నీ కనుపాపలోని ప్రతి స్వప్నం
posted on Oct 28, 2020
posted on Oct 28, 2020
నీ కనుపాపలోని ప్రతి స్వప్నం
నీ కనుపాపలోని ప్రతి స్వప్నం
నా గురించే అనుకున్నా
వర్షించే ప్రతి మేఘం
నా కొరకే అనుకున్నా
కడలి ఎగిసే ప్రతి కెరటం నను చేరాలనే
నీ ఆరాటం అనుకున్నా
చలువరాతిపై నిదురిస్తుంటే
నాపై రాలిన పువ్వులు నీ నవ్వులనుకున్నా
అసలు నీవు పుట్టిందే నాకోసమనుకున్నా