చీకటి శిలలు
posted on Nov 9, 2021
నల్లమబ్బులు బరువులను మోసుకొస్తున్నాయి
అవి కాలంలో కలిసిపోయిన ప్రాణాలకై
విలపిస్తున్న కన్నీటిమూటలు
ఎందరి ఆర్తనాదాలో బరువెక్కి ఆషాఢమేఘాలై ఆకాశమంతా ఆవహించాయి
నిశీధినీడలలో తమవారి జాడలను వెతికే బంధాలు
వానకారు కోయిలలై మూగరాగాలు ఆలపిస్తున్నాయి
అమావాస్యను నింపి అమాంతంగా మాయం చేసిన ప్రేమబంధాలను
తెల్లవారి వెన్నెలలో తడిఆరని కన్నులతో
ధారగా ప్రవహించే జ్ఞాపకాల జలపాతాలలో ఒలకబోస్తూ
ప్రతినిత్యం చీకటి శిలలై వేదనల అలలలో తడుస్తూ
ఒంటరైన జీవితాలెన్నని లెక్కించేది
కరోనా రక్కసి కపాలమాలను ధరించి కాలరాత్రై సాగించే ఈ మారణహోమంలో...
నవకోయిల పల్లవముల ప్లవ నామ వత్సరం
ఆమని గీతాలు ఆలపించుతూ ఏతెంచేవేళ
లోకమంతా ఎదురుచూస్తోంది కరోనా రహిత స్వచ్ఛ వాయువులకై...
- వకుళ వాసు
9989198334