అలసిపోతున్నా (ఇరానీ కవిత్వం)
posted on Aug 7, 2024
ఈ జనం ఒంటరిగా బాధపడతారు అలా నేను అలసిపోయేలా చేస్తారు
నీ ప్రేమ మత్తులో మునగాలని... ఒక వీరుడి బలాన్ని చేతులారా తాకాలని నేను ఆశించడం తప్పు కాదేమో...
అశాశ్వతమైన వాటితో విసిగిపోయాను శాశ్వతమైన కాంతిని చూడాలనుకుంటున్నా...
ఎంతకీ దొరకని దానికోసం దీపాలు పట్టుకుని చీకట్లో వెతకడం అవివేకం కాక మరేమవుతుంది?
నువ్వు తాత్విక సారం.. నువ్వు ఒక ప్రేమ మైకం నీ పాట పాడాలని నా హృదయం కోరుతోంది
కానీ ఆ కోరిక తీరక మనసు అలసిపోతోంది మౌనమే నాకు చివరకు మిగులుతోంది
-ప్రముఖ ఇరానీ కవి రూమీ