వస్త్రధారణ ఏం చెబుతుంది ?

వస్త్రధారణ ఏం చెబుతుంది ? పార్ట్ -2 ఎన్ని జతల పాద రక్షలున్నాయి ? - స్వప్న కంఠంనేని   ఒక మనిషి Maintain చేసే పాదరక్షల్ని బట్టి అతని బుద్ది ఏపాటిదో  గ్రహించవచ్చు: ఒక వ్యక్తీ  అనేక జతల పాదరక్షల్ని ఉంచుకుని ఇవాలోకటి, రేపు మరొకటి ధరిస్తుండవచ్చు. అలాగే మరో వ్యక్తీ ఒక్క జతను మాత్రమే ఉంచుకుని అవి పాడైపోయేదాక రోజు వాటినే వాడుతుండవచ్చు అలాంటపుడు * అనేక పాదరక్షలు కలిగి ఉంది  రోజుకో పడరక్షను విలాసవంతంగా ధరించే వ్యక్తీ అభిరుచుల్ని సంతృప్తిపరచడం గానీ, అతణ్ణి పట్టుకోవడం గానీ, అతడితో జీవించే లేక జీవించాలనుకునే స్త్రీకి కొంచం కష్టసాధ్యమే అవుతుంది. * చంచల మనస్కుడతను. పూర్వజన్మలో ఏ  నవాబుగారబ్బాయినో అన్నట్లు అతను దారేపోయే సీతాకోకచిలుకల వేపు దృష్టి సారించే అవకాసం వుండదు. * చిరిగిపోయేదాకా ఎప్పుడు ఒకే పాదరక్షల్ని వాడే వ్యక్తీ డబ్బుల విషయంలోనూప్రేమ విషయంలోనూ పరిమిత ఖర్చును ప్రదర్శిస్తుంటాడు. జీవితలో ఒకే ఒక్క స్త్రీకి కట్టుబడి ఉంది ఆ సంబంధాన్ని నిజాయితీగా అంటిపెట్టుకుని ఉంటాడు. * ఇక్కడ అమ్మాయిలు ఒక విషయాన్నీ గమనించాలి. పురుషులకూ సంబంధించిఈ చెప్పే ఏ ఒక్క విషయాన్నీ ప్రామాణికంగా తీసుకుని గభాల్న ఒక అంచనాకి రాకూడదు   దుస్తులు ధరించే ధోరణి పక్కన పెడితే : ఒక వ్యక్తీ ధరించే వర్ణాలు అతడిలో టెంపర్మెంట్ ని, మూడ్ ని బయట పెడుతుంటాయి. ఇప్పుడు ఆ వర్ణాలు చెప్పే వివరాలేమిటో చూద్దాం... తెలుపు : తెలుపు వర్ణాన్ని మనవాళ్ళు స్వచ్చతకు సూచనగా చెబుతారు .తరచుగా తెల్లటి దుస్తుల్ని ధరించే  వ్యక్తీ సంప్రదాయక భావాలు కలిగినవాడై ఉంటాడు స్త్రీతో కూడా అతను సంప్రదాయకంగా ఆమెకు కట్టుబడి ఉంటాడు. అయితే కొన్ని సందర్భాలలో  స్త్రీకి అతను కొంత మొండిగా,గిజినపట్టు మనిషిగా కూడా కనిపించవచ్చు కాని ఆమెపట్ల అతను నిజయితగా ఉంటాడనేందుకైనా ఆమె సంతోసించవచ్చు నలుపు : అధికంగా నల్ల దుస్తులలో కనిపించే వ్యక్తీ మూడీ మనిషి కావచ్చు ఆ మూడ్స్ కూడా నెగిటివ్ ధోరణిలో  ఉంది అతనితో జీవించే స్త్రీకి తరచుగా చికాకును కలిగించుతాయి. ఎరుపు: సజీవత్వానికి చిహ్నం ఈ రంగు! ఈ రంగు దుస్తుల్ని ధరించే మనిషి మిడిసిపడుతూ అగ్రెసివ్ గా ఉత్తేజంగా ఉంటాడు. హమేషా అతను తన జీవితాన్ని ప్రేరణ కలిగించే స్థితిగతుల కోసం అన్వేషిస్తూ తన స్త్రీ పట్ల సమ్మోహిత పూరితంగా ప్రవర్తిస్తాడు. ఆమె కూడా అతని పట్ల సమ్మోహితంగా  ఉండగలిగితే ఒకరికోకళ్ళు సరిజోడు అవుతారు. నీలం : స్వతహా నెమ్మదస్తుడు, ప్రశాంత చిత్తుడు ఈ వర్ణాన్ని అభిమానిస్తాడు. ఈ రకం దుస్తుల్ని ధరించుతాడు. అతడి  ప్రశాంత నైజం అతడిలో జీవితాన్ని పంచుకునే స్త్రీకి  ఒక వరం లాంటిది ఆమె జీవితం  ఒడిదుడుకులు లేకుండా ప్రశాంత గోదావరిలా సాగిపోతుంది. ఆకుపచ్చ : ప్రకృతి వర్ణం! నూతనత్వానికి చిహ్నం !! సాహసాల పట్ల అవుట్డోర్  రోమాన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండే స్త్రీకి ఈ దుస్తుల్ని ధరించే పురుషుడు ఆదర్శ జోడి ! పసుపు వర్ణం : ఈ దుస్తుల్ని ధరించే వ్యక్తీ కల్మషరహితుడు, మానవత్వం పట్ల గౌరవం కలిగిన వాడూ అయి వుంటాడు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం కలవాడై  ఉంటాడు అతడితో జీవితాన్ని పంచుకునే స్త్రీ అతడిని పూర్తిగా నమ్మవచ్చు. ఇక్కడొక విషయం - ఈ మనిషి ఎప్పుడు ఒకే రంగు దుస్తుల్ని ధరించాడు ! వెరైటి కోసమైనా గాని రకరకాల వర్ణాలలో దుస్తుల్ని వేసుకుంటాడు అయితే మరి అతని దుస్తులలో ఏ వర్ణాన్ని లెక్కలోనికి తీసుకోవాలి ? అతను ధరించే దుస్తులలో ఏ రంగు ఎక్కువ డామినేట్ చేస్తుందో పరీశీలించాలి. ఆ  రంగును బట్టి అతని అభిరుచి ఏమిటో, ఆ అభిరుచి వెనుక ఉండే అతని మనస్తత్వం ఏమిటో, అతను తనకు ఈ రకంగా సరిపోతాడో సరిపోల్చుకోవాలి...  

అమెరికాలో క్రిస్మస్, కొత్త సంవత్సరం సంబరాలు

 అమెరికాలో క్రిస్మస్, కొత్త సంవత్సరం సంబరాలు   -కనకదుర్గ-    మెర్రీ క్రిస్మస్! :    అమెరికాలో వణికించే చలిలో, సాయంత్రం చాలా త్వరగా చీకటి పడిపోతుంది.  చాలా ప్రదేశాల్లో స్నో పడి ఇంట్లో నుండి బయటకు రావడం కూడా కష్టం అయిపోతుంది.  చాలా మంది సీజనల్ డిప్రెషన్ కి లోనవుతారు.  ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడువారి వుంటాయి మళ్ళీ వసంతం వచ్చేవరకు. ఈ చీకట్లను పోగొట్టి ప్రజల జీవితాల్లో ఉత్సాహం నింపడానికి క్రిస్మస్ కి నెలరోజుల ముందునుండే వీధులను, ఇళ్ళను లైట్లతో అలంకరించే పద్దతిని ఆరంబించారని చెప్పుకుంటారు.  ’థ్యాంక్స్ గివింగ్,’ పండగ నవంబర్ నాలుగో గురువారం జరుపుకుంటారు.  ఈ పండగ జరుపుకోవడానికి దేశంలో ఏ మూలనున్నా కుటుంబంతో టర్కీ డిన్నర్ చేసి సమయం గడపడానికి ప్లేన్లు, ట్రైన్లు, కార్లు, బస్సులు, ఎలా వీలయితే అలా ఇళ్ళకు చేరుకుంటారు.  మర్నాడు బ్లాక్ ప్రైడే రోజు క్రిస్మస్ కోసం షాపింగ్ చేస్తారు.  అప్పుడు దేశం మొత్తంలో, మాల్స్, షాపింగ్ సెంటర్స్ అన్నీ గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు కొన్ని చోట్ల, లేదా కొన్ని గంటలు సేల్స్ అని పెడతారు.  ఆ సేల్స్, డిస్కౌంట్స్ కోసం విపరీతంగా షాపింగ్ చేస్తారు అమెరికన్లు.  మాల్స్, షాపింగ్ సెంటర్స్ దగ్గర కార్ల పార్కింగ్ దొరకడం చాలా కష్టం అవుతుంది.  థ్యాంక్స్ గివింగ్ తర్వాతే, వీదుల్లో క్రిస్మస్ లైట్లు, డెకొరేషన్స్ చేస్తారు.  సిటీల్లో, మాల్స్ లో పెద్ద పెద్ద క్రిస్మస్ చెట్లు పెట్టి డెకొరేట్ చేస్తారు.  న్యూయార్క్ లో రాకఫెల్ల ప్లాజా(Rockefeller Plaza) దగ్గర క్రిస్మస్ చెట్టు పెట్టి లైట్లతో చాలా అందంగా డెకోరేట్ చేస్తారు, వాషింగ్టన్ లో వైట్ హౌస్ (White House) ఎదురుగా పెట్టి డెకొరేట్ చేస్తారు, ఫిలడేల్ఫియాలో లవ్ పార్క్ (Love Park) లో పెట్టి లైట్లతో, అర్నమెంట్స్ (Ornaments)తో డెకొరేట్ చేస్తారు.  ఇలాగే మిగతా పెద్ద సిటీల్లో కూడా చేస్తారు.  ప్రతి ఏడు క్రొత్త రకం లైట్లు, క్రిస్మస్ డెకొరేషన్స్ మర్కెట్లోకి వస్తాయి.  చాలామంది ప్రతి ఏడు వచ్చే కొత్త ఐటమ్స్ తో అలంకరిస్తారు ఇళ్ళని, మరి కొంతమంది ప్రతి సంవత్సరం ఒకటే రకంగా చేస్తే మరికొంతమంది క్రిస్మస్ పండగ జీసస్ జననం గురించి కాబట్టి ఆ సన్నివేశాలు ఇంటి ముందర బొమ్మలు పెట్టి లైట్స్ పెట్టి అలంకరిస్తారు.  అవి చూస్తే మనం దసరా, సంక్రాంతికి చేసుకునే బొమ్మల కొలువు గుర్తోస్తుంది.  ఇంటి లోపల వారి ఇళ్ళల్లో పట్టేంత క్రిస్మస్ చెట్లు కొంతమంది కుటుంబంతో వెళ్ళి క్రిస్మస్ చెట్లను పెంచి అమ్మకాలు   చేసే దగ్గర నుండి వారే వారికి ఏ చెట్టు కావాలో ఎన్నుకుని స్వయంగా కొట్టి వాన్ పై పెట్టి  తీసుకొచ్చి ఇంట్లో లివింగ్ రూమ్ లో పడిపోకుండా పెట్టి కుటుంబ సభ్యులు కలిసి చెట్టుని అలంకరిస్తారు...      చెట్టుపైన పెట్టే నక్షత్రం ఇంటికి పెద్ద అయిన తండ్రి అయినా పెడతారు లేదా పిల్లల్లో ఒకరితో పెట్టిస్తారు. కొంతమంది ముందే కొట్టేసి అమ్ముతున్న క్రిస్మస్ చెట్లను ఎవరికి ఏ సైజువి కావాలో చూసి కొనుక్కుంటారు.   ఒకసారి చెట్టు పెట్టిన తర్వాత చాలా మంది కొత్త సంవత్సరం వరకు వుంచుకుని తర్వాత తీసేస్తారు.  క్రిస్మస్ రోజు చర్చ్ లలో సర్వీస్ లు చేసి, స్నేహితులతో, కుటుంబసభ్యులతో, బంధువులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు.  క్రిస్మస్ సమయంలో చాలా మంది బీదవారికి, క్యాన్సర్ తో బాధపడ్తున్న చిన్నారులకు చాలా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ కి డొనేషన్స్, ఇలాగే ఇతర భయంకరమైన జబ్బులకు రిసెర్చ్ చేస్తున్న సంస్థలకు, ఇళ్ళులేని వారికి ఇళ్ళు కట్టించి ఇచ్చే స్వచ్చంద సంస్థలకు, జంతువుల షెల్టర్లకు కూడా చాలా మంది డొనేషన్లు ఇస్తుంటారు.  ఇతర దేశాల కంటే అమెరికాలో క్రిస్మస్ వ్యాపారాత్మకంగా అయిపోయింది అని అంటారు ఇతర దేశాల వారు. క్రిస్మస్ పండగ అంటే జీసస్ పుట్టిన రోజు సంబరాల కంటే ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకునే పండగలా తయారయ్యింది అని కూడా అంటుంటారు.   క్రెడిట్ కార్డ్లు వాడి వారి స్తోమతకి మించి గిఫ్ట్స్ కొంటారు ముందు వెనకా ఆలోచించకుండా చాలామంది. ఈ పండగ అమ్మకాల్లో వచ్చే లాభాలపైనే చాలా బిజినెస్ వాళ్ళు ఆధారపడ్తారు.  పండగ అయ్యింతర్వాత ఇంకా హాలీడేస్ వాతావరణం వుంటుంది కాబట్టి సెలవులకి పిల్లలతో కొత్త ప్రదేశాలకి వెళ్ళడం లేదా, స్నేహితులు, బందువుల వూళ్ళకు వెళ్ళి వాళ్ళతో కలిసి సమయం గడిపి వస్తారు.  ఆఫీసులకి కొంతమందికి సెలవు ఇస్తారు కొన్ని రోజులు, కొంతమంది సెలవు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆఫిసులు, స్కూళ్ళు తెరిచేవరకు వచ్చేస్తారు.  ఆ తర్వాత అప్పులు చేసి గిఫ్ట్స్ కొన్నవారు, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టిన వారికి బిల్స్ రావడం మొదలుపెట్టగానే డిప్రెషన్ కి గురవుతారు, వీళ్ళల్లో సైకియాట్రిస్ట్ ల దగ్గరికి వెళ్ళేవారు కూడా వుంటారు.  హ్యాపీ న్యూ ఇయర్! కొత్త సంవత్సరం సంబరాలు ప్రతి పెద్ద సిటీలో బ్రహ్మాండంగా చేసుకుంటారు.  న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ దగ్గర ఒక పెద్ద ఎలక్ట్రిక్ బాల్ చాలా అందంగా తయారు చేసి కరెక్ట్ గా డిసెంబర్ 31 మధ్యరాత్రి పన్నెండు గంటలకు న్యూయార్క్ జడ్జి బటన్ ప్రెస్ చేయగానే మెల్లి మెల్లిగా క్రిందకి జారుతుంది. ఈ సారి తయారు చేసిన ఈ బాల్ 12 అడుగుల వెడల్పు, 11,000 పౌండ్లు బరువుంది.  ఈ ఏడాది కొన్ని రోజుల ముందు నుండే వలంటీర్లు ప్రతి రోజు స్టేషనరీ సైకిళ్ళ పై పెడల్ చేసారు, విధ్యుత్తుని ఉత్పత్తి చేసి బాల్ ని కిందికి జారవిడవడానికి. బాల్ కిందికి జారడానికి తీసుకునే సమయం ఒక నిమిషం. ఈ సంవత్సరం టైమ్స్ స్క్వేర్ దగ్గర ఒక మిలియన్ ప్రజలు చేరారు ఈ ముచ్చట చూసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి. మరో మిలియన్ ప్రేక్షకులు టీ.వీ ముందు చేరి వీక్షించారు.    దీనికి ముందు దేశం నలుమూలల నుండి, ఇతర దేశాల నుండి ఈ బాల్ క్రిందికి రావడాన్ని చూడడానికి పర్యాటకులు పొద్దున్నుండే వచ్చి టైమ్ స్క్వేర్ ప్రాంతంలో చేరారు.  మంచి చలి కాలం కాబట్టి ఎంత చలి వున్నా సరే పట్టించుకోరు. మొత్తం శరీరం పై నుండి క్రింది వరకు చలికి తట్టుకోవడానికి బాగా కవర్ చేసుకుని కొత్తసంవత్సరం సంబరాలు చూడడానికి రెడీగా వుంటారు. బాల్ కిందికి రాగానే ఫైర్ వర్క్స్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. సరిగ్గా పన్నెండు కాగానే అన్నీ సిటీల్లో, వూళ్ళల్లో ఫైర్ వర్క్స్ తప్పనిసరిగా వుంటాయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి.   సాయంత్రం కాగానే మ్యూజిక్ కాన్సర్ట్స్ మొదలవుతాయి.  సిటీల్లో పెద్ద పెద్ద హోటల్లో మ్యూజిక్ తో పాటు, డిన్నర్, డ్రింక్స్ కి ధరలు బాగా పెంచేస్తారు.  ఇళ్ళల్లో, పెద్ద పెద్ద భవంతులలో, రెస్టారెంట్లలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి పార్టీలు జరుగుతాయి.     .  ఫిలడెల్ఫియాలో ఎక్కడా జరగని పరేడ్ జరుగుతుంది, "మమ్మర్స్ పరేడ్," అని 17వ శతాబ్దం నుండి చేస్తూ వస్తున్న పరేడ్ జనవరి 1న ఫిలడెల్ఫియా సిటీలో చేస్తారు.  ఈ పరేడ్ లో ఐర్లాండ్, బ్రిటిష్, జర్మన్, ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల నుండి వచ్చి సెటిల్ అయిన వారు ఎన్నో ఏళ్ళుగా కుటుంబాలతో, స్నేహితులతో కలిసి చేస్తారు.  ఇది చూడడానికి దేశం నలుమూలలనుండి, ఒకోసారి విదేశాలనుండి కూడా వస్తారు.  దేశం నలుమూలల నుండి మమ్మర్స్ క్లబ్ హౌస్ ల వాళ్ళు ఇందులో పాల్గొంటారు, వీరి ప్రతిభకు గుర్తింపుగా ప్రైజులని కూడా ఇస్తారు.  కాలిఫోర్నియా, పాసెడినా (Pasedena) లో గులాబీలతో తయారు చేసిన ఫ్లోట్స్ తో పరేడ్ జరుగుతుంది.  ఇది కూడా చాలా పాపులర్ అయిన పరేడ్.  ఎన్ని రకాల, ఎన్ని రంగుల, ఎన్ని గులాబీలు ఈ పరేడ్ కోసం వాడతారో చెప్పడం కష్టం.      ఇలా కొన్ని సిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటే మిగతా సిటీల్లో, వూళ్ళల్లో ఆనందంగా పార్టీలు చేసుకుని కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటారు.  ఇవండీ అమెరికాలో క్రిస్మస్, పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే విశేషాలు!  మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!  ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యం, సంతోషాలను, విజయాలను, శాంతిని కల్గించాలని మనసారా కోరుకుంటూ.....        

