తయారయ్యింది.     గౌసియా చుట్టూ చూసింది. అప్పటికి అన్ని షాపులూ మూసివేయబడివున్నాయి.     "యా... అల్లా" బిగ్గరగా అరుస్తూ అక్కడినుండి పారిపోయే ప్రయత్నం చేసింది. అంతలోనే నిలువు నామం దిద్దుకుని, కాషాయపు గుడ్డను తలకు చుట్టుకున్న ఒక యువకుడు, కత్తితో ఆమె వీపులో కసిగా పొడిచాడు.     "అమ్మా..." తెలుగులో పెనుకేక వేస్తూ, కత్తిపోటును లక్ష్యపెట్టక అలాగే పరుగెట్టబోయింది గౌసియా.     అంతలోనే ఒక ముస్లిం యువకుడు కత్తితో ఆమె భుజాన్ని పొడిచాడు. అయినప్పటికీ ఆమె ఆగలేదు. బాధను భరిస్తూ అలాగే ముందుకు పరుగెట్టింది.     ఆమెకు దారి తెలియట్లేదు. దిక్కుతోచనట్టుగా పరుగెత్తసాగింది. ఒకవైపు రక్తం ఆమె గుడ్డల్ని తడిపేస్తూనే వుంది.     కొంతదూరం పరుగెట్టాక రైల్వేస్టేషన్ కనబడింది. ప్లాట్ ఫామ్ పై ఒక రైలు చిన్న జర్క్ తో అప్పుడే కదులుతోంది. ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నంలో చాలామంది అభాగ్యజనాలు పరుగెట్టుకుని వెళ్ళి ఆ రైల్లోకి ఎక్కుతున్నారు. వాళ్ళతోపాటుగా పరుగెట్టుకువెళ్ళి రైలు ఎక్కబోయింది గౌసియా. కానీ ఆమెకు వెళ్తున్న రైలు ఎక్కడం చేతకాలేదు. అయినప్పటికీ పట్టువదలకుండా రైలు వెంటే కొంతదూరం పరుగెట్టి, ఒక యువకుడు చేయి అందించడంతో రైలు ఎక్కగలిగింది.     రైల్లో అందరూ గౌసియా పరిస్థితిని చూసి "అయ్యయ్యో..." అంటూ గాభరాపడ్డారు.     "మత కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ దరిద్రపు నా కొడుకులకు మతం ఏంపెట్టిందో తెలీదుగానీ, మానవతను మరిచి పోట్లాడుకుంటున్నారు" ఎవరో అన్నారు.     అప్పటికి గౌసియా పరిస్థితి తీవ్రంగా తయారయ్యింది. దప్పికతో ఆమె నోరు పిడచకట్టుకుపోసాగింది. కళ్ళు మూతలు పడసాగాయి. మరోవైపు రక్తస్రావం ఎక్కువౌతూ ఒంట్లో శక్తి పూర్తిగా నశించసాగింది. ఇంకోవైపు కత్తిగాయాలు శరీరాన్ని బాధపెడుతూ కలిచివేయసాగాయి.     "పాపం! పిల్ల పరిస్థితి అదోలావుంది. కనీసం ఒక్క స్టేషన్లో నైనా ఎవ్వరికైనా అప్పజెప్పుదాం"     "పాపం... ఎవ్వరో ఉన్నోళ్ల పిల్లలా వుంది. ఎక్కడికీ ప్రయాణించినట్టులేదు, కలహాలకి భయపడి రైలుఎక్కినట్టుంది"     "ఎవరి ఖర్మ ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. ఆ పిల్లను అనవసరంగా పట్టించుకుని గాలికి పోయే కంపను తలకు తగిలించుకునే ప్రయత్నం చేయొద్దండి"     కనికరం చూపేవాళ్ళు, కాఠిన్యం పంచేవాళ్ళు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆమె దగ్గరికి రాలేదు.     రైలు వేగంగా ప్రయాణిస్తోంది. క్షణక్షణానికి గౌసియా పరిస్థితి కూడా విషమించసాగింది. ప్రాణాలు పోయేంతగా కత్తిపోట్లు ఆమెను గాయపర్చకపోయినా, పట్టించుకునే నాథుడు లేనందున ఆమెకు ప్రాణాపాయ స్థితే ఏర్పడింది.     "హ... హమ్మా... అమ్మా... మా..." ఆయాసపడసాగింది గౌసియా. ఆమె రైలు ఎక్కేందుకు చేయిని ఆసరా ఇచ్చిన యువకుడు ఆమెను ఎంతోసేపు అలా చూస్తూ ఉండలేకపోయాడు. వచ్చి ఆమె గాగ్రా పైటతో ఆమె గాయాలకు కట్టు కట్టసాగాడు.     "బాబూ... వూరుకోవయ్యా! ఇట్లాంటి కేసులు ప్రాణంమీదకి వస్తాయి" అన్నారు ఎవరో.     "ఛ... నోర్మూసుకోండి. మీకు మానవత్వం ఏ కోశాన వున్నా ఈ విధంగా మాట్లాడరు" గదమాయింపుగా అన్నాడు అతడు.     "ఎవరి ఖర్మ వాళ్ళది. మనకెందుకు?" ఎవరో గొణిగారు.     ఆ యువకుడు ఎవ్వర్నీ పట్టించుకోలేదు. గౌసియా గాయాలకు కట్టుకట్టి వాటర్ బాటిల్ కోసం అటూ ఇటూ చూశాడు. ఎవరో చిన్నపిల్లాడు కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు.     ఆ యువకుడు పరుగున ఆ పిల్లాడి దగ్గరకి వెళ్ళి, కూల్ డ్రింక్ సీసా లాక్కుని, గౌసియా దగ్గరకి అదే పరుగుతో వచ్చి ఆమె ముఖంమీద కొంత చిలకరించి, మిగతాది ఆమెతో తాగించసాగాడు.     అవతల ఆ పిల్లాడు కూల్ డ్రింక్ సీసా కోసం గుక్కపెట్టి ఏడవసాగాడు.     "బావున్నావు కదయ్యా! పిల్లాడి కూల్ డ్రింక్ లాక్కుని తాగిస్తున్నావు" ఆ పిల్లాడి తాలూకు వాళ్ళు అన్నారు.     "అవతల ఆ మనిషి చస్తుంటే, కూల్ డ్రింక్ కోసం చూసుకుంటావేంటమ్మా? నువ్వు ఎలాంటి మనిషివి?" మరెవరో ఆవిడమీద కొద్దిగా కోప్పడ్డారు.     పక్క స్టేషన్ లో రైలు ఆగింది. ఆ యువకుడు ఆలస్యం చేయలేదు. గౌసియాను చేతులమీదకు ఎత్తుకుని రైలుదిగి ఆటోలో చేతులమీదకు ఎత్తుకుని రైలుదిగి ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. అప్పటికే గౌసియాకు స్పృహ తప్పింది.     వెనువెంటనే చికిత్స అందించారు. గంట తర్వాత స్పృహలోకి వచ్చి చూసుకుంటే, వదులైన తెల్లని దుస్తులు వున్నాయి తన శరీరంమీద.     "పాపా" పిలిచాడు డాక్టర్.     "మా..." నీరసంగా పలుకుతూ చూసింది గౌసియా.     "ఎలా వుంది?"     "బాగుంది" అన్నట్టుగా తలాడించింది గౌసియా.     "డాక్టర్" అంతలో పిలుస్తూ వచ్చాడు యువకుడు.     "యస్" అంటూ అటు తిరిగాడు డాక్టర్.     "అమ్మాయికి ఎలా వుంది?" అడిగాడు యువకుడు.     "బాగుంది. చెప్పిన మందులు అన్నీ తీసుకొచ్చావా?" అంటూనే అతడి చేతిలోని మందుల ప్యాకెట్స్ ని తన చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్.     యువకుడు ఆమ్మాయి దగ్గరకి నడిచాడు. డాక్టర్ తన గదిలోకి వెళ్తూ, "మిస్టర్... ఈ మెడిసిన్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేస్తాను" చెప్పాడు.     "ఒకే డాక్టర్..." అని "అమ్మాయీ" గౌసియా ముఖంలోకి చూశాడు యువకుడు.     గౌసియాకు అతడు ఎవరో అర్థంకాలేదు.     "నా పేరు మోహన్... నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నేనే" చెప్పుకున్నాడు అతడు.     గౌసియా కళ్ళల్లో కృతజ్ఞతాభావం పొంగి పొర్లింది.     "ఇప్పుడు నీకేంకాదు. నీవు అన్నివిధాలా క్షేమంగా వున్నావు. కాకపోతే ఒక నెలరోజులు రెస్ట్ తీసుకోవాలి" అంటూ గౌసియా పక్కన కూర్చుని, "నీ చిరునామా చెప్పు. మీ అమ్మావాళ్లకు కబురుచేస్తాను" అన్నాడు అతడు.     "మాది హైదరాబాద్" చెప్పింది గౌసియా.     "హైద్రాబాదులో ఎక్కడ వుంటారు?"     "పత్తర్ బజార్"     "నీపేరు, మీ నాన్నగారి పేరు, మీ చిరునామా మొత్తంగా చెప్పు?"     "నా పేరు..." అంటూ ఆగిపోయి, "నువ్వెవరు?" అడిగింది గౌసియా.     "చెప్పాను కదా... నా పేరు మోహన్. నాదీ హైద్రాబాదే. బాంబే వెళ్తున్నాను. కాకపోతే నీకోసం ఇక్కడ దిగాల్సి వచ్చింది"     "శుక్రియా..." గౌసియా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.     "ఫర్వాలేదులేమ్మా! నువ్వు నా చెల్లెల్లాంటి దానివి" చిన్నగా నవ్వాడు అతడు.     "మా పత్తర్ బజార్ లో కూడా గొడవలు జరిగాయా?" అడిగింది గౌసియా.     "ఎక్కడ జరిగితేనేమి? ఈ గొడవలు ఎక్కడ జరిగినా అవి మానవతకి కడుతున్న సమాధులు" ఆవేశంగా మాట్లాడాడు మోహన్.     ఆమె మౌనంగా చూసింది.     "మనసుల్లేని ఈ మనుషులు రాన్రానూ రాక్షసులౌతున్నారు. లేకపోతే ఇన్ని అన్యాయాలు, మోసాలు, దారుణాలు ఎందుకు జరుగుతాయి? ఛ" అని కాసేపాగి, "మన హైద్రాబాదుకు చెందిన ఒక ముస్లిం అమ్మాయిని, అరబ్బు షేక్ కు అమ్మివేశాడుట ఒక పాపిష్టి తండ్రి. ఆ తండ్రిలాంటి తండ్రులు ఇంకా ఎందరో ఉన్నారు. కానీ ఆ అమ్మాయిలాంటి అమ్మాయిలు మాత్రం ఎవ్వరూ లేరనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా అరబ్బుషేక్ ని ఎదురుతిరిగి చంపేసింది. రియల్లీ అయామ్ ప్రౌడ్ ఆఫ్ హెర్!     "ఇంతేకాదు, ఆ అమ్మాయి... ఒక హిందూ యువకుడు ప్రేమించుకున్నారట. అయితే ఆ యువకుడు అదేరోజు రాత్రి ఆ తండ్రిని నిలువునా నరికిపడేసాడట. మంచి పని చేశాడు" అదే ఆవేశంతో మాట్లాడ్తూ పోయాడు అతడు.

" ఏడు రోజులు " 26వ భాగం

" ఏడు రోజులు " 26వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి          అప్పుడు సమయం పదకొండు దాటింది. అయినప్పటికీ బంధువులు హడావిడిగా తిరుగుతుండటం ఆమెకు ఒక అవకాశంగా తోచింది. ఆలస్యం చేయకుండా వెళ్లి బంధువుల మధ్య కల్సిపోయింది. వాళ్లంతా ఖరీదైన బట్టలు ధరించి వున్నారు. వాళ్లమధ్య వెలిసిపోయినట్లుగా వున్న తన దుస్తుల్ని ఒకమారు చూసుకుని వీళ్లు నన్ను ఏర్పాటు చేయకుంటే బాగుణ్ణు మనసులో అనుకుంటుండగానే ఆమె దృష్టి కాసింత దూరంలో వున్న బాత్ రూమ్ మీద పడింది.     బాత్ రూమ్ కు సమీపంగా కట్టివున్న తాడుమీద మంచి వస్త్రాలు ఆరవేయబడివున్నాయి. వాటిని చూడగానే ఆమెలో చటుక్కున ఒక ఆలోచన మెదిలింది. కాసేపు అటూ ఇటూ తటపటాయించి తర్వాత బాత్ రూమ్ వైపు నడిచి తాడుమీద తనకు సరిపడే ఒక గాగ్రాఛోళిని తీస్కుని బాత్ రూమ్ లోకి వెళ్లి మార్చుకుని వచ్చింది. ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడంలేదు. వెళ్లి ఒక పక్కగా కూర్చుంది.     "ఫాదర్ కి ఎలావుందో ఏమో! వెళ్లి చూసి వద్దామనుకున్నా ఈ నగరం అర్థం కావడం లేదు. ఈ రాత్రికి స్టేషన్ లోనే వుండి వుదయాన్నే పోలీసుల సహాయంతో వెళ్దామన్నా పరిస్థితి బాగోలేదు. అసలు వీళ్ళల్లో కల్సిపోయాను కాని ఇప్పుడేం చేయాలి?" ఆమె మనసు కలవరపడింది.       పదిహేను నిముషాలు గడిచిపోయాయి. పెళ్లివాళ్లు నృత్యాలు మొదలెట్టారు. అదే సమయంలో పక్కన వచ్చి కూర్చున్న వాళ్ల మాటలద్వారా వాళ్లంతా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని తెల్సింది.     వీళ్లవెంట వెళ్లిపోతే సరి. కాని ఇక్కడ ఫాదర్? తనలో తను అనుకుంటూండగానే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆమె చేయి పట్టి లాగింది.     ఉలిక్కిపడి చూసింది గౌసియా.     "డాన్స్ చేద్దాం" పిలిచింది ఆ అమ్మాయి గౌసియా కాదనలేదు. అమ్మాయి అందించిన కర్రాల్ని పట్టుకుని వచ్చీరానీ నృత్యాన్ని చేయనారంభించింది.     అర్థగంట తర్వాత టూరిస్టు బస్సువచ్చి గేటు బయట ఆగింది. పెళ్లిజనాలు ఒక్కొక్కరుగా బస్సులోకి ఎక్కి కూర్చోసాగారు. కొందరు లగేజీతో వెళ్తున్నారు. కొందరు ఖాళీగా వెళ్తున్నారు. వాళ్లందరితో పాటుగా తనూ వెళ్లాలనుకుంటూ కోలాటం కర్రల్ని ఆ అమ్మాయికి అందించింది గౌసియా.     "నువ్వు కూడా వెళ్తావా?" అడిగింది అమ్మాయి.     "అందరూ వెళ్లిపోతున్నారుకదా?" అంది గౌసియా.     "వాళ్లంతా హైదరాబాదు వెళ్తున్నారు. మనం మాత్రం ఇక్కడే వుండి హాయిగా డాన్స్ లు చేసుకుందాం. మనతోపాటుగా ఇంకా చాలామంది కూడా వుంటున్నారు. సరేనా?" అంది ఆ అమ్మాయి.     "వద్దు నేను వెళ్లిపోతాను" అంటూ బస్ వైపు నడిచి బస్సు ఎక్కి కూర్చుంది గౌసియా. అమ్మాయి కూడా బస్సు ఎక్కింది.     "ప్లీజ్ నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. నువ్వే నా ఫ్రెండువి. కిందికి దిగవా?" బ్రతిమాలినట్లుగా అంది.     "నేను హైదరాబాద్ వెళ్లాలి" అంది గౌసియా.     "మనం తర్వాత వెళ్దాం" అంది అమ్మాయి.     విన్పించుకోలేదు గౌసియా. అమ్మాయి కాసేపు అడిగి, డ్రైవర్ బస్సు ఎక్కగానే "చూద్దాంలే" అంటూ బస్సు దిగి వెళ్లిపోయింది.     "హమ్మయ్యా" అమ్మాయి బస్సు దిగగానే అనుకుంది గౌసియా.             photo     అక్కడ వెంకట్ గౌసియాను కొంత దూరం వరకు వెదికి తిరిగి స్టేషన్ కు వచ్చాడు. అతడి ముఖం కంగారుతో నిండిపోయి వుంది. అప్పటికి స్టేషన్ కు కృష్ణ వచ్చి వున్నాడు. అతడు వాళ్లకోసమే వెదుకుతున్నట్టుగా బయటే నిలబడివున్నాడు.     "కృష్ణా ఆ పోరి కనబడట్లేదు" జీపు దిగీదిగకుండానే హడావిడిగా చెప్పాడు వెంకట్.     "ఎక్కడికెళ్లింది?" కృష్ణ కూడా కంగారుపడ్డాడు.     "అది తెలిస్తే ఇంత కంగారు ఎందుకు పడ్తాను?" చేతులు నలుపుకున్నాడు వెంకట్.     "మరి ఇప్పుడెలా?"     "ప్చ్... అదే అర్థం కావడంలేదు"     "ఆ పోరి నీ కళ్లుగప్పి పారిపోవడానికి నువ్వెక్కడికి వెళ్లావు?"     "ఆ దరిద్రపు ఫైల్సు సర్దుతున్నాను"     "అరరే"     "ఆ ఫాదర్ గాడు వస్తున్న జీపుకు యాక్సిడెంట్ జరిగింది. అందులో మన కానిస్టేబుల్స్, ఎస్.ఐ. కూడా వున్నారు. ఎవ్వరికీ ఏం కాలేదు. కాకపోతే ఆ పోరికి కొద్దిగా బిల్డప్ ఇచ్చాను. అదీ నా లైను క్లియర్ అవుతుందేమోనని. ప్చ్... ఒప్పుకోలేదు. పైగా పారిపోయింది. ఆ పోరి డైరెక్టుగా ఆసుపత్రికి వెళ్లిందేమో? వెళ్తే మాత్రం మన గురించి చెప్పేస్తుంది. వెళ్లినా వెళ్లకపోయినా మన ఉద్యోగం మాత్రం ఊడుతుంది ప్చ్..." రెండు విధాలా కలవరపడిపోయాడు వెంకట్.     "అవునవును. అనవసరంగా ఆ పోరితో ఎక్స్ ట్రాగా ప్రవర్తించాం. ఇప్పుడేం చేద్దాం?" కృష్ణ మరింత కలవరపడిపోతూ ఏకంగా తల పట్టుకుని మెట్లపై కూలబడిపోయాడు.             *    *    *     ఇక్కడ గౌసియా వెళ్తున్న బస్సులోంచి బయటకు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.     బస్సులోని స్త్రీ పురుషులు పాటలు పాడుతున్నారు. గౌసియా ఎవ్వరిపాటనూ వినడం లేదు. ఆమె మెదడు రకరకాల ఆలోచనలతో నిండిపోయి వుంది. ఆ ఆలోచనలు ఆమెను ఒకవిఅపు భయపెడుతున్నాయి, ఒకవైపు కలవరపెడుతున్నాయి, మరోవైపు తొందరపెడుతున్నాయి, ఇంకోవైపు ఎటూ అర్థం కాకుండా చేస్తున్నాయి.             శుక్రవారం     గౌసియా గురించిన మొత్తం సమాచారం అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ దినపత్రికల్లో ప్రధానవార్తగా ఫోటోలతోసహా ప్రచురింపబడింది. ఎవ్వరూ ఊహించని గౌసియాగాథ దేశం మొత్తంమీద సంచలనం సృష్టించింది. ఎవ్వరినోట చూసినా ఆ మాటలే వినబడసాగాయి.     గౌసియాకు అదేమీ తెలియదు. పెళ్ళి వాళ్ళతో కలిసి రెండుగంటలకల్లా హైద్రాబాద్ చేరుకుంది. అప్పటివరకూ పెళ్ళిజనాలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.     అందరితోపాటుగా బస్సు దిగి అటూ ఇటూ చూసింది. అది ఆమెకు ఏమాత్రం పరిచయంలేని ప్రాంతం. అయినప్పటికీ ఎరిగినవాళ్ళు ఎవ్వరైనా కనబడ్తారేమో అన్న ఆశతో జనాల్ని కలియచూసింది.     పెళ్ళివాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా తెలిసినవాళ్ళకోసం ఆమె కళ్ళు గాలించసాగాయి.     "అమ్మాయీ" అంతలోనే ఎవరో పిలిచారు.     ఎవరన్నట్టుగా చూసింది గౌసియా.     "నీవు చందూలాల్ కూతురివి కదూ?" అడుగుతూ వచ్చి ఆమె పక్కలో కూర్చుంది ఒక నడివయసు స్త్రీ.     వెంటనే ఏంచెప్పాలో తోచలేదు గౌసియాకు. చేసేది లేక అవును అన్నట్టుగా తలాడించింది.     "నేను నిన్ను రాత్రినుంచి చూస్తున్నాను. ముఖంమాత్రం అచ్చు అలాగేఉంది కానీ, అవునా కాదా అనుకుంటున్నాను" అంటూ మరికొంచెం చేరువగా జరిగి, "మరి ఒక్క సొమ్ము కూడా పెట్టుకోలేదు ఎందుకు?" అడిగింది.     "పెట్టుకోలేదు" ఇబ్బందిగానూ భయంగానూ అంది గౌసియా.     "అవున్లే! చిన్నపిల్లవికదా. ఎందుకైనా మంచిది అని పెట్టలేదనుకుంటాను? అవునూ మీ అమ్మానాన్న రాలేదుకానీ, నువ్వు ఒక్కతివే వచ్చావేంటీ?"     "వచ్చాను"     "మీ అమ్మావాళ్ళు వెనక వస్తారేమో కదూ?"     "అవును"     "మీ అన్నయ్య డాక్టరు కోర్సు చదువుతున్నాడుకదూ?"     "అవును"     "మరి నీవేం చదువుతున్నావు?"     "నేను పదవ తరగతి"     "నీ పేరు ఏదో వుంది కదా? మాలతి కదూ?     "అవును"     "ఆ... మాలతీ! ఒక్కపని చెప్తాను చేస్తావుకదూ?"     "చెప్పండి"     "మరేంలేదు. నాకు కొద్దిగా తలనొప్పిగా వుందమ్మా. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయే దుకాణాలు, అక్కడికి వెళ్ళి ఒక అమృతాంజనం సీసా, అనాసిస్ మాత్రలు తీసుకురా.     "పని చెప్తున్నానని మరేం అనుకోవద్దు. నేను నీకు మేనత్త వరస అవుతాను. నువ్వు గుర్తుపట్టలేవుగానీ, మీ నాన్న నాకు బాగా తెలుసు" అందామె.     "సరే" తలాడించింది గౌసియా.     "వేరే ఎవ్వరికైనా ఈ పని చెప్పేదాన్నే అనుకో! కానీ నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదమ్మా. అందుకే నువ్వేం అనుకోవద్దు" డబ్బులు అందిస్తూ క్షమార్పణగా ముఖం పెట్టిందామె.     "ఏమీ అనుకోనులే" అంటూ డబ్బు అందుకుని బయటకు నడిచింది గౌసియా.

" ఏడు రోజులు " 25వ భాగం

" ఏడు రోజులు " 25వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి         ఆమె ఇంకేం అనలేదు. కృష్ణ ఆమెను బాత్ రూమ్ వైపు తీసుకెళ్లాడు. ఆమె బాత్ రూమ్ లోకి వెళ్లి నిముషం తర్వాత వచ్చింది.     "గౌసియా నీకో నిజం చెప్తాను. నేను కోరింది ఇస్తావా?" చీకట్లో ఆమె చేయి పట్టుకున్నాడు కృష్ణ.     "ఏంటీ?" ప్రశ్నార్థకంగా చూసింది అతడి విఅపు.     "చెప్తాగాని ముందు నేను కోరింది ఇవ్వు" మాట మార్చాడు కృష్ణ.     "నీకేం కావాలి?" అడిగిందామె.     "నువ్వు కావాలి" గుసగుసగా అన్నాడు అతడు.     "ఆ" ఆమెకు వెంటనే ఏం అర్థం కాలేదు.     "నువ్వు కావాలి" మళ్లీ చెప్పాడు.     "అం...టే?" ఆమె గొంతు అప్రయత్నంగా వణికింది.     "ష్... మరేం కాదులే. నీకు డబ్బులు కూడా ఇస్తాను" ఆశపెట్టాడు.     "ఆ...ఆ..." ఆమె తడబడింది.     "హైదరాబాదులో ఏం జరిగింది అనేది ఫాదర్ నీతో దాచిపెట్టాడు. కాని నీకు మొత్తంగా చెప్పేస్తాను. నా కోరిక అంగీకరిస్తేనే" అన్నాడు కృష్ణ.     "అమ్మో... వద్దు" భయంగా గుండెలపై చేయివేసుకుందామె.     "ప్లీజ్ కాదనవద్దు" ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు.     "వద్దు" అతడిని విడిపించుకునే ప్రయత్నం చేసింది.     "కృష్ణా..." అంతలోనే స్టేషన్ లోపల్నుంచి వెంకట్ పిలుపు.     "ఆ వస్తున్నా" అంటూ, "నేను ఇలా అడిగానని వాడితో చెప్పొద్దు" అని గౌసియాతో చెప్పి ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచాడు కృష్ణ.     "నీకు సర్కిల్ సాబ్ నుండి ఫోన్ వచ్చింది" చెప్పాడు వెంకట్.     "ఏమన్నాడు?" అడిగాడు కృష్ణ.     "ఇంటికి రమ్మంటున్నాడు" చెప్పాడు వెంకట్.     వెంటనే బయటకు నడిచాడు కృష్ణ. అప్పటికి బాగా రాత్రయ్యింది. ఆవులిస్తూ వెళ్లి ఎప్పటిచోట కూర్చుంది గౌసియా. కాసేపటి తర్వాత ఆమె దగ్గరికి వెళ్లాడు వెంకట్.     "హైదరాబాద్ లో ఏం జరిగింది?" అడిగింది గౌసియా.     "ఏం జరగలేదు. ఆనందంగా వుండు" అంటూ వెళ్లి ఆమె పక్కగా కూర్చుని "నీవూ నీ ప్రియుడు కలిసి ఎక్కడెక్కడ తిరిగేవాళ్లు?" అడిగాడు.     "ఎక్కడా తిరగలేదు. మైసమ్మ గుడి దగ్గర కల్సుకునేవాళ్లం" చెప్పింది.     "అక్కడ ఏం చేసేవాళ్లు?" ఆరా తీసినట్టుగా అడిగాడు.     "మాట్లాడుకునేవాళ్లం"     "అంతేనా? ఇంకేం చేసేవాళ్లుకాదా?"     "ఇంకేం చేస్తాం?" అతడివైపు అనుమానంగా చూసింది.     అతడు చిన్నగా నవ్వాడు. నవ్వుతూనే "ఈకాలం పిల్లలకు ప్రేమంటే అదేకదా! అందుకే అడిగాను" అన్నాడు.     "..."     "అయినా అందులో తప్పేముంది?" అంటూనే ఆమె చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలేశాడు.     "..."     "ఒక్కసారి ఆ సుఖం తెలిస్తే నువ్వు ఇలా వుండలేవు" గొణిగినట్టుగా అన్నాడు.     "ఫాదర్ ఎప్పుడు వస్తాడు?" అతడి మాటలు వింటూనే అడిగింది.     "వస్తాడు" టైం చూసుకుంటూ అన్నాడు వెంకట్.     "త్వరగా వస్తే బాగుణ్ణు" అందామె.     "వస్తాడులే" ఆమెవైపు ఓరగా చూశాడు అతడు.     అప్పటికి ఆ ఇద్దరి మెంటాలిటీ ఆమెకు అర్థమైపోయింది. వాళ్లు తనని ఏమైనా చేస్తారేమోనన్న భయం ఆమెను నిలువెల్లా వణికించసాగింది.     ఇరవై నిముషాలు గడిచాయి. ఫాదర్ ఇంకా రాలేదు. ఆమెలో టెన్షన్ పెరిగింది. అంతలో ఫోన్ మోగింది. వెళ్ళి లిఫ్ట్ చేశాడు వెంకట్. వెంటనే అతడి ముఖంలో రంగులు మారాయి.     "ఐసీ... ఓకే" అంటూ ఫోన్ పెట్టేశాడు.     "ఎక్కణ్ణుంచి ఫోను? అడిగింది గౌసియా.     "ఫాదర్ వాళ్లు వస్తున్న జీపుకి యాక్సిడెంట్ జరిగిందంట. నీకు చెప్పొద్దని చెప్పారు. కాని చెప్పాను. బాధపడుతూ కూర్చుని, నన్ను బయట పెట్టొద్దు" అన్నాడు అతడు.     "హా....?" ఆమె తట్టుకోలేకపోయింది.     "చెప్పానుకదా! నీకు తెలీనట్టుగానే వుండు" అన్నాడు అతడు.     "ఎలా వుండమంటావు?" ఏడుస్తూ అంది గౌసియా.     వాడికెవ్వడికో యాక్సిడెంట్ అయితే దీనికి ఇంత దుఃఖం ఎందుకో?' తనలో తను గొణుక్కుని "ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ల గాయాలు తగ్గిపోవు" అన్నాడు.     "వెళ్లి చూసివద్దాం" ఏడుస్తూనే అంది గౌసియా.     "నీకు చెప్పడమే నా బుద్ధి తక్కువ అయినట్టుంది" అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుని "సరేలే తీసుకువెళ్తాను. మరి నాకేం ఇస్తావు?" అడిగాడు.     "ఏమివ్వాలి?" అందామె.     "కోరింది ఇవ్వాలి" అన్నాడతడు.     అతడు ఆమెకు అర్థమయ్యాడు. "ఇక్కడ వుండటం ఎంత మాత్రం మంచిదికాదు" మనసులో స్థిరంగా అనుకుంది.     "సరేనా?" అన్నాడు అతడు.     ఆమె భయంగా చూసింది. అతడు మాత్రం హాయిగా 'నాయక నహీ' పాటను హమ్ చేసుకుంటూ వెళ్లి ఏవో ఫైల్స్ సర్దసాగాడు.     ఆమె ఆలస్యం చేయలేదు. అటుతిరిగి నిల్చునివున్న అతణ్ణే చూస్తూ వెలుపలికి నడిచింది.     స్టేషన్ బయటకి వచ్చాక ఆమెకు అంతా గందరగోళంగా వుంది. రోడ్లమీద జనసంచారం అడపాదడపా అన్నట్లుగా ఉంది. మరియా ఆశ్రమానికి వెళ్లాలని బయటకి వచ్చిందేకాని అర్థంకాని ఆ రహదారుల వెంబడి తను వెళ్లాల్సిన చోటుకు వెళ్లలేనని అర్థమైపోయింది. దానికి తోడు నవీన్ వాళ్లు గుర్తొచ్చారు. అందుకే కొంతదూరం ముందుకు నడిచి 'స్టేషన్ కే వెళ్లిపోదామా?' అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది. అదే సమయంలో స్టేషన్ ప్రహరీగోడలోంచి వెలుపలికి వస్తూ కనబడింది ఒక వాహనం.     'తనకోసమే కావొచ్చు' అని ఆమె మనసు తలచగానే తిరిగి ఆమెకు భయమనిపించింది. 'దొరక్కూడదు' అని వెంటనే నిర్ణయించుకుంది. వాహనం ఆమెను దాటి వెళ్లి పోయింది.     అక్కడ కారు షెడ్డువుంది. కార్లచాటుగా నక్కిన గౌసియా వాహనం వెళ్లిపోగానే వెలుపలికి వచ్చి అటూ ఇటూ చూసింది. ఆ తర్వాత కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా వడివడిగా వచ్చిన దారెంబడే వెనుతిరిగి సాగిపోయింది.     స్టేషన్ ని దాటి కొంతముందుకు వెళ్లాక ఒక ఇంటిముందు హడావిడి కనబడింది. ఇంటికి వేసిన లైట్లు, జనాల్లో కనిపిస్తున్న ఆనందం, ఆ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతోందని చెప్పకనే చెప్పింది.

" ఏడు రోజులు " 24వ భాగం

" ఏడు రోజులు " 24వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     వెళ్లను" అంది గౌసియా.     "నాకు కొద్దిగా పని వుందమ్మా! ఆ పని అయ్యాక వెంటనే వస్తాను" అన్నాడు ఫాదర్.     "తొందరగా రావాలి" అంది గౌసియా.     "వస్తాను"     గౌసియా ఇంకేం మాట్లాడలేదు. కానిస్టేబుల్ వెంట బయటకు నడిచింది.     "ఈ అమ్మాయి ఎక్కువసేపు ఇక్కడ వుంటే నిజాన్ని ఎట్లాగయినా తెలుసుకుంటుంది. ఈ కానిస్టేబుల్స్ కాసేపు వూరుకోండయ్యా అంటే విన్పించుకునేట్టులేరు. తను ముందే మానసికంగా బలహీనురాలు. అందుకే స్టేషన్ కు పంపిస్తున్నాం" వెళ్తున్న గౌసియానే చూస్తూ పక్కన నిల్చునివున్న ఒక పత్రికా విలేకరితో అన్నాడు ఫాదర్.     "ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుందిగా ఫాదర్?" అన్నాడు విలేకరి.     "నిజం తెల్సినా భరించుకునేలా రేపటివరకు అమ్మాయిని ప్రిపేర్ చేస్తాం" అన్నాడు ఫాదర్.     అప్పటికి కానిస్టేబుల్ తో కలిసి బయటకి నడిచింది గౌసియా. వెనకే మరో కానిస్టేబుల్ వచ్చాడు. ఇద్దరితో కలిసి పోలీసుజీపులో స్టేషన్ కి బయలుదేరిందామె. మధ్యలోకి వెళ్లాక వెనకసీట్లో కూర్చుని వున్న కానిస్టేబుల్ అడిగాడు.     "అమ్మాయీ! నీవు ప్రేమలో పడ్డావా?"     "అ...వు...ను" కొద్దిగా ఇబ్బందిపడింది గౌసియా.     "ఆ కుర్రాడు ఏం చేస్తుంటాడు?"     "చదువుకుంటున్నాడు"     "ఏంటో ఈ కాలం పిల్లలకు ఇంత వయసు వచ్చిందో లేదో అప్పుడే తహతాహలు మొదలౌతాయి" తనలో తానే గొణుక్కున్నాడు కానిస్టేబుల్.     జీపు పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కానిస్టేబుల్స్ తో పాటుగా జీపుదిగి స్టేషన్ లోపలికి నడిచింది గౌసియా.     "నీకేం భయంలేదు. ధైర్యంగా వుండు" డ్రైవ్ చేసిన కానిస్టేబుల్ ఆమె భుజాన్ని తడుతూనే గట్టిగా నొక్కాడు.     ఆమె అతడిని పెద్దగా పట్టించుకోలేదు. వెళ్లి అక్కడ కుర్చీలో ఒక పక్కగా కూర్చుంది.     "నీకేం అవసరం వచ్చినా నాతో చెప్పు" ఆమె వీపు నిమిరాడు అతడు.     "సరే" తలాడించిందామె.     "బాత్ రూమ్ వస్తోందా?" తనే అడిగాడు.     "ఉహూ" తల అడ్డంగా వూపింది.     "వస్తే వెళ్లు" చెప్పాడు.     "..."     "కాసేపైతే ఫాదర్ తో పాటుగా అందరూ వస్తారు. అంతా అల్లరిగా వుంటుంది. బాత్ రూమ్ కి ఇప్పుడే వెళ్లు" చెప్పాడు.     "వద్దు" అందామె.     "సరే నీ ఇష్టం" అంటూ బయటకి నడిచాడు అతడు.     "ఏమంటోందిరా?" మెల్లగా అడిగాడు అక్కడున్న కానిస్టేబుల్.     "వేస్టు క్యాండిడేటు" చెప్తూ వెళ్లి అతడి పక్కన కూర్చున్నాడు ఇతడు.     "ఇదే వేరే కేసైతే ట్రైచేసి చూసేవాళ్లం. కాని ఇప్పుడు జాగ్రత్తగా వుండాల్రోయ్. లేదంటే మన కొంపలు మునుగుతాయి" మొదటి కానిస్టేబుల్ అన్నాడు.     అంతలోనే గౌసియా డోర్ దాకా వచ్చి "సార్" పిల్చింది. ఇద్దరూ ఆమెవైపు చూశారు.     "బాత్ రూమ్" అందామె.     "వస్తాను పదా" అంటూ రెండవ కానిస్టేబుల్ లేచి ఆమెవైపు వెళ్లాడు.     "మీ ఇద్దరి పేరేంటి?" అడిగింది గౌసియా.     "నా పేరు కృష్ణ. అతడి పేరు వెంకట్" చెప్పాడు. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 24వ భాగం

" ఏడు రోజులు " 24వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     గౌసియా అందించిన వివరాల ప్రకారం మొదట హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అట్నుంచి గౌసియా వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి డి.జి.పి యే స్వయంగా మాట్లాడాడు. అక్కడి సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ చెప్పిన మాటలు డి.జి.పిని మొదట కలవరపెట్టాయి.          డి.జి.పిద్వారా విషయం తెలుసుకున్న ఫాదర్ కూడా కలవరపడి పోతూ "ఓ గాడ్! ఈ విషయాన్ని వెంటనే అమ్మాయికి చెప్పడం అంత మంచిదికాదు" అన్నాడు.          "జాగ్రత్తపడాల్సింది అమ్మాయి గురించే కాదు, దేశం గురించి కూడా! అరబ్బుషేకు హత్య గురించి ఏ పేపర్లూ పెద్దగా రాయలేదు. ముందు ఆలోచనగా గౌసియా తండ్రి హత్య గురించి కూడా పెద్దగా రాయలేదు. కాని రేపు ఈ వార్తలు మెయిన్ ఎడిషన్ లో రాబోతున్నాయి. అంటే దేశం మొత్తం మీద మతకల్లోలాలు తలెత్తినా ఎత్తవచ్చు" అన్నాడు డి.జి.పి.          "కన్నతండ్రి విషయంలో అమ్మాయి విముఖతగా వుంది. సో... తండ్రి హత్య గురించి తెలిస్తే కాసేపు బాధపడి వూరుకుంటుందేమో కాని తన ప్రియుడు కనిపించకుండా వెళ్ళిపోయాడంటే మాత్రం ఆ పిల్ల తట్టుకోలేదు" అన్నాడు ఫాదర్.          "ఆ అబ్బాయి నిజంగా పారిపోతే పొరపాటు చేసినవాడే అవుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి గౌసియా తండ్రిని ఎందుకు హత్య చేశాడు అన్న విషయాన్ని పేపర్లు స్పష్టంగా ప్రచురించలేదు. కాని అబ్బాయి అదే విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి వుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు ఆ హత్య ఎందుకు జరిగింది అన్న విషయం గురించి కరెక్టు సమాచారం లేదంటున్నారు. అయినా ఇప్పుడు అంతా తేటతెల్లమైపోయిద్న్హి. కాని ఆ అబ్బాయే ఎక్కడవున్నాడో ఏమో పాపం" అన్నాడు డి.జి.పి.          "నేనూ అదే బాధపడుతున్నాను" అన్నాడు ఫాదర్.          "అసలు ఆ అబ్బాయి బతికే వున్నాడా లేదా అనేది నాకు అనుమానంగా వుంది. ఉదయం పేపర్లో ఓ చోట చిన్నగా వచ్చిన వార్తను చదివినప్పుడు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అమ్మాయి అంతా చెప్పాక అక్కడకి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి తెలుసుకున్నాక ఈ సంఘటన ఎంత తీవ్రమైనదో అర్ధమౌతోంది" అని డి.జి.పి అనగానే.          "మీరు ఆ వార్తను కనీసం చదివారు. నేను అసలు చదవలేదు. ఇలాంటి విధ్వంసాల గురించి చదివితే ఒకటి రెండు రోజుల వరకు నాకు మనశ్శాంతి వుండదు. అందుకే దాదాపుగా నేను అట్లాంటి వార్తలు చదవను" అన్నాడు ఫాదర్.          డి.జి.పి మరేదో అనబోయాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చాడు.          "సర్! ఆ అమ్మాయి మాకేం అర్ధం కావడంలేదు" చెప్పాడు.          "నేను వస్తాను" అంటూ లేచి వెంటనే డి.జి.పి గదిలోంచి బయటకు వచ్చాడు ఫాదర్.          బయట ఒకపక్కగా చెయిర్ లో ఒదిగి కూర్చుని వుంది గౌసియా.          "గౌసియా..." ప్రేమగా పిలుస్తూ దగ్గరగా వెళ్ళాడు ఫాదర్.          స్తబ్దుగా నేలను చూస్తూ కూర్చునివున్న గౌసియా కనీసం తలతిప్పి చూళ్ళేకపోయింది.          "గౌసియా" ఆమె పక్క చెయిర్ లో కూర్చున్నాడు ఫాదర్.          "నాకెందుకో భయంగా వుంది ఫాదర్" ఏడుపు ముఖంతో ఫాదర్ వైపు చూసింది గౌసియా.          "ఎందుకు భయపడుతున్నావు?" అడిగాడు ఫాదర్.          "నేను ఇప్పట్లో హైదరాబాదు వెళ్ళలేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. నేను కొద్దికొద్దిగా విన్నాను" పక్కన నిల్చునివున్నా కానిస్టేబుల్స్ వైపు చూపిస్తూ అంది గౌసియా.          "మేము ఏం మాట్లాడాం?" అన్నట్లుగా చూశారు కానిస్టేబుల్స్.          "గౌసియాకు ఏం జరిగిందని మీరేం మాట్లాడుకున్నారు? తను రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్తుంది. ఆమెను అనవసరంగా భయపెట్టవద్దు" కానిస్టేబుల్స్ తో అన్నాడు ఫాదర్.          "మేము అసలు ఆమె గురించే మాట్లాడలేదు. మా మాటలు మేము మాట్లాడుకున్నాం. తను పొరపాటు పడితే మేమేం చెయ్యాలి?" ఆశ్చర్యపోతూ అన్నాడు ఒక కానిస్టేబుల్.          "లేదు ఫాదర్! వీళ్ళు నా గురించే మాట్లాడారు నేను విన్నాను హైదరాబాద్ లో కూడా అల్లర్లు జరిగాయటకదా. ఎవరికో ఏదో జరిగిందటకదా!" భయంగా అంది గౌసియా.          "నోనో! ఎవ్వరికీ ఏం జరగలేదు" గౌసియా భుజంపై చేయివేశాడు ఫాదర్.          "మీరు ఏదో దాచిపెడుతున్నారు. నిజం గానే ఎవ్వరికో ఏదో జరిగింది" ఏడవసాగింది గౌసియా.          "ఎవ్వరికీ ఏమీ కాలేదమ్మా అందరూ క్షేమంగా వున్నారు" చిన్నగా నవ్వుతూ అన్నాడు ఫాదర్.          "అయితే రేపే నన్ను హైదరాబాదు తీసుకెల్లండి" అంది గౌసియా.          "వెళ్దాం కాని కొద్దిగా ఆలస్యంగా! ఎందుకంటే నువ్వు హత్యకేసులో వున్నావు. ఈ కేసులో నీకు శిక్షపడదు. కాని కొన్ని రోజులు ఇక్కడే పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకుంటారు" నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఫాదర్.          "వద్దు... నేను రేపే వెళ్తాను" మొండిగా అంది గౌసియా.          "సరేలే నీ ఇష్టం" అని కాసేపాగి, "ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చో" చెప్తూనే లేచి తిరిగి లోపలికి నడిచాడు ఫాదర్.     'నా భవానీ శంకర్ కు ఏం కాకూడదు' మనసులో కోరుకుంటూ అక్కడే కూర్చుండి పోయిందామె.          "పాపా" కాసేపటి తర్వాత ఒక కానిస్టేబుల్ పిలుస్తూ వచ్చాడు.          ఏంటన్నట్లుగా చూసింది గౌసియా.          "స్టేషన్ కు వెళ్దాం రామ్మా" అన్నాడు.          "ఫాదర్!" లోపలివైపు చూసింది.          "నేను తర్వాత వస్తానమ్మా"          "వద్దు ఫాదర్! మీరు లేకుండా నేను వెళ్లను" అంది గౌసియా.     "నాకు కొద్దిగా పని వుందమ్మా! ఆ పని అయ్యాక వెంటనే వస్తాను" అన్నాడు ఫాదర్.     "తొందరగా రావాలి" అంది గౌసియా.     "వస్తాను"     గౌసియా ఇంకేం మాట్లాడలేదు. కానిస్టేబుల్ వెంట బయటకు నడిచింది.     "ఈ అమ్మాయి ఎక్కువసేపు ఇక్కడ వుంటే నిజాన్ని ఎట్లాగయినా తెలుసుకుంటుంది. ఈ కానిస్టేబుల్స్ కాసేపు వూరుకోండయ్యా అంటే విన్పించుకునేట్టులేరు. తను ముందే మానసికంగా బలహీనురాలు. అందుకే స్టేషన్ కు పంపిస్తున్నాం" వెళ్తున్న గౌసియానే చూస్తూ పక్కన నిల్చునివున్న ఒక పత్రికా విలేకరితో అన్నాడు ఫాదర్.     "ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుందిగా ఫాదర్?" అన్నాడు విలేకరి.     "నిజం తెల్సినా భరించుకునేలా రేపటివరకు అమ్మాయిని ప్రిపేర్ చేస్తాం" అన్నాడు ఫాదర్.     అప్పటికి కానిస్టేబుల్ తో కలిసి బయటకి నడిచింది గౌసియా. వెనకే మరో కానిస్టేబుల్ వచ్చాడు. ఇద్దరితో కలిసి పోలీసుజీపులో స్టేషన్ కి బయలుదేరిందామె. మధ్యలోకి వెళ్లాక వెనకసీట్లో కూర్చుని వున్న కానిస్టేబుల్ అడిగాడు.     "అమ్మాయీ! నీవు ప్రేమలో పడ్డావా?"     "అ...వు...ను" కొద్దిగా ఇబ్బందిపడింది గౌసియా.     "ఆ కుర్రాడు ఏం చేస్తుంటాడు?"     "చదువుకుంటున్నాడు"     "ఏంటో ఈ కాలం పిల్లలకు ఇంత వయసు వచ్చిందో లేదో అప్పుడే తహతాహలు మొదలౌతాయి" తనలో తానే గొణుక్కున్నాడు కానిస్టేబుల్.     జీపు పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కానిస్టేబుల్స్ తో పాటుగా జీపుదిగి స్టేషన్ లోపలికి నడిచింది గౌసియా.     "నీకేం భయంలేదు. ధైర్యంగా వుండు" డ్రైవ్ చేసిన కానిస్టేబుల్ ఆమె భుజాన్ని తడుతూనే గట్టిగా నొక్కాడు.     ఆమె అతడిని పెద్దగా పట్టించుకోలేదు. వెళ్లి అక్కడ కుర్చీలో ఒక పక్కగా కూర్చుంది.     "నీకేం అవసరం వచ్చినా నాతో చెప్పు" ఆమె వీపు నిమిరాడు అతడు.     "సరే" తలాడించిందామె.     "బాత్ రూమ్ వస్తోందా?" తనే అడిగాడు.     "ఉహూ" తల అడ్డంగా వూపింది.     "వస్తే వెళ్లు" చెప్పాడు.     "..."     "కాసేపైతే ఫాదర్ తో పాటుగా అందరూ వస్తారు. అంతా అల్లరిగా వుంటుంది. బాత్ రూమ్ కి ఇప్పుడే వెళ్లు" చెప్పాడు.     "వద్దు" అందామె.     "సరే నీ ఇష్టం" అంటూ బయటకి నడిచాడు అతడు.     "ఏమంటోందిరా?" మెల్లగా అడిగాడు అక్కడున్న కానిస్టేబుల్.     "వేస్టు క్యాండిడేటు" చెప్తూ వెళ్లి అతడి పక్కన కూర్చున్నాడు ఇతడు.     "ఇదే వేరే కేసైతే ట్రైచేసి చూసేవాళ్లం. కాని ఇప్పుడు జాగ్రత్తగా వుండాల్రోయ్. లేదంటే మన కొంపలు మునుగుతాయి" మొదటి కానిస్టేబుల్ అన్నాడు.     అంతలోనే గౌసియా డోర్ దాకా వచ్చి "సార్" పిల్చింది. ఇద్దరూ ఆమెవైపు చూశారు.     "బాత్ రూమ్" అందామె.     "వస్తాను పదా" అంటూ రెండవ కానిస్టేబుల్ లేచి ఆమెవైపు వెళ్లాడు.     "మీ ఇద్దరి పేరేంటి?" అడిగింది గౌసియా.     "నా పేరు కృష్ణ. అతడి పేరు వెంకట్" చెప్పాడు. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 23వ భాగం

" ఏడు రోజులు " 23వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ దగ్గరగా ఒదిగి నిలబడి నవీన్ నే చూడసాగింది గౌసియా.          ప్రార్ధన పూర్తయ్యేవరకూ అతడు ఎక్కడా చూళ్ళేదు. ఎంతో ఏకాగ్రతగా ప్రభువును స్మరించుకున్నాడు. ప్రార్ధన పూర్తయ్యాక సైతం అతడు ఎవ్వరితో మాట్లాడలేదు. ఎవ్వర్నీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా బయటికి నడిచాడు.          'అతడు అతడేనా?' అతడ్నే చూస్తూ ఆశ్చర్యంగా అనుకుంది గౌసియా.          "ఏం గౌసియా? ఎవర్ని అలా చూస్తున్నావు?" అడిగింది పక్కనే వున్న సన్యాసిని.          అప్పటికి తను చెప్పాలనుకున్న విషయం గుర్తుకురాగానే హడావిడి పడుతూ, "అతడే... అతడే" నవీన్ వైపు చూపించింది గౌసియా.          "ఎవరు?" వెళ్ళిపోతున్న జనాల్లోకి చూసింది సన్యాసిని.          "అదిగో... అతడు" ఆత్రంగా చూపించింది గౌసియా.          "ఎవరు గౌసియా?" ఆమెకు అర్ధం కావడంలేదు.          "అదిగో తెల్లచొక్కా వేసుకున్నాడే... అతడే నన్ను మోసం చేయాలనుకున్నవాళ్ళలో ఒకడు"          "అట్లాగా... ఎవరూ... ఎవరూ?" ఆమెలో కూడా ఆత్రం పెరిగింది.          నవీన్ జనాల్లో కలిసి వెళ్ళిపోతున్నాడు. అందరూ తెల్లచొక్కాలే ధరించి వున్నందున అతడ్ని గుర్తించడం సన్యాసినికి సాధ్యపడడం లేదు.          "అతడే..." గౌసియా నవీన్ వైపు కళ్ళింత చేసి చూస్తోంది.          "ఎక్కడా?" ఆమె కంగారుపడిపోతూ జనాల్లోకి చూస్తోంది.          అప్పటికి బయటికి నడిచాడు నవీన్. గౌసియా కూడా బయటికి నడవబోయింది వెళ్తున్న జనాలు ఆమెను త్వరగా బయటకు వెళ్ళనివ్వలేదు. జనాలు తొక్కిసలాటలా కాకుండా ఒక క్రమపద్దతిలో బయటకు వెళ్తున్నారు అయినప్పటికీ వాళ్ళందర్నీ దాటుకుని బయటికి వెళ్ళేసరికి కొద్దిసమయం పట్టింది. తీరా బయటకు వెళ్ళేసరికి నవీన్ కనబడలేదు.          "యా అల్లా..." అనుకుంటూ జనాల్లోకి కలియచూసింది గౌసియా.          "అతడు ఎక్కడా?" వెనకే వచ్చిన సన్యాసిని అడిగింది.          "కనబడ్డంలేదు..." కంగారుగా అని, "ఆ... అదిగో... అక్కడ..."          అటుతిరిగి గేటుదగ్గర నిల్చునివున్న ఓ వ్యక్తివైపు చూపించింది గౌసియా.          "నాకు అర్ధంకావడంలేదు వెళ్దాంరా" అంటూ గౌసియా చేయి పట్టుకుని ముందుకు నడిచింది సన్యాసిని.          "ఇదిగో ఇతడే" సమీపంగా వెళ్ళగానే చూపించింది గౌసియా.          అదేక్షణంలో అతడు ఇటుతిరిగాడు. అతడు నవీన్ కాదు.          "మదర్?" సన్యాసిన్ ఐ వైపు ప్రశ్నగా చూశాడు అతడు.          "ఆ... ఆ... ఇతడుకాదు" పొరపాటుకు తడబడింది గౌసియా.          "మరి అతడెక్కడా?" అడిగింది సన్యాసిని.          "కనబడ్డంలేదు వెళ్ళిపోయినట్టున్నాడు" జనాల్లోకి చూస్తూ అంది గౌసియా.          "సరే" అని, "సారీ మిస్టర్" తమవైపే అర్ధం కానట్టుగా చూస్తున్న ఇందాకటి వ్యక్తికి చెప్పి, గౌసియా చేయి పట్టుకుని వెనక్కి నడుస్తూ, "నువ్వు అనవసరంగా పొరబడుతున్నావు" అంది సన్యాసిని.          తను ఖచ్చితంగా పోరాబదలేదు. ఇలాగని తనను ఇప్పుడు నిరూపించుకోలేదు.          గౌసియా అందుకే మౌనంగా వుండిపోయింది.          ఆశ్రమానికి వెళ్ళాక విషయం అందరికీ తెల్సిపోయింది.          "నేను నిజంగా అతడ్ని చూసాను" ఖచ్చితంగా అంది గౌసియా ఆమెను ఎవ్వరూ నమ్మలేదు ఆమె ఇక ఎక్కువసేపు ఎవ్వర్నీ నమ్మించే ప్రయత్నం చేయలేదు కూడా.          ఫాదర్ కోసం ఎదురుచూస్తూ బయటి వరండా మెట్లమీదకు వెళ్ళికూర్చుంది.                  *    *    *          ఫాదర్ పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఇన్స్ పెక్టరుతో సీరియస్ గా మాట్లాడుతున్నారు.          "అమ్మాయి కేసు, దేశంమొత్తం మీద సంచలనం సృష్టించబోతోంది" అన్నాడు ఇన్స్ పెక్టర్.          "ఒక చదువురాని పిల్ల... అందునా ఒక అమాయకురాలు... ఇంత సాహసం చేసింది అంటే ఇది సామాన్యమైన విషయంకాహ్డు కదా?" అన్నాడు ఫాదర్.          "అప్పట్లో ఎయిర్ హోస్టెస్ అమృతా అహ్లూవాలియా ద్వారా రక్షింపబడిన అమీనా సంఘటన కనీవినీ ఎరుగని సంచలనమైంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా తనను కొనుగోలు చేసినవాడ్ని అమ్ముడుపోయిన అమ్మాయే చంపడమంటే నాట్ పాసిబుల్. కానీ సాధ్యమైంది. సో... అమ్మాయిని వెంటనే చూడాలనిపిస్తోంది వెళ్దాం పదండి" తొందరపడ్డాడు ఇన్స్ పెక్టర్.          "ఓకే" అంటూ లేచి నిల్చున్నాడు ఫాదర్.          కాసేపట్లో పోలీసుజీపు మరియా ఆశ్రమం ముందు ఆగింది. గౌసియాతోపాతూగా వరండాలో కూర్చునివున్న సన్యాసినులు అందరూ ఒక్కసరిగా తిరిగిచూశారు.          ఫాదర్ తోపాటుగా పోలీసులు కిందికి దిగారు. వాళ్ళను చూడగానే గౌసియా భయంగా లేచి నిలబడింది.          "ఈ అమ్మాయే మన గౌసియాబేగం" దగ్గరగా రాగానే గౌసియాను పోలీసులకు చూపించాడు ఫాదర్.          "సలాం.... వాలేకుం" అలవాటుగా తల వంచి చెప్పింది గౌసియా.          ఆమె సలాంను స్వీకరిస్తున్నట్టుగా చిరునవ్వుతో గౌసియా భుజాన్ని తట్టాడు ఇన్స్ పెక్టర్.          తర్వాత అందరూ కలిసి డాబామీదకు వెళ్ళారు. అప్పుడు సమయం రాత్రి ఏడుగంటలు కావస్తోంది. వాతావరణం చల్లగా హాయిగా వుంది. వెళ్ళి డాబామీద ఖాళీ ప్రదేశంలో వేసివున్న కుర్చీల్లో కూర్చున్నారు పోలీసులు, ఫాదర్, గౌసియా ఒకపక్కగా నిలబడి పోయింది.          ఇన్స్ పెక్టర్ గౌసియాతో అన్ని విషయాల్ని ఓపికగానూ, క్షుణ్ణంగానూ మాట్లాడసాగాడు. ఆమె వున్నది వున్నట్టుగా చెప్పుకుపోసాగింది.          "అమ్మాయిని ఈ రాత్రికే డి.జి.పి దగ్గరకు తీసుకెళ్దాం" గౌసియాతో మాట్లాడక ఫాదర్ తో అన్నాడు ఇన్స్ పెక్టర్.          "రేపు ఉదయాన్నే తీసుకువెళ్దాం ఇప్పుడు చీకటయ్యింది కదా" అన్నాడు ఫాదర్.          "నో నో జాప్యం చేయడానికి ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి విషయాల్లో అర్దరాత్రి పన్నెండయినా సరే, వెళ్ళాల్సిన చోటుకు మేము వెళ్ళితీరుతాం! ఆడామగా తేడా కూడా మాకు లేదు" అన్నాడు ఇన్స్ పెక్టర్.          "సరే  అట్లాగే కానివ్వండి" అన్నాడు ఫాదర్.          "ఆ...అమ్మాయీ! నిన్ను మోసం చేయాలనుకున్నారే ఆ కుర్రాళ్ళు వుండే చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళగలవా?" అడిగాడు ఇన్స్ పెక్టర్.          "తీసుకువెళ్ళలేను. కాకపోతే అక్కడ ఒక దేవత గుడి వుంటుంది. వీధి కూడా పాడుబదినట్టుగా వుంది" చెప్పింది గౌసియా.          "సరే సరే వాళ్ళను తరువాత చూసుకుందాం" అన్నాడు ఇన్స్ పెక్టర్.          "ఈ సాయంత్రం వాళ్ళల్లో ఒకడు చర్చికి వచ్చాడు. నేను కళ్ళారా చూశాను. కాని అంతలోనే అతడు వెళ్ళిపోయాడు నేను ఈ విషయాన్ని చెప్తే కూడా నన్ను ఎవ్వరూ నమ్మలేదు ఫాదర్ కు చెబుదామన్నా ఫాదర్ ఈ సాయంత్రం చర్చికి రాలేదు" చెప్పింది గౌసియా.          "ఈ సాయంకాలం నుండి ఫాదర్ మా దగ్గరేవున్నారు" ఫాదర్ ను చిరునవ్వుగా చూస్తూ చెప్పాడు ఇన్స్ పెక్టర్.          తర్వాత గౌసియాను డి.జి.పి దగ్గరకు తీసుకెళ్ళారు. ఫాదర్ వెంటే' వున్నాడు అక్కడికి వెళ్ళాక పత్రికల వాళ్లకి, టీవీవాళ్ళకి సమాచారం పంపడం, వాళ్ళు వెనువెంటనే రావడం, న్యూస్ కవర్ చేసుకోవడం గౌసియాకు అంతా కలలోలా తోచింది. అరబ్బుషేకులకు స్థావరం కల్పించిన హిందుస్థానీ హోటల్ మీదకు అప్పటికప్పుడు పోలీసులు దాడిచేయడం, హత్య అనంతరం కొందరు పారిపోగా మిగిలిన వాళ్ళు కొందర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, హోటల్ యాజమాన్యాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం అంతా ఆ రాత్రికి రాత్రే జరిగిపోయాయి.   ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 22వ భాగం

" ఏడు రోజులు " 22వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    భవానీశంకర్ అపనమ్మకంగా చూస్తూ నిల్చుని వున్నాడు. ఫాదర్ తోడురాగా చిరునవ్వుతో భవానీశంకర్ దగ్గరికి నడిచింది గౌసియా.          "గౌ... సి...యా?" ఆమె రాకను అతడు నమ్మలేకపోతున్నాడు.          "శం... క...ర్... ఈ ఫాదర్ దేవుడు. నన్ను నీకోసం తీసుకువచ్చాడు" ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన బిగువ పట్టుకుంటూ అందామె.          ఫాదర్ వైపు చూశాడు భవానీశంకర్ ఫాదర్ చిరునవ్వుతోనే అతడ్ని పలకరించదువు. భవానీశంకర్ ఫాదర్ చిరునవ్వుతోనే అతడ్ని పలకరించాడు. భవానీశంకర్ ఫాదర్ కి చేతులు జోడించాడు. ఆ సమయంలో భవానీశంకర్ కళ్ళల్లో కృతజ్ఞతాపూర్వకమైన వెలుగు.          "ఫాదర్! మా ఇద్దర్నీ కలిపారు. ఇక మా కుటుంబాలనుండి గానీ, మా మతాలనుండి కానీ మాకు ఎలాంటి కష్టం రాకుండా మీరే కాపాడాలి" ఫాదర్ చేతుల్ని పట్టుకుంది గౌసియా.          "మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు" అన్నాడు ఫాదర్.          "ఎందుకైనా మంచిది మేం ఈ సమాజానికి దూరంగా బతుకుతాం" అన్నాడు భవానీశంకర్.          "మేం ఏ మతానికీ సంబంధించిన వాళ్ళంకాదు. మేం కేవలం భారతీయులం! కాబట్టి అటు హిందువులుగానీ, ఇటు ముస్లింలుగాని మమ్మల్ని ఏదైనా చెయ్యవచ్చు" భయంగా అన్నాడు భవానీశంకర్.          "అవును ఫాదర్! మతాల్ని వదిలేసుకుని భారతీయులుగా బతకాలి అనుకుంటున్నాం కాబట్టి, ఏ మఠం వాళ్ళకైనా మాపై కోపం రావొచ్చు" అంది గౌసియా.          సరిగ్గా అదే సమయంలో అటువైపునుండి హిందువులు, ఇటువైపునుండి ముస్లింలు భయపెడుతూ అరుస్తూ... కర్రలు పట్టుకుని పరుగెట్టుకు రాసాగారు.          గౌసియా, భవానీశంకర్ ఆ ఇరువర్గాల్ని చూడగానే ఒకరిచేతుల్ని ఒకరు బిగ్గరగా పట్టుకుని భయంగా బిగుసుకుపోతూ ఒక పక్కకు జరిగారు.          ఫాదర్ మాత్రం భయపడలేదు "ఆగండి" ఇరువర్గాలకి చేతులు చూపిస్తూ గట్టిగా అరిచాడు.          ఎవ్వరూ ఫాదర్ ని లెక్కచేయలేదు. కట్టలు తెగుతున్న కసి, ద్వేషాలతో ఒకర్ని ఒకరు కొట్టుకోవడం ఆరంభించారు. కాసేపటిక్రితం ప్రశాంతంగా వున్న వాతావరణం ఒక్కసారిగా హాహాకారాలతో... అరుపులతో... రణభూమిలా మారిపోగానే, ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆ ప్రేమికులు ఇద్దరూ అక్కడ్నుంచి తప్పించుకునే ఉద్దేశ్యంతో నెమ్మదిగా అడుగులు వెనక్కి వేయసాగారు.          "ప్రభూ! ఏమిటీ విపరీతం?" ఫాదర్ కూడా పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాడు.          "ఫాదర్! వచ్చేయండి" తాము వెళ్తూనే మెల్లగా చెప్పింది గౌసియా ఫాదర్ వెనక్కి తిరిగి చూశాడు.          సరిగ్గా అదే క్షణంలో ఐదారుగురు వ్యక్తులు ఒక్కుమ్మడిగా వచ్చి ఫాదర్ ను విచాక్షణారహితంగా కత్తులతో పొడవసాగారు.          "ఫాదర్" గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది గౌసియా. సమీపంగా కూర్హ్సుని బైబిలు పుస్తకాలు చదువుకుంటున్న కొందరు సన్యాసినులు ఒక్కసారిగా గౌసియావైపు అర్ధంకానట్లుగా చూశారు.          భయంగా చుట్టూచూసింది గౌసియా.          ఫాదర్ లేడూ, భవానీశంకర్ లేడూ, అస్సలు ఏ గొడవా లేదు. అంతా నిర్మలమైన వాతావరణం నెలకొని వుంది.         "కలవచ్చింది" సన్యాసినులవైపు చూస్తూ భయంగా చెప్పింది గౌసియా ఆమె ఇప్పుడు భయపడింది కలగురించి కాదు, వాళ్ళ పఠనానికి భంగం కలిగించినందుకు, వాళ్ళు తనను కోప్పడతారేమోనని మాత్రమే!          గౌసియాకు చేరువగా కూర్చునివున్న ఒక సన్యాసిని ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వును గమనించిన గౌసియా తన గుండెలపై చేయివేసుకుని.... "హమ్మయ్య! వీళ్ళను నాపై కోపం రాలేదు" అనుకుంది మనసులో.          "గౌసియా" అందరిమధ్యా కూర్చునివున్నా ఒక సన్యాసిని పిల్చింది.          "ఆ..." పలికింది గౌసియా.          "లేచివెళ్ళి స్నానంచేసి తయారవ్వు మళ్ళీ చర్చికి వెళ్దాం" చెప్పిందామె.          "సరే" అని లేచి నిల్చుంటూ ఎదురుగా వున్న గోడగడియారం వైపు చూసింది గౌసియా గడియారాన్ని చూసిన వెంబడే సమయం తెల్సుకోవడం ఆమెవల్లకాదు. అందుకే అలవాటుగా గడియారం వైపు కొన్నిక్షణాలపాటు చూసి, గీతల్ని లెక్కించుకుని, సమయం సాయంత్రం ఐదుగంటలు కావస్తోందని తెల్సుకున్నాక.... నెమ్మదిగా బాత్ రూమ్ వైపు నడిచింది.          ఆమె స్నానం చేసి వచ్చేసరికి చర్చికి వెళ్ళేందుకు సన్యాసినులు సిద్దమౌతున్నారు.          "బైబిలు తీసుకో" ఒక సన్యాసిని డైరీ లాంటి పుస్తకాన్ని గౌసియాకు అందివ్వబోయింది.          "నాకు చదువురాదు" చెప్పింది గౌసియా. కిసుక్కున నవ్వింది సన్యాసిని. నవ్వుతూనే..." చదువుకున్న అమ్మాయిలాగా కనబడుతున్నావే" అంది.          "చదువుకుంటాను" ఆమె నవ్వినందుకు గానూ ఇబ్బందిగా ముఖంపెట్టింది గౌసియా.          "నేను నిన్ను వెక్కిరించలేదు గౌసియా. నువ్వు ఆమాట అనగానే నాకు ఎందుకో నవ్వొచ్చింది" గౌసియా భుజంపై చేయి వేసిందామె.          గౌసియా చిరునవ్వుతో చూసింది.          "ఈ కాలంలో కూడా చదువురాని వాళ్ళు వున్నారంటే నాకు ఆశ్చర్యంగా వుంది. నువ్వు తప్పకుండా చదువుకోవాలి"          "మీరు నాకు అక్షరాలు నేర్పిస్తారా?"           "తప్పకుండా"          "ఈ రాత్రికే నాకు అక్షరాలు రాసివ్వండి దిద్దుకుంటాను"          "ఇక్కడ్నుంచి వెళ్ళాక కూడా చదువును నిర్లక్ష్యం చేయొద్దు నీవు బాగా చదువు నేర్చుకుని నీ స్వంత దస్తూరితో మాకు ఉత్తరం రాయాలి. సరేనా?"          "సరే..."          "నీవు ప్రభువును నమ్ముకుంటే నీకు త్వరగా చదువు అబ్బుతుంది. నాకు మొదట్లో ఇంగ్లీష్ మాట్లాడ్డం రాకపోయేది కానీ.... "ప్రభూ! ఐ వాంట్ ఇంగ్లీష్" అని ప్రభువును మనస్ఫూర్తిగా నమ్మి ప్రతినిత్యం ధ్యానించుకున్నాక, విచిత్రం! కేవలం రెండు నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న నా ప్రయత్నం గెలిచింది."          "అవునా?" ఆశ్చర్యపోయింది గౌసియా.          అదే సమయంలో అందరికీ పెద్దగా వ్యవహరించే మదర్ అందర్నీ ఉద్దేశిస్తూ "ప్రార్ధనకు వేళవుతోంది" అని గుర్తుచేసి, "గౌసియా..." పిలిచింది.          "మదర్?" అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళింది గౌసియా.          "చర్చికి వెళ్దాంరా" గౌసియా చేయి పట్టుకుందామె.          ఆమె చాలా పెద్దావిడ. ఆ వయసు లోనూ ఆమె అన్నివిధాలా చలాకిగా వుంది. ఆమెతోపాటుగా ఇంకొందరు పెద్దవాళ్ళు వున్నారు. వాళ్ళు కూడా చలాకీగా వుంటున్నారు.          గౌసియా వచ్చింది ఉదయమే అయినప్పటికీ, ఆ పెద్దవాళ్ళతోపాటుగా మిగతా సన్యాసినులు అందరూ ఆమెతో ఎంతో దగ్గరితనంగా మెలుగుతున్నారు ఆ ఆశ్రమం చాలాచిన్నది సన్యాసినులు మొత్తం యాభై మంది కంటే ఎక్కువలేరు. వాళ్ళల్లో అందరూ గౌసియాకు బాగా నచ్చారు. అదే మాటను మదర్ తో అంది గౌసియా.          "మీరంతా చాలా స్నేహంగా మెలుగుతున్నారు. మీరు నాకు బాగా నచ్చారు"          "ఎంత బాగా నచ్చాం?" గౌసియా చేయిని అలాగే పట్టుకుని ముందుకు నడుస్తూ అడిగింది మదర్.          "చాలా బాగా! కానీ... మీరు నాకేం అర్ధం కావడంలేదు. ఎందుకంటే నాకు తెల్సి నంతవరకు మీలాంటి వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడిసేవకు అంకితమైపోతారు. కానీ మీవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా కనబడుతున్నారు" అమాయకంగా అంది గౌసియా.          చిన్నగా ఓమారు నవ్వి... "మేం దేవుడి సేవకేకాదు, మానవసేవకు కూడా అంకితమైన వాళ్ళం. మా వాళ్ళల్లో కొందరు అమ్మాయిలు ప్రయివేటుగా చదువుకుంటున్నారు. అంటే... పరీక్షలు రాయడానికి మాత్రమే హాజరౌతారు అన్నమాట! మిగతా సమయాల్లో మేం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాం. ఇలా కొందరు చదువుకుంటూ, మరికొందరు మానవసేవ నిమిత్తం వెళ్తున్నారు. అందుకే నీకు ఒక్కొక్కరు ఒక్కోలా కనబడుతున్నారు" అంది మదర్.          "అలాగా" అని, "నాకు మీ అందరిపేర్లు తెల్సుకోవాలని వుంది. కానీ మీపేర్లు నాకు గుర్తేవుండవు" అంది గౌసియా.          మళ్ళీ నవ్వింది మదర్ నవ్వి "వచ్చిన కొన్ని గంటల్లోనే మా గురించి బాగా తెల్సుకున్నావు. అంటే నువ్వు చురుకైనదానివి అన్నమాట. మరి మా పేర్లు ఎందుకు గుర్తుండలేదు" అడిగింది మదర్.          తెలీదు అన్నట్టుగా చిన్నగా నవ్వింది. గౌసియా.          "నీకేకాదు గౌసియా. చాలామంది హిందువులకు, క్రిస్టియన్ లకు, కష్టంగా వున్న ముస్లిం పేర్లు కూడా గుర్తుండవు" అంది మదర్.          "అవునా?" తనేదో గొప్పనిజం తెల్సుకున్నట్లుగా అంది గౌసియా.          వాళ్ళు అలాగే మాట్లాడుతూ పదిహేను నిముషాల్లో చర్చిదగ్గరకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక అందర్నీ ఒకసారి కలియజూసింది గౌసియా. అనుకోకుండా రాజేష్ వాళ్ళు అక్కడికి వస్తారేమోనన్న అనుమానం ఆమెను ఇంకా పీడిస్తోంది. కానీ వాళ్ళపట్ల ఆమెకు ఇప్పుడు మునుపటి భయంలేదు. కాకపోతే అందరికళ్ళూ కప్పి తనను వాళ్ళు ఎత్తుకు వెళ్తారేమోనన్న కొత్త భయం ఆమెలో చోటు చేసుకుంది.          ఆమె భయాన్ని హెచ్చిస్తూ చర్చి ఆవరణ లోకి నవీన్ వచ్చాడు ఎవ్వర్నీ పట్టించుకోకుండా చర్చిలోపలికి నడిచాడు. అతడిగురించి మదర్ తో చెప్పాలనుకుని మదర్ వైపు చూసింది గౌసియా. మదర్ ఎవ్వరితోనో మాట్లాడుతోంది.          అదే సమయంలో మరో సన్యాసిని వచ్చి గౌసియాను చర్చిలోపలకు తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళాక నవీన్ కోసం చూసింది గౌసియా. అతడు మగవాళ్ళ ముందు వరసలో భక్తిపూర్వకంగా తలవంచుకుని నిలబడివున్నాడు. కనీసం తనను తీసుకువచ్చిన సన్యాసినికైనా అతడ్ని చూపించాలనుకుంది గౌసియా కానీ అప్పటికి అందరూ ప్రార్ధన కోసం సంసిద్ధులు అవుతున్నారు. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 21వ భాగం

" ఏడు రోజులు " 21వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    ఉదయం ఏడూ గంటలు కావొస్తోంది. భానుడి లేత కిరణాలు ముంబాయి నగరానని మృదువుగా తడుముతున్నాయి. పొద్దస్తమానం రద్దీగా వుండే రోడ్డు ఉదయంవేళ కాబట్టి అరకొర వాహనాలతో బోసిగా కనబడుతోంది.          ఆ రోడ్డుకు ఒకపక్కగా వున్న కుప్పతొట్టిలో దగ్గరగా ఒదిగిపడుకుని వుంది గౌసియాబేగం. పైకి లేవాలంటేనే ఆమెకు భయంగా వుంది. తన కోసం ఆ దరిదాపుల్లోనే రాజేష్ మాటువేసుకుని వున్నాడేమో అన్న అనుమానం ఆమెను బలంగా పీడిస్తోంది.          వున్నట్టుండి గాలిదుమారం క్రమంగా ఆరంభమైంది. కుప్పతొట్టిలోని చెత్తాచెదారం గాలి విసురుకు పైకిలేచి గౌసియాపై చెల్లాచెదురుగా పడసాగింది. బిక్కుబిక్కుమంటూ పడుకునివున్న ఆమె మరింత దగ్గరగా ముడుచుకుని, బిగ్గరగా కళ్ళు మూసుకుంది.          అదే సమయంలో ఎవరో స్త్రీ బుట్టతో చెత్తతీసుకువచ్చి తొట్టిలోకి ఎత్తిపోసింది ఆ చెత్తలో అగ్గికణికలు కొన్ని వున్నందున, అవి గౌసియా శరీరంపై వచ్చి పడగానే...ఒక్కసరిగా ఉలిక్కిపడి... "మా" కెవ్వున అరుస్తూ లేచి కూర్చుంది.          చెత్త పోస్తున్న స్త్రీ కూడా ఉలికిపాటుగా గౌసియాను చూస్తూ అలాగే బుట్టను వదిలేసింది.          ఆమెను బిక్కచచ్చినట్టుగా చూస్తూ, అలాగే కూర్చుండిపోయిన గౌసియాబేగం జుబ్బా ఒకవైపు క్రమంగా కాలిపోతోంది.          "ఎ...ఎవర్నువ్వు?" కసిరింపుగా అడిగింది ఆమె.          నిలువెత్తున చెత్తపడివున్న గౌసియా అదేమీ పట్టించుకోకుండా ఆమెను అలాగే చూస్తోంది.          "ఎ జన్మలో ఏం పాపం చేసిందో? చిన్న వయసులో మతితప్పి తిరుగుతోంది" అనుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోయిందామె.          "మంచి ఆలోచన! నన్ను అందరూ పిచ్చిది అనుకోవాలి" వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ అనుకుంటూ, మెల్లగా కుప్పతొట్టి లోంచి కిందికిదిగి, ఎటువైపు వెళ్ళాలా అన్నట్టుగా అటూఇటూ చూసింది.          ఎడంగా ఒక సందు కనబడింది. ఆ దారెంబడి క్రిస్టియన్ సన్యాసినులు గుంపులుగా వెళ్తూ కనబడుతున్నారు. అటువైపు వెళ్ళడం ఉచితం అనుకుంటూ నెమ్మదిగా అటువైపు నడిచింది గౌసియా.          వుండుండీ వెళ్తున్న జనాలు ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడంలేదు. గౌసియా మాత్రం అందర్నీ పరికించి చూస్తోంది తనకోసం రాజేష్ వాళ్ళు ఎవరైనా వస్తారేమోనన్న భయం ఆమెను ఇంకా వదిలిపెట్టనేలేదు.          నిన్న ఎప్పుడో అరబ్బుషేకు తినిపించిన తిండి మళ్ళీ తిననేలేదు. కడుపులో ప్రేవులు ఆకలికోసం గోలచేస్తున్నాయి.              "అమ్మా..." తెలుగులో ఉచ్చరించుకుంటూ బాధగా కడుపు పట్టుకోబోయి కాలుతున్న జుబ్బాను అప్పుడు చూసుకుంది గౌసియా.          వెంటనే కాలుతున్నచోటున గుడ్డను నులుముకుని, రోడ్డుదాటి సందువైపు నడిచింది అక్కడ ఓ వేపచెట్టుకింద స్కూల్ బ్యాగులు తగిలించుకుని నిలబడివున్నారు ఐదారుగురు స్కూల్ పిల్లలు వాళ్ళు గౌసియాను చూడగానే "ఏ....ఏ .... హే.....హే.." అని వెక్కిరిస్తూ వెంబడించసాగారు.          "ఏయ్" వెళ్ళేదల్లా నిల్చుని గదమాయించింది గౌసియా ఆమె గదమాయింపు ఆ పిల్లలకు ఆటవిడుపులా అయ్యింది.          "హూహూ... హేహే..." ఈసారి అదోలా కావాలని నవ్వుతూ, గెంతులు వేస్తూ గౌసియాను చుట్టుముట్టారు.          "నా దగ్గరకి వస్తే కొడతాను" అంటూనే చెయ్యెత్తింది గౌసియా.          పిల్లలు వెంటనే దూరంగా పరుగెట్టి, అక్కడ కుప్పగా పోసివున్న కంకరరాళ్ళను తీసుకుని గౌసియామీదకు విసరసాగారు.          గౌసియా ఎందుకైనా మంచిది అన్నట్టుగా అక్కడ్నుంచి ముందుకు పరుగుతీసింది ఆ పిల్లలు తరమసాగారు.          వేగంగా పరుగెట్టుకువెళ్ళిన గౌసియా తనకు తెలియకుండానే అక్కడున్న చర్చిలోకి దూసుకుపోయింది.          సన్యాసినులు అంతా వరుసలుగా నిల్చుని పవిత్రస్మరణ చేసుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ మధ్యగా నిల్చోవాలనుకుని, అంతలోనే తనను ఒకసారి పరికించి చూసుకుని, అడుగుల్ని వెనక్కి వేసింది గౌసియా.          ఆమె చర్చి లోపలికి వెళ్ళడంతో పిల్లలు ఆక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆ పిల్లలు అక్కడెక్కడో వుండివుంటారన్న భయంతో గుండెలమీద చేయి వేసుకుని, మెల్లగా అడుగులో అడుగువేస్తూ బయటికి నడిచింది గౌసియా కానీ ఆమెకు అక్కడ్నుంచి వెళ్ళాలనిపించలేదు. అక్కడి వాతావరణం ప్రశాంతతని కలిగిస్తుంటే అక్కడే ఒకపక్కగా కూర్చుండిపోయింది.          కాసేపటి తర్వాత సన్యాసినులు ఒక్కొక్కరూ బయటికి రాసాగారు. కొందరు అక్కడక్కడా గుంపులుగా నిలబడిపోతున్నాడు మరికొందరు వెళ్ళిపోతున్నారు.          "నేను ఎట్లాగయినా హైద్రాబాదు వెళ్ళాలి. వీళ్ళల్లో ఎవ్వరైనా సహాయం చేస్తే బాగుణ్ను" అనుకుంటూ ఒక గుంపు దగ్గరికి వెళ్ళింది గౌసియా.          వాళ్ళు గౌసియాను చూడగానే పిచ్చిది అన్నట్టుగా భయంగా దూరం జరిగారు.          "నేను పిచ్చిదాన్నికాదు" వెంటనే చెప్పుకుంది గౌసియా.          వాళ్ళు కనుబొమలు ముడిచి అర్ధంకానట్టుగా చూశారు.          "నేను హైద్రాబాద్ వెళ్ళాలి నన్ను రైలు ఎక్కించండి" అభ్యర్ధనగా అడిగింది.          వాళ్ళు గౌసియాను అలాగే చూస్తున్నారు.          "నేను పిచ్చిదాన్ని కాదు నన్ను నమ్మండి" అంటూ తనమీది చెత్తాచెదారాన్ని వెంటనే దులుపుకోసాగింది గౌసియా.          ఆ చెత్త వాళ్ళమీదికి ఎగరడంతో వాళ్ళు ఆమెను అలాగే చూస్తూ దూరం జరిగారు.          "నాపేరు గౌసియాబేగం నన్ను ముగ్గురు కుర్రాళ్ళు ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారు. నేను వాళ్ళను తప్పించుకుని వచ్చాను" అన్న నిజాన్ని చెప్పలేకపోయింది గౌసియా.          అంతలో చర్చి ఫాదర్ వచ్చారు అక్కడికి.          "ఫాదర్... ఈ అమ్మాయీ...." ఒక సన్యాసిని గౌసియావైపు చూపించింది.          ఫాదర్ గౌసియావైపు పరిశీలనగా చూసాడు.          "నాపేరు గౌసియాబేగం.... నన్ను ముగ్గురు కుర్రాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళను తప్పించుకుని వచ్చేసాను నన్ను హైద్రాబాద్ పంపించండి" ఫాదర్ తో తిరిగి తనగురించి చెప్పుకుంటూ చేతులు జోడించింది గౌసియాబేగం.          "తప్పించుకుని ఎన్నిరోజులయ్యింది?" అడిగాడు ఫాదర్.          "రాత్రే... తప్పించుకుని అక్కడ చెత్తకుండీలో దాక్కున్నాను"          "ఐ సీ" అంటూ గౌసియాను ఒకసారి ఆపాదమస్తకం పరిశీలించి, "హైద్రాబాద్ లో మీ నాన్నగారి చిరునామా ఏంటి?" అడిగాడు ఫాదర్.          "వద్దు మా అబ్బా దగ్గరికి పంపించొద్దు మా అబ్బా దుర్మార్గుడు" భయంగా అంది గౌసియా.          ఫాదర్ ఐదారుక్షణాలు గౌసియావైపు చిత్రంగా చూసి ఆ తర్వాత సన్యాసి నులవైపు చూస్తూ... "ఈ అమ్మాయిని...మీవెంట తీసుకెళ్ళండి" చెప్పాడు.          'సరే' అన్నట్టుగా తలాడించారు సన్యాసినులు.          "నేను మధ్యాహ్న సమయానికి వస్తాను" సన్యాసినులకే చెప్పి వెళ్ళిపోయాడు ఫాదర్.          సన్యాసినుల వెంట మరియా ఆశ్రమానికి వెళ్ళింది గౌసియా.          అక్కడ గౌసియాకు వాళ్ళు కొత్తబట్టలు ఇచ్చారు స్నానంచేసి వాటిని ధరించివచ్చింది గౌసియా. తర్వాత వాళ్ళతో పాటుగా అల్పాహారం తీసుకుంది. అప్పుడు కడుపు చల్లబడడంతో క్రైస్తవ సన్యాసినులు ఆమెకంటికి దేవతల్లా కనబడ్డారు.          "శుక్రియా" ఎద లోతుల్లోంచి చెప్పుకుంది.          "ఫరవాలేదు.... కూర్చో" ఒక సన్యాసిని గౌసియా చేయి పట్టుకుంది.          కూర్చుంది గౌసియా. సన్యాసిని గౌసియా ముఖంలోకి సూటిగా చూస్తూ.... "నీవు నిజాయితీగా వున్నది వున్నట్టుగా చెప్పాలి. మేం నీకు తప్పకుండా సహాయం చేస్తాం. ఆ ప్రభువు కూడా నీపై తన చల్లని చూపు నిలుపుతాడు" అంది.          వింటూ తలాడించింది గౌసియా.          "ఊ... చెప్పు? నీవు ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చావు.... ఎలా వచ్చావు?" అడిగిందామె.          కొన్నిక్షణాల మౌనం తర్వాత తన గురించి అంతా విపులంగా చెప్పుకుంది గౌసియా.          ఆమె గురించి అంతా విన్నాక చుట్టూ మూగిన సన్యాసినులు ఆమెవైపు అపనమ్మకంగా చూశారు. ఆ తర్వాత జాలితల్చారు.          "నీవు భయపడవద్దు. ఆ ప్రభువు నిన్ను తప్పక రక్షిస్తాడు" అంది ఒక సన్యాసిని ధైర్యం చెబుతున్నట్టుగా.          "నీవు భవానిశంకర్ దగ్గరికి వెళ్ళాలీ అనుకుంటే వెళ్ళవచ్చు లేదా మాకుమల్లే ఇక్కడే వుండిపోవాలీ అనుకుంటే వుండిపోవచ్చు" మరొక సన్యాసిని అంది.          "నేను భవానీశంకర్ దగ్గరకే వెళ్ళిపోతాను" అంది గౌసియా.          "అలాగే" అంది ఇంకో సన్యాసిని.          మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తుందనగా ఫాదర్ వచ్చాడు సన్యాసినుల ద్వారా గౌసియా గురించి పూర్తిగా తెల్సుకున్నాడు. ఆరోజు దినపత్రికల్లో అరబ్బుషేక్ హత్య గురించిన సమాచారం.... "హోటల్ హిందుస్థానీలో అరబ్బుషేక్ హత్య... హంతకులెవ్వరు?" అని వచ్చింది. ఆ హత్య చేసింది "గౌసియానే కావొచ్చు" అని అనుమానపడుతూ పేపర్ లో వచ్చిన అరబ్బు షేక్ తాలూకు ఫోటో చూపిస్తూ అడిగాడు ఫాదర్.          "ఇదిగో... నువ్వు చంపేసింది ఇతడేనా?"          రక్తపుమడుగులో పడివున్న అరబ్బుషేక్ ఫోటోను చూడగానే, కళ్ళింత చేసి...."వీడే.... వీడే" గట్టిగా అంది గౌసియా.          "మంచిపని చేశావు" అన్నాడు ఫాదర్.          "అంటే నేను ఆ హత్య చేసినందుకు నాకు శిక్ష పడదా? నన్ను పోలీసులు పట్టుకుపోరా!" గౌసియాలో పనిపిల్ల అమాయకత్వం.          "పోలీసులు తీసుకువెళ్తారు. కానీ శిక్షపడదు" చెప్పాడు ఫాదర్.          "అదెలా?" అడిగింది గౌసియా.          "అంతా నీకు తర్వాత తెల్సివస్తుంది" అన్నాడు ఫాదర్.          ఆ విషయం గురించి ఆమె ఇంకేం మాట్లాడలేదు. కాసేపు మౌనంగా వుండి ఆ తర్వాత "నన్ను భవానీశంకర్ దగ్గరికైనా పంపించండి. లేదంటే నా దగ్గరికైనా భవానీశంకర్ ను తీసుకురండి" తల వంచుకుని చెప్పింది.          "ఆ ప్రభువు దయవల్ల నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఆ ప్రభువుకు నీపై జాలి కలిగింది కాబట్టే మా దగ్గరకు తీసుకువచ్చాడు" ప్రశాంతంగా అన్నాడు ఫాదర్.          "అంటే... నేనూ భవానీశంకర్ తప్పకుండా కల్సుకుంటాం అన్నమాట" ఆనందం గానూ ఆశగానూ అంది గౌసియా.          'అవును' అన్నట్టుగా తలాడించాడు ఫాదర్.          "నాకు అంతకన్నా కావల్సింది లేదు. శుక్రియా బాబా" సలాం వాలేకుం అన్నట్టుగా చేత్తో నమస్కరిస్తూ అంది గౌసియా.          ఫాదర్ చిన్నగా నవ్వి "నన్ను ఫాదర్ అనాలి" చెప్పాడు ఫాదర్.          "సరే... సరే..." తలాడించింది గౌసియా. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 20వ భాగం

