గుడ్లు పగిలిపోకుండా, పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ తయారీకి అద్భుతమైన చిట్కాలు!

Publish Date:Oct 29, 2026

Advertisement

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో లభించే సమృద్ధిగా ఉండే ప్రోటీన్లు, విటమిన్లు మరియు ముఖ్యమైన పోషకాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, ఉడికించిన గుడ్డు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఉన్నప్పటికీ, చాలా మందికి వాటిని సరైన పద్ధతిలో ఉడకబెట్టడం రాదు. తరచూ గుడ్లు ఉడికించేటప్పుడు పగిలిపోతుంటాయి లేదా సరిగ్గా ఉడకవు. ఈ చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టి, గుడ్లను పర్ఫెక్ట్‌గా ఉడకబెట్టే కొన్ని సులభమైన, ఆచరణాత్మక చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం. చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేసిన కోడిగుడ్లను నేరుగా వేడి నీటిలో ఉడకబెడుతుంటారు. అలా చేయడం వల్ల ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగా గుడ్లు త్వరగా పగిలిపోతాయి. కాబట్టి గుడ్లను ఉడికించే ముందు కొద్దిసేపు బయట ఉంచి, గది ఉష్ణోగ్రతకు తెచ్చిన తర్వాతే ఉడకబెట్టాలి.

అలాగే, గుడ్లు ఉడకబెట్టే నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి. ఇది గుడ్డు పెంకు పగలకుండా నిరోధించడమే కాకుండా, ఉడికిన తర్వాత పెంకు సులభంగా వచ్చేలా చేస్తుంది. అలాగే కొద్దిగా తెల్ల వెనిగర్ వేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు తగినంత పెద్ద గిన్నెను ఎంచుకోవాలి. గిన్నెలో గుడ్లు పూర్తిగా మునిగేలా నీరు పోయాలి. ఒకేసారి 3 నుంచి 4 గుడ్ల కంటే ఎక్కువగా వేయకూడదు. ఎక్కువ వేస్తే అవి ఒకదానికొకటి తగిలి పగిలిపోయే ప్రమాదం ఉంది. గుడ్లను ఎప్పుడూ హై ఫ్లేమ్‌లో ఉడికించకూడదు. మీడియం వేడి మీద మరిగిస్తే గుడ్లు చెక్కుచెదరకుండా సమానంగా ఉడుకుతాయి.

గుడ్లను పరిపూర్ణంగా ఉడకబెట్టడానికి  3 3 3  పద్ధతి చాలా పాపులర్. దీని ప్రకారం, ప్రెజర్ కుక్కర్‌లో గుడ్లను 3 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గ్యాస్ కట్టేసి, కుక్కర్‌లో గ్యాస్ అంతా పోయే వరకు మరో 3 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ వెంటనే గుడ్లను చల్లటి ఐస్ వాటర్‌లో వేసి 3 నిమిషాల తర్వాత తొక్క తీయాలి. ఇలా చేస్తే గుడ్డు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఉడకబెట్టే సమయాన్ని బట్టి గుడ్డు పక్వత మారుతుంది. 6 నిమిషాలు ఉడికితే, మెత్తని పచ్చసొన, మృదువైన తెలుపు భాగం వస్తుంది. 8 నిమిషాలు ఉడికిస్తే సలాడ్లు లేదా టోస్ట్‌లలో వాడే గుడ్లకు సరైనది. 10 నుండి 12 నిమిషాలలో గుడ్డు కర్రీస్ కోసం గట్టిగా ఉడకబెట్టడానికి ఇది ఉత్తమమైన సమయం. ఉడికిన వెంటనే గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో లేదా ఐస్ వాటర్‌లో వేయాలి. ఇలా చేయడం వల్ల పెంకు చాలా సులువుగా వచ్చేస్తుంది. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తూ పోషకాలు చెక్కుచెదరకుండా రుచికరమైన ఉడికించిన గుడ్లను ఆస్వాదించండి.

 

 

How To Boil Eggs, Perfect Boiled Eggs, Egg Peeling Tips, Boiling Eggs Without Cracking, Kitchen Hacks, Easy Egg Recipe Tips, Hard Boiled Egg Guide.
 

By
en-us Political News

  
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
గర్భధారణ మొదటి త్రైమాసికంలో తల్లులు మరియు బిడ్డ ఆరోగ్యం కోసం ఏయే పోషకాలు తగాలో తెలుసుకోండి. ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ప్రొటీన్ మరియు విటమిన్ల ప్రాముఖ్యతతో కూడిన పూర్తి ఆహార మార్గదర్శిని.
మేక తలకాయ కూర తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు, ప్రోటీన్, విటమిన్ బి12 మరియు ఐరన్ లాభాల గురించి తెలుసుకోండి.
పిల్లలు పండ్లు, కూరగాయలు తినడానికి మొండికేస్తున్నారా? అయితే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్, దానిమ్మ రసంతో ఇంట్లోనే సులభంగా ఆరోగ్యకరమైన ఏబీసీ గమ్మీస్ తయారు చేసే ఈజీ రెసిపీని తెలుసుకోండి. 6 నెలల పాటు నిల్వ ఉండే ఈ హెల్తీ క్యాండీల తయారీ విధానం!
నిమ్మ మరియు నారింజ తొక్కలను వంటల్లో వాడటం ఆరోగ్యానికి హానికరమా? సిట్రస్ పండ్లపై ఉండే పురుగుమందుల అవశేషాలు మరియు రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య ముప్పు గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
వంటగది సింక్ ఎల్లప్పుడూ మెరిసిపోవడానికి, బ్లాక్ కాకుండా ఉండడానికి సింక్‌లో వేయకూడని వ్యర్థాలు మరియు ముఖ్యమైన శుభ్రత చిట్కాలను తెలుసుకోండి.
దీపావళి పండుగకు నూనె లేకుండా, కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన హై ప్రొటీన్ స్ప్రౌట్స్ కెనాప్స్ చాట్ తయారు చేసుకోండి. రుచి మరియు ఆరోగ్యం అందించే ఈ స్పెషల్ రెసిపీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుందనే సోషల్ మీడియా వైరల్ ట్రిక్ వెనుక అసలు నిజం ఏమిటి? వైద్యులు చెబుతున్న హెచ్చరికలు మరియు సరైన ఆరోగ్య చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
రాగి మరియు జొన్న పిండిలో ఏది ఆరోగ్యకరమైనది? పోషకాలు, బరువు తగ్గడం, ఎముకల బలం మరియు గ్లూటెన్-ఫ్రీ ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
జిమ్‌లో ఎంత కష్టపడి వ్యాయామం చేసినా ఫలితం లేదా? నిద్రలేమి కండరాల పెరుగుదల, బలం మరియు ఫిట్‌నెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపలు ఎంతగా సహాయపడతాయి? వారానికి ఎన్నిసార్లు, ఏ రకమైన చేపలు తినాలి? సాల్మన్, సార్డిన్ లాంటి చేపల్లోని పోషకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
దీపావళి పండుగ సమయంలో మధుమేహం ఉన్నవారు స్వీట్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ ఫ్రీ మరియు బెల్లం స్వీట్లు సురక్షితమేనా? రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ముఖ్యమైన ఆరోగ్య చిట్కాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.