వస్త్రధారణ ఏం చెబుతుంది.

వస్త్రధారణ ఏం చెబుతుంది? (కట్టే బట్టను చూసి కట్టూ ' బొట్టు'కు ఎన్నుకో ) - స్వప్న కంఠంనేని దుస్తుల్ని మనుషులు తయారు చేస్తారు. కాని దుస్తులు మనుషుల్ని తయారు చేస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు! మనం ఒక మనిషిని చూడగానే అతను ధరించిన దుస్తులు అతనెలాంటి వాడో మనకు చెప్పేస్తాయి. అతని  వ్యక్తిత్వం ఎలాంటిదో, ప్రేమికుడుగా అతని లక్షణాలేమిటో లాంటి విషయాలను కూడా తెలియజేస్తాయి. ( వింటున్నావా వినయవతి ) తన స్వంత స్టయిల్ లో దుస్తుల్ని ట్రిమ్ గా ధరించే వ్యక్తీ ఎప్పుడు అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనిపిస్తాడు స్వతహా అతను అందగాడు కాకపోయినా గానీ !  అదే రకంగా ఒక వ్యక్తీ ఎంత అందగాడు అయినా కూడా సరయిన దుస్తుల్ని ధరించపోతే అమ్మాయిల్ని ఆకట్టుకోలేడు. అమ్మాయిలకు కూడా అంత అందంగా ఉండే అతను తనను ఎందుకో ఆకర్షించలేక పోతున్నాడో అర్ధంకాదు ! యువకులకు సంబందించిన ఒక అదృష్టమేమిటంటే యువతులంతా ఒకే రకమైన వస్త్రధారణ సమ్మోహితులు కాకపోవడం. ఒక అమ్మాయికి ఒంటికి అంటిపెట్టుకుని ఉండే బిగుతు దుస్తులు ధరించిన  యువకుడు ఆకర్షణీయంగా కనిపించకపోతే, మరో అమ్మాయికి వదులుగా ఉండే బాగీ ప్యాంటు, షర్ట్ ధరించిన యువకుడు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. మరో స్త్రీ కి కవుల్ని స్పురణకు  తెచ్చే బిగుతు పైజామా, వదులు లాల్చీ (రాజేష్ఖన్నా స్టయిల్) ధరించిన యువకుడు అందంగా కనిపించవచ్చు. చిందరవందరగా పడేసి ఉంటే.... ఒక యువతి తను ప్రేమించే లేక తనను ప్రేమిస్తున్నాను అంటూ తన చుట్టూ తిరిగే యువకుడి గదికి వెళ్ళిందనుకుందాం. అప్పుడామెకు అతని దుస్తులు గదిలో ఈ మూల నేల మీద పడేసి ఒకటి,మంచం మీద ఒకటి, కుర్చికి తగిలించి ఒకటి ఇలా అడ్డంగా చిందరవందరగా కనిపిస్తాయి. అప్పుడతని గురించి ఆమె ఎలాంటి అభిప్రాయానికి రావచ్చు?  అతను యధాలాపంగా ఉండే మనిషి ! కొంచం బాధ్యతారహితంగానే ఉండేవాడు కావచ్చు. కానీ జీవితం పట్ల ఆశక్తి కలవాడు , జీవితాన్ని తేలికగా తీసుకునే వ్యక్తీ అయివుంటాడు కూడా! అతి నీట్ గా ఉంటే .. దుస్తుల్ని అతి నీట్ గా ఉంచే  యువకుడు  అంటే హంగర్ కి తగిలించే వాటిని హంగర్ కూ తగిలించి, విదిచేసిన వాటిని ఓ పక్క ప్రత్యేకంగా ఉండే చెక్క పెట్టెల్లో కనిపించకుండా పడేసి ఉంచి చూపరులకు నీట్నెస్ ప్రదర్శించే వాడు.మొండి మనిషి కావచ్చు అతని అభిప్రాయాన్ని మార్చటంగాని, అతడి హృదయానికి చేరువ కావటం గానీ కొంత కష్టసాధ్యమైన విషయమే.సదా సిద్దంగా ఉంచితే...చొక్కా గుండిలు  ఊడిపోవటం , చిరుగులు లాటి వేమీ లేకుండా తనకు దుస్తుల్ని వేసుకోవటానికి ఎప్పుడు సిద్దంగా ఇస్త్రీ మడతలతో రెడీగా ఉంచితే..ఆ వ్యక్తీ భాద్యతల్ని స్వీకరించేవాడూ కమిట్మెంట్స్ కి కట్టుబడి ఉండేవాడు అయివుంటాడు. దుస్తుల్ని తనకు తాను రిపేర్ చేసుకునేవాడు... దుస్తుల్ని రిపేర్ చేయమంటూ ఇంట్లో వాళ్ళకో , టైలర్కో అప్పజెప్పే మనిషయితే అతను తన పరిధిలేమిటో తెలిసినవడయివుంటాడు. అవసరమైనపుడు నిపుణుల సలహాలు తీసుకోవడానికి ఏమాత్రం సందేహించాడు. అలాకాకుండా తనకు తానూ కుట్టుకోవడమే చేసేవాడు అయితే తన గురించి తాను జాగ్రత్తలు తీసుకోగలిగే స్వతంత్ర వ్యక్తిత్వం  కలిగినవాడు అయి వుంటాడు. అతడిని పెళ్ళాడిన స్త్రీ కొంత స్వతంత్యాన్ని ప్రదర్శించినా గాని ఏ మాత్రం అభ్యంతరం పెట్టడు. డ్రెస్ ఎన్నాళ్ళపాటు వేస్తాడు... ఒక డ్రస్సును వూరికే రోజులు తరబడి వేయకుండా ఒక రోజు రెండు  రోజులు మాత్రం ధరించి ఆ వెంటనే ఇస్త్రీకి పంపేవాడు స్త్రీ కి తను నప్పుతాడా లేదా అని తెగ తాపత్రయ పడేవాడు అయి వుంటాడు అలా కాకుండా ఒకసారి ఇస్త్రీ చేసిన దుస్తుల్ని మైలపడ్డాయో లేదో చూసుకోకుండా రోజుల తరబడి వేసుకునే యువకుడు తన గురించి తాను పట్టించుకోనివాడు, స్త్రీల అభిప్రాయాలకు ప్రాదాన్యత ఇవ్వనివాడు. అంతే కాదు ఆమెకు అందంగా కనిపిస్తే ఏమిటి కనిపించకపోతే ఏమిటి అన్న ధోరణిలోను  ఉంటాడు. దుస్తుల అమరిక : వార్డ్ రోబ్ లో అతను దుస్తుల్ని ఎలా వేలడదీస్తాడు : దుస్తుల్ని ఒక పద్దతి ప్రకారం నిలవ ఉంచుకునే వ్యక్తీ బరువు బాధ్యతల్ని స్వికరించ గల్గేవాడయి ఉంటాడు . జీవితం విషయంలోనూ ప్రేమ విషయంలోనూ నినాదాన్ని పాటించే వాడయి వుంటాడు. అల కాక దుస్తుల్ని ఒక పద్దతి లేకుండా చేతికి కందిన చోట్ల దేన్నీ పడితే దాన్ని హాంగ్ చేసి ఉంచేవాడు ప్రేమ విషయంలోఒక నిలకడ లేకుండా తన చిత్తం వచ్చినట్లుగా అమ్మాయిలతో ఆడుకునే వాడయి ఉంటాడు.

వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి

వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి - ఇల్లిందల పద్మా శ్రీనివాస్   పిల్లలూ ? పిల్లలు అంతే గుర్తు వచ్చింది. ఇప్పుడు పిల్లలూ ఎక్కడ ఉన్నారు ఉంటే స్కూల్ లో లేదా కంప్యూటర్ టి.వి ల ముందు ఇంతకు ముందు మా  రోజుల్లో పిల్లలు అయితే సాయంత్రం అయితే చాలు వీధుల్లో పిల్లలి అందరూ  కలసి ఆడుకుంటూ ఉండేవారు. రాత్రిళ్ళు తాతయ్య, నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు.ఇప్పుడు పిల్లలకు ఆ తీరికా లేదు, ఆ కోరికా తీరదు. ఎందుకంటే ఎప్పుడూ చదువుతో వాళ్ళు బిజీ , ఉద్యోగాలతో తల్లితండ్రులు బిజీ. వాళ్ళని ఒళ్ళోకి తీసుకుని  వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకునే టైం లేదు ఎప్పుడూ ర్యాంక్ స్కూల్లో రుద్దుతారు. ఇంటికి వచ్చాక ట్యూషన్. ఇక వాళ్ళకి ఆదుకునే టైం ఏది.. పిల్లలు సాయంత్రం పూట ఆడుకుంటుంటే వాళ్ళ మేధ శక్తి పెరుగుతుంది.వాళ్ళ ఒంటికి వ్యాయామం ఉంటుంది. నలుగురితో ఎలా కలిసి మెలిసి ఉండాలన్నది. వాళ్ళకు అలవాటు అవుతుంది. పొద్దున్నే లేవగానే ఉరుకులు పరుగులు అంత బరువున్న స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని వెళ్లి సాయంత్రం ఇంటికి అలసిపోయిరాగానే మళ్ళీ ట్యూషన్ ఇదేనా పిల్లల జీవితం వాళ్ళ బాల్యం ఇలా ముగిసి పోవలిసిందేనా చదివించండి కాని వాళ్ళకి ఆటకి గంటయినా టైం ఇవ్వండి. చిన్న వయసులో పదే పదే చదివిస్తే వాళ్ళకి వచ్చింది కూడా మరచిపోయే అవకాశం ఉంది. వాళ్ళ చిన్ని బాధను అర్ధం చేసుకునే వాళ్ళ వయసుకు తగిన చదువును చెప్పండి. మూడు సంవత్సరాలు రాగానే వాణ్ణి స్కూల్ లో వేసి వాడి వయసుకు మించిన భారాన్నివాడి మీద  మోపుతున్నారు, ఆ వయసులో  వాడి చిన్ని బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఈ రోజు ఏం ఆడుకోవాలని కాని కాని ఆటలకి టైం లేదన్న సంగతి వాడికి తెలియదు. వాళ్ళ బాల్యంలో వాళ్ళ ఆనందాలను మనం తుంచేస్తే వాళ్ళ కోరికలు ఎప్పుడూ తీరుతాయి. ఏమి తెలియని పసి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని దోచుకునే హక్కు తల్లి దండ్రులగా మనకు లేదు. తల్లిదండ్రుల తప్పుకూడా ఎంత   మాత్రమూ లేదు ఎందుకంటే పిల్లల మధ్య కాంపిటిషన్ ఎక్కువ అయింది. తమ పిల్లలకు ర్యాంక్  రాకపోతే వాడు వాల్లందరిలో ఎక్కడ తక్కువ అవుతాడో అని ఫీలింగ్. ఆ ఫీలింగ్ విడిచి  తల్లి తండ్రులు కూడా వాళ్ళ భావితకి వారధులుకండి . వాళ్ళని కూడా సాయత్రం వేళ ప్రకృతిలో స్వేచ్చగా విహరించనీయండి. స్వచ్ఛమైన గాలిని  ఆస్వాదించనీయండి.చదువుతో పాటు ఆటలకి కూడా టైం ఇవ్వండి.  

