అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం... భాషను కాపాడుకోవాలిప్పుడు..

Publish Date:Feb 21, 2023

Advertisement

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం…అనగానే...


తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం..


తెలుగు వీర లేవరా..

దీక్షబూని సాగరా…

దేశమాత స్వేచ్చకోరి తిరుగుబాటు చేయరా..


నా పాట తేట తెలుగు పాట

నా పాట తేనెలొలుకు పాట

పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట…


అబ్బా . ఎన్నెన్ని మంచి పాటలు కదా… మాతృభాషా దినోత్సవమంటే సభలూ సమావేశాలు పెట్టేసి.. పాటలు, ఉపన్యాసాలు దంచి కొట్టేసి.. హమ్మయ్య మనం తెలుగు భాష కోసం పాటుపడుతున్నాం అనుకుని సభల్లో బాగా మెక్కి ఇంటికెళ్లిపోవడం. ఆ తరువాత ఎక్కడ చూసినా ఇంగ్లీషులో మాట్లాడుతూ, ఇంగ్లీషులో మునిగి తేలుతూ.. తమ పిల్లలను అచ్చంగా ఇంగ్లీషు భాషలోనే పెంచుతూ తెలుగుకు మంగళం పాడేస్తుంటారు. ఇదేనా తెలుగు భాషకు పాటు పడటం. 


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఒక దేశానికి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినది. అసలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా..


1947 లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా రెండు భాగాలుగా ఏర్పడింది. వాటిలో  ఒకటి తూర్పు పాకిస్తాన్ కాగా  రెండవది పశ్చిమ పాకిస్తాన్. తూర్పు పాకిస్తాన్ ను ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటున్నాం. రెండవ భాగం  పాకిస్తాన్ గా ఉంది. అయితే అప్పటికి రెండు భాగాలలో భాష, సంస్కృతి వేరువేరుగా ఉండేది. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ జాతీయ భాషగా ఉర్ధూను ప్రకటించింది. ఇది బంగ్లా ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ శాతం ప్రజలు బంగ్లా మాట్లాడతారు. అందుకే వారికి పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయభాషగా ఉండాలని డిమాండ్ చేశారు. 


తూర్పు బంగ్లా ప్రజలు అదే విషయాన్ని పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. నిరసన చేపట్టారు. దీన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ఇంకా అనేక నిబంధనలు విధించింది. దానికి వ్యతిరేకంగా డాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. 1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ లీగ్ అదే రోజు పార్లమెంటర్ పార్టీకి రాజీనామా చేశారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.


ఇలా ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద భాషలు అన్నిటినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది.


దీన్ని బట్టి చూస్తే..  మనకు అవసరం కోసం, పై చదువుల కోసం ఎన్ని భాషలు అవసరమైన అవన్నీ అక్కరకు మాత్రమే.. మాతృభాష అనేది తప్పక ప్రతిఒక్కరి జీవితంలో ఉండాలి. మాతృ అనే పదంలోనే అది అమ్మ భాష అనే అర్థం ఉంది. మాతృ భాషను వదులుకుంటే అమ్మను కాలదాన్నినట్టే.. కాబట్టి పరభాషను గౌరవించాలి, ఆదరించాలి, మన భాషను ప్రేమించాలి, పోషించాలి, ఎప్పటికీ నిలుపుకోవాలి.. అంతేకానీ ఒకరోజు ముచ్చటగా ముగించకూడదు.


ఏ దేశమేగినా..ఎందుకాలిడినా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. ఇందులోనే ఈ జాతిలోనూ.. ఈ భూమిలోనూ మన తెలుగు భాష ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలి. 


                                    ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
గర్భధారణ మొదటి త్రైమాసికంలో తల్లులు మరియు బిడ్డ ఆరోగ్యం కోసం ఏయే పోషకాలు తగాలో తెలుసుకోండి. ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ప్రొటీన్ మరియు విటమిన్ల ప్రాముఖ్యతతో కూడిన పూర్తి ఆహార మార్గదర్శిని.
మేక తలకాయ కూర తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు, ప్రోటీన్, విటమిన్ బి12 మరియు ఐరన్ లాభాల గురించి తెలుసుకోండి.
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా, పెంకు సులువుగా వచ్చేలా చేయడానికి కొన్ని సింపుల్ మరియు ఎఫెక్టివ్ కిచెన్ టిప్స్. పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ కోసం ఈ సులభమైన ట్రిక్స్ తెలుసుకోండి!
పిల్లలు పండ్లు, కూరగాయలు తినడానికి మొండికేస్తున్నారా? అయితే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్, దానిమ్మ రసంతో ఇంట్లోనే సులభంగా ఆరోగ్యకరమైన ఏబీసీ గమ్మీస్ తయారు చేసే ఈజీ రెసిపీని తెలుసుకోండి. 6 నెలల పాటు నిల్వ ఉండే ఈ హెల్తీ క్యాండీల తయారీ విధానం!
నిమ్మ మరియు నారింజ తొక్కలను వంటల్లో వాడటం ఆరోగ్యానికి హానికరమా? సిట్రస్ పండ్లపై ఉండే పురుగుమందుల అవశేషాలు మరియు రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య ముప్పు గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
వంటగది సింక్ ఎల్లప్పుడూ మెరిసిపోవడానికి, బ్లాక్ కాకుండా ఉండడానికి సింక్‌లో వేయకూడని వ్యర్థాలు మరియు ముఖ్యమైన శుభ్రత చిట్కాలను తెలుసుకోండి.
దీపావళి పండుగకు నూనె లేకుండా, కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన హై ప్రొటీన్ స్ప్రౌట్స్ కెనాప్స్ చాట్ తయారు చేసుకోండి. రుచి మరియు ఆరోగ్యం అందించే ఈ స్పెషల్ రెసిపీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుందనే సోషల్ మీడియా వైరల్ ట్రిక్ వెనుక అసలు నిజం ఏమిటి? వైద్యులు చెబుతున్న హెచ్చరికలు మరియు సరైన ఆరోగ్య చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
రాగి మరియు జొన్న పిండిలో ఏది ఆరోగ్యకరమైనది? పోషకాలు, బరువు తగ్గడం, ఎముకల బలం మరియు గ్లూటెన్-ఫ్రీ ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
జిమ్‌లో ఎంత కష్టపడి వ్యాయామం చేసినా ఫలితం లేదా? నిద్రలేమి కండరాల పెరుగుదల, బలం మరియు ఫిట్‌నెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.