ఇద్దరు పల్లెటూరి రైతులు

ఇద్దరు పల్లెటూరి రైతులు ఇద్దరు పల్లెటూరి రైతులు ట్రెయిన్లో ప్రయాణం చేస్తున్నారు. ట్రెయిన్ ఎక్కేముందు వాళ్ళు ట్రెయిన్లో తినడానికి ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కున్నారు. ట్రెయిన్ ముందుకు పరుగెడుతూనే ఉంది. ఇద్దరిలో ఒక రైతు ఒక అరటిపండు తీసుకుని తినసాగాడు. అంతలో రైలు ఓ టన్నెల్ లోకి ప్రవేశించింది. వెంటనే అరటిపండు తింటున్న మరొక రైతు కంగారు పడి పెద్దగా రెండో రైతుతో ఇలా అన్నాడు. " ఓరేయ్ నువ్వు ఇప్పుడు అరటిపండు తిన్నావా ? " " ఇంకాలేదురా...ఎందుకని ? " అని సందేహంగా ఒక రైతు అడిగాడు. " సంతోషం...నువ్వు చాలా అదృష్టవంతుడివి. నేను అరటిపండు తిన్నాను. అంతే...గుడ్డివాడిని అయ్యాను, నా కంటికి ఏమి కనిపించడం లేదు " అని బాధగా అన్నాడు మొదటి రైతు. ఏమి అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.

మర్యాద తెలిసిన పిల్ల

మర్యాద తెలిసిన పిల్ల అదో చిన్న ఊరు. అప్పుడే ఆగిన రైల్లోంచి ఓ అందమైన అమ్మాయి లగేజితో దిగింది. అప్పటికి టైము రాత్రి పదకొండు గంటలు దాటింది. ఆమె అక్కడే పడుకొని నిద్రపోతున్న ఓ రైల్వే పోర్టర్ ను నిద్రలేపింది. “ ఈ ఊళ్ళో ఏదైనా మంచి హోటలుందా ?” అడిగిందామె పోర్టర్ ను. “ లేదండి " అన్నాడు నిద్రమత్తులో ఉన్న పోర్టర్. “ పోనీ ఏదైనా రెస్టారెంట్ ఉందా !” అడిగిందామె. “ లేదండి " నిద్రలోనే జోగుతూ జవాబిచ్చాడా పోర్టర్. “ అరె ! నేనీ రాత్రి ఎక్కడ గడపాలి అయితే " ఆందోళనగా అందామె. “ మీకు అభ్యంతరం లేకపోతే మా స్టేషన్ మాస్టర్ తో కలిసి రూమ్ లో పడుకోండి. ఏర్పాటు చేస్తాను " అన్నాడు ఆ పోర్టర్ హుషారుగా మత్తు వదల్చుకుని. “ ఏమిటి నీ ఉద్దేశం ! నేను మర్యాదస్థుల యింటి ఆడపిల్లను తెలుసా ?” అందామె కోపంగా. “ మా స్టేషన్ మాస్టర్ కూడా మర్యాదస్థుల యింటి ఆడపిల్లెనండి " అన్నాడు పోర్టర్ తాపీగా.