నవరసాల నవీనుడు

నవరసాల నవీనుడు

 

 

శాంతంగా ఆలోచిస్తూ
పరులపై కరుణ కురిపిస్తూ
అత్యద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ
నవ్వుతూ  నవ్విస్తూ

 

భీభత్సమైన కష్టాన్ని కరిగిస్తూ
రౌద్రరూపన చెడును సంహరిస్తూ
భయంకరమైన భయాన్ని బ్రస్టీస్తూ
పరమ ఔషధమైన శృంగారాన్ని స్వీకరిస్తూ

 

వీరత్వముతో వీరుని వలె జీవిస్తూ
నీలోని నవరసాలు పలికించి, ఉపయోగించి
జీవిత గమ్యం వైపు పయనించి
విజయం సాధించాలని భావిస్తూ ...!!!!!!
మస్తూ మస్తూ శుభమస్తూ తెలుపుతూ ....!!!!

 

-జాని.తక్కెడశిల