" ఏడు రోజులు " 20వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     సమయం రాత్రి పదిగంటలు!          హైద్రాబాద్ లో గౌసియా వాళ్ళ వీధి భయంకరంగా వుంది. హిందూ, ముస్లింలు ఒకర్ని ఒకరు కొట్టుకుంటున్నారు. కత్తిపోట్లు జరుగుతున్నాయి అరుపులతో కేకలతో ఆ ప్రాంతం ఒకవైపు దద్దరిల్లిపోతుంటే, మరోవైపు నెత్తుటి చినుకులు ఆ నేలను తడిపేస్తున్నాయి.          కొందరు ఇళ్ళల్లో చేరి గడియలు వేసుకున్నారు. మరికొందరు ఇళ్ళు వదిలి పారిపోతున్నారు.          తలుపుల్ని విరగ్గొట్టి లోపల వున్నవాళ్ళను బయటికి లాగి స్త్రీలు, పసిపిల్లలు.... తేడా లేకుండా చితకబాదడం, విచక్షణారహితంగా ప్రవర్తిస్తుండటం, వస్తువుల్ని ధ్వంసం చేయడం అంతా ఒక యుద్దభూమిని తలపించే వాతావరణం!          వున్నట్టుండి సైరన్ మోతలతో సర్రున దూసుకువచ్చాయి పోలీసు వ్యాన్లు తుపాకీలు పట్టుకుని అప్రమత్తులౌతూ....వ్యాన్లు ఆగీ ఆగకుండానే కిందికి దూకారు పోలీసులు.          పోలీసుల్ని గమనించి కూడా ఎవ్వరూ చెదిరిపోలేదు ఎవ్వరూ బెదిరిపోలేదు.          "ఆగండి" మైకులోంచి ఐదారుసార్లు హెచ్చరికగా చెప్పారు పోలీసులు కాని వాళ్ళను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అక్కడ!          పోలీసులు ఇక ఆలస్యం చేయలేదు నీళ్ళ పైపుల్ని ఎక్కుపెట్టి, నీళ్ళని ఎగజిమ్ముతూ, జనాల్ని చెదరగొట్టే ప్రయత్నం చేసారు.          కొంతవరకు జనాలు చెదిరిపోయారు. మిగతా వాళ్ళు మాత్రం తొణకడంలేదు, బెణకడంలేదు లాభం లేదనుకున్న పోలీసులు మరి కాసేపటికి గాలిలోకి కాల్పులు జరిపారు ఊహు.... అయినప్పటికీ విధ్వంసకారులు చెక్కుచెదరలేదు.          పోలీసులు ఈసారి లాఠీఛార్జీ జరిపారు. ఆ ప్రయత్నంలో కొందరు విధ్వంసకారులు పోలీసుల్నే ఎగబడికొట్టారు. దీంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమౌతూ నేరుగా కాల్పులు జరిపేందుకు తుపాకుల్ని ఎక్కుపెట్టింది.          "ఆగండీ లేదంటే సూటిగా కాలుపు జరుపుతాం ప్రాణాలు పోతాయి" ఒకటి రెండుసార్లు హెచ్చరించారు పోలీసులు.          అప్పటికి విధ్వంసకాఉర్లు పూర్తిగా చెదిరిపోయారు ఆ ప్రాంతం అంతా యుద్ధం తర్వాతి భయంకర నిశ్శబ్దంతో నిండిపోయింది. ఒకవైపు తిరగబడుతున్న వస్తువులు, మరోవైపు చెల్లాచెదురుగా పడివున్న చెప్పులు... కర్రలు... వస్తువులు... అక్కడక్కడా పడివున్న కొన్ని శరీరాలు చోసోతుమ్తే బలహీనుల గుండె ఆగిపోతుందేమో అన్నట్టుగావుంది పరిస్థితి.          పోలీసులు అంతా కలియజూస్తున్నారు.          "సర్...." అంటూ నెమ్మదిగా ఒక ఇంటి చాటునుండి వచ్చారు కొందరు ముస్లీం యువకులు.     "మా సాయిబును హిందువుల కుర్రాడు అకారణంగా చంపేసాడు. చనిపోయిన సాయిబు బాధ్యతలుగల వ్యక్తి ఇప్పుడా కుటుంబానికి దిక్కు ఎవ్వరూలేరు ఇందుకు మీరేం చేస్తారో మీ ఇష్టం" రాగానే పొట్టిగా లావుగా వున్న ఒక వ్యక్తి చెప్పాడు.          అదే సమయంలో మరో ఇంటి చాటు నుండి వచ్చింది, బాలస్వామి అతడి అనుచరబృందం.          "మా కుర్రాడు వాళ్ళ సాయిబును అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపేసిన మాట నిజమే! కాని అందుకు కారణం వుంది. చనిపోయిన సాయిబు తన పెద్దకూతురు గౌసియాను అరబ్బుషేకుకు మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది తెల్సి మానవత్వం వున్న మనిషిగా, మనసులేని ఆ మనిషిని చంపేసాడు. మతంతో సంబంధంలేని ఆ మనిషిని చంపేసాడు. మతంతో సంబంధంలేని ఈ హత్య, మతకలహాలకి దారితీయడం నిజంగా దురదృష్టకరం" అన్నాడు బాలస్వామి.          నిజానికి అతడి మనసులో... సమయం దొరికింది కాబట్టి ముస్లింలను అందర్నీ చంపేయాలన్నంత కసివుంది.          పోలీసులు ఇరువర్గాల్ని పరిశీలించి చూసారు. ఇరువురూ గొడవలో పాలుపంచుకోవడం వల్ల రేగిపోయి కనబడుతున్నారు.          "హత్య చేసిన కుర్రాడు ఏడి?" అడిగేడు ఒక పోలీసు.          "భవానీశంకర్! పారిపోయాడు" చెప్పాడు బాలస్వామి.          అంతలోనే అక్కడ పడివున్న శరీరాలవద్దకు బిగ్గరగా రోదిస్తూ పరుగెట్టుకువచ్చారు హిందూ ముస్లింలు తమవాళ్ళ నిర్జీవ శరీరాల్ని చూసుకోగానే వాళ్ళ దుఃఖం మరింత పెరిగింది.          "ఆ కుర్రాడి ఇల్లు ఏది?" అడిగాడు ఇంకోపోలీసు.          "అదే" చూపించాడు బాలస్వామి.          కొందరు పోలీసులు అక్కడికి నడిచారు లోపల మౌనంగా రోదిస్తూ కూర్చునివుంది లక్ష్మీదేవమ్మ అక్కడే లేవలేని స్థితిలో పడుకుని, తను కూడా ఏడుస్తున్నాడు గోపాలయ్య.          పోలీసుల్ని చూడగానే అతడు లేచి కూర్చోబోయాడు కాని అతడికి చేతకాలేదు లక్ష్మీదేవమ్మ మాత్రం లేచి నిలబడి చేతులు జోడించింది. ఆమె కళ్ళ వెంబడి కన్నీళ్ళు ధారాపాతమౌతున్నాయి.          "సారూ... మా కొడుకు కనబడ్డంలేదు. వాడు అసలు వున్నాడో లేక ఈ నా కొడుకులు చంపి ఎక్కడైనా పడవేసారో తెలీట్లేదు"          "ఏయ్..." బయటే నిలబడివున్న యువకులు, లక్ష్మీదేవమ్మ మాటలు వినగానే సహించలేనట్టుగా ఒక్కుమ్మడిగా అరిచారు.          వాళ్ళను వారిస్తున్నట్టుగా తన లాఠీని తలుపుకేసి బాదాడు ఒక పోలీసు.          "అవున్సార్! వాడి విషయంలో మాకు అనుమానంగా వుంది. వాడు మాకు ఒక్క గానొక్కకొడుకు వాడు లేకపోతే మేము బతికి లాభంలేదు" గోపాలయ్య కళ్ళనీళ్ళు తుడ్చుకున్నాడు.          "మీరు వాడి విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా, వెంటనే ఏ సంగతి తేల్చెయ్యాలి" పోలీసుల వెనకగా నిలబడి వున్న బాలస్వామి అన్నాడు.          "నీవు నోర్మూసుకోవయ్యా" మరో పోలీసు బాలస్వామిని వారిస్తుంటేనే, బయటనుండి వెహికల్స్ వస్తున్న శబ్దం వినబడింది.          అందరూ అటుకేసి చూసారు ఓ రెండు అంబాసిడర్ కార్లు వచ్చి ఒకపక్కగా ఆగగానే, అందులోంచి ముస్లిం నాయకులు దిగారు. ఆ వెంటనే వచ్చిన మరో రెండు టాటా సుమోల్లోంచి హిందూ నాయకులు దిగారు. వారు ఇరువురూ చుట్టూ మూగిన జనాల్ని పరామర్శించసాగారు.          పోలీసులు మాత్రం బయటకు వెళ్ళలేదు. ప్రశ్నలతో గోపాలయ్య దంపతుల్ని ఉక్కిరి బిక్కిరిచేయసాగారు.          "అంటే.... మీ కొడుకు ముందుగానే ఆ అమ్మాయిని కాపాడే విషయమై మీతో చర్చించాడన్నమాట" వాళ్ళ సమాధానాల్ని అన్నీ విన్నాక అన్నాడు ఒక పోలీసు.          "అవున్సారు" అంది లక్ష్మీదేవమ్మ.          "అమ్మాయిని అమ్మే విషయం మీకు తెలియదు కానీ మీకొడుక్కి తెల్సింది. ఎలా తెల్సిందంటారు" అదే పోలీసు అడిగాడు.          "తెలీదుసారూ" అంది లక్ష్మీదేవమ్మ.          పోలీసులు ఇంకేం అడగలేదు బయటకి నడిచి.... అట్నుంచి సాయిబు ఇంటివైపు అడుగులు వేసారు పోలీసులు వెళ్ళేసరికి సాయిబు భార్య ఖతీజాబీ సొమ్మసిల్లిపడిపోయివుంది కొంచెం పెద్దగా కన్పిస్తున్న ముగ్గురు పిల్లలు తండ్రి శవంచుట్టూ కూర్చుని వున్నారు. బాగా ఏడ్చినందున వాళ్ళ కళ్ళు ఉబ్బిపోయివున్నాయి.          చంటిపాప నిద్రపోతోంది. ఇంకో పిల్ల ఆడుకుంటోంది. ఒక పక్కగా కూర్చునివున్న మరో ఇద్దరు పిల్లలు మాత్రం పోలీసుల్ని చూసి చటుక్కున లేచి నిలబడి.          "మా అమ్మ కూడా చచ్చిపోయింది"          "అవున్సారూ.... అమ్మ కూడా చచ్చిపోయింది"          చావంటే ఏదో అబ్బురమైన విషయం అన్నట్లుగా కళ్ళింతచేసి ఒకరితర్వాత ఒకరు చెప్పారు ఆ పిల్లలు.          పోలీసులు సాయిబు శవాన్ని పరిశీలనగా చూసారు. తర్వాత ఆ ఇంటి పరిసరాల్ని అంతా ఒకసారి పరికించి చూసి, ఆ తర్వాత తండ్రి పక్కలో కూర్చున్న పిల్లల వైపు చూస్తూ అడిగారు.          "బేబీ... మీ అక్కను ఏంచేశారు?"          "మా అబ్బా అమ్మేసాడు" ఒక పిల్ల వెంటనే చెప్పింది.          "కాదుకాదు" అంటూ ఆ పిల్లను మెల్లగా గిల్లి "మా ఆపా మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది" మరోపిల్ల తెలివిగా చెప్పింది.          "అది కూడా కాదు, మా ఆపాకు పెళ్ళయి వెళ్ళిపోయింది" ఇందాక వాళ్ళమ్మ గురించి మాట్లాడిన పిల్లల్లో ఒక పిల్ల అందుకుంది.          "ఎవ్వరితో పెళ్ళయ్యింది" ఆ పిల్ల దగ్గరకి వెళ్ళి, కాసింత వంగి మృదువుగా అడిగాడు ఓ పోలీసు.          "సైతాన్ తో" ముఖం చిట్లించింది ఆ పిల్ల.          అప్పటికి ఖతీజాబీని ఎమర్జెన్సీ డాక్టరు పరిశీలిస్తున్నాడు.          "డాక్టర్... ఆమె త్వరగా కోలుకునేలా చూడండి" చెప్తూ పోలీసులు బయటికి నడిచారు.   ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 19వ భాగం

" ఏడు రోజులు " 19వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    ఆ ప్రాంతంలో ఎక్కువగా వేశ్యలు వుంటారు. కాబట్టి సాయంకాలం కాగానే ఆ ప్రాంతం విటులతో నిండిపోతుంది. అదేమీ ఆమెకు తెలియదు. కేవలం తనను ఆ యువకులు గమనించి వెంబడిస్తున్నారేమో నన్న భయంతో, వుండుండీ వెనక్కి చూస్తూ ముందుకుసాగిపోతోంది.          కాని ఒకస్త్రీ ఆమెను గమనించి వెంబడిస్తోంది. అది కూడా గౌసియా పసిగట్టలేదు. నేరుగా ముందుకు నడిచి అక్కడున్న ఒక దేవాలయంలోకి వెళ్ళిపోయింది.          దేవాలయంలో స్త్రీ పురుషులు ఇరువురూ చెరోవైపు గుంపులుగా కూర్చుని భజనచేస్తున్నారు. వెళ్ళి స్త్రీల గుంపులో కూర్చుంది. గౌసియా పక్కనే కూర్చుంది.          "పాపా! నీ పేరేంటి? "కాసేపటి తర్వాత అడిగింది ఆ స్త్రీ.          "గౌ..." తన పేరు చెప్పబోతూ ఆగిపోయింది. ఎందుకంటే 'ముస్లింలు దేవాలయాల్లోకి రాకూడదు అనే నిబంధనగాని, ఆచారంగాని వుందేమో? అన్న ఆలోచన మనసులో మెదిలింది. అందుకే తడబడుతూనే మరో పేరు చెప్పుకుంది.          "గౌ....గౌతమి"          "మంచి పేరు ఈ వీధిలోకి కొత్తగా వచ్చారా?"          "అవును"          "మీ ఇంట్లో ఎవరెవరు వుంటారు?" ఆరాతీస్తున్నట్టుగా అడిగింది.                  "అందరమూ"          "అంటే... మీ నాన్నగారు కూడానా?"          "ఆ!" అవును అన్నట్టుగా తల ఊపింది గౌసియా.          నిజానికి ఆ ప్రాంతంలో సంసారకుటుంబాలు వందకు ఐదు మాత్రమే వున్నాయి. మిగతా అందరూ వేశ్యలు అక్కడున్న సంసారకుటుంబాలు ఎంతో దీనస్థితిలో వున్నాయి కాని గౌసియాబేగం ఆమె కంటికి కొద్దో గొప్పో వున్నదానిలా కనబడ్డమే కాదు. తనలాంటి "అక్కా" దగ్గర్నుండి పారిపోయి వస్తున్నదానిలా కనబడింది అందుకే వెంబడిచింది.          "మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?" కావాలనే అడిగింది.          "చాయ్ బండి అమ్ముతాడు"          "ఎక్కడ?"          సమాధానం కోసం గౌసియా చిక్కులో పడిపోయింది.          "ఇ... ఇక్కడే"          "నిజమే చెప్తున్నావా?" గొంతు మరీ తగ్గించి ఆ వెంటనే సూటిగా అడిగిందామె.          భీతిల్లి చూసింది గౌసియా.          "భయపడొద్దు పాపా! నేను ఇక్కడ ఒక స్కూలు నడుపుతున్నాను. ఆ స్కూల్లో ఇళ్ళ నుండి పారిపోయివచ్చిన పిల్లలు, అనాథ పిల్లలు, బలవంతంగా అపహరింపబడి తప్పించుకున్న పిల్లలు చాలా మందే వుంటారు" చెప్పి గౌసియావైపు పరిశీలనగా చూసిందామె.          గౌసియా ఏదో ఆశ క్రమంగా కళ్ళ ల్లోంచి ప్రస్పుటం అవ్వసాగింది.          "ఇప్పుడు చెప్పూ... మీ కుటుంబం ఎక్కడ వుంటుంది?" అడిగింది ఆమె.          "నేను మీ వెంట రావొచ్చా" నెమ్మదిగా అడిగింది గౌసియా.          "తప్పకుండా" కళ్ళను ఒకసారి మృదువుగా ఆర్పి తీసిందామె.          అప్పటికి భజన పూర్తయ్యింది. భక్తులు లేచి వెళ్ళి గుడిలోపాల కొలువైన మహిషాసురమర్దినికి దణ్ణం పెట్టుకుని, తీర్ధప్రసాదాలు పుచ్చుకుంటున్నారు. ఆమెతోపాటుగా గౌసియా కూడా లేచివెళ్ళి దేవతకు దణ్ణంపెట్టుకుని తీర్ధప్రసాదాలు తీసుకుంది.          "ఇక వెళ్దామా?" అడిగింది ఆమె.          "వెళ్దాం" అన్నట్టుగా తలాడించింది గౌసియా.          ఆమె గౌసియాని తీసుకుని వెంటనే ముందుకు నడిచింది. భక్తులు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా వేరే ప్రాంతాలకి చెందినవాళ్ళు మహిషాసురమర్ధిని గుడి అక్కడ వున్నందున పవిత్రది నాల్లో మాత్రమే అక్కడికి వచ్చి భజనలు చేస్తుంటారు. అది వేశ్యలు వుండే ప్రాంత మైనందున చీకటిపడకమునుపే భజన కార్యక్రమాల్ని ముగించుకుని వెళ్ళిపోతుంటారు అదేమీ గౌసియాబేగానికి తెలియదు కాబట్టి వెళ్తూ ఆమెతో ఇలా అంది.          "మా దగ్గర చీకటిపడేవరకు భజన చేస్తారు"          "ఇక్కడ మాత్రం చీకటి పడకుండానే వెళ్ళిపోతారు" అందామె.          "రోజూ భజన చేస్తారా?" అడిగింది గౌసియా.          "కాదు కొన్ని పుణ్యదినాల్లో మాత్రమే ఇక్కడ భజనచేస్తారు ఈరోజు శ్రావణమాసపు మొదటిరోజు" ఆమె చెప్తుంటేనే కొంచెం దూరంలో వస్తూ కనిపించాడు రాజేష్.          అతడ్ని చూడగానే గౌసియా వణికిపోయింది. అతడి కంట్లోపడకూడదన్నట్లుగా ఆమెచాటుకి మెల్లగా నక్కబోయింది. అంత లోపే రాజేష్ దృష్టి గౌసియాను గమనించింది.          "ఎందుకు అలా భయపడుతున్నావు?" ఆమె కూడా గౌసియాను గమనించింది.          "వాడు...వాడు" అదురుతున్న పెదిమ లతో రాజేష్ ను చూపించింది.          "ఏంచేసాడు వాడు?" నవ్విందామె.          "వాడు నన్ను పట్టుకుపోతాడేమో..." భయంతో అక్కడే ఆగిపోతూ ఆమె చేతుల్ని బిగ్గరగా పట్టుకుంది గౌసియా.          "వాడు నిన్నేంచేయడు" గౌసియా భుజం చరిచిందామె.          "ఏంటక్కా? మా గౌసియాను నీవు తీసుకెళ్ళిపోతున్నావు?" వాళ్ళకు దగ్గరగా రాగానే అడిగాడు రాజేష్.          "గౌసియా? ? గౌతమి? ?" గౌసియా వైపు ప్రశ్నార్ధకంగా చూసిందామె.          "గౌతమి కాదు, గౌసియాబేగం! రాజ్ బజార్ పబ్లిక్ పార్క్ లో ఏడుస్తూ కనబడితే జాలిపడి తీసుకువచ్చాం. పాపం.... హైద్రాబాద్ నుండి వచ్చిందట. ఇక్కడ ఎవ్వరూ కూడా లేరట" ఆమెకు చెప్పి "మాకు తెలియకుండా పుష్పావతక్కను ఎలా కల్సుకున్నావు? అక్క దగ్గరకి రేపు వెళ్దువుగాని, ఇంటికి వెళ్దాంరా" ప్రేమగా పిలుస్తూ గౌసియా చేయి పట్టబోయాడు రాజేష్.          ఆమె ఎవరో తెలియగానే గౌసియాబేగానికి ఒక్కసారిగా తనని ఎవరో సమూలంగా కబళించివేసిన భావన కలిగింది.          "హా..." హడలిపోతూ ఆ ఇద్దర్నీ చూసింది.          "అదేంటి పాపా?" ఆమెలో కొండంత ప్రేమ.          పట్టించుకోలేదు గౌసియా అదే తడవుగా వెనుతిరిగి వేగంగా పరుగెట్టసాగింది.          "అయ్యో...అయ్యో" పుష్పావతి గుండెలు బాదుకుంటుంటేనే- "ఏయ్...పోరీ" అంటూ వెనకే పరుగెట్టాడు రాజేష్. ...... ఇంకా వుంది .........

మహాత్ములు (స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్)

మహాత్ములు   ఒక తల్లికి గొప్ప చింత పట్టుకున్నదట. ఆమె కొడుక్కి స్వీట్ల పిచ్చి. తినేందుకు తీపి వస్తువులేమైనా కావాలని ప్రతిరోజూ మారాం చేసేవాడు. వాడికి స్వీట్లు తినీ తినీ లేనిపోని రోగాలు ఎక్కడొస్తాయోనని తల్లికి భయం. ఎంతో ప్రయత్నం చేసింది; ఎన్నో రకాలుగా చెప్పి చూసింది- పిల్లవాడు వినలేదు. రోజూ స్వీట్లు తింటూనే ఉన్నాడు. ఎవరో అన్నారు-"చూడమ్మా! ఇట్లా నువ్వు చెబితే మానడు. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందట. ఎవరైనా గొప్పవాళ్లతో‌ చెప్పించు. వాళ్ళమీది గౌరవంతోనన్నా మీవాడు స్వీట్లు తినటం మానేస్తాడు" అని.   వాళ్ళింట్లో అందరికీ రామకృష్ణ పరమహంస అంటే గురి. "ఎవరిచేతో ఎందుకు? ఆయన చేతే చెప్పిస్తాను" అనుకున్నదా తల్లి. కొడుకును వెంటబెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది. సమస్యను శ్రద్ధగా విన్నాడాయన. "తల్లీ! నేను చెబుతాను వాడికి. అయితే ఇప్పుడు కాదు- ఒక పదిహేను రోజులాగి, రా!" అన్నాడు. తల్లి పదిహేను రోజుల తరువాత మళ్లీ తీసుకెళ్లింది కొడుకును. రామకృష్ణుడన్నాడు- "అయ్యో! ఇప్పుడే ఏమీ చెప్పేట్లు లేదు తల్లీ! ఇంకొక పదిరోజులాగి రండి" అని. పది రోజుల తర్వాత మళ్లీ పది రోజులు- ఇట్లా ఐదారు సార్లు జరిగింది. చివరికి రామకృష్ణుడు పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, "బాబూ! స్వీట్లు అంతగా తినకూడదు- పళ్ళు పాడైపోతాయి. ఆరోగ్యం కూడా పాడౌతుంది. స్వీట్లు మానేసేందుకు ప్రయత్నించు, సరేనా?" అన్నాడు. పిల్లవాడు 'సరే'నని తలూపాడు. అయిపోయింది- అన్ని రోజులు తిరిగి తిరిగి వేసారి చూసిన ఇంటర్వ్యూ అయిపోయింది ఒక్క నిముషంలో! రామకృష్ణుడు తనపని తాను చూసుకోవటం మొదలుపెట్టాడు. తల్లికే అర్థం కాలేదు: "ఈ రెండు ముక్కలు చెప్పేందుకు ఇన్నిసార్లు తిప్పాలా? మొదటిసారే చెప్పేస్తే ఏం పోయె?" అని. కుతూహలాన్ని ఆపుకోలేక, వెనక్కి వచ్చి మరీ అడిగింది పరమహంసను.   ఆయన సిగ్గు పడుతున్నట్లు నవ్వాడు. "ఏం లేదు తల్లీ! వాడెట్లా తింటాడో నేనూ అట్లాగే, చాలా ఇష్టంగా తింటాను స్వీట్లు. ఒక వైపున నేను తింటూ, వాడికి ఎలా చెప్పను, తినద్దని? అందుకని పదిహేను రోజులు సమయం కోరాను. ఆలోగా నేను స్వీట్లు మానేద్దామనుకున్నాను. కానీ ఏం చేసేది? ఈ నాలుక ఆగలేదు. చివరికి, దానితో పోరాడి గెలిచేందుకు ఇన్ని రోజులు పట్టింది" అన్నాడు రామకృష్ణుడు. నమ్మినదాన్ని ముందుగా తాము ఆచరించి చూసి, ఆ తర్వాతగానీ ఇతరులకు సలహాలనివ్వని ఇలాంటి మహాత్ములు అరుదు. అలాంటి కొద్దిమంది మంచివాళ్లలో ఒకరు, గాంధీజీ. అక్టోబరు రెండవ తేదీన గాంధీ జన్మదినం సందర్భంగా, ఆయనకున్న అనేక రూపాలలో కొన్నిటిని ఆవిష్కరిస్తున్నాయి, ఈ మాసపు అనువాద కథలు. మనందరం రకరకాల పనుల్ని సొంతంగా, సంతోషంగా చేసుకునేందుకు ఇవి ప్రేరణనిస్తాయని ఆశిద్దాం. 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

" ఏడు రోజులు " 18వ భాగం

" ఏడు రోజులు " 18వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    మిగతా ఇద్దరు యువకులతో కలిసి లోపలికి నడిచిందామె అది ఇరుకుగా ఉన్న ఒక గది మాత్రమే బయటనుండి ఇల్లు ఎంత పాతగా వుందో లోపల అంతకన్నా పాతదిగా వుంది.          నిల్చుని గదంతా ఒకసారి పరికించి చూసిందామె ఒక పక్కగా చిన్న చెయిర్ లో కుప్పగా వేయబడిన బట్టలు, ప్యాంట్లు, చొక్కాలు, లుంగీలు, తగిలించివున్న హ్యాంగర్లు, ఒక కిరోసిన్ స్టవ్వు, ఐదారు వంటపాత్రలు, ఒక ప్లాస్టిక్ నీళ్ళబిందె, ఒక చాప, రెండు దుప్పట్లు, రెండు సూట్ కేసులు ఇంతకుమించి ఆ గదిలో ఇంకేమీ లేవు.          "బ్యాచిలర్స్ ఇల్లు ఇలాగే వుంటుంది. ఆలస్యం చేయకుండా నువ్వెళ్ళి స్నానం చేసిరా" ఇందాకటి యువకుడే మళ్ళీ చెప్పాడు.          "అదిగో అదే బాత్ రూమ్" ఆ గదికి మరోపక్కవున్న తలుపులు తెరిచి చూపించాడు ఇంకో యువకుడు.          "నాకు బట్టలు లేవు" అందామె.          "మా బట్టలు వేసుకో" చెప్తూనే తెల్లని జుబ్బా పైజామా తెచ్చి ఇచ్చాడు మరో యువకుడు.          ఆ బట్టలు తీసుకుని వెళ్ళి స్నానం చేసి అలాగే తన బట్టల్ని కూడా పిండి ఆరవేసుకుని ఇరవై నిముషాల్లో ఇంట్లోకి వచ్చింది గౌసియా అప్పటికి ఆ యువకులు వంట మొదలెట్టారు.          ఆమెవెళ్ళి ఒక పక్కగా కూర్చుంది షేకు గుర్తొచ్చాడు. అందాకా స్థిరంగా వున్న ఆమె మనసు షేకు గుర్తుకు రాగానే భయంతో కంపించి పోయింది.          "భయపడుతున్నావెందుకు?" గమనించి ఒక యువకుడు అడిగాడు.          "షేకు గుర్తొచ్చాడు" చెప్పింది.          "వాడిని చంపేశావుకదా? ఇంకెందుకు భయపడాలి?"          "దెయ్యమై వస్తాడేమో అన్పిస్తోంది"          ఆమె ఆ మాట అనగానే ఆ ముగ్గురు పగలబడి నవ్వారు. ఆమె వాళ్ళని అదోలా చూసింది.          'నా భయం నాది నేను భయపడుతుంటే వాళ్ళకు నవ్వువస్తుంది ఏమిటి? మనసులో అనుకుంది.          "వాడు దెయ్యమై వచ్చినా నిజంగానే బతికి వచ్చినా మేము వుండగా వాడు నిన్నేం చేయలేడు. నీవు నీ గురించి చెప్పుకోగానే మాకు జాలివేసింది అందుకే మరేం అడగకుండా నేరుగా నిన్ను మా ఇంటికి తీసుకువచ్చాం ధైర్యంగా వుండు" ఉల్లిపాయలు తరుగుతున్న యువకుడు చెప్పాడు.          వాళ్ళు ఆమెకు ఒక సమయంలో మంచి వాళ్ళుగా ఒక సమయంలో నమ్మదగని వాళ్ళుగా తోస్తున్నారు. మొదట వాళ్ళపై దురభిప్రాయం ఏర్పడింది కాబట్టి వాళ్ళు మంచి మాటలు మాట్లాడుతున్నా ఆమెకు నమ్మకం కుదరడంలేదు.          వాళ్ళు తనని భయపెట్టడంవల్లే వాళ్ళ వెంట రాగలిగింది. అక్కడ వుండటం తనకు ససేమిరా ఇష్టంలేదు. కాని ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.          "నీ పేరేంటి?" అడిగాడు ఒక యువకుడు.          "గౌసియాబేగం"          "నా పేరు నవీన్, వీడి పేరు గిరిధర్, వాడి పేరు రాజేష్" పరిచయం చేసుకున్నాడు.          "నీకు వంటపని వచ్చా?" అడిగాడు రాజేష్.          "వచ్చు" చెప్పిందామె.          "అయితే ఇంకేం? ఎప్పటికీ మాదగ్గరే వుండిపో..." అన్నాడు నవీన్.          'వుండలేను' అన్నట్లుగా తల అడ్డంగా వూపిందామె.          "పాపంరా! రేపు పొద్దునే హైద్రాబాద్ రైలు ఎక్కిద్దాం" అన్నాడు గిరిధర్.          "ఈ రాత్రికి ఇక్కడే వుంటుందా?" అదో రకంగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు రాజేష్.          "వుండాల్సిందే కదా" కన్నుగీటాడు నవీన్.          గమనించిన గౌసియాబేగానికి సిక్స్త్ సెన్స్ శంకించింది.          "ఇక్కడ్నుంచి ఎలాగైనాసరే పారిపోవాల్సిందే" మనసులో నిర్ణయించుకుంది.          "మాలో ఎవరు అందంగా వున్నారు గౌసియాబేగం?" అడిగాడు గిరిధర్.          "ముగ్గురూ బాగున్నారు" చెప్పిందామె. ఆ మాట ఆమె మనస్ఫూర్తిగా చెప్పలేదు ఏదో ఒకటి అన్నట్లుగా చెప్పేసింది.          "అందరూ మనల్ని ఇలాగే అంటారు. అద్దం కూడా ఇలాగే చెప్తోంది. ఫోటోలు కూడా ఇలాగే చెప్తున్నాయి. మరి మనం వచ్చి ఏడాది కాలమైనా సినిమాల్లో కాదు గదా, కనీసం టీవీలో కూడా మంచి వేషం ఒక్కటి కూడా రాదేంట్రా?" నిరాశపడిపోతూ అన్నాడు రాజేష్.          "మనకూ వుంటుంది గుడ్ టైమ్" అన్నాడు గిరిధర్.          అందాకా వాళ్ళని చదువుకోడానికి వేరే ప్రాంతం నుండి వహ్చిన విద్యార్ధులు అనుకుందామె కాని వాళ్ళు ఎవరూ అనేది ఆమెకు అర్ధమైపోగానే ఆమెకు మరింత భయంవేసింది. ఎందుకంటే... ఎప్పుడైనా సినిమా చూడాలనిపించి తెల్సినవాళ్ళ ఇంటికి టీవీకి వెళ్తామంటేనే, తమ అబ్బా వెళ్ళనిచ్చేవాడు కాదు. వాళ్ళ సినిమాలు కూడా మంచివికాదు. చూస్తే చెడిపోతారు" అని చెప్పేవాడు.          ఆ మాట తనలోనే కాదు, తన చెల్లెళ్ళ ల్లోనూ బలంగా నాటుకుపోయింది. అయినప్పటికీ తమకు సినిమాలంటే ఇష్టమే. కాని సినిమావాళ్ళంటేనే ఇష్టంలేదు. 'వీళ్ళను చెడ్డగా చెప్పిన అబ్బానే మంచి వాడు కాదు' అనుకుంటూ కాసేపటితర్వాత నెమ్మదిగా లేచి నిలబడింది గౌసియాబేగం          "ఎక్కడికి?" అడిగాడు రాజేష్.          "నా బట్టలు ఆరాయో లేదో చూసివస్తాను"          "వెళ్ళువెళ్ళు" అన్నాడు రాజేష్.          ఆమె రెండో గుమ్మంవైపు నడిచింది. వెళ్తున్న ఆమెవైపు పెదవి కొరుక్కుంటూ చూసాడు గిరిధర్.          "భలే దొరికిందిరా! రాత్రి సాంతం ఎంజాయ్ చేసుకోవచ్చు" ఆమె వెళ్ళిపోగానే మిత్రులకి మాత్రమే వినబడేలా అన్నాడు నవీన్.          "మనం ఎంజాయ్ చేసుకున్న తర్వాత పుష్పావతక్కకు అప్పజెప్పేస్తే మనకు అంతో ఇంతో ముట్టజెప్తుంది" అన్నాడు గిరిధర్.          "రేయ్... నీ బుర్ర బాగా పనిచేస్తుందిరా" మెచ్చుకోలుగా అన్నాడు రాజేష్.          బయటికి వెళ్ళిన గౌసియాబేగం, గుమ్మానికి సమీపంగా తాడుపై ఆరవేసిన తన బట్టల్ని త్వరగా ఆరే ఉద్దేశ్యంతో దూరందూరంగా జరుపుతున్నదల్లా... లోపల్నుంచి వినబడిన మాటలకు ఉలిక్కిపడింది.          వాళ్ళు ఇంకా ఆమె గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు చిన్న స్వరంతోనే మాట్లాడుతున్నప్పటికీ బయటికి స్పష్టంగా వినబడుతున్నాయి మాటలు.          'అబ్బా ఒకసారి అమ్మేసాడు మళ్ళీ వీళ్ళు కూడా నన్ను అమ్ముకుంటారు? అల్లా... నన్ను ఆడపిల్లగా ఎందుకు పుట్టించావు?' గుండెలపై చేయివేస్కుని దైన్యంగా ఆకాశంకేసి చూస్తూ అనుకుంది గౌసియా.          "ఆ పిల్ల నిజంగా హత్య చేసిందంటే నమ్మబుద్దికావడంలేదురా! చూస్తుంటేనేమో అమాయకురాలే! తనకు అన్యాయం జరుగుతున్నా తెగించేంత సాహసం కనబడ్డం లేదు. కాని హత్యచేసినట్టు రక్తపుమరకల్ని చూసాం??" అన్నాడు రాజేష్.          "అవన్నీ మనకు అనవసరం మనక్కావల్సింది ఆడపిల్ల కోరిక పుట్టినప్పుడల్లా కొనుక్కోలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడా బాధ తీరింది అంతే చాలు" అన్నాడు గిరిధర్.          "ఇప్పుడైతే పుష్పావతక్కకు అప్పజెప్పాల న్నావు?" తాలింపు వేసాడు నవీన్.          "డబ్బుకోసం అప్పజెప్పాల్సిందే అలాగే అవసరమైనపుడు మనదగ్గరకి పంపించాలని మాట్లాడుకోవాలి కూడా" అంటుంటేనే గిరిధర్ గొంతులో అదోకైపు.          "అబ్బ! ఇన్నాళ్ళకు మన సమస్యకు మార్గం దొరికింది అటు డబ్బుకి డబ్బూ వస్తుంది ఇటు సుఖానికి సుఖమూ దొరుకుతుంది. అదృష్టవంతులమేరా మనం" నవీన్ గొంతులో సంతోషం.          అప్పటికి గౌసియాబేగం భయంతో బిర్ర బిగుసుకుపోయింది. ఇంకొక్కక్షణంకూడా తను అక్కడ వుండటం మంచిదికాదని భావిస్తూ అప్రయత్నంగా గుమ్మంవైపు చూసింది.          వాళ్ళ మాటల్లో వాళ్ళువున్నారు. ఇప్పట్లో  వాళ్ళు వెలుపలికి వచ్చే సూచనలు కనబడ్డం లేదు.          ఆమె ఇక ఏమాత్రం జాప్యం చేయలేదు.          అక్కడ్నుంచి పారిపోయేందుకు తనకు అనువైన మార్గం ఏమైనా దొరుకుతుందా అన్నట్లుగా అటూఇటూ చూసింది. తక్కువ వైశాల్యంలో వున్న ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ మాత్రం చాలా ఎత్తుగా వుంది. బాగా ప్రయత్నిస్తే ఎక్కిదుమకవచ్చు కాని ఆ ప్రయత్నించే సమయం తనకు లేదు.          చేతులు నలుపుకుంటూ బాత్ రూమ్ వైపు తిరిగింది. అక్కడోచోట మూతవున్న నీళ్ళ డ్రమ్ము ఒకటి పెట్టబడివుంది. దానిమీదకు మెల్లగా ఎక్కి ప్రహరీగోడమీదకు ఎక్కవచ్చు.          "అల్లా! నన్ను రక్షించు" మనసులో అనుకుంటూ, మరోసారి గుమ్మంవైపు చూసి వాళ్ళు ఎవ్వరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకుని, వడివడిగా డ్రమ్ముదగ్గరికి వెళ్ళి, చప్పుడు చేయకుండా డ్రమ్ము మీదకి ఎక్కి అట్నుంచి ప్రహరీగోడమీదకి జాగ్రత్తగా ఎక్కి క్షణంకూడా ఆలస్యం చేయకుండా అవతలకి దూకింది.          ఆ విసురుకి శరీరమంతా ఒక్కసారిగా కదిలింది. తోడుగా అరికాళ్ళు పగిలినట్టుగా అన్పించడమే కాకుండా, మోకాళ్ళ చిప్పలు పగిలిపోయాయి.          "మా..." బాధగా అంటూనే లేచి దులుపుకుంటూ వేగంగా ముందుకు నడిచింది. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 17వ భాగం

