బ్రతకనిద్దాం !
posted on Oct 12, 2020
బ్రతకనిద్దాం !
వారసత్వ పోరు
మూఢనమ్మకం జోరు
ఆడపిల్ల అనే
అభద్రతా భావంతో
లింగ నిర్ధారణ పరీక్షల
పేరుతో
కడుపులోని పిండానికి
కడుపులోనే విచ్ఛిన్నం
చేస్తున్నారు
తమకు జన్మనిచ్చింది
అమ్మే నని
జీవితాన్ని పంచింది
స్త్రీనేనని
సృష్టికి మూలం మహిళేనని
ఇంట్లో దీపం వెలిగించి
వెలుగును పంచేది మగువేనని
తెలుసుకో
భ్రూణ హత్యలు ఆపకపోతే
ఇలాగే కొనసాగితే
మనుషుల మనుగడకే ముప్పు
ఆడపిల్లలకు జన్మంనిద్దాం
సృష్టి మనుగడను కొనసాగిద్దాం.
- చాపలమహేందర్