లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ
posted on Oct 14, 2017
లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ...!
దివిటీల పండుగ టపాసుల పండుగ
లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ
గడప గడప ముందర మిలమిలా మెరయగా
తారావళి ద్రోలగా తారావళి వెలగగా
॥దివిటీల॥
ఇంటింటా పండుగ ఇంపైన పండుగ
ఇంటిల్లిపాదికీ ఇష్టమైన పండుగ
॥దివిటీల॥
రంగురంగు మతాబూలు రమ్యమైన రజనువత్తి
అంటించగ చిచ్చుబుడ్డి అవి పూలు జిమ్మగా
॥దివిటీల॥
చిన్నదైన టపాకాయ చిటికెలో పేలుతుంది
అవిటె గుండెవాడినెంతో హడలగొట్టుతుందిరా
॥దివిటీల॥
తూటాలు దరణాలు ముట్టించి వదలగా
తుస్సుమంటు బుస్సుమంటూ తరుముచూ వెంటపడు
॥దివిటీల॥
నరకాసురునికింక నాశనంబేనంటూ
పేరచూట్లొస్తాయి బాంబులే పేల్తాయి
దేశమంతా నేడు దేదీప్యమానంగా
దీపాలు వెలగంగా దీపావళి వచ్చింది
॥దివిటీల॥
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో