ఏది బాగుంది
posted on Jun 16, 2022
ఏది బాగుంది
బాగుంది
ఏదో బాగుంది
అదే బాగుంది
అలాగే బాగుందా ??
తెలియకున్న
తెలిసినట్లే బాగుంది
అర్థం కానీ ఆమిధ్య
మరీ బాగుందా ??
రొద పెడుతున్న ఆలోచనలను
నింపిన అంతరంగపు సంచి
లోతు తెలియని శోధనకు
ముగింపు ఎక్కడ ఉంది ??
ఏమీ లేని దగ్గర
ఏమి తెలుసుకోవాలో
తెలియని వెతుకులాటల
సమయం వ్యర్థం అని
తెలుసుకుంటేనే
ఎంతో బాగుంటుంది !!
లేదంటే ఇంకేముంటుంది
అంతా శూన్యమే...!!
రచన: కవిత రాయల