యుద్ధం మార్చిన జీవిత కథలు... ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం2025..!

Publish Date:Jan 7, 2025

Advertisement

 


ఈ ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. అధికారం కోసమో, అస్థిత్వం కోసమో లేక నాయకుల అహంకారపు విధానాల వల్లనో రోజూ ఏదో మూలన చిన్నదో, పెద్దదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది.. మనం వింటూనే ఉంటాము. కానీ  మనలో చాలామంది ఆలోచనలు యుద్ధంలో  ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ సైనికులు, ప్రజలు ఎంతెంతమంది  చనిపోయారు? అనే ప్రశ్నల దగ్గరే ఆగిపోతాయి.. కానీ, ఆ యుద్ధాలవల్ల కొందరి బ్రతుకులు ఒక్క రోజులోనే చీకట్లోకి నెట్టివేయబడుతున్నాయన్న విషయం  మనమంతా మర్చిపోతుంటాము. ఎవరివి ఆ జీవితాలు అనుకుంటున్నారా... ఇంకెవరివి!! దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారబోయటంతో  అనాథలైన   సైనికుల పిల్లలవి..  అలాగే జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ బాంబో వచ్చిపడి అందరూ చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన సామాన్య ప్రజల పిల్లలవి.... ఇటువంటి వారి పరిస్థితి ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా?.. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా..!  మరి వారి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు?. ఇలా ప్రపంచ యుద్దం కారణంగా అనాథలైన పిల్లల గురించి అనాథల గురించి ఆలోచించే దిశగా ప్రజలను చైతన్యం చేసేదే ప్రపంచ యుద్ద అనాథల దినోత్సవం.  దీని గురించి తెలుసుకుంటే..


ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు మొదలైంది....

యుద్ధం వల్ల అనాథలైన  సైనికుల పిల్లల గురించి ఆలోచించి వారి కోసం మొదటగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన  ఘనత రోమన్లకి దక్కుతుందని చరిత్ర చెబుతుంది. అయితే   ఆధునిక ప్రపంచంలో  ప్రస్తుత   యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం,  అనాథలైన  పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక,  శారీరక ఆటంకాలను గుర్తు చేయడం కోసం   ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్’ అనే ఫ్రెంచ్ సంస్థ ఈ ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి6 న జరపడం మొదలుపెట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు వేదికను అందించడం, వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ, ప్రభుత్వాల దాకా అందరినీ  ఇందులో భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథల హక్కులు, సమస్యలు గురించి పోరాడేలా చేయటం, వారి భవిష్యత్తుకి మంచి పునాది వేయటమే దీని ఉద్దేశ్యం.  

 ఎందుకు జరుపుకోవాలి....

యూనిసెఫ్ ప్రకారం, 1990 నుంచి 2001సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధాల కారణంగా  అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకుపైగా అనాథలు ఉన్నారు.  2001 నుంచి ప్రతి సంవత్సరం 0.7 శాతం అనాథల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అది చెప్పుకోతగ్గ  మార్పెమీ  కాదు. పైగా  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,  ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం,  కొత్తగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న చిచ్చు వంటి   ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే  అనేక మంది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత మంది అనాథ పిల్లలు  నిర్లక్ష్యం చేయబడకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకోవాలి. అటువంటి అనాథ  పిల్లలు జీవితంలో ఎదుర్కునే అన్ని సమస్యలను  గుర్తు చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా అనాథలుగా మిగలకుండా, యుద్ధం లేని ప్రపంచ స్థాపన కోసం కృషి చేయటంలో అందరి బాధ్యతని  గుర్తు చేయటం కోసం  ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యుద్ధాలవల్ల పిల్లలకి జరుగుతున్న అన్యాయం..

యుద్ధ కాలంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించి, వాటిని నివారించాలని ప్రపంచ దేశాలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. పిల్లలకు మానవతా సహాయం అందకుండా చేయటం  పిల్లలను కిడ్నాప్ చేయటం,  చంపేయడం,  బలాత్కారం లేదా ఇతర తీవ్రమైన లైంగిక హింసకి పాల్పడటం.  స్కూల్ల్స్, హాస్పిటల్ల మీద దాడులు చేయడం వంటి ఎన్నో  అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణంగా పిల్లలని సాయుధ దళాల్లో  లేదా రెబల్ గ్యాంగుల్లో చేర్పించి వాళ్ళని  అక్రమ కార్యాలకి ఉపయోగించుకోవటం కూడా చేస్తున్నారు.

 ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే  ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవ వేదికగా ప్రజలందరూ ప్రశ్నించి, నిలదీయాలి. ఒకవేళ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే, వారు మన సమాజంలో ఉన్న అసాంఘిక, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చిక్కి, తప్పుడు దారిలో నడుస్తారు. అది మన సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. మన సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ నిర్లక్ష్యం చేయబడకూడదు, పైగా సర్వస్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు అస్సలు నిర్లక్ష్యం చేయబడకూడదు.


                                            *రూపశ్రీ.

By
en-us Political News

  
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఏ రోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? బంగారం, వెండి, పాత్రలతో పాటు ఏది శుభప్రదం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మానవ ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధునిక పోషకాహార ఫ్రేమ్‌వర్క్ తెస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రయోజనాల గురించిన పూర్తి సమగ్ర విశేషాలు.
మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా? ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ప్రముఖ నిపుణులు డాక్టర్ బాలు యెల్లెపు సూచించిన 10 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ మరియు డైట్ చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
తెలంగాణ స్టైల్ నల్లకూర ఫ్రై తయారీ విధానం తెలుసుకోండి. నీచు వాసన రాకుండా, పర్ఫెక్ట్ మసాలాలతో పల్లెటూరి రుచిలో నల్లకూర ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేయండి.
ఆంధ్రా స్టైల్ చింత చిగురు రొయ్యల కూర తయారీ విధానం మరియు ఆరోగ్య ప్రయోజనాలు. రుచికరమైన పచ్చి రొయ్యల కర్రీని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.
దీపావళి పండుగ ప్రత్యేకంగా స్వీట్ షాప్ స్టైల్ లో నేతి బొబ్బట్లు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ కొలతలు, చిట్కాలతో రుచికరమైన బొబ్బట్ల రెసిపీ.
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు.
చాయ్‌తో తినడానికి సరికొత్త రుచితో కరకరలాడే బియ్యంపిండి మురుకులను ఇంట్లోనే అత్యంత సులభంగా, నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.