ఓ ఉదయం

ఓ ఉదయం

 

మేల్కొంటున్న కనులు
విరబూస్తున్నా పూలు
ఎగురుతున్న పక్షులు
కల్లాపితో ముస్తాబవుతున్న వాకిళ్ళు
ఇంటి పనుల్లో ఆడవాళ్ళు...
మొదలైన ఉరుకులు పరుగులు
శబ్ధాలు నిశ్శబ్దాలు
వీధి అంతా కుక్కల అరుపులు..

వెలుగు నీడల దాగుడుమూతలు
మనుషుల నడకలు
వాహనాల మోతలు ...
ముక్కలైన ఏకాంతం
విస్తుపోతున్న ధ్యానమందిరం
ప్రశాంతతను బయటకు గెంటేసిన మెదళ్లు..

ఇది ఓ ఉదయం
నిన్నటిని నేటిని వేరు చేసిన ఉదయం
పై పైకి అందాన్ని మోసుకొచ్చిన ఉదయం
లో లోపల కర్తవ్య భయాన్ని తీసుకొచ్చిన ఉదయం
కొందరికి ధైర్యాన్ని ఇచ్చే ఉదయం
మరికొందరికి నమ్మకాన్ని ఇచ్చే ఉదయం...!

 

- Malleshailu