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి పార్ట్ - 2 -స్వప్న కంఠంనేని అరుణారుణ ముఖం : కోపం వచ్చినపుడు లేక అవమానించబడ్డప్పుడు మనిషి మొహం ఎర్రగా  కందిపోతుంది. ఇందుకు కారణం ఆ సమయంలో శరీరంలో రక్తం మొహంలోకి తన్నుకు రావడం! ఆ సమయాన సమీపంలో ఉన్నవాళ్లు మీద అతను  పెట్రేగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా మాటిమాటికి మొహం కందిపోయే పురుషుడిని స్త్రీ భరించడం కష్టమే. ఆమె అసహనవతి కాకపోతే వాళ్ళ మధ్య రణ నాదాలు చెలరేగిపోయే ప్రమాదం ఉంది.. దృడ చిత్తుడు : చుబుకం ముందుకు జరిగి,దవడ నరాలు బిగుసుకుని  ఉండి, పెదిమల కొనలు కొండికి వంపు తిరిగి ఉంటే ఆ వ్యక్తి దృడ చిత్తుడుగా తీసుకొనవచ్చు. ముస్సోలినీ,రిచర్డ్ నిక్సిన్ ఈ కోవకు చెందినవాళ్ళే.ఇలాంటి పురుషులకు దర్పం ఎక్కువ. ఇతరులతో ఏకీభవించక తను మాటే నెగ్గాలని పంతం ఎక్కువ ఒకవేళ ఎప్పుడన్నా ఏకీభవించినట్లు కనిపించక కనిపించినా అది తను పంతం నెగ్గటానికి అదే నాటకం మాత్రమే అది! అణకువగా ఉండే స్త్రీలు ఇలాంటి పురుషుల వద్ద రాణించ గలుగుతారు ! నునుసిగ్గులవాడు : పెదాలు కళ్ళ చివర చిరు నవ్వులు దాగి,చేపలు కొద్దిగా గులాబీ రంగుకు మారి (కెంపులై) నునుసిగ్గులు ప్రదర్శించే పురుషుడు శృంగార రాయుడై, స్త్రీ చెప్పే సజెషన్స్ తల వగ్గే వాడై వుంటాడు. పాలిపోయిన మొహం :  మోహంలో రక్తం ఇంకిపోయి తెల్లగా వ్యక్తి పూర్తిగా భయపడిపోయిన వాడై వుండాలి. లేక తీవ్ర కోపంతో ఉన్నవాడైనా అయి వుండాలి.ఆ సమయాన అతడి మొహం లో రక్తం శరీర కండరాల లోకి పరుగుదీసి అతడిని పారిపోవడనికో, పోరాడడానికో సిద్దం చేసి ఉంటుంది. ఇలాంటి  స్థితిలో ఉన్న వ్యక్తితో  హేతుబద్దంగా  వాదనలు పెట్టుకోబూనడం శుద్ధ అవివేకం. పక్కకు తప్పుకు పోవడం  మంచిది. ముక్కుపుటాలెగరేసేవాడు : చిన్న చిన్న విషయాలకే త్వరగా ఉద్రిక్తత చెందే పురుషుడు మనిషి మాటి మాటికి ముక్కుపుటాలను ఎగరేస్తుంటాడు. రౌద్రనికి సూచన ఇది.తీవ్రమైన ఉద్వేగ జీవి ఇతను. తరచు మూడీగా ఉంటాడు. తన భావాలను దాచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించడు. పైగా వాటిని ఎదుటి వాళ్ళకు తెలియచేయటానికి కూడా సిద్దం గా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఉండి  ఉండి గభాల్న కోపంతో మండిపోతాడు. అంతలోనే చల్లారిపోతాడు. వంకరలు తిరిగే మొహం : తనలో భావాలను అణచుకుని నెర్వస్ గా అణచుకుని ఉండే మనిషి మొహం వంకర్లు తిరిగినట్లుగా కనిపిస్తుంది. మొహంలో ని ప్రతీ భాగమూ ఎంతో కొంత అసలు రూపాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. న్యూరోటిక్  మనిషి అతను.అతని అవసరాలు, కోర్కెలు తీర్చడానికి సిద్దపడితే తప్ప ఏ స్త్రీ అతని జోలికి పోకుండా ఉండటమే మంచిది. పురుషుడు తన చుట్టూ తిరుగుతూన్నపుడు విడివిడిగా అతని  మొహంలో ఒక్కో భాగాన్ని పరిశీలించడం కాకుండా  జమిలిగా అతను తన చూపుల్ని ఏ దిక్కుకి ప్రసరిస్తున్నాడు , కనుబొమ్మల్ని ఎలా కదిలిస్తున్నాడు, ఏ సందర్భంలో ఎంత త్వరగా నవ్వగలుగుతున్నాడు, అతని పెదిమల పొజిషన్ ఎలా ఉంది లాంటివన్నీ నిశితంగా గమనించి అతని గురించి ఒక అభిప్రాయానికి రావడం మంచిది.   

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి - పార్ట్ - 2 - స్వప్న కంఠంనేని తెరుచుకున్న పెదాలు : ఎదుటి మనషి మాట్లాడుతున్నపుడు ఒక వ్యక్తి నోరు తెరచుకుని వింటున్నాడనుకోండి. అప్పుడు? * అతను  హృదయాన్ని విప్పి వింటున్నాడని అవతలి మనిషి చెప్పే  వాటిని నమ్ముతున్నాడనీ, వినాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నడనీ అనుకోవాలి. * తన చుట్టూ తిరిగే  పురుషుడు తన చెప్పే  విషయాన్నీ ఇలా పెదాలు తెరచుకుని  ఆమె అతను పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడని తన గురించి ఇంకా తెలుసుకోవాలని చూస్తున్నాడని అనుకోవాలి. బిగుసుకున్న పెదాలు : హమేషా పెదాల్ని బిగించి ఉంచే పెద్దమనిషికి మనసులో అనేక అభిప్రాయాలూన్నాయనీ అతడు వాటి గురిచి చెప్పకుండా దాచుకుంటున్నడని అనుకోవాలి. * ఇలాంటి మనుషులు లోలోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉద్వేగాలతో ఎప్పుడు అగ్నిపర్వతం బద్దలవుతుందా అన్నట్లుంటారు. వీళ్ళు మానసిక  ఒత్తిడితో నలిగిపోతు తలనొప్పులు, ఆల్సర్ మొదలైన వాటితో భాదపడే అవకాశం ఉంది. పెదిమల కొనలు పైకి లేచి: * ఇలాంటి వ్యక్తి ప్రతీ విషయాన్ని ఆశ అనే భూతద్దంలోంచి చూసే ఆశావాది అయివుంటాడు. * ఇతడిలో స్వతహా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. ఇతను ఎదుటి వాళ్ళను కూడా చలాకీగా నవ్వులలో ముంచగలుగుతాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని చేసుకునే అమ్మాయి మహా బాగా సుఖ పడిపోగలుగుతుంది. దీనికి పూర్తి విరుద్దం గా వ్యక్తి పెదిమల కొనలు కిందికి వాలిపోయి వుండే మనిషి.. * లోకంలో ఇలాంటి వాళ్ళే అధికంగా ఉండటం విచారకరం! లోకం తో విసుగు చెంది గొప్ప నిరాశావాదులు అయివుంటారు. * ఇలాంటి వ్యక్తి కాన్ఫిడెన్స్ ను పొందటం కష్టం అలా  పొందగలిగిన స్త్రీ ని మాత్రం అతను నెత్తి మీద పెట్టి చూసుకుంటాడు. పెదిమలు తడుపుతూ : ఇతను మంచి సరసుడై వుంటాడు ఇందులో కూడా కొన్ని పద్దతున్నాయి. నాలుకను  చకచక వెనక్కు ముందుకు ఆడించడం.  నాలుకను  పెదిమల మధ్య నిధానంగా ఈ చివరి నుండి ఆ చివరికు కదిలించడం. ఇవి కొంచం ఎబెట్టు చేష్టలు సంస్కారవతి  అతని పట్ల ఇష్టం లేకపోతే  అవమానం ఫీల్ అవుతుంది. వణికే పెదాలు : * మాటి మాటికి  ఇలాంటి స్థితిలో లో ఉండే  పురుషుణ్ణి   స్త్రీ తట్టుకోవడం  కొంచం కష్టమే అయితే ఆమె అతనిని ఒక తల్లిలా గురువులా, బుజ్జగించగలిగితే  అద్భుత విజయాన్ని సాధించగలుగుతుంది. ఇవి కాకుండా మరికొన్ని భావాల్ని వ్యక్తికరించే మొహల గురించి వచ్చేవారం తెల్సుకుందాం....

వెర్రి తలలు వేస్తున్న అమెరికన్ల స్త్రీ పురుష సంబంధాలు

 వెర్రి తలలు వేస్తున్న అమెరికన్ల స్త్రీ పురుష సంబంధాలు                                                                                                                                 -కనకదుర్గ అమెరికాలో ఏది చేస్తే ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా అవి చేయడం గొప్పగా, అభివృద్ది చెందుతున్ననట్టుగా భావిస్తారు.  ప్రపంచీకరణ తర్వాత ఈ తత్వం మరీ ఎక్కువయ్యింది.  ఇది బట్టలు వేసుకోవడంలో, మ్యుజిక్ వినడంలో, సినిమాలు మన భాషల్లోకి అనువదించి చాలా మంది ప్రేక్షకులు చూసేలా చేయడంలో, అక్కడ దొరికే ప్రతి ఒక్క కాస్మటిక్స్, ఎలక్ట్రానిక్స్, మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ ల్లాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టి మన తిండి చేసుకుని బిజినెస్ చేసుకునేవారికి జీవనం కష్టమయినా సరే, అదేం పెద్ద విషయాలు కాదన్నట్టు, చిన్న చిన్న దుకాణాల్లో రక రకాల వ్యాపారాలు చేసుకునేవారి పాలిట మాల్స్ వచ్చి ఒక్క మాల్ కి వెళితే అన్ని అక్కడే దొరుకుతాయి ఎన్నో చోట్ల తిరగకుండా,  ఇక్కడ కంపెనీలు ఆసియాలో పెట్టుకుని చీప్ లేబర్ కోసం అక్కడ పనులు ఎక్కువ చేస్తూ అమెరికాలో కొంతమందితో పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు.  ఇలాంటి పనుల వల్ల మన జీవిత విధానంలో మార్పులు వచ్చినా ఇదంతా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎంతో మంది ఆసియా దేశస్థులు.  ఒకప్పుడు పెళ్ళి చేసుకుని భర్తతో కాపురం చేస్తూ అతనితోనే పిల్లల్ని కని ఎంతో గౌరవంగా బ్రతకడం అనుకునేవారు.  స్త్రీలకీ శీలం అనీ, దాన్ని భద్రంగా పెళ్ళయ్యేవరకు దాచుకోవాలని లేకపోతే కుటుంబ, గౌరవ మర్యాదలకే ముప్పు వచ్చినట్టు భావిస్తారు ఎన్నో దేశాల ఆచార వ్యవహారాల్లో.  రేప్ జరిగిన అమ్మాయి తప్పు లేకున్నా ఆ అమ్మాయి జీవితం నరకప్రాయం చేస్తారు, పెళ్ళికి ముందు ప్రేమలో పడి గర్భం ధరిస్తే త్వరగా పెళ్ళి చేసి ఆ విషయం బయట పడకుండా జాగ్రత్త పడతారు, లేదా మోసం చేసి అతడు పారిపోతే ఎవరికి తెలియకుండా ఆ గర్భం తీయించి ఏమీ జరగనట్టు వేరే సంబంధం చూసి పెళ్ళి చేస్తారు.  అవునూ అమెరికాలో వెర్రి తలలేస్తున్న సంబంధాల గురించి రాస్తూ ఇవన్నీ ఏమిటీ అనుకుంటున్నారా?  అంటే అక్కడ ఏది మారితే వాటి ప్రభావం ఇతర దేశాలపై వుంటుంది అని చెప్పడానికే ఇదంతా చెప్పాను.   ఒకోసారి టీనేజ్ అమ్మాయిలు డేటింగ్ చేస్తూ గర్భనిరోధక పద్ధతులేవి పాటించకుంటే గర్భం ధరిస్తే కొంతమంది వుంచుకుని ఇద్దరు కలిసి చదువుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ బిడ్డని కని పెంచుకుంటారు, సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటారు.  కానీ అందరి విషయంలో ఇలా జరగదు.  భాయ్ ఫ్రెండ్ తనకేమి సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోతే, తనకు అప్పుడే తల్లి కావడం, తన స్వాతంత్ర్యం వదులుకోవడం ఇష్టం లేకుంటే కొంతమంది అబార్షన్ చేయించుకుంటే కొంతమంది బిడ్డని కని అడాప్షన్ కోసం పెడతారు.  పిల్లలు లేని వారు ముందుకు వచ్చి ఆ అమ్మాయి డెలివరీ అయ్యేదాక అన్నీ ఖర్చులు భరించి కాన్పు అయ్యాక బిడ్డను వారికి అప్పజెప్పి వెళ్ళిపోయి తమ బ్రతుకు బ్రతుకుతారు.  ఇది ఇక్కడ చాలా మామూలు విషయం.  ఒకోసారి పిల్లలు పెద్దయి తమ కన్న తల్లి ఎవరో తెల్సుకోవడానికి పెంచిన తల్లి తండ్రులదగ్గర సమాచారం తీసుకుని వెళ్ళి కలుస్తారు.   పిల్లలు పుట్టక పోతే టెస్ట్ ట్యూబ్ బేబీ నుండి అదీ కూడా సాధ్యం కాకపోతే కొత్తగా అద్దె తల్లి, సర్రొగేట్ (Surrogate) మదరింగ్ అని ఒక కొత్త పద్ధతిని కనుకున్నారు.   ఒకపుడు "అంగడిలో దొరకనికిది అమ్మ ఒకటే," అనుకునే వారు.  కానీ ఇపుడు మార్కెట్లో తల్లులు కూడా దొరుకుతారని రుజువు చేసారు.  ఒక సారి ఒక తల్లి తన కూతురు తల్లి కాలేక పోతున్నానని బాధ పడ్తుంటే తనకి పెద్ద వయసు అయిపోలేదు కాబట్టి తను పిల్లని కని కూతురికి ఇచ్చింది.  అంతే ఎంతోమంది తల్లులు కాలేని డబ్బున్న వారికి ఒక దారి దొరికింది.  డబ్బు ఆశ చూపించి మంచి ఆరోగ్యవంతులైన యువతులను ఎన్నుకుని వారి గర్భకోశాన్ని అద్దెకు తీసుకుని దానికి రుసుము చెల్లించి తల్లి తండ్రులు కావాలనుకుంటున్న భార్యా భర్తల్లో భర్త వీర్యాన్ని ఆమె గర్భకోశంలోకి ఇంజెక్ట్ చేసి గర్భం తెప్పించి, ఒకోసారి అండం, వీర్యాన్ని కలిపి అద్దెకు తీసుకున్న గర్భకోశంలో ప్రవేశపెట్టి, కానుపు అయ్యేదాక ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని పాపో, బాబో పుట్టగానే తీసుకెళ్తారు, అప్పుడప్పుడు తల్లి వచ్చి చూసుకోవచ్చు అని చెబుతారు.  అది కేవలం ఒక బిజినెస్ గా తీసుకునే వారు పెద్దగా పట్టించుకోరు, వారి చదువు, ఉద్యోగంలో పడి పోతారు.  ఇది మన దేశానికి ప్రాకడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.  కొన్ని సినిమాల్లో ఇందులో పెద్ద తప్పేమి లేదని కూడా చూపించడంతో, పేద స్త్రీలు, పిల్లలను బాగా చదివించుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, శరీరంలో భాగాలు అమ్ముకుని కొంతమంది అప్పులు తీర్చుకోవడం, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం ఎలా చేస్తున్నారో అలాగే మాతృత్వాన్ని అదీ ఇద్దరి మనుషులు పిల్లల కోసం సంసారం చేసి కని ప్రేమతో పెంచుకునే ప్రకృతి స్త్రీలకి ప్రసాదించిన వరం.  కేవలం తన ఇష్టంతో, తన కోసం తనకిష్టమయిన జీవితభాగస్వామితో కలిసి కని తన రక్తాన్ని చనుబాలుగా చేసి తాగించి ఎంతో ముద్దు మురిపాలతో పెంచుకునే మాతృత్వాన్ని ఒక వ్యాపారంగా మార్చేసారు.  ఇప్పుడు కుటుంబ గౌరవం, పరువు మర్యాదలు గుర్తు రావటం లేదా?  తమకు తగినట్టు ఆచారాలను మార్చుకోవడం ఈ పురుషాధిక్య సమాజానికి అలవాటే కదా! ఇపుడు అమెరికాలో స్త్రీ పురుషులు ఒంటరిగానే వుంటూ కేవలం పిల్లలను కనడం కోసం వెబ్ సైట్స్ ద్వారా ఒక పార్ట్ నర్ ని ఎన్నుకుని అన్ని చెక్స్ చేయించుకుని అంటే వారి ఆరోగ్య వివరాలు, వారికెలాంటి నేర చరిత్ర లేదని తెలుసుకున్నతర్వాతే కేవలం ఒక పాపో, బాబునో కని వారి పెంపకంలో ఇద్దరూ ఎలా పాలు పంచుకుంటారో అనే విషయాల గురించి ఒప్పందం చేసుకుని పెంచుకుంటున్నారు.  వీరిద్దరి మధ్య ఎలాంటి ఇతర ప్రేమా ఆప్యాయతలు లాంటివి వుండవు.  కానీ బిడ్ద కారణంగా కలిసి వుంటారు.  ఒకవేళ కొన్నాళ్ళయ్యాక తల్లికి మళ్ళీ ఇంకో బిడ్డ కావాలంటే, అతను తనకి ఒక్క బిడ్డే చాలనుకుంటే అ తల్లి మళ్ళీ ఆన్ లైన్ లో ఇంకో క్యాండిడేట్ ని వెతుక్కుంటుంది.  స్త్రీకి పిల్లలు కావాలా, వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వుంది.  సమాజం కోసం ప్రతి స్త్రీ పిల్లల్ని కనాలనే రూల్ ఏమీ లేదు.  అది ఆమె నిర్ణయం, తన భాగస్వామిని ఎన్నుకునే హక్కు, ఆర్ధిక స్వాతంత్ర్యం, సమాజంలో తను ఎలా బ్రతకాలనుకుంటుందో అవి అన్ని ఆమె నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇలా, ఒకో బిడ్డకి, ఒకో తండ్రిని మార్కెట్లో వెతుక్కోవడం మరీ విడ్డూరం అవుతుంది.  పిల్లల్ని పెంచడం ఆర్ధికంగా ఒక్కరే పెంచడం కష్టమవుతుందని, ఇద్దరుంటే బిడ్డ పెంపకపు బాధ్యతలు సమంగా పంచుకుంటామని అగ్రిమెంట్ చేసుకుని పెంచుకోవడం సులువవుతుందని బిడ్డల పెంపకం కోసం ఇద్దరిని కలపడానికి  కొన్ని సంస్థలు, వెబ్ సైట్స్ మొదలయ్యాయి.  మాడర్న్- ఫ్యామిలీ రెండు పదాలు కలిపి మాడామిలీ (Modamily) అని అంటున్నారు ఇలాంటి కుటుంబాలని.  ఏమిటో చదివేస్తే ఉన్న మతి పోయినట్టు రాను రాను అభివృద్ది పేరుతో సంబందాలతో ఆటలాడుకుంటున్నారు. ఏది మంచి మార్పు, ఏది మనుషులను దిగజారుస్తుందో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు మనుషులు.  మనకి ఏది మంచిది, ఏది కాదు అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుందా లేదా ఆలోచించండి.

అర్ధం చేసుకోండిలా

అర్ధం చేసుకోండిలా   - రమ   మన  వాళ్ళని మనం ఎంత బాగా అర్ధం చేసుకుంటున్నామో... వారితో మన అనుబంధం అంత గట్టిగా వుంటుంది. Misunderstandings లో Mis తీసేయ్యాలంటే ఇవి తెలుసుకు తీరాలి. * ప్రతీ చిన్న విషయానికి నవ్వుతుంటే వాళ్ళు చాలా Happy గా ఉన్నారనుకోకండి అసలు నిజం వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారు. * బాగా నిద్రపోతున్నారంటే  ఏ బాధతో విలవిల లాడుతున్నారో అని అర్ధం * ఎంత బాధలోనూ ఏడవని మనుషులని చూసి గట్టి వాళ్ళే అనుకుంటాం, కాని  నిజానికి  వాళ్ళు మానసికంగా బలహీనులు ఏడవటానికి చాలా ధైర్యం కావాలి. * ఎడాపెడా ఏదో ఒకటి తింటుంటే చాలా Tension లో వున్నారని అర్ధం. * ప్రతీ చిన్న విషయానికి కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే వాళ్ళు అమాయకులని చెప్పవచ్చు. * ముక్కు మీదే కోపం ఉన్నట్టు ప్రతీదానికి కోపం వస్తుంటే ఆ వ్యక్తికి కావలసినంత ప్రేమ దొరకటం లేదని అర్ధం. కాస్త అర్ధం చేసుకోండి...

చేయూతనిద్దాం

చేయూతనిద్దాం - ఇల్లిందల పద్మా శ్రీనివాస్ ఏదైనా వైకల్యంతో పిల్లలు పుట్టగానే చాలా మంది తల్లి దండ్రులు వాళ్ళని అనాథలుగా వదిలి వెళ్ళిపోతారు.కాని ఆ పిల్లలకు వైకల్యం లేదు. అలా వదిలి వెళ్ళిన తల్లిదండ్రులే వైకల్యం ఉన్నవాళ్లు.. అలా ఉన్న పిల్లలను ఇంకా ఎంతో  ప్రేమతో తల్లి దండ్రులు పెంచాలి. వాళ్ళకు కూడా ఏదో ఒక విజయాన్ని సాధించాలని వుంటుంది. ఆ విజయ సాధనకు తల్లి దండ్రులే తొలి గురువులు కావాలి.వాళ్ళను బాగా చదివించి వాళ్ళకు నచ్చిన ఏదో ఒక  దారిలో సాగనివ్వాలి. ఎప్పుడూ పొరపాటున కూడా వాళ్ళదగ్గర 'నువ్వు ఇలా పుట్టావు' అన్న మాటలు రానివ్వకూడదు. అంగవైకల్యం ఉన్న వారి దగ్గర తల్లి దండ్రులు కాని వాళ్ళను పెంచే అనాధ ఆశ్రమాలు కాని ఎంతో ప్రేమతో వ్యవహరించాలి.వాళ్ళకు వైకల్యం  గుర్తు రాకుండా వాళ్ళు క్రుంగిపోకుండా అంగవైకల్యం ఉన్న వాళ్ళు సాధించిన విజయాలను గురించి చెప్పాలి. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఏదో ఒక వైకల్యం ఉన్న వాళ్ళను పిల్లలు  కూడా అడుకున్నపుడు ఆటపట్టించి వేధిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లల తల్లితండ్రులు పిల్లలకు చెప్పాలి ఏరోజు అంగవైకల్యం ఉన్నపిల్లలను చిన్న చూపు చూడకూడదని, వాళ్ళను కూడా మీతో కలవనివ్వాలని , ప్రతీ తల్లి దండ్రులు పిల్లలకు చెప్పాలి. అందం కాదు ముఖ్యం వాళ్ళలో ఉన్న ప్రతిభను చూడాలి  వైకల్యం ఉన్నవాళ్ళు కూడా  క్రుంగిపోకుడదు. వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి నలుగురిలో శభాష్ అనిపించుకోమని మీకు ఏమాత్రం తక్కువ కాదు అని తెలియచెప్పాలి. అందం గా ఉన్న ప్రతీ మనిషి అందగాడు  కాదు అందర్ని ఒకేలా చేసే చూసే మంచి మనసున్న వ్యక్తే ఏ అంగవైకల్యం లేనివాడు. ప్లీజ్ వాళ్ళను కూడా మనతో సమానంగా చూద్దాం. చేతనయితే వాళ్ళకు  అండగా వుందాం. సాయం చేద్దాం వాళ్ళను విడిగా మాత్రం చూడొద్దు. మీకు మేమున్నాం అనే భరోసా వాళ్ళకు ఇద్దాం. అల పుట్టడం వాళ్ళు చేసిన తప్పు కాదు ఆ దేవిడి తప్పు .మనం చూస్తున్నాం అంధులుగా  ఉన్నవాళ్లు ఎంతో మంది సంగీతంలో ముందున్నారు. పాటలు పడుతున్నారు ఇంకా ఎన్నో శిఖరాలు అవరోదిస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి చేయూతనిద్దాం. వాళ్ళను కూడా మనతో సమానంగా చూద్దాం..   

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి - స్వప్న కంఠంనేని (ఎలా లవ్వుతాడో తెలుసుకోవాలంటే ఎలా నవ్వుతాడో  చూడాలమ్మాయి ! ) అందమైన అమ్మాయి, కలవారి అమ్మాయి, సంపాదించే స్త్రీ వయ్యారాల వొంపుల కుప్ప, సుతారాల సుందరాంగి ఇలాంటి స్త్రీలను చూసినపుడు పురుషులు ప్రేమలో పడాలనే వెంపర్లటలో  పడతారు. నానారకాల నాటకాలు మొదలెడతారు. అయితే తన చుట్టూ తిరిగే అలాంటి పురుషులలో  తనకు సరిజోడి ఎవరో ఆమె ఎలా తెలుసుకోగలదు. అతను తనను ఉల్లాస పరుస్తాడా,ఉదాసీనత చిత్తుడా, సౌమ్యవంతుడా, డాన్ జాన్ వారసుడా ?మోహిత పరిచే నరసచిత్తుడా లేక బిగుసుకుని ఉండే జడాత్ముడా ? ఈ విషయాన్నీ తెలుసుకోవడం ఎలా ? ఒక మనిషి నవ్వే తీరు, అతని నోటి కండరాల విన్యాసం, పెదాల భంగిమలు, ఇలాంటివన్నీ అతడు సంభాషించే సమయంలో  అతడి గురించి రహస్య సమాచారాన్ని బయట పెడతాయి. అలాంటి వాటిని  కూపీ లాగటం ద్వారా స్త్రీ అతడేలాంటివాడో తనపట్ల అతనికేలాంటి దృక్పథముందో తెలుసుకోవచ్చు. విశాల లాస్యం : ఒక వ్యక్తిలో  మంచి హ్యూమర్ ఉండి అతడు పెదాల్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు లాగి నోరంత తెరచి మనస్పూర్తిగా నవ్వుతుంటే అతనున్న గదంతా  వెలిగిపోతున్నట్లవుతుంది. * తన సంతోషాన్ని ఇతరులకు పంచటానికి సంకోచించని మనిషి  అయి వుంటాడు అతడు. * గారెలోని చిల్లును పట్టించుకోకుండా మిగతా ముక్కవైపు ఆశగా ఆశగా చూసే ఆశావాది అతను. * తన ఆనందాన్ని ఎదుటి వాళ్ళకు కూడా పంచాలనే  తాపత్రయం గల పెద్ద మనిషి.! * అతడి ఎన్నుకునే స్త్రీ తన జీవితాన్ని ఒక నవ్వుల పువ్వుల  పండగగ చేసుకుంటుంది. అయితే ఆమె  కొంచం సెన్సిటివ్ అయితే  ఒకోసారి ఆమెకు అతను  బోరు కూడా కొట్టవచ్చు. అతడిలో అది ఆమె క్షమించ దగ్గ అవలస్కనమే కూడా సీరియస్ సీజరు : కొందరు మోహం మీద ఎప్పుడూ సీరియస్నెస్ చోటుచేసుకుని సదా బిగదీసుకున్నట్లుగా  ఉంటారు. అలాంటి పురుషుడి గురించి స్త్రీ  ప్రారంభంలో తప్పు  అంచనా వేసుకున్నాకాలక్రమాన అతనిలో అసలు రహస్యాన్ని పసిగట్టగలుగుతుంది. * తనలో భావాల్ని ఇతరులకు కనిపించకుండా దాచుకునే పెద్దమనిషి అయి వుంటాడు. * సామాన్యంగా  అతను  తనకు తాను  సంతోషంగా ఉండే పెద్ద మనిషి కాడు. అందుకనే అతనిలో సంబందాలు అతనితో జీవితాన్ని పంచుకునే స్త్రీకి కూడా ఏమంత సంతోషందాయకంగా ఉండవు. పెదిమల్ని పట్టించుకోరూ : నవ్వు చెప్పే రహస్యాలే కాకుండా ఎక్కువ సంధర్బాలలో అతని పెదిమలు అలవాటు పూర్వకంగా సాగే భంగిమలు కూడా అతని  గురించిన రహస్యాలు చెబుతుంటాయి. * ఉదాహరణకు ఒక వ్యక్తి కాకుండా ఎక్కువ తరచుగా తన కింది పెదిమను కోరుకుంటూ ఉంటాడనుకోండి. * అతను నెర్వస్ ఉన్న మనిషి అయి ఉంటాడు. తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పకుండా లోలోపల అణచి పెట్టుకున్నవాడై వుంటాడు. వచ్చేవారం పెదిమలకు సంబందించిన మరికొన్ని వివిధ భంగిలమలను పరిశీలించుదాం .... సశేషం....

Fall Colors in US

  Fall Colors in US   - Kanakadurga   “Autumn is the hardest season. The leaves are all falling, and they're falling like they're falling in love with the ground.” ― Andrea Gibson  As the summer ends the weather slowly in US becomes very pleasant especially in the North East of America. At the end of September the temperatures slowly start dropping. In the summers the temperatures go up to as high as 120 degrees in many places. As September enters it stays mostly in the 80’s to 70 degrees which makes the weather very pleasant. During this time there are some kinds of flowers that bloom like different colors of Azaleas flowers. These flowers bloom 3 times throughout the year- from July to September. They look very beautiful as if the earth was decorated with different colors of these kinds of flowers. It seems like these flowers along with other flowers bloom at this time of the year when the summer is ending and autumn is entering to entertain the people also to make the earth very pretty and give relief to the people from summer high temperatures  At the end of September and as October enters the temperatures drop some more and starts the beautiful nature process – the leaves start changing colors slowly at the end of September and start becoming dark in October. Each tree looks so beautiful and it seems like all of them showing of different colors and making the tree and leaves full of so much beauty as if competing to please the people or the Sun, Moon, and the Earth which are their close friends. Wherever you turn there are different colors like Orange, Pink, Light Yellow color, sometimes when the whole leaves haven’t changed colors to one color at that time down of the tree looks with the changing colors half of the leaf turns pink and the other still green. The ripened leaves at the top looks pink and that tree looks as if someone painted by selecting those colors. Maple trees leaves change dark apple color. Those leaves and the Maple trees with the apple colored leaved look most attractive. Tourists from different places of the country and from other countries travel to the hills, mountains where all the trees from faraway look like the utmost scene of beauty on the earth when they start changing colors to when they all changed colors. Lot of artists come there and stay to get inspiration and try to catch nature’s beauty through their brushes. They may try as hard as they can but still the natural and real and original scene is the most fabulous scene on the earth.  The reason why the leaves turn colors and fall off is as the temperatures slowly fall down the heat in the sun rays becomes less and photosynthesis, which is so important for the leaves, doesn’t happen during that time. The leaves always have all these colors but chlorophyll covers them and the leaves look green. Chlorophyll, which gives green color to the leaves, goes away as the days become shorter and dry, so the plants do not make food. That’s why the leaves change the colors and then they fall off the trees to get ready to face the hard and long winter! If you want to know why Maple trees change its colors to apple colors there is a reason to it. It has pigment known as Anthocyanin which is present in apples, cranberries, cherries, etc. This pigment makes the Maple leaves turn bright red like apples. The tree looks very beautiful. This pigment is present mostly in New England and Canadian Maple trees. The fall season, changing of colors starts in September and most of the leaves fall off by the end of November and official winter starts from 22nd December.  When the leaves fall off people rake them and kids love to jump and play in them. It’s so much fun to watch and play too. The fall season looks as if lot of painters from above painted each leaf and tree to make it a colorful world for a couple of months. It makes us wonder about all the fabulous colors of autumn. If the spring season is all about colorful and beautiful flower blooms, then the fall season is all about the changing colors of leaves. Enjoy the Fall Season in US looking at the pictures. “I loved autumn, the one season of the year that God seemed to have put there just for the beauty of it.” ― Lee Maynard      

చూపులు కలపని శుభమనిషి

చూపులు కలపని శుభమనిషి - స్వప్న కంఠంనేని చూపులు కలపని శుభమనిషి : అమ్మాడు, నువ్వు ప్రేమిస్తున్న నీతో మాట్లాడుతున్నపుడు నీ కళ్ళలోకి కాకుండా ఎంతసేపూ నీ భుజాలు,నీ చుబుకం, నీ  మెడ, నీ నుదురు .... ఇలా వేరే అవయవాల   వేపు చూస్తున్నాడనుకో  అప్పుడేమనుకుంటావ్ * అతగాడు తప్పనిసరి గా నీ గురించిఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనిషి కొంచం సిగ్గరి కావచ్చు.స్వయంస్పృహ కలవాడు కావచ్చు. *  ఇలాంటి కుర్రవాణ్ణి కనుక నువ్వు వలలో వేసుకుని అతడిలో  ఆత్మవిశ్వాసం రాజుకునేటట్లు చేయగలిగావంటే అదృష్టవంతురాలివే. సుఖపడిపోతావ్. అయితే తరచుగా అతణ్ణి నువ్వు వెన్ను తట్టి అతడిలో ఆత్మస్థయిర్యాన్ని మేల్కొలుపు తుండాలన్న సంగతిని మర్చిపోవద్దు. దిక్కులు చూసే రామయ్య ! : ఒక మనిషి కళ్ళు చికిలించి చంచలంగా అటూ ఇటూ చూస్తుంటే అతన్ని నెర్వస్ మనిషిగా, సందేహలరావుగా (లేక డౌటేశ్వరరావుగా ) అనుకోవాలి. * బహుశా అతనికి జీవితం నేర్పిన పాఠాలు ఎవర్ని నమ్మవద్దని చెప్పి వుంటాయి. ప్రియురాలు గానో భార్యగానో ఎప్పుడూ నిన్ను ఒక కంట కనిపెట్టుకుని ఉంటాదతను.మీ  మధ్య సంబంధం ఏమంత సజావుగా ఉండే అవకాశం లేదు. కన్నుగోట్టే సోగ్గాడు: * మరొక మరిడేశ్వరరావుంటాడు. ప్రారంభం నుంచీ నితో చలాకీగా కులాసాగా కబుర్లు చెపుతుంటాడు.సండుచుసుకుని కన్నుకొట్టి ' నువ్వంటే నాకసక్తి 'అన్న విషయాన్ని దాపరికం లేకుండా తెలియజేస్తుంటాడు. * అతనితో పరిచయం పాకనపడ్డ కొద్ది అతని కన్నుకొట్టే  రహస్యమేమిటో నీకు తెలిసి వస్తుంది. బహుశ అతను ఆడవాళ్ళను వలలో వేసుకునే వేణు గోపాల స్వాముడన్నా అయి ఉండాలి. * లేక నీతో మాట్లాడున్నపుడు నెర్వస్ నెస్ ని ఫీల్ అయి ఆ గాభరాలో గార్దభరావులా  అతనికి తెలియకుండానే అతని కన్ను అలాకొట్టుకుంటునన్నా ఉండాలి. కనుబొమలు : కళ్ళలాగే కనుబొమలు కూడా  అనేక సందర్భాలలో మన మనసులోపలి భావాలను తెలియజేస్తాయి. ఒక మనిషి కనుబొమలు ముడి పడ్డాయంటే అతను బాధ్యతా యుతమైన ఏవో ఆలోచనలలో ఉన్నాడని అనుకోవాలి. * ముఖ లక్షణలో కనుబొమలు ముడిపడి ఉండటం ఒక భాగామయినపుడు -  అంటే అతడి కనుబొమలు హమేషా ముడిపడిన భంగిమలో ఉంటే - అతడు తాను పెళ్లాడబోయే లేక ప్రేమించబోయే స్త్రీని చాలా జాగ్రత్తగా ఎన్నుకునే వాడై ఉంటాడు. నిశితంగా, విశ్లేషణాత్మకంగా ఆమెను, పరిశీలిస్తుంటాడు. అతను రిలాక్స్ అయి ఉండే సందర్భాలు తక్కువ కాబట్టి అతనితో ఆమెకాపురం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. * అయితే అతనామెకు , ఆమెతో సంబంధానికి కట్టుబడి ఉంటాదనేది ఆశావహమైన విషయం. * కనుబొమలు పైకి లేచి ఉండే పెద్దమనిషి గొప్ప ఆశావాది. ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ విడ్డురంగా (వండర్ మే థండర్ అన్నట్లుగా) వీక్షిస్తుంటాడు. ఇతరులలో మంచి గుణాల్ని మెచ్చుకుంటాడు. కొత్త విషయాల్ని తెలుసుకోవాలనే తపనలో ఉంటాడు. * ఎక్కువసేపు అతనలా కనుబొమలు పైకిలేపి ఉంచి నీవేపు చూస్తున్నాడంటే అతను నీ సౌదర్యం, తెలివి తేటల పట్ల మెచ్చుకోలుగా చుస్తున్నడనీ, తన ఆ మేచ్చుకోలుతనన్నీ నీకు తెలియజేయాలని  చూస్తున్నాడని అనుకోవచ్చు. * ఒక  కనుబోమనుమాత్రమే పైకి లేపి చూసే మహానుభావుడు కాస్త మిస్ చీవియస్ మనిషనీ, దేనినీ,- ఆఖరికి స్త్రీ పురుష సంబంధాలని కూడా నమ్మడని అర్ధం చేసుకోవాలి. దేనిని నమ్మని నిశిత పరిశీలకుడతను. * నీకతని వేడి వేడి చేదు భావాలూ వినోదాన్ని కలిగిస్తే బహుశ నీకతను ' విట్టీ' గా 'చామింగ్' గా కనిపించవచ్చు.

కళ్ళు చెప్పే కథలు

కళ్ళు చెప్పే కథలు - స్వప్న కంఠంనేని మొదటగా ఒక మనిషి గురించి అతని కళ్ళెం చెబుతాయో చూద్దామా! * కళ్ళు హృదయాన్ని ప్రతిబింబిస్తాయని అనాది నుంచి ఒక అభిప్రాయం వాడుకలో వుంది.నిజమే కూడా ! ఏ మనిషి గురించి అయినా గానీ అతని కళ్ళు ఎక్కువ రహస్యాల్ని చెబుతాయి. * ఇద్దరు వ్యక్తులు ఎదురు బొదురుగా  ఉన్నపుడు మాటల ద్వారా కంటే చూపులు ద్వారా ఎక్కువ భావాల్నిమార్పిడి చేసుకుంటారు. కళ్ళు బాహ్య ప్రపంచానికి ముఖద్వారాలే కాక మన అంతర్ ప్రపంచానికి రాజమార్గాలు కూడా! * కాబట్టి లతాంగీ, నీ పురుషుడి అంతరంగంలో ఏమి దాగి ఉందో తెలుసుకోవడానికి  మొదటగా అతని కళ్ళను చదువు ! * అతని కళ్ళలో నీ పట్ల ఆసక్తి ఉందా, నిర్లక్ష్యం ఉందా? కోపం పొరలు పోతుందా ? మానవత్వం దాగి ఉందా , అద్భుత భావం  పొదిగి ఉందా ? * ఈ సందర్భంలో  నీకు వాసంతి తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏమని వాపోతుందో తెలియజేస్తాను. ఆమె అంటుంది కదా : " ప్రకాష్ సంగతి నాకేం అంతుపట్టడం లేదు అతను నావైపే ఆర్తిగా ప్రేమగా చూస్తాడు, అంతవరకు బాగానే వుంది. గాని నేను మాట్లాడుతున్నపుడు మాత్రం అతను ధ్యాస వుంచి వినటం లేదేమో అని అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నపుడు అతను ఎంతసేపు గదిలో ఆ మూలకి ఈ మూలకి అవతల కదులుతున్న మనుష్యుల వైపు చూస్తుంటాడు. ఎప్పుడో  ఒకసారి నా కళ్ళలోకి నేరుగా చూస్తాడు గాని అది ఒక్క క్షణం మాత్రమే. ఎక్కువ సమయాలలో అతను నామీద కంటే నా చుట్టుపక్కల ఉండే పరిసరాల మీద, ఇతర మనుష్యుల మీదా ఎక్కువ ధ్యాస ఉంచుతున్నాడేమో ననిపిస్తుంది.అది నిజమేనా లేక కేవలం నా అనుమానమేనంటారా ? * పాపం అతని పట్ల అంత మక్కువను పెంచుకున్న వాసంతికి ఏమని చెప్పాలి ? * మాటిమాటికి ఆమె నుంచి చూపుల్ని తప్పించి చుట్టుపక్కలకు  చూడటం ద్వారా అతను ఆమెపట్ల తనకు నిజమైన ఆశక్తి లేదని స్పష్టంగా  తెలియజేస్తున్నాడు. అతని నుంచి ఆమె ముందే జాగ్రత్త పడటం మంచిది. అదే చెప్పాను. * మరికొన్ని విషయాలు తెలియజెప్పాక ఆమె నిజంగానే జాగ్రత్తపడి మరో యువకుణ్ణి పెళ్ళాడి ఇప్పుడు సుఖంగా కాపురం చేసుకుంటుంది.   చూపుల్తో చూపులు కలిపే చిన్నోడు : * ఒక యువతి తనతో సంభాషిస్తున్నపుడు నేరుగా ఆమె కళ్ళలోకి చూసే యువకుడు ఆమె పట్ల నిజమైన ఆసక్తి కలిగి వున్నవడై ఉంటాడు. * తన భావాల్ని , ఉద్వేగాల్ని ఆత్మీయంగా ఆమెకు చెప్పి మళ్ళీ ఆమె నుంచి వాటిని అందుకోవాలని చూస్తాడు. నటన ఏమి లేకుండా నిజాయితీగా, కనీసం ఒక క్షణం అయినా గానీ తానామె పట్ల ఆకర్షితుడై ఉన్నట్లు తెలియజేస్తాడు.   అనిమేషుడు : * మరొక యువకుడుంటాడు, తాను ప్రేమించే యువతీ వేపు రెప్పలార్చకుండా చూస్తుంటాడు. మరి అతని మాట ? * తీరికగా ప్రశాంతంగా కళ్ళలోకి చూసే మనిషికీ రెప్పలార్చకుండా సూటిగా కళ్ళలోకి చూసే మనిషికీ తేడా ఉంటుంది. * రెప్పలార్చకుండా సూటిగా కళ్ళలోకి చూసే మనిషి మనల్ని శల్యపరీక్ష చేస్తున్నట్లుగా అనిపించి అనీజీగా ఫీలవుతాము! మనలో కలిగేఆ అనీజీ వాస్తవబద్దమైనదే కూడా! * తను ప్రేమించే అమ్మాయిని అలాంటి అనీజీకి గురిచేసే పెద్దమనిషిని ఏమనాలి ?! * వన్ వే ట్రాఫిక్ మహాశయుడు ! * అతడు తన గుచించి ఏమీ తెలియజేసయడు గాని అవతలివాళ్ళ రహస్యాలను మాత్రం తెలుసుకోవాలని చూస్తాడు! ఒకవేళ ఆ అమ్మాయి అతనిలోని మిగితావిషయాలు నచ్చి అతణ్ణి పెళ్లి చేసుకుందంటే  త్వరలోనే ఆమె అతడు ఏ కెజిబి లోనో, ఏ సిఐఏ లోనో ఉండాల్సిన మానవుడని అనేక విధాలుగాఅతడు తనకు ' చిక్కడు దొరకడు' అనీ అర్ధం చేసుకుంటుంది.    (సశేషం)  

చూపుల భాష్యం

చూపుల భాష్యం - స్వప్న కంఠంనేని    ప్రేమిస్తున్నానని నీ కళ్ళలోకి సూటిగా చూస్తాడా ? లేడి కళ్ళ కూనా, వలపులో  పడ్డావా పాపం ! ప్రిన్స్ చామింగ్ కనిపించాడా నీకు ? అతనేలాంటివాడో సరసుడో విరసుడో వలపు బాణం వదలాలో వద్దో టక్కరివాడో టక్కులమారాల వాడో- ఆ బాణాన్ని తిరిగి నీకే వదిలి నిన్ను బోల్తా కొట్టించాడు కదా !? అని సందేహ పడుతున్నావా పాపం ! సతమతమవుతున్నావా పాపా ? వేత చెందకు బేబి! కలలో కూడా నిన్ను కలవరపరుస్తున్న ఆ నలకూబరున్నీ స్టడి చేయడానికి నీకు కొన్ని సూత్రాలు చెబుతాను... మొహం నిండా నగ్న సత్యాలే!   అందమనేది చర్మంలోతు మాత్రమేనంటారు విజ్ఞులు. కానీ ఆ చర్మం మీద ముఖ్యంగా మొహపు చర్మం మీద ఏర్పరిచిన ముద్రలు ఆ వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజెప్పుతాయని చాలామందికి తెలియదు.పుట్టినప్పుడు పాపాయి మొహం అమాయకంగా పసిగా ఏ భావాలూ లేని నైర్మల్యంతో ఉంటుంది. కానీ వయసు గడిచిన కొద్ది ఆ మొహం మీద కొన్ని ముద్రలు ఏర్పడతాయి.ముఖ్యం గా టీనేజ్ ప్రారంభం నుండి యవ్వన పరిపూర్ణత సిద్ధించే దాకా ఉండే మధ్య కాలంలో.  అంటే సుమారు పదమూడు నుంచి ఇరవైఒకటి సంవత్సరాల మనలో ఉద్వేగాలు మన ముఖకండరాలు రేఖల్లో మార్పులు తీసుకువచ్చి మన మొహపు రూపురేఖల్లో( వీటిని ఫీచర్స్ అంటాము) శాస్వత ముద్రలు ఏర్పరుస్తాయి.రూపురేఖలే మన గత జీవితానికి ' మ్యాప్' లాగాను,భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ తో గాను ఉంటాయి. మీరు ఒక మనిషి కళ్ళలోకి చూడండి. అతని పెదిమలు తిప్పే వంపుల్ని చూడండి నుదురు మీద పడ్డ గీతల్ని చూడండినవ్వే తీరును గమనించండి- అవి  అతడి మనస్తత్వం గురించి,ఆ సమయాన అతడి దృక్పధం గురించి  ఎంతో కొంత రహస్యాలు తెలియజెప్పకమానవ్ ! కాబట్టి బేబి, నువ్వు ఆకర్షణకు లోనవుతున్న, నువ్వు ప్రేమలో పడబోతున్న యువకుడి మొహాన్ని మొదట జాగ్రత్తగా గమనించు. గమనించి,అతడి  ముఖ భంగిమలు వ్యక్తీకరించే లక్షణాలను చదవడానికి ప్రయత్నించు. * అతడు కళ్ళు విప్పార్చిచూస్తాడా,చూస్తాడా ? * అతడు నేరుగా నీ కళ్ళలోకి చూస్తాడా లేక నీ చూపును తప్పించాలని చూస్తాడా * అతడు మాట్లాడకుండా ఉన్నపుడు అతని పెదాలు గట్టిగా బిగుసుకుని ఉంటాయా లేక కొద్దిగా తెరుచుకుని ఉంటాయా ? * అతని పెదిమల కొనలు పైకి తిరిగి ఉంటాయా లేక కిందికి వాలి ఉంటాయా * అతని నోటి చుట్టూ నవ్వు గీతలు కనిపిస్తాయా లేక నుదుటి మీద కోపం గీతలు కనిపిస్తాయా? * అతను పెద్దగా నోరు తెరచి నవ్వుతాడా లేక స్వల్పంగా పెదాల్ని కదల్చి నవ్వుతాడా? * అతను నీతో మాట్లాడుతున్నపుడు అప్పుడప్పుడు మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటాడా ? అంటే మొహం తుడుచుకున్నట్లుగా...

ప్రేమలో పడే అమ్మాయిలకు కొన్ని జాగ్రత్తలు

ప్రేమలో పడే అమ్మాయిలకు కొన్ని జాగ్రత్తలు  - స్వప్న కంఠంనేని ఒక యువకుడు  తటస్థించి క్రమంగా తనాతని వైపు ఆకర్షించబడుతున్నప్పుడు ప్రతి యువతీ విధిగా ఈ క్రింది అయిదు ప్రశ్నలనూ వేసుకుని తననితాను శోధించుకోవాల్సిన అవసరం వుంది. * అతను తొలి చూపులోనే ఆకట్టుకుంటున్నాడ అయితే అదంతా నిజమేనా అందులో  నాటకమేమి లేదు కదా !? . ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ప్రేమ తొలి దశలో ఉన్నపుడు ఏ మనిషైన అవతలి మనిషిని ఆకట్టుకోవడానికి సర్వశోభాయమనుడిగా కనిపించటానికి ప్రయత్నిస్తాడు. తనలోని లోపాలను  కప్పెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తాడు. . ప్రతీదానికి తల వూపుతున్నట్లు కనిపిచేవాడు వాస్తవంలో మిమ్మల్ని నమ్మించడానికి మాత్రమే అలా నటిస్తుండవచ్చు. . ఉదాహరణకు అతడు బేరార్ కి టిప్పు ఎలా ఇస్తున్నాడు.కరచాలనం ఎలా చేస్తున్నాడు, వీధిని ఎలా దాటుతున్నాడు. లాంటి వాటిని అబ్జర్వ్ చేయద ద్వారా అతడిలోని కొంగ జపాన్ని అర్ధం చేసుకోవచ్చు. * నిజంగా  అతడు మీతో బంధాన్ని కోరుకుంటున్నాడా ? . కొందరు పురుషులు ఆడవాళ్ళతో తాత్కాలిక సంబంధాలకే ఇచ్చగిస్తారు.గానీ శాశ్వత అనుబందం ఏర్పరచుకోవాల్సి  వచ్చేసరికి ఉలిక్కిపడతారు. అందుకే ప్రేమ ప్రారంభ దశలో "నువ్వు లేకుండా నేను బ్రతకలేను" ప్రియురాలికి తన మూలంగా గర్భం వచ్చిందని తెలియగానే మొహం చాటేస్తాడు. . క్రమంగా ఆమెను కలుసుకోవటం తగ్గించటం, లేనిపోని గొడవలు పెట్టుకోవడం. ఆమెనుంచి  అర్ధంపర్ధం లేని డిమాండ్లు చేయడం మొదలెడతాడు దీనికి  అర్ధం ఇక ఆమెతో తెగతెంపులు చేసుకోవడానికే. * అతడు మీతో శాశ్వత సంబంధాన్ని కోరుకుంటున్నాడో తాత్కాలిక  కోర్కెల్ని తీర్చుకోవడానికే చూస్తున్నాడో తెల్సుకోవడం ఎలా ? . అతడి పూర్వపు సంబందలేమిటి, అతని ఉద్యోగ చరిత్ర ఏమిటి,అతని గది అలంకరణ ఎలా ఉంది. లాంటి వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. * ఎమోషనల్ గా అతను మీకు చేయూతనిస్తాడా లేదా ? . నిజమైన ప్రేమలో ఉన్న పురుషుడెప్పుడు తన స్త్రీ విజయాన్ని కాంక్షిస్తాడు. ఎమోషనల్ గా ఆమెకు చేయుతనందివడానికి ప్రయత్నిస్తాడు. . ప్రియురాలి ఆశయాలు ,లక్ష్యాలు కూడా తన ఆశయాలు ,లక్ష్యాలంత ప్రాముఖ్యత గలవనీ తమ మధ్య ఎమోషనల్ గా ఆరోగ్యవంతమైన సంబందాలుండాలనీ భావిస్తాడు. * అతడు ఎమోషనల్ గా చేయూతనిచ్చే మనిషి అవునో కాదో తెలుసుకోవడం ఎట్లా ? . సాయంత్రం మీరేదన్నా ప్రోగ్రాం పెట్టుకున్నపుడు దానిని నిర్ణయించే విషయంలో  మీ అభిప్రాయానికి విలువ ఇస్తాడో లేదో, లేక మీరేదన్నా విషయమై సలహా అడిగినపుడు అతను ఎలా స్పందిస్తాడో  మొదలైన వతి ద్వారా తెలుసుకోవచ్చు. * స్త్రీలో అతను ఏమి కోరుకుంటున్నాడు. . తిరస్కరించబడతామేమోనన్నభయంలో పురుషులు ప్రేమ ప్రారంభ దశలో తమ అసలు అభిప్రాయాన్ని కాక ప్రియురాలికి ఇష్టమైన అభిప్రాయాలనీ వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తారు. . ప్రియురాలితో తాను స్వతంత్ర అభిప్రాయాలూ గల ఆధునిక యువతిని ఇష్టపడతానని చెప్పవచ్చు  కానీ లోలోపల సంప్రదాయబద్దమైన  యువతిని కోరుకోవచ్చు.  * మొత్తం మీద అతను మిమ్మల్ని నిరాశపరచడు కదా ? ఏ స్త్రీ అయినా తన ప్రేమ విజయవంతమై అంతిమాన ప్రియుడు తనను వివాహమాడాలని కోరుకుంటుంది. ప్రేమ వివాహానికి దారితీయకపోవదానికంటే దారుణమైన నిరాశ స్త్రీ కో మరొకటి వుండదు. సో... ప్రేమలో పడబోయే అమ్మాయిలు, హృదయాన్నే పారేసుకో బోయే యువతులు తమ జాగ్రత్తలో తాముండటం కోసం - తాము కోరుకుంటున్న పురుషుడు గోవా,సాధువా,గొంటనక్కో, గర్జించే పులో తెలుసుకోవడానికి పనికి వచ్చె ఈ అంశాలు మీ మా పాఠకుల కోసం...  

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికీ అలాగే తెలుగుని విస్మరించే పతీ ఒక్కరికీ తెలుగు బాష దినోత్సవ శుభాకాంక్షలు! కన్నతల్లి లాంటి తెలుగు బాష ని మరువకండి..... తెలుగు మాట్లాడండి మీ పక్క ఉన్న వాళ్ళతో మాట్లాడించండి దేశ బాషలందు తెలుగు లెస్స అన్నారు రాయల వారు తెలుగు మాట్లాడమే పాపం అంటున్నది నేటి మన సమాజం తెలుగు బాషకి మనం గుర్తింపు తీసుకురాక పోయిన పర్వాలేదు కానీ మర్చిపోయేలా మటుకు చేయకండి పరాయి రాష్ట్రాల వారు బాష పై మమకారంతో యుద్దాలు చేస్తున్నారు కానీ మనం కనీసం మాట్లాడడం కూడా చేయడం లేదు...... ఒక బడిలో తెలుగులో మాట్లాడితే టీచర్ ఆ విద్యార్ధిని ఎండలో నిలబెట్టింది రోజంతా ***     12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.     అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష.     పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది     క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది.     క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.     బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది.     ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు.     కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి     తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. తెలుగువారు అయినందుకు గర్వపడండి....తెలుగువారిగా పుట్టినందుకు సంతోషపడండి.. తెలుగు భాష ఉనికి కోసం పాటుపడండి..తెలుగు భాషావ్యాప్తికి కృషి చెయ్యండి"..!!  

అమెరికాలో ఆనందోత్సోహాలతో జరుపుకున్నఅమెరికా స్వాతంత్ర్యదినోత్సవం

 అమెరికాలో ఆనందోత్సోహాలతో జరుపుకున్నఅమెరికా స్వాతంత్ర్యదినోత్సవం - కనకదుర్గ         "హ్యాపీ జులై 4th," అని ఒకరికొకరు చెప్పుకుంటూ, " హ్యాపీ బర్త్ డే అమెరికా," అంటూ సంతోషంగా అందరూ సాయంత్రం పూట వారి వారి కమ్యూనిటీ ఏరియాలలో 'ఫైర్ వర్క్స్,"  చేసుకుంటూ చాలా సరదాగా గడుపుతారు.  ఈ రోజున అమెరికా కొత్త దేశంగా అవతరించిందని అందుకే దేశానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.  ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి అన్నీ దేశాల వారు, జాతుల వారు కుటుంబాలతో, స్నేహితులతో కలిసి వస్తారు.  జులై 4న దేశమంతా సెలవు దినం, ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పెరేడ్లు, మ్యూజికల్ కాన్ సర్ట్స్, బార్బెక్యూలు, పిక్ నిక్ లు, కుటుంబ సభ్యులు, బంధువులు దేశంలో వివిధ ప్రదేశాల్లో వున్న వారంతా అనుకుని జులై 4, గురువారం అయితే, శుక్రవారం సెలవు తీసుకుని లాంగ్ వీకెండ్ లా చేసుకుని అందరూ కలిసి బీచ్ లకి వెళ్ళడమో, ఏదైనా చూడని కొత్త ప్రదేశానికి వెళ్ళడమో చేస్తారు.  బేస్ బాల్, క్రికెట్ లాగే ఇక్కడ ఈ ఆటకి బాగా క్రేజ్ వుంది, ఈ గేమ్స్ చాలా చోట్ల ఆడతారు.  సరదాగా ఈ గేమ్స్ చూడడానికి కూడా వెళతారు.  అసలు ఈ జులై 4కి ఎందుకింత ప్రత్యేకత? అందరూ స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకున్నట్టే వారు జరుపుకుంటారు గొప్పేంటి అనుకోవచ్చు.        అమెరికాలో వున్న బ్రిటిషర్స్, ఇతర దేశస్థులపై బ్రిటిషర్స్ పెత్తనం, బ్రిటిష్ రాజు ఆధిపత్యం వద్దని పోరాటం జరుగుతున్న సమయంలో జులై నాలుగున 'అమెరికా దేశం బ్రిటీష్ దేశాధిపత్యం నుండి విముక్తి చెందిందని, 1776, జులై 4న ప్రకటించిన రోజు.'  'డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్' అని అంటారు.  కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం ఓటు చేసాక, ఆ స్వాతంత్ర్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకుని, థామస్ జెఫర్సన్ ఒక కమిటీ మెంబర్ గా అయిదుగురు వున్న కమిటీ ఆ నిర్ణయాన్ని అందరికీ వివరించడానికి ఒక స్టేట్మైంట్ తయారు చేసారు.  ఆ రోజు నుండి అమెరికన్లు జులై 4న స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  1777 సంవత్సరంలో 13 సార్లు గన్ షాట్స్, పొద్దున, సాయంత్రం సెల్యూట్ చేస్తూ కాల్చి, రోడ్ ఐలాండ్ లో స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకున్నారు.  ఫిలడెల్ఫియాలో ఏడాది వార్షికోత్సవాన్ని చాలా మాడరన్ గా జరుపుకున్నారు.  కాంటినెంటల్ కాంగ్రెస్ కి డిన్నర్, టోస్ట్స్,  13 సార్లు సెల్యూట్ గన్ షాట్స్, స్పీచ్ లిచ్చి, ప్రార్ధనలు చేసి, పరేడ్లు, మ్యూజిక్, చిట్ట చివరన సూర్యుడస్తమించాక పెద్ద మైదానంలో ఫైర్ వర్క్స్ తో పండగలాగా జరుపుకున్నారు, షిప్స్ కి బ్లూ, ఎరుపు, తెలుపు, జెండా రంగులతో డెకరేట్ చేసారు. అప్పటినుంచి చాలా వరకు అలాగే జరుపుకుంటూ వస్తున్నారు. జులై 4 వస్తుందంటే ఇళ్ళ ముందర, షాప్స్, ఆఫీసులు, హాస్పిటల్స్, ఇలా ప్రతి చోట అమెరికా జెండాలు పెట్టుకుంటారు.  పిల్లలు, పెద్దవాళ్ళూ, అందరూ, జెండా రంగులతో వున్న బట్టలు వేసుకుంటారు.  జులై నాలుగు ఒక వేళ ఆదివారం వస్తే మర్నాడు సెలవు ఇస్తారు.  పొద్దున పూట పరేడ్లు చేసుకుంటారు, సాయంత్రం చిన్న చిన్న ప్రదేశాల్లో కమ్యూనిటీ మైదానాల్లో ఆ చుట్టు ప్రక్కల వారంతా చేరి ఫైర్ వర్క్స్ చేసుకుంటారు.  ఫైర్ వర్క్స్ చూడడానికి దుప్పట్లు, క్యారి ఆన్ కుర్చీలు తీసుకెళతారు.  దుప్పట్లు పరుచుకుని పాటలు పాడుకుంటూ, చిన్న పిల్లలు పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంటారు.  పెద్దవాళ్ళు కూడా పిల్లలతోపాటూ కలిసి పిల్లల్లా ఆడుకుంటూ సూర్యాస్తమయం అయ్యేదాకా సరదాగా గడుపుతారు.   అక్కడే ఫైర్ వర్క్స్ కి ముందు ఆర్కెస్ట్రాలతో మ్యూజిక్ కాన్ సర్ట్స్ చేస్తారు.  పెద్ద పెద్ద సిటీలల్లో, పేరున్న బ్యాండ్స్ ని, గాయనీ గాయకులను పిలిపించి కాన్ సర్ట్స్ ముఖ్యమైన, చారిత్రాత్మకమైన ప్రదేశాల్లో పెట్టుకుంటారు.  లక్షలమంది వస్తారు ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్, ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసే ఫైర్ వర్క్స్ చూడడానికి.  పూర్తిగా చీకటి పడ్డాకే చేస్తారు.  అన్ని షాప్స్ లో, మాల్స్ లో, కార్ల పై ఇలా ప్రతి ఒక్క దాని పై జులై 4 సేల్స్, డిస్కౌంట్స్ వుంటాయి.  చాలా మంది కాకర పూవొత్తులు, చిన్న చిన్న టపాసులు కొని ఇంటి దగ్గర కాల్చుకునే వారు కాల్చుకుంటారు, లేకపోతే కొంతమంది ఫైర్ వర్క్స్ జరిగే దగ్గరకి తీసుకెళ్ళి పిల్లలతో కలిసి కాలుస్తారు, పిల్లలు కాలుస్తుంటే సంతోషిస్తారు.        ఫిలడెల్ఫియాలో జులై 4న జరిగే సంబరాలు చూడడానికి ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల టూరిస్ట్స్ ఈ సమయానికే ఇక్కడ వుండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఫిలడెల్ఫియాలో జరిగే సంబరాలు ఆర్ట్ మ్యూజియమ్ దగ్గర జరుగుతాయి.  ఆర్ట్ మ్యూజియమ్ "రాకీ,"(Rocky)సినిమాలో సిల్వస్టర్ స్టాలోన్  ఆర్ట్ మ్యూజియమ్ మెట్ల పై పరిగెత్తుతూ ప్రాక్టీస్ చేసే సీన్ చాలా పాపులర్ అయ్యింది.  ఇప్పటికి చాలామంది అలాగే మెట్లపైన పోటీలు పెట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఫైర్ వర్క్స్ ఆర్ట్ మ్యూజియమ్ దగ్గర చేస్తే చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది.  బెన్ ఫ్రాంక్లిన్ పార్క్ వే నుండి ఆర్ట్ మ్యూజియమ్ వరకు జనాలు ఇసక వేస్తే రాలనంత నిండి పోతారు. బెన్ ప్రాంక్లిన్ వేలో కాన్సర్ట్ జరుగుతుంది.  ఈ సారి కాన్సర్ట్ చేయడానికి ఇక్కడ బాగా పాపులర్ అయిన రూట్స్ బ్యాండ్, జాన్ మేయర్, గాయకుడు, నియో అనే ఈ మధ్యనే మరో కొత్త ఆల్బమ్ రిలీజ్ చేసి అది బాగా హిట్ అయిన కళాకారుడు, మరి కొంతమంది కళాకరులు వచ్చారు.  వారి కాన్సర్ట్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, జనాలని కూడా కలుపుకుంటూ, వారితో పాటలు పాడిస్తూ, డ్యాన్స్ చేయిస్తూ సరదాగా జరిగింది.  ఫైర్ వర్క్స్ మాత్రం ఆర్ట్ మ్యూజియమ్ వెనక భాగం పైన జరుగుతాయి.  ఎక్కడ నుండి చూసినా పైన జరుగుతాయి కాబట్టి చాలాదూరంవరకు స్ఫష్టంగా కనిపిస్తాయి.  ఫైర్ వర్క్స్ జరిగేపుడు పాపులర్ ఆల్బమ్స్ నుండి పాటలు, మ్యూజిక్ వేస్తూ చేస్తారు.  వినడానికి వీనులవిందుగా, చూడడానికి కనులపండువుగా వుంటుంది. ఆ రోజంతా భారతీయులకి దీపావళి పండగ గుర్తొస్తుంది. కొంతమంది భారతీయులు ఇప్పుడు మాత్రమే దొరికే టపాసులు కొని పెట్టుకుని దీపావళి పండగకి ఇంటిదగ్గర దీపాలు పెట్టుకుని స్నేహితులు, బంధువులుంటే అందరూ కల్సి కాల్చుకుంటారు.   అమెరికా అంటే ఎన్నో దేశాల వారు కలిసిన దేశం.  అమెరికన్లు,భారతీయులు, జర్మన్లు, ప్రెంచ్ వారు, చైనీస్, జపానీస్, ఆఫ్రికన్ దేశాల వారు ఇలా ఎన్నో దేశాల వారు కలిసిన దేశం.  జులై 4న, స్వాతంత్ర్యదినాన ఏ తేడాలు లేకుండా జాతి, మత, దేశీయ తేడాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా, ఉల్లాసంగా, దేశభక్తిని తెలియజేసుకుంటూ స్వాతంత్ర్య సంబరాలు ఆనందంగా జరుపుకుంటారు.