" ఏడు రోజులు " 17వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    ఆమె వున్నది నాల్గవ అంతస్థు అయినప్పటికీ లిఫ్టు ఉపయోగించడం తెలియదు కాబట్టి వడివడిగా మెట్లు దిగసాగింది.          కిందికి వెళ్ళాక రిసెప్షన్ లో నలుగురు ఉద్యోగస్థులు కూర్చుని వున్నారు. వాళ్ళ కౌంటర్ ముందు ఐదారుగురు వ్యక్తులు నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళెవ్వరూ గౌసియాబేగాన్ని పట్టించుకోలేదు. కాంపౌండ్ లోకి వెళ్ళాక కూడా ఎదురైన వాళ్ళెవ్వరూ ఆమెను పట్టించుకోలేదు.          ఆమె ధరించిన బురఖా నలుపురంగులో వున్నందున ఆమె మీదకు ఎగజిమ్మిన రక్తం ఆ రంగులో కల్సిపోయింది. ముఖాన్ని చేతుల్ని తడిపేసిన రక్తాన్ని బురఖా ముసుగు కప్పివేసింది.          ఏమాత్రం పరిచయంలేని మహానగరం, కాంపౌండ్ గేటు దాటి ముందుకు వెళ్ళీవెళ్ళగానే ఆమెను హడలగొట్టింది. తనకు పరిచయం వున్న హైదరాబాదే మహారణ్యంలా కనబడేది. అలాంటిది అంతకు ఐదురెట్లుగా కనబడుతున్న ముంబాయి నగరం ఆమెకు ఆగమ్య గోచరంగా కనబడుతుంటే గమ్యం తెలియని పక్షిలా అడుగులు ముందుకు వేయసాగింది.          కొంతదూరం వెళ్ళాక పబ్లిక్ పార్క్ ఒకటి కనిపించింది. ఆకుపచ్చని తివాసిలా పార్క్ అంతా పరుచుకున్న గడ్డిపరకల్లో భిక్షగాళ్ళు సేదతీరుతున్నారు. వెళ్ళి పోకచెట్టు నీడలో కూర్చుంది గౌసియాబేగం.          అప్పటికి ఒంటిని, బట్టల్ని అంటుకున్న రక్తం ఎండిపోయి వాసన వస్తోంది. దానికి తోడు దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది.          ఎక్కడైనా పబ్లిక్ కుళాయి కనబడుతుందేమోనని అటూ ఇటూ చూసింది గౌసియా.          కాసింత దూరాన ఫౌంటేన్ ఎగజిమ్ముతూ కనబడింది. వెంటనే లేచి అటు వైపు నడిచిందామె.          అవి నిలవవుండిపోయిన మురికి నీరు అని ఆమెకు తెలీదు. వెళ్ళి ఫౌంటేన్ కట్టపై కూర్చుని నీళ్ళనంతా ఒకసారి కలియజూసింది. ఆకుపచ్చగా కనబడుతున్న నీళ్ళల్లో నాచు బాగా పేరుకుపోయివుంది. కాకపోతే ఫౌంటేన్ కదలికలవల్ల నాచు నతా పక్కలకు చేరిపోయి వుంది. శుభ్రమైన నీరు కాదు అని ఆమెకు అర్ధమైపోయింది. అయినాగాని దాహం తీర్చుకోడానికి అంతకన్నా వేరేదారి దొరకలేదు ఆమెకు.          దోసిళ్ళతో నీరు తీసుకుని తాగబోయింది. నీరు చాలాకాలంగా నిలవవుండడంవల్ల మురికివాసన ఆమె ముక్కుపుటాల్ని అదరగొట్టింది. అయినప్పటికీ ఒక్క దోసిలి నీరు తాగింది. ఎండిపోయిన గొంతులో తేమ వూరినట్లుగా తోచింది. అందుకే కళ్ళు మూసుకుని ఐదారు దోసిళ్ళ నీటిని గబగబా తాగి, హాయిగా వూపిరి పీల్చుకుంటూ ఫౌంటెన్ కట్టదిగి పోకచెట్టువైపు నడవబోయింది.          అంతలోనే ఆమె అడుగులు ఆగిపోయాయి కాసింత దూరంలో నిలబడి వెకిలిగా తననే చూస్తున్నారు ముగ్గురు యువకులు.          "పోరికి దమాక్ ఖరాబ్ అయినట్టుంది" ఒక యువకుడు అన్నాడు.          "ఇంతకీ ఈ పోరి ఎవరు?" మరో యువకుడు అన్నాడు.          "లేచిపోయి వచ్చిన కేసులావుంది. లేకపోతే బురఖాలు పబ్లిక్ పార్కుల్లో కనబడ్డం, అందునా ఒంటరిగా కనబడ్డం అంటే అది ఆలోచించాల్సిందే" ఇంకో యువకుడు అనగానే.          "ఆలోచించడం కాదురా అనుమానించాల్సిందే" మొదటి యువకుడు అన్నాడు.          ఆ యువకులు మాట్లాడ్తున్నది స్వచ్చమైన హిందీ అయినప్పటికీ తమ ఇంట్లో మాట్లాడేది నాటు ఉర్దూ అయినప్పటికీ వాళ్ళు మాట్లాడే ప్రతిపదం ఆమెకు అర్ధమవుతోంది.          వాళ్ళు ఆమె కంటికి కబళించడానికి వచ్చిన రాబందుల్లా కనబడ్డారు. అందుకే వెంటనే అట్నుంచి ముందుకు కదిలి వాళ్ళని దాటి వెళ్ళబోయింది.          "ఏయ్ పోరీ" అంటూ ఒక యువకుడు ఆమె బురఖా పట్టుకు లాగాడు.          ఆ విసురుకు తలమీద ముసుగు తొలగి రక్తపు మరకలు అంటివున్న ఆమె ముఖం వాళ్ళకు స్పష్టంగా కనబడింది.          "హా!?" ముగ్గురూ ఒకేసారి కళ్ళింతచేశారు.          ఆమెకు ప్రాణం పోయినంత పనయ్యింది నిలువెత్తున వణికిపోతూ చప్పున తొలగిన బురఖాని ఎప్పట్లా కప్పుకుని అక్కన్నుంచి పరుగెట్టబోయింది.          "ఏయ్" ఇంకో యువకుడు ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు.          ముసుగు చాటునుండి అతడివైపు భయంగా చూసిందామె.          "నిజం చెప్పు? ఎక్కడనుంచి వస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు?" గద్దించినట్టు అడిగాడు ఆ యువకుడు.          "నన్ను వదులు" సమాధానం చెప్పలేకపోయిందామె.          "నిజం చెప్తే వదిలేస్తాము" అన్నాడు అతడు.          "నన్ను వదులు" మళ్ళీ అదేమాట అంటూ అతడిని విడిపించుకోబోయిందామె.          "కిలాడి" మరో యువకుడు అన్నాడు.          "అవును కేడీరాణిలా వుంది" ఇంకో యువకుడు అన్నాడు.          "నిజం చెప్పకపోతే పోలీస్ స్టేషన్ కి పట్టిద్దాం" ఆమె చేయి పట్టుకున్న యువకుడు అన్నాడు.          పోలీస్ స్టేషన్ అనగానే ఆమెకు ఏడుపు ముంచుకువచ్చింది.          "నేను ఎవ్వర్నీ ఏం చేయలేదు. నన్ను వదిలిపెట్టు" ఏడవసాగింది.          "మోసగాళ్ళ వేషాలు ఇలాగే వుంటాయి పదరా పోలీస్ స్టేషన్ కి" ఇంకో యువకుడు అతడిని ప్రేరేపించాడు.          "వద్దు... వద్దు" ఏడుస్తూనే అంది.          "మరి ఎవ్వర్ని ఏం చేశావో చెప్పు?" ఆమె చేతిని బిగ్గరగా నొక్కాడు అతడు.          ఆమె ఐదారు క్షణాలు మౌనంగా వుండి పోయి ఆ తర్వాత ఏడుస్తూనే నెమ్మదిగా చెప్పుకుపోయింది.          "నన్ను కొనుక్కున్న అరబ్బుషేకును చంపేసి వస్తున్నాను అతడు నన్ను ఏదో చేయబోయాడు. అందుకే చంపేశాను. అదిగో ఆ దూరంగా కనబడుతుందే పెద్దహోటలు అందులోనే చంపేశాను"          యువకులు ఆమెవైపు విస్మయంగానూ అపనమ్మకంగానూ చూస్తుండిపోయారు.          "మాది హైదరాబాదు మేము గరీబువాళ్ళం అందుకే మా అబ్బ నన్ను అరబ్బుషేకుకు అమ్మేశాడు. దయచేసి నన్ను హైదరాబాద్ పంపించండి" అభ్యర్ధనగా అందామె.          "సరే! నిన్ను తప్పకుండా హైదరాబాద్ పంపిస్తాం. మరి మా వెంట వస్తావా?" ఆమె చేయి వదిలేస్తూ అడిగాడు యువకుడు.          "మీ వెంట ఎక్కడికి రావాలి?" అడిగిందామె.          "మేము తీసుకెళ్ళిన చోటికి"          "మీరు నన్నేం చేయరుకదా?"          "నీలాంటి వాళ్ళని ఏదో చేసేంత మూర్ఖులం కాదు. మాకూ మానవత్వం ఉంది"          "సరే" ఒప్పుకుందామె కాని ఆమె లోపల ఏదో అలజడి చెలరేగుతూ వాళ్ళపట్ల అపనమ్మకాన్ని కలిగిస్తోంది.          ఆమె చదువుకోలేదు. పైగా సంఘంలో తిరగలేదు. అందుకే ఆత్మరక్షణ కోసం తను చేసిన హత్యను ఘోరమైన నేరంగా భావించుకుంటూ భయపడుతోంది.          మదమెక్కి... కొవ్వుబలిసి పరాయి దేశానికి చెందిన ఒక పురుషుడు, ఒక భారతీయ స్త్రీని కేవలం తన కోరికల కోసం కొనుగోలు చేయడం అనేది క్షమించరాని నేరమని ఆమెకు తెలీదు ఈ నేపథ్యంలో తను చేసిన హత్యకు శిక్ష వుండదని, సమాజంతో పాటుగా ప్రభుత్వం కూడా తనని హర్షిస్తుందని అంతకన్నా తెలీదు కాబట్టి పోలీసువాళ్ళు అంటేనే భయపడి ఆ యువకుల వెంట వెళ్ళిపోయింది.          వాళ్ళు ఆమెను ఒక మురికివాడలోకి తీసుకువెళ్ళారు. ఆమెకు ఆ ప్రాంతం హైదరాబాదులో తామువుండే మురికివాడకంటే అన్యాయంగా తోచింది. యువకుల్ని చూస్తుంటే బాగా డబ్బుగలవాళ్ళలా వున్నారు అందుకే ఆమె వాళ్ళవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.          "మీరు ఈ ప్రాంతంలో వుంటారా?"          "ఏం వుండకూడదా?" నవ్వాడు ఒక యువకుడు. మిగిలిన ఇద్దరు యువకులు శ్రుతికలిపారు.          ఆ నవ్వు ఆమెకు నచ్చలేదు. ఎంతో మృదువుగా నవ్వే తన భవానీశంకర్ నవ్వు ముందు వాళ్ళ నవ్వు ముళ్ళపొద ఒంటికి రాసుకుపోయినట్టుగా తోచింది. అందుకే ఇంకేం మాట్లాడలేదు. వెళ్తున్న ఆటో రిక్షా లోంచి బయటకు చూస్తూ మౌనంగా కూర్చుండిపోయింది.          "నేరుగా వెళ్ళి కనిపించే పెంకుటింటి ముందు ఆపేయ్" ఆటో డ్రైవర్ కి సూచించాడు ఒక యువకుడు.          ఆటోరిక్షా అక్కడికి వెళ్ళి ఆగింది. ముగ్గురూ కలిసి బిల్లు చెల్లించారు ఆటో రిక్షా వెళ్ళిపోయింది.          "వాసనగా వుంది. వెళ్ళి స్నానం చేయి" తన పక్కన కూర్చున్న యువకుడు చెప్పాడు.          "ముందు ఇంట్లోకి వెళ్దాం రండి" అంటూ డ్రైవర్ పక్కగా కూర్చుని వచ్చిన యువకుడు ముందుకు నడిచి తలుపులు తెరుచుకుని నేరుగా లోపలికి వెళ్ళాడు. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 16వ భాగం

" ఏడు రోజులు " 16వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    ముంబాయిలో విమానం దిగాక ఆమెను ఒక పెద్ద హోటల్లోకి తీసుకెళ్ళాడు షేకు అక్కడ గదుల్లో షేకులాంటి వ్యక్తులు దాదాపు పదిమంది వరకు కనిపించారు. వాళ్ళల్లో కొందరి గదుల్లో అమ్మాయిలు కనిపించారు. ఆ అమ్మాయిలు తనలా బాధపడకుండా ఎంతో ఆనందంగా కనిపించడంతో గౌసియాబేగం ఆశ్చర్యపోయింది.          కేవలం అందమైన స్త్రీలను అనుభవించడంకోసం పనిగట్టుకుని గల్ఫ్ దేశాలనుండి షేకులు వస్తారని, నెలల వారిగా తిష్టవేస్తారని, వాళ్లకి కావాల్సినంత సుఖాన్ని అందిస్తూ భారతీయ వేశ్యలు దండిగా డబ్బు సంపాయించుకుంటున్నారని గౌసియా బేగానికి తెలియదు అందుకే తను కూడా వాళ్ళలా ఆనందంగ కనబడాలి కాబోలు అనుకుంది.          "చూశావా? ఆ అమ్మాయిలు ఎంత చక్కగా సహకరిస్తున్నారో?" తమ గదిలోకి వెళ్ళాక తలుపులు దగ్గరగా వేస్తూ అన్నాడు షేకు.              "..."          "నువ్వుకూడా అలాగే వుండాలి. ఇలా ఏడుస్తూ వుంటే నేను ఒప్పుకోను" అంటూ వచ్చి ఆమెను తన మీదకు లాక్కున్నాడు.          తన ప్రియుడు కూడా ఎప్పుడూ అలా చేయలేదు. తమ మధ్యన కొనసాగింది స్నేహబంధంలాంటి ప్రేమ! అందుకే పురుషుడి తాలూకు బలమైన తొలి స్పర్శకు ఆమె దాదాపుగా అదిరిపడింది.          కిటికీలోంచి బయట అంతా స్పష్టంగా కనబడుతోంది. కిటికీకి చేరువగా వున్నా వేపచెట్ల కొమ్మలమీద బుల్ బుల్ పిట్టలు స్వేచ్చగా కూర్చుని వున్నాయి. వాటిని చూసిన ఆమె మనసు 'మరి నాకెందుకు ఈ పంజర జీవితం? వాటిలా స్వేచ్చగా నేనెందుకు ఉండలేకపోతున్నాను? నా శరీరం నా అనుమతి లేకుండా ఎవ్వరికోసమో ఎందుకు అంకితమైపోతోంది? వద్దు బలవంతంగా నేను బలికావద్దు' నాటో ఆక్రోసించింది. ఆ తర్వాత ఆవేశపడింది.          తనను ముద్దాడబోయిన అతడి మొరటుపెదాలు ఆమెలో జుగుప్సని కలిగిస్తుంటే వెల్లువెత్తిన ఆవేశంతో అతడిని చప్పున నెట్టేసింది.          ఆమె తన బలాన్నంతా ఉపయోగించడం వల్ల అతడు ఎగిరి బెడ్ మీద పడ్డాడు. తక్షణమే తమాయించుకుని ఆమెవైపు దెబ్బ తిన్న పాములా చూశాడు.          ఆమె గజగజా వణికిపోయింది.          "నిన్ను సుల్తానీ చేయాలనుకున్న నన్నే నెట్టేస్తావా? నీకెంత పొగరు?" పళ్ళబిగువున అంటూ లేచి ఆమెవైపు వచ్చాడు.          ఆమె అప్రయత్నంగా అడుగులు వెనక్కి వేసింది.          "రాత్రే నిన్ను అనుభవించాలనుకున్నాను. ఖుషీఖుషీగా నీ శరీరాన్ని నలిపివేయాలనుకున్నాను. కాని మా షేకులకి మందు పార్టీ ఇచ్చేసరికే తెల్లవారిపోయింది. అప్పటికే నేను నీరుగారిపోయాను. అందుకే ఇప్పుడు నన్ను కాదని నాకు కోపాన్ని తెప్పించవద్దు" అంటూ ఆశగా కళ్ళు పెద్దవిచేసి ఉన్మాదిలా ఆమెవైపు నడిచాడు అతడు.          ఆమె అలాగే అడుగులు వెనక్కి వేస్తోంది. తన మీద అతడు పళ్ళు నూరగానే తనని కొడ్తాడేమో అనుకుంది. కాని అంతలోనే అతడిలో తన మీద కోరిక కనబడగానే మరింత భయపడిపోయింది.          "నన్నేం చేయొద్దు" చేతుల్ని అడ్డం పెట్టుకుంది.          అతడు కోరలు చాచిన పాములా ఆమె వైపుకు వస్తున్నాడు. ఆమెకు ముచ్చెమటలు పట్టేశాయి. ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీళ్ళు ఆమె చెక్కిళ్ళమీదుగా కిందికి ప్రవహించసాగాయి.          "నీవు నాకు తాతలా వున్నావు. నన్నేం చేయొద్దు" అంటూ అలాగే అడుగుల్ని వెనక్కి వేస్తూండగా అనూహ్యంగా అక్కడ వున్న టీపాయ్ ని తాకింది. ఆమె బలంగా తగలడంతో టీపాయ్ కదిలి దానిమీద వున్న ఫ్లవర్ వేజ్ కిందపడి భళ్ళున పగిలిపోయింది.          తత్తరపాటుగా పగిలిన ఫ్లవర్ వేజ్ వైపు చూసిన గౌసియాబేగానికి చటుక్కున ఒక ఆలోచన మెదిలింది. ఆమె ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వంగి పగిలిన గాజు ముక్కను చేతిలోకి తీసుకుని అతడివైపు భయంగా చూస్తూ "నావైపు రావొద్దు" అంది గట్టిగా.          ఈ అనూహ్య పరిణామానికి అతడు బిత్తరపోతూ ఆగిపోయాడు. ఆమె గాజు ముక్కను అలాగే పట్టుకుని గుమ్మంవైపు అడుగులు వేస్తూ "నా దగ్గరకి వస్తే నిన్ను పొడిచి చంపేస్తాను" అంది.          అతడు కొన్ని క్షణాలు ఆమెవైపు విస్మయంగా చూసి ఆ తర్వాత చప్పున తన కుర్తాజేబులోంచి పిస్టల్ బయటికి తీసి "ఆ గాజుముక్కను పక్కకు పెట్టేయ్ లేదంటే కాల్చేస్తాను" అంటూనే పిస్టల్ని ఆమెకు గురి పెట్టాడు.          ఆమె భయపడిపోయింది. అతడివైపు భీతిల్లిన నేత్రాలతో చూస్తూ నెమ్మదిగా వెళ్ళి గాజుముక్కను టీపాయ్ పై పెట్టేసింది.          "శహభాష్" నవ్వుతూ అని పిస్టల్ని తిరిగి తన కుర్తా జేబులో పెట్టుకుంటూ "రా బేగం రా! నా కోసంరా" పిలుస్తూ ఆమెవైపు వచ్చాడు.          ఆమె అక్కడే నిలబడిపోయి వుంది.          "నీవు చిన్నపిల్లవి నీకు సుఖం గురించి తెలీదు. అందుకే అనవసరపు వేషాలు వేసి నన్ను విసిగిస్తున్నావు. ఒక్కసారి సుఖాన్ని రుచిచూస్తే ఇలాంటి వేషాలు ఇక వేయకుండా బుద్దిగా వుంటావు" అంటూ ఆమె వైపు వచ్చి ఆమె భుజాలపై చేయివేసి బిగించి పట్టుకున్నాడు.          ఆమె అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది అతడు కూడా ఆమె కళ్ళల్లోనే చూస్తున్నాడు. కాకపోతే ఆమె కళ్ళల్లో భయం, అతడి కళ్ళలో కామం.          అతడు ఆమె ముఖంమీదకు తన ముఖాన్ని పోనిచ్చి ఆమె పెదవుల్ని ఆబగా అందుకోబోయాడు.          సరిగ్గా అదే క్షణంలో తన చేయిని వెనక్కిపోనిచ్చి టీపాయ్ మీద గాజుముక్కను అందుకుని వెనకాముందు ఆలోచించకుండా అతడి కడుపులోకి బలంగా పొడిచింది గౌసియాబేగం.          "మా" అతడు బిగ్గరగా  అరుస్తూ వెనక్కి తుళ్ళాడు. అతడు తమాయించుకునే లోపు అదే గాజు ముక్కతో మరోసారి కసిగా గుచ్చింది. ఈసారి అతడు లుంగలు చుట్టుకుపోయాడు. ఆమె ఇక ఆగలేదు. ఇష్టం వచ్చినట్టుగా అతడిని పొడవసాగింది. అతడు భీకరంగా అరుస్తూనే తన కుర్తాజేబులోని తుపాకీని బయటకి తీయబోయాడు. కాని అది అతడివల్ల కాలేదు. తుపాకిని అందుకోబోయేలోపే అతడి చేతుల్లో శక్తి క్షీణించింది.          ఆమెవైపు భయంకరంగా చోసోతూ "బేగం" అంటూ గర్జించాడు. ఎగజిమ్మిన రక్తపు మరకలతో తడిసిపోయిన గౌసియా బేగానికి తను చేసింది ఏమిటో అర్ధం కాగానే కాళ్ళూ చేతులు వణకనారంభించాయి.          ఏడుస్తూ అతడివైపు చూస్తూ గాజుముక్కని చేతుల్లోంచి వదిలేసింది.          అతడు కిందపడి మెలికలు తిరిగిపోతూ క్రమంగా తన చైతన్యాన్ని కోల్పోతున్నాడు ఫలితంగా అతడిలో కదలికలు నెమ్మదిగా ఆగిపోతున్నాయి.          ఆమెకు అర్ధంకాలేదు అటూ ఇటూ చూసింది "అల్లా" అంటూ ఏడుస్తూ గుమ్మంవైపు పరుగెట్టి అతడివైపు ఒకసారి తిరిగి చూసింది.          అతడు రక్తపు మడుగులో గింజుకుంటున్నాడు. అతడిని అలా చూడగానే ఆమెకు మరింత భయంవేసింది.          "అల్లా అల్లా" గుండెలు బాదుకుంటూ గిరుక్కున వెనుతిరిగి తలుపు తీసుకుని వేగంగా బయటకి నడిచింది.          అటూఇటూ వరసగా వున్న గదులన్నీ మూసుకుని వున్నాయి. బయట ఒక్కరు కూడా కనబడ్డంలేదు. ఆమె ఎటూ చూడకుండా పరుగున ముందుకు నడుస్తూ తల మీదనుండి తొలగిన బురఖాని సరిచేసుకుంది.