1971 యుద్ధ విజయానికి ఘన స్మారకం: విజయ్ దివస్..!

Publish Date:Dec 16, 2024

Advertisement

 

నేడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ఏ దేశానికాదేశం,  వారి మిలిటరీ శక్తి సామర్ధ్యాలతో భయపెట్టి తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని,ప్రపంచ రాజకీయాల్లో తామే హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రపంచంలోని  గొప్ప మిలిటరీ శక్తుల్లో ఒకటిగా పేరుగాంచిన భారతదేశం మాత్రం ఎప్పుడూ తన బలం, అధికారం చూపించుకోవటానికి ఏ దేశంపైనా మొదటిగా దాడి చేయలేదు. ఇప్పటికీ అదే సిద్దాంతం అనుసరిస్తుంది. అయితే ఒకానొక సమయంలో  మన పొరుగు దేశమైన పాకిస్తానుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అది కూడా స్వార్ధ ప్రయోజనాల గురించి కాకుండా, పాకిస్తాన్ ప్రజల కోసమే చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధమే  మన  దేశ సైన్యపు శక్తి సామర్ధ్యాల గురించి ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో మన దేశాన్ని హీరోని చేసింది. అలాంటి గొప్ప యుద్ధం గురించి, అందులో వీరోచితంగా పోరాడిన సైన్యపు త్యాగాల గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఆ  విజయాన్ని, విజయం తెచ్చిపెట్టిన సైన్యాన్ని స్మరించుకోవటానికి గానూ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు.  సినిమా సక్సెస్ లు, సినిమాలలో హీరోల త్యాగాలు కాదు.. రియల్ లైప్ లో హీరోలుగా, ఒక యుద్దాన్ని విజయవంతం చేసిన వీరులుగా భారతీయ ఆర్మీని కొనియాడటానికి విజయ్ దివస్ వేదికగా మారుతుంది.


ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న, భారతదేశం విజయ్ దివస్‌ను జరుపుకుంటుంది. 1971లో  భారతదేశం, పాకిస్థాన్ల  మధ్య జరిగిన యుద్ధంలో విజయాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి  మద్దతుగా భారతదేశం చేసిన త్యాగాలను స్మరించుకునే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది.

యుద్దం ఎందుకు జరిగింది..

భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగిన తరవాత 1971కి ముందు పాకిస్తాన్ అనేది మన దేశానికి తూర్పు, పడమరల్లో కూడా ఉందేది. అయితే  తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)  ప్రజలు పాకిస్థాన్ శాసనానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేశారు. వారికి భారత దేశం మద్దతు దొరకటంతో  తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించి బంగ్లాదేశ్ దేశంగా మారింది. ఈ గొడవకంతటికి చాలా విషయాలు కారణాలుగా నిలిచాయి.  వాటిలో భాషా విభేదం చాలా ఉంది.  తూర్పు పాకిస్థాన్‌లో ఎక్కువ మంది బెంగాళీ మాట్లాడేవారు.  అయితే పశ్చిమ పాకిస్థాన్‌లో ఉర్దూను అధికార భాషగా ప్రకటించడం పట్ల తూర్పు పాకిస్థాన్‌లో నిరసనలు చెలరేగాయి. ఆర్థిక అసమానతలు కూడా విభేదాలకు కారణమయింది.  మొత్తం పాకిస్తాన్  ఆర్ధికాదాయంలో తూర్పు పాకిస్థాన్ నుంచి అధిక  ఆర్థిక ఆదాయం సమకూరుతున్నప్పటికీ, దాని ప్రయోజనాలు మాత్రం పశ్చిమ పాకిస్థాన్‌ పొందేది. దీని వ్ల  తూర్పు పాకిస్తాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగేది.  రాజకీయకంగా కూడా రెండు భాగాలలో విబేధాలు ఎక్కువగా ండేవి1970 ఎన్నికల్లో అవామీ లీగ్, షేక్ ముజీబుర్ రెహ్మాన్ నాయకత్వంలో తూర్పు పాకిస్థాన్‌లో విజయం సాధించింది. అయినప్పటికీ పశ్చిమ పాకిస్థాన్  ఈ విజయాన్ని అంగీకరించలేదు. వీటన్నింటి వల్ల పాకిస్తాన్ లోనే రెండు భాగాల మధ్య విభేదాలు చాలా ఎక్కువ అయ్యాయి.

పాక్ దాడి-  భారత్ ప్రతిస్పందన ఎలా ఉందంటే..


మార్చి 26, 1971న, పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్‌ లైట్ ప్రారంభించి, తూర్పు పాకిస్థాన్‌లో బెంగాళీ ప్రజలను పీడించటం మొదలుపెట్టింది. దీంతో భయపడిపోయిన దాదాపు  కోటిమంది  శరణార్థులు తూర్పు పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి వచ్చారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మెఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోకి వచ్చారు. ఇదిలాగే కొనసాగితే భారత దేశం సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిజాన్ని గ్రహించి, ఈ పరిస్థితిని చక్కబెట్టటానికి భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

మొదట భారతదేశం ఈ పరిస్థితిని దౌత్యపరంగా పరిష్కరించాలనే  ప్రయత్నించింది. కానీ, ప్రపంచదేశాల  నