కోడీ కోడీ వస్తావా
posted on Nov 17, 2018
కోడీ కోడీ వస్తావా
కోడీ కోడీ వస్తావా, ఆడుకుందాం వస్తావా?
రాను రాను రామయ్యా, తీరికలేదు తీవయ్యా
కాకీ వస్తావా, ఆడుకుందాం వస్తావా?
రాను రాను రామయ్యా, తీరికలేదు తీవయ్యా
కుక్కా కుక్కా వస్తావా? ఆడుకుందాం వస్తావా?
రాను రాను రామయ్యా, తీరికలేదు తీవయ్యా
కోతీ కోతీ వస్తావా? ఆడుకుందాం వస్తావా?
రాను రాను రామయ్యా, తీరికలేదు తీవయ్యా
కోడీ,కాకీ, కుక్కా, కోతీ- ఏల రారు, ఏల రారు?
పోపోవయ్యా పుల్లయ్యా, బుద్ధిగ బడికి పోవయ్యా!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో