తెలుగు వెలుగు

తెలుగు వెలుగు


నవనీతము నా భాష
నవరసము నా భాష
జలజము నా భాష
మలయజము నా భాష

సుగంధము నా భాష
సుస్వరము నా భాష
సేమంతిక నా భాష
పూబంతిక నా భాష

కంటిపాప నా భాష
చంటిపాప నా భాష
హరివిల్లు నా భాష
విరాజిల్లు నా భాష

హిమాలయం నా భాష
సమాలయం నా భాష
నారంగము నా భాష
సారంగము నా భాష

నా భాష తెలుగు భాష
నా భాష వెలుగు భాష

రచన : తండ హరీష్ గౌడ్