సంథింగ్ సంథింగ్

సంథింగ్ సంథింగ్     త్రినాద్   నేను ఈ మద్య హాల్లో చూసిన సినిమాలు చాలా తక్కువే అది కూడా ఎప్పుడైనా మా అత్తగారి వూరు వెళ్ళేటప్పుడు . బోర్ కొడితే సినిమాకు వెళ్ళాలి అనిపించినపుడు . ఆ మద్య ఒక ఆదివారం వెళ్ళాము అది ఒక చిన్న పట్టణం . సాయంత్రం అయ్యే వేళ మరీ బోర్ కొడుతుంటే వెంటనే సినిమాకి బయలుదేరాను . మావాడు వెంటనే నేను కూడా వస్తాను అన్నాడు వెంటనే ఇంకో తోక... మా అమ్మాయి కూడా నేను వస్తాను అంది నా శ్రీమతి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడే అవకాశం పోతుందని నేను రాను అంది ముగ్గురం జోరుగా హుషారుగా బయలుదేరాము.    కొంత దూరం నడిచాకా ఒక హాల్ కనపడింది అందులో " ప్రేమ కథా చిత్రం " నడుస్తుంది . వెళదామా అంటే మా అమ్మాయి ససిమేరా ఒప్పుకోలేదు ఎందుకమ్మా అంటే హీరో సుదీర్ మహేష్ బాబు బావ కాబట్టి నేను రాను అంది. " మొగుడు కొట్టాడని కాదు తోటికోడలు నవ్విందని " అన్నట్లు మహేష్ బాబు సుదీర్ బావ అయినందుకు కాదు మహేష్ బాబు మావాడి అభిమాన హీరో అయినందుకు. అందులోను మా అమ్మాయి ప్రభాస్ అభిమాని . మా బుడ్డోడు వెళ్దామని మా అమ్మాయి వద్దని మద్యలో నేను నలిగిపోయాను , నడవగా నడవగా ఇంకో హాల్ వచ్చింది అందులో "ఇద్దరమ్మాయిలు " నడుస్తుంది. మా అమ్మాయి వెళ్దాము అంది, ఎటొచ్చి ప్రభాస్ సినిమా లేదు కాబట్టి వెళ్దాము అంది , నేను వద్దన్నాను ఎందుకంటే అప్పటికే ఆ సినిమా రివ్యు చదవటం జరిగింది .        ఈ మద్య ప్రతి సినిమాను నెట్లో పెట్టిన రివ్యూ చదివి నిర్ణయించుకోని చూడటం అలవాటు అయ్యింది . ఎందుకో ఆ సినిమాకి రివ్యూ సరిగా లేకపోవటం వద్దులేమ్మా అన్నాను. కొద్ది దూరంలోనే " సంథింగ్ సంథింగ్ " నడుస్తుంది బావుందని అంటున్నారు (ఇది కూడా రివ్యూ ) వెళ్దాము అన్నాను " పళ్ళు ఊడ కొట్టుకోవటానికి ఏ రాయి అయితే ఏంటి" అన్నట్లు మావాళ్ళు ఇద్దరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు , టికెట్లు తీసుకున్నాము . రిసర్వుడు 30 రూపాయిలు (అబ్బొయ్ డెడ్డు సీపు అన్నట్లు నా మనసులో ఒకటే సంబడం ) ఆ తరువాత మా అమ్మాయి చూసింది "నాన్న ఇది ఎసి థియేటర్ కాదు వద్దు" అంది. ఇక్కడ ఎసి హాల్ ఒకటే వుంది అందులో అది ముందుకు వెళ్ళిపోయింది కదా అయినా అన్నిటికీ అలవాటు పడాలి. అన్నట్లు చిన్న క్లాసు పీకబోతే "వద్దు నాన మీ చిన్ననాటి రోజులు ఫ్లాష్ బాక్ ఇప్పుడు చెప్పకు అంది . ఈలోగా హాల్లోకి ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రవేశించాము           "మాకెందుకొచ్చిన ఈ జీవితం" అన్నట్లు పంకాలు నిస్తేజంగా తిరుగుతున్నాయి . కాశీ వెళ్ళినా కాసిన గుణం పోదు అన్నట్లు ప్రొజెక్టర్ కి దగ్గరగా వెళ్లి చివర వరసలో సోఫా లో కూలబడ్డాము ( చిన్నపుడు ప్రొజెక్టర్ దగ్గర కూర్చోవటం అదో సరదా ) . ఈలోగా సినిమా మొదలు అయ్యింది ముగ్గురం కూర్చున్నాము సోఫా ఇరుకుగా వుంది వేరే సోఫాలో ఇంకొకర్ని కూర్చోబెడదాము అంటే అక్కడ పంకా లేదు ఈలోగా ప్రక్క నుండి పెద్ద శబ్దం మా ప్రక్క సోఫాలో కూర్చోడానికి ప్రయిత్నించిన ఇద్దరు భార్య భర్తలు సోఫా విరిగి లోనికి కూరుకుపోయారు . బ్రతికాము దేవుడా ఆ సోఫాలో మనం కూర్చోలేదు అనుకున్నాము . పాపం వారు అవమానంతో లేచి లోలోపలే హాలు వాడిని తిట్లకు అంకితం చేసి మరో కుర్చీలో కూలబడ్డారు . ఈలోగా సినిమా పేర్లు పూర్తి అయ్యాయి . టాకీ వస్తుంది కాని మూకీ లేదు కెవ్వు కేక అంటూ కుర్రాళ్ళు ఒకటే కేక మళ్ళి బొమ్మ కనపడింది . కొద్దిసేపు అయ్యాక మళ్ళి మూకీ పోయింది మళ్ళి కెవ్వు కేక ఈసారి మా అమ్మాయి నన్ను అదోలా చూసింది ఏం పర్వాలేదమ్మా వస్తుందిలే అంటూ అభయం ఇచ్చాను . మళ్ళి టాకీ మూకీ రెండు వచ్చాయి కాసేపు హమ్మయ్య అనుకున్నాము .       మళ్ళి కాసేపు అయ్యాక మూకీ మాయం అయ్యి టాకీ ఖాయం అయింది . ఒక్కసారిగా ఒకటే కెవ్వు కేకలు కొంతమంది కుర్రాళ్ళు ఆపరేటర్ని ఒకటే తిట్టుడు "ఒరేయ్ నీ .........". అంటూ ఈసారి పూర్తిగా ఆపేసాడు . "బయటికి వెళ్లి వస్తాను వుండండి" అనుకోని బయటికి వెళ్ళాను. బయట ఒకాయన ఈరోజు సినిమా లేదంట అన్నాడు ఓరిదేవుడా ఇదెక్కడి గోలరా బాబు అనుకున్నాను , మా పిల్లలతో చెప్పితే వాళ్ళ మోహంలో రంగులు మారిపోయాయి . "పదండి పదండి ముందుకు పదండి" అంటూ జనం వురికారు అప్పటికే ఆఫీస్ గది లోపల గడియ పెట్టారు . తలుపులు గట్టిగా కొడితే ఒకబ్బాయి బయటికీ వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అన్నాడు అంతే జనం తిట్ల పురాణం చదువుతూ ఒక్కసారిగా టిక్కెట్ కౌంటర్ మీద పడ్డారు .          "అబ్బో ..........ఇచ్చేసిన డబ్బులకోసం కూడా ఇంత పోట్లాట" అనుకోని మా డబ్బులు మేము తీసుకొని రోడ్డు మీద పడ్డాము . "ఇదేంటి నాన" అని మా పిల్లలు అడిగారు అదేనమ్మా " సంథింగ్ సంథింగ్ " అన్నాను నాకు తెలిసి చిన్నపుడు చూసిన టూరింగ్ టాకీసులో కూడా ఇలా జరగలేదు అన్నాను . మావాడి మొహం కందగడ్డలా మారిపోయింది . ఇంక వాళ్ళని కూల్ చెయ్యటానికి కోలాలు హిమ క్రీములు అన్నీ ఇప్పించి శాంతిపజేసాను . "హతవిధీ ఈ అవమాన భారంతో మా మోహములు మావాళ్ళకు ఎలా చూపించవలే " అని ఈసురోమని ఇల్లు చేరాము . మమ్మల్ని చూసి అవాక్కయ్యారు మావాళ్ళు. విషయం చెప్పగానే వాళ్ళకి అయోమయం ఒక్కసారి నిశ్శబ్దం గోల్లుమంటూ మావాళ్ళందరూ ఒకటే నవ్వులు మా మొహాలు మాత్రం అయ్యాయి వాడిన పువ్వులు .

