ఆలోచనా దినోత్సవం ఆడబిడ్డల అస్త్రం!

Publish Date:Feb 22, 2023

Advertisement

అప్పుడెప్పుడో అభిషేక్ బచ్చన్ ఐడియా సిమ్ యాడ్ లో one idea can change your life అని చెప్పాడు. ఆ సిమ్ యాడ్ గురించి ఏమో కానీ.. ఒక్క ఆలోచన అయితే జీవితాన్ని మారుస్తుందని దృఢంగా చెప్పవచ్చు. ఒక్క ఆలోచనతో, ఒక్క నిర్ణయంతో తమ జీవితాలలో గొప్ప మార్పులు సాధించుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలోచనల పరంపర ఎందుకంటే.. అన్నిటికీ ఓ దినోత్సవాన్ని పెట్టేసిన ప్రపంచ అభివృద్ధికి పాటు పడినవారు ఈ ఆలోచనలకు కూడా ఒక రోజును కేటాయించారు. అది కూడా ఊరికే ఆలోచించడం కాదు. బాలికలు, మహిళలు వారి సమస్యల గురించి ఆలోచించడం, పరిష్కార దిశగా ప్రపంచాన్ని నడిపించడం ఇందులో ముఖ్య ఉద్దేశ్యం.

అసలు ఏమిటి ఈ ఆలోచనా దినోత్సవ ముఖ్య ఉద్దేశం:-


ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని జరుపుకుంటారు.  150కి పైగా దేశాల్లోని 10 మిలియన్ల బాలికలు  నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మహిళలు అందరూ తమ మధ్య ఒకానొక సోదరీబంధం, స్నేహ బంధంతో మహిళా సాధికారతకు అడుగులు వేయడం జరుగుతుంది. ఇదే అంశాన్ని ఈ ఆలోచనా దినోత్సవం గుర్తించి మహిళా సాధికారతను మనఃపూర్వకంగా గౌరవిస్తుంది.  ప్రపంచ ఆలోచనా దినోత్సవం మహిళాల గౌరవాన్ని నొక్కి చెప్పే ముఖ్యమైన దినం.  

  ప్రపంచ ఆలోచనా దినోత్సవం ప్రాముఖ్యత:-


 ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజు మహిళలు బాలికలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి, వారికి సంబంధించిన అంశాలను చర్చించడానికి వాటికి ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించడానికి ఒక పెద్ద వేదికగా మారుతుంది.  


దీని చరిత్ర ఏంటంటే..


ప్రపంచ ఆలోచనా దినోత్సవం ఆవశ్యకతను 1926లో నాల్గవ మహిళా స్కౌట్ అంతర్జాతీయ సదస్సులో ప్రస్తావించారు.  ఫిబ్రవరి 22ని థింకింగ్ డేగా అంకితం చేసేందుకు సదస్సు అంగీకరించింది.  బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాను స్థాపించిన లార్డ్ బాడెన్-పావెల్. ఈయన భార్య ఈ  సంస్థ యొక్క మొదటి గ్లోబల్ హెడ్ గైడ్‌. వీరిద్దరూ ఫిబ్రవరి 22న జన్మించారు. 


ఆరు సంవత్సరాల తరువాత, 1932లో పోలాండ్‌లోని బుజ్‌లో జరిగిన 7వ ప్రపంచ సదస్సులో వారి పుట్టిన రోజు సందర్భంగా  బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు. దీనివల్ల బాలికల ఆలోచనా దినోత్సవానికి అదొక గొప్ప విరాళం లాగా మారింది. ఈవిధంగా థింకింగ్ డే కు రూపకల్పన జరిగింది.  


ఈ ఏడాది ఆలోచనా అంశం ఏమిటంటే..


'మన ప్రపంచం, మన శాంతియుత భవిష్యత్తు' అనే నినాదం ఈ సంవత్సరం ఆలోచనా దినోత్సవ అంశం. ఈ వ్యవస్థ నుండి మనం ఏమి అర్థం చేసుకోగలమో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మరింత సురక్షితమైన మరియు ప్రశాంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రకృతితో మనం ఎలా సహకరించవచ్చో ఇది విశ్లేషిస్తుంది.


ఆలోచన అనేది రేపటిని మరింత ఆశాజనకంగా ఉండేలా చేస్తుంది కాబట్టి ఆలోచన మీ ఆయుధం కావాలి.


                                    ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
గర్భధారణ మొదటి త్రైమాసికంలో తల్లులు మరియు బిడ్డ ఆరోగ్యం కోసం ఏయే పోషకాలు తగాలో తెలుసుకోండి. ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ప్రొటీన్ మరియు విటమిన్ల ప్రాముఖ్యతతో కూడిన పూర్తి ఆహార మార్గదర్శిని.
మేక తలకాయ కూర తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు, ప్రోటీన్, విటమిన్ బి12 మరియు ఐరన్ లాభాల గురించి తెలుసుకోండి.
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా, పెంకు సులువుగా వచ్చేలా చేయడానికి కొన్ని సింపుల్ మరియు ఎఫెక్టివ్ కిచెన్ టిప్స్. పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ కోసం ఈ సులభమైన ట్రిక్స్ తెలుసుకోండి!
పిల్లలు పండ్లు, కూరగాయలు తినడానికి మొండికేస్తున్నారా? అయితే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్, దానిమ్మ రసంతో ఇంట్లోనే సులభంగా ఆరోగ్యకరమైన ఏబీసీ గమ్మీస్ తయారు చేసే ఈజీ రెసిపీని తెలుసుకోండి. 6 నెలల పాటు నిల్వ ఉండే ఈ హెల్తీ క్యాండీల తయారీ విధానం!
నిమ్మ మరియు నారింజ తొక్కలను వంటల్లో వాడటం ఆరోగ్యానికి హానికరమా? సిట్రస్ పండ్లపై ఉండే పురుగుమందుల అవశేషాలు మరియు రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య ముప్పు గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
వంటగది సింక్ ఎల్లప్పుడూ మెరిసిపోవడానికి, బ్లాక్ కాకుండా ఉండడానికి సింక్‌లో వేయకూడని వ్యర్థాలు మరియు ముఖ్యమైన శుభ్రత చిట్కాలను తెలుసుకోండి.
దీపావళి పండుగకు నూనె లేకుండా, కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన హై ప్రొటీన్ స్ప్రౌట్స్ కెనాప్స్ చాట్ తయారు చేసుకోండి. రుచి మరియు ఆరోగ్యం అందించే ఈ స్పెషల్ రెసిపీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుందనే సోషల్ మీడియా వైరల్ ట్రిక్ వెనుక అసలు నిజం ఏమిటి? వైద్యులు చెబుతున్న హెచ్చరికలు మరియు సరైన ఆరోగ్య చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
రాగి మరియు జొన్న పిండిలో ఏది ఆరోగ్యకరమైనది? పోషకాలు, బరువు తగ్గడం, ఎముకల బలం మరియు గ్లూటెన్-ఫ్రీ ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
జిమ్‌లో ఎంత కష్టపడి వ్యాయామం చేసినా ఫలితం లేదా? నిద్రలేమి కండరాల పెరుగుదల, బలం మరియు ఫిట్‌నెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.