తూర్పు పడమర డిజైన్స్ కలయికతో అమెరికాలో లంగావోణీలు

                                                                                                    -కనకదుర్గ అమెరికాలో కాలిఫోర్నియా, సాన్ హోజే(San Jose) స్టేజ్ పై రక్ రకాల అందమైన లంగా ఓణీలు వేసుకుని కేవలం భారతీయ అమ్మాయిలే కాదు కొంతమంది అమెరికన్ అమ్మాయిలు కూడా ఫ్యాషన్ షో చేస్తున్నారు.  ఇదేమిటీ? లంగా ఓణీలతో ఫ్యాషన్ షో ఏమిటి అనుకుంటున్నారా?  అవునండీ అది చేయిస్తున్నది ఎవరో కాదు, అనుషా కూచిబొట్ల.  "వోల వోల " అనే పేరుతో లంగా వోణీలు డిజైన్ చేసి ఫ్యాషన్ షోస్ చేసి, అమెరికాలో వుండే భారతీయులకి సాంప్రదాయమైన ఈ బట్టలను అందజేయాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ఈ ప్రయత్నం గత రెండేళ్ళుగా మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నది.   అసలు అమెరికాలో లంగా వోణీలను డిజైన్ చేసి అవి ఇక్కడ సెటిల్ అయిన భారతీయుల కుటుంబాలకు అమ్మాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు, అనుషా తడుముకోకుండా చెప్పే సమాధానం, " నాకు చిన్నప్పటినుండి ఫ్యాషన్ అన్నా రకరకాల బట్టలన్నా చాలా ఇష్టం. కేవలం వాటిని చూడడమే కాదు అవి ఎలా డిజైన్ చేసారు, ఎవరు చేసారు, వాటి లేబుల్స్ ఏమిటి, అవి ఎలా అమ్ముడుపోతున్నాయి లాంటి విషయాలు బాగా గమనించేదాన్ని.  ఇండియా కెళ్ళినప్పుడు కొన్నేళ్ళ క్రితం అక్కడ అస్సలు లంగా ఓణీలు కనిపించేవి కాదు. మేము బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అడిగితే అంటే వూర్లల్లో కూడా,'ఇపుడు అవి ఎవరు వేసుకుంటున్నారమ్మా?  చుడీదార్ లయితే మీకు సులభంగా వుంటుంది అవే వేసుకొండి'అనేవారు.      నాకు చాలా బాధేసింది.  నాకు లంగా ఓణీలంటే చాలా ఇష్టం. అవి పూర్తిగా కనుమరుగవుతున్నాయంటే ఏదైనా చేయాలనిపించింది.  అమెరికాలో ఇండియన్ బట్టలు కావాలంటే అన్ని సిటీస్ లో దొరకవు, న్యూజెర్సీ లాంటి ప్రదేశాలకి వెళ్ళినా అక్కడ కూడా చుడీదార్ లు, చీరలు మాత్రమే దొరికేవి, లంగా జాకెట్లు కానీ, లంగా ఓణీలు కానీ దొరికేవి కావు." అని చెప్పింది అనూష.  మరి ఈ వోల వోల ఎప్పుడు మొదలు పెట్టారు?అనే ప్రశ్నకి, "ఎప్రిల్, 2011 ఉగాది రోజు మొదలు పెట్టాము.  నాకు చిన్నప్పటినుండి మన సాంప్రదాయమైన బట్టలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా లంగా ఓణీలు, వాటి అందం వాటిదే కదా!  నా కాలేజ్ చదువయి పోయాక నా ఐడియా గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు అదీ కాకుండా నన్ను అమ్మ, శాంతి, నాన్న ఆనంద్ కూచిబొట్ల ప్రోత్సహించారు." ఆనంద్ కూచిబొట్ల గారు గైడెన్స్ ఇవ్వడమే కాకుండా, అనూషాకున్న వోల వోల ఐడియాలో ముఖ్యపాత్ర వహిస్తారు.  ఇది కుటుంబం అంతా కలిసి చేసే పనిగా మారింది. అనుషా అత్తయ్య గిరిజ లల్లా, తను ఇండియా నుండి మంచి నాణ్యమైన బట్ట లంగా వోణీలకు కావాల్సినవి అనూష ఎలాంటి కలర్స్ కావాలన్నా, ఎలాంటి డిజైన్ క్లాత్ కావాలన్నా పంపిస్తుంది.  ఒకోసారి  డిజైన్ చేసి పంపిస్తే ఆ ఫ్యాబ్రిక్ తయారు చేయించి పంపిస్తుంది.      అమ్మ,శాంతిగారు అనూష డిజైన్ చేసినవి చక్కగా కుడుతుంది, అన్నీ సైజులు, రక రకాల లంగాలు, ముఖ్యంగా జాకెట్లు ఏ డిజైన్ వైనా చాలా బాగా కుడుతుంది,  బొటిక్, (Boutique) కస్టమర్ మ్యానేజ్మ్ంట్ కూడా తనే చూసుకుంటుంది.   తమ్ముడు అరుణ్ వెబ్ డిజైనింగ్,గ్రాఫిక్స్, ఫాంప్లెట్స్ తయారు చేయడం, వాటిని అందరికీ పంచడం, మార్కెటింగ్ పనుల్లో సాయం చేయడం చేస్తాడు. అనుషా కొత్త కొత్త ఐడియాలతో డిజైన్ చేయడం, షోస్ అరేంజ్ చేయడం, మార్కెటింగ్ పనులు చూసుకుంటుంది. " మేమందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మా కందరికీ ఆనందానిచ్చే పని ఇది.  ఇప్పటి వరకు అందరి ఆశీర్వాదంతో, సహకారంతో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.  ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాను. మేము షోస్ చేసినపుడు ఇక్కడ అమ్మాయిలు, అమెరికన్స్ వారికి మన భారతీయ సంస్కృతి గురించి అంతగా తెలియక పోయినా వచ్చి వారికి నచ్చినవి ఒక జతే కాదు కొన్ని జతలు కొనుక్కేవాళ్ళను చూస్తే చాలా సంతోషమేస్తుంది.  ఇండియన్ కుటుంబాల్లో ఒకోసారి పిల్లలకి ఇష్టం లేకున్నా తల్లి తండ్రులు వారికిష్టం కాబట్టి కొంటారు.  కానీ అదే ఇతర దేశాల వారయితే ఎవ్వరి ప్రోద్భలం లేకుండానే వారి ఇష్ట ప్రకారం ఆనందంగా కొనుక్కుంటారు, " అని గల గలా మాట్లాడుతూ చెప్పింది అనూష.   ఇంతకీ"వోల వోల" అంటే ఏమిటో తెలుసుకున్నారా?  వోణీ లంగా అని అర్ధం అలాగే ఇటాలియన్ లో "వోల వోల"అంటే "ఫ్లై హై" (Fly High) అని కూడా అర్ధం అన్న మాట! అనూష బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మేజర్ సబ్జెక్ట్ మరియు మైనర్ సబ్జెక్ట్ లా యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్ సైడ్ లో చేసింది.  అనూష కేవలం వోల వోల పనే చేస్తుందనుకుంటే పొరపాటేనండోయ్.  మొదలు వెరాబ్రాడ్లీ (VERA BRADLEY) వారి బ్రాంచ్ సాన్ హోజేలో కొత్తది ప్రారంభించినపుడు దానికి మ్యానెజర్ గా పని చేసింది.  మొత్తం షాప్ పని మొత్తం తనే చూసుకునేది దాంతో మంచి అనుభవం సంపాదించింది.  ప్రస్తుతం ఒక కంపెనీలో మార్కెటింగ్ ప్రోగ్రామ్ మ్యానెజర్ గా తను పొద్దున ఫుల్ టైమ్ జాబ్ చేస్తుంది.   సాయంత్రం ఈ"వోల వోల" పని చేస్తుంది.   ఇండియాకి ఫోన్లు చేసి మాట్లాడటం, తన డిజైన్స్ తయారు చేసుకోవడం, షోస్ వుంటే వాటి పని చూసుకోవడం చేస్తుంది.  అమెరికాలో పుట్టి పెరిగినా కూడా చక్కగా తెలుగు మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చు.  తెలుగు భాష అంటే విపరీతమైన మక్కువ.  అంతే కాదండోయ్ అనూష మంచి కూచిపూడి నృత్యకారిణి, సంగీతం నేర్చుకుంటుంది, అన్నమాచార్య జయంత్యుత్సవంలో అన్నమాచార్య అభిమానులంతా పాల్గొన్న కార్యక్రమంలో తనూ పాల్గొన్నది.    ఇవన్నీ చేయడానికి సమయం ఎలా దొరుకుతుంది? అంటే, " మనకి ఇష్టమయిన పనులు చేయడానికి సమయం తప్పకుండా దొరుకుతుంది.  అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి, మా అమ్మా, నాన్న చిన్నప్పటినుండి టైమ్ మ్యానేజ్ మెంట్ గురించి నేర్పించారు.  నాకు ఫ్యాషన్(Fashion is my passion)అంటే విపరీతమైన ఆసక్తి, ఆ పని అంటే ఉత్సుకత, ఉత్సాహం అన్నీ కలగలిసి వున్నాయి.  కాబట్టి నాకు ఆ పని అస్సలు కష్టం అని అనిపించదు.  లంగా వోణీలను అంతర్జాతీయంగా పాపులర్ చేయాలని నా ఆలోచన, ఈ మధ్యనే హాంగ్ కాంగ్ నుండి అక్కడి అమ్మాయే మా వోల వోల డిజైన్స్ చూసి ఆర్డర్ చేసింది.  ఇక్కడ వారు కొనుక్కుంటూనే వుంటారు.   మేము కస్టమర్స్ అడిగిన డిజైన్స్ కూడా చేస్తాము, కస్టమ్ మేడ్ లంగా వోణీలన్న మాట.  మేము ఇంకా ఎంతో సాధించాల్సి వుంది.  సాధిస్తామనే నమ్మకం వుంది.  ఇది ఒక టీమ్ వర్క్." అనూష డిజైన్ చేసే లంగా వోణీలు ఎక్కడికైనా వేసుకుని వెళ్ళేలా వుంటాయి.  ఇండియాలో వస్తున్న లంగా వోణీలు చాలా చమ్కీవర్క్, పూసలు, లేసులు, పెద్ద పెద్ద బార్డర్స్ తో వస్తున్నాయి. అవి పండగలకు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వేసుకెళ్ళడానికి బావుంటాయి.  కానీ అనూష డిజైన్స్ మామూలుగా షాపింగ్ కి వెళ్ళేపుడు, ఫ్రెండ్స్ తో వెళ్ళేపుడు, బర్త్ డే పార్టీలకు, అలాగే పండగలకు, పెళ్ళిళ్ళకు వేసుకున్నా బావుంటాయి.      నేను 2007లో ఇండియాకి వెళ్ళినపుడు మా అక్కయ్య కూతురు, అన్నయ్య కూతురిని ఓణీలు వేసుకోమని బ్రతిమాలాల్సి వచ్చింది.  అందులో ఒక్కరే వేసుకుని నన్ను సంతోష పెడితే మరొకరు పరీక్షల పేరుతో తప్పించుకున్నారు. ఇండియాలోనే ఇక సాంప్రదాయమైన లంగా ఓణీలు తగ్గుతున్నాయనుకున్న నాకు "వోల వోల" అదీ అమెరికాలో మన సాంప్రదాయమైన, అందమైన లంగా ఓణీలను తీసుకురావడమే కాదు వాటిని బాగా పాపులర్ చేస్తున్నారు.  వోల వోల మున్ముందుకు సాగుతూ మరెన్నో విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటూ, మీరిప్పుడు వోల వోల ఓణీల డిజైన్లని చూసి ఆనందించండి!  ఓణీలు పెళ్ళి కాని అమ్మాయిలే వేసుకోవాలనుకునేవారు కానీ ఇప్పుడు ఓణీలు సినిమాల ద్వారానయితేనేమి, పెద్ద పెద్ద డిజైనర్లు కూడా మంచి లంగా వోణీలను చేస్తుండడంతో ఇపుడు పెళ్ళయినవారు కూడా వేసుకుంటున్నారు.  కాబట్టి మీ అమ్మాయిలకు కొని వేయించండి అలాగే మీ సరదా కూడా తీర్చుకొండి.

తెగిన పేగు

తెగిన పేగు కొన్ని కథలు జీవితానికి ఎంతో దగ్గరాగా వుంటాయి అవి చదివినపుడు మన మనసు చెమ్మగిల్లితుంది ఆ కథలోని పాత్రలు కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడుతాయి అలా ఈ మద్యనేను చదివిన ఒకప్పటి కథ నన్ను భలే కలవర పరచింది అప్పటి తరంలో స్త్రీల భాదలను మన ముందుంచే ఆ కథ పేరు " తెగిన పేగు " పీసుపాటి ఉమమహేశం గారు రాసారు. ఆ కథని అనుకోకుండా మొన్న చదివాను నాకు ఎంతో నచ్చింది నిజానికి ఆ కథలోని 'ఫీల్ ' కథని స్వంతంగా చదివితేనే మనసుని తాకుతుంది. ఎక్కడైనా దొరికితే తప్పకుండ చదవండి. ఇప్పుడు ఆ కథని నేను మీకు పరిచయం చేస్తాను నాగలక్ష్మి గారు కొడుకుని ఓ కోరిక కోరుతుంది కేరళలోని " పాల్ గాట్ " కి తీసుకెళ్ళమని. తల్లి ఎప్పుడు ఏది అడిగింది లేదు ఇన్నేళ్ళలో మొట్టమొదటిసారి పైగా కేరళ కి తీసుకెళ్ళమని అడగగానే కొంత ఆశ్చర్యపోయిన తల్లి కోరిక తీర్చాలనుకుంటాడు కొడుకు. తండ్రి ఎప్పుడో మాటల మద్య చెప్పగా విన్నాడు కేరళలోని " పాల్ గాట్ " తల్లి పుట్టినిల్లు అని, ఇన్నేళ్ళలో ఎప్పుడు ఎవరు అక్కడినుండి ఇక్కడికి వచ్చింది లేదు, వీళ్ళు ఇక్కడనుండి అక్కడికి వెళ్ళిందిలేదు తల్లిని ఆమె పుట్టిన ఊరికి తీసువెళ్ళటానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఆమెకి ఆ ఊరి పేరొకటే తెల్సు అది ఎక్కడ వుందో కూడా తెలియదు మొత్తానికి ఎలాగో ఒకలా ఆ ఊరు చేరుతారు ఇందులో నాగలక్ష్మి గారు పుట్టిన ఊరు కేరళలోని పాల్ గాట్ అయితే ఆమెకి సంవత్సరాలు ఉన్నపుడు కన్యాశుల్కం మిచ్చి పెళ్లి చేసుకుని ఆంధ్రదేశంలోని ఓ మారుమూల పల్లెటూరికి తెస్తాడు ఆమె భర్త . ఇక్కడ పెద్ద కోడలిగా బరువు బాధ్యతల మద్య తన ఊరు తన వాళ్ళని మర్చిపోతుంది ఈమెకి వాళ్ళ ఊరు పేరు , చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలు లీలగా గుర్తుంటాయి. అక్కడి భాష కూడా ఆమెకి గుర్తుండదు అయితే ఆమె 80 సంవత్సరాల వయసులో కొడుకుని పాల్ గాట్ కి తీసుకు వెళ్ళమని కోరుతుంది. అష్ట కష్టాలు పడి అ ఊరు చేరాక తమ ఇల్లు ఏదో గుర్తుకు రాదు ఆమె కి.. నాగలక్ష్మి మీ గారికి తమ ఇల్లు ఓ గుడి పక్కన ఉన్నట్టు చిన్న జ్ఞాపకం అదే చెబుతుంది కొడుకుకి , అక్కడి ఓ స్కూల్ టీచర్ కి ఇంగ్లీష వస్తే ఆయనకి తమ సమస్య చెప్పి మొత్తానికి గుడి పక్క ఇల్లు కనుక్కుంటారు ఆ ఇంటికి చేరగానే ఓ ముసలి వ్యక్తీ గుమ్మంలో ఎదురవుతాడు అతనిని తదేకంగా చూస్తూ నువ్వు అప్పువి కదా అంటుంది అవును నువ్వు నా తమ్ముడివి అని ఏదేదో చెప్తుంది కానీ ఒక్క మాట అతనికి అర్ధం కాదు మద్యన స్కూల్ టీచర్ మలయాళం లోకి ఈమె చెప్పినవన్నీ తర్జుమా చేసి ఆ ముసలాయనకి చెబుతాడు. నాగలక్ష్మి ఒక్క ఉదుటన ఇంట్లోకి వెళ్లి ప్రతీ ప్రదేశాన్ని తాకుతూ, ఏడుస్తూ ఇక్కడ నేను ఆడుకునేదాన్ని ఇక్కడ అన్నలు తినేవాళ్ళం అంటూ ఏవేవో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని చెబుతూ ఇల్లంతా తిరుగుతుంది.వెక్కి వెక్కి ఏడుస్తుంది నాది కానీ ఊరు నా వాళ్ళు లేని జీవితం దేవుడా ఎందుకింత శిక్ష ఆడవాళ్ళకి అంటూ భాదపడుతుంది ఆమె తమ్ముడితో మాట్లాడడానికి అతనికి తెలుగు రాదు, ఆమెకి మలయాళం రాదు కాసేపటికి తన పుట్టింటి వారి గురించి అడిగి తెల్సుకుని తనుపుట్టిన ఇంటిని ఆత్రంగా తడిమి తడిమి చూసుకుని కన్నీళ్ళతో వెనక్కి బయలుదేరుతుంది. ఎప్పుడో 75 ఏళ్ళ క్రితం తెగిన పేగు బంధం భాదగా మూలుగుతుంది ... ఇది ఏ కథ సారాంశం ఏ కథని వింనటం కాదు చదివి తీరాలి. కొన్ని తరాల వెనక ఆడవారి మనసు లోతుల్లోని కన్నీరు మన కళ్ళ వెంట ధారల కారటం కాయం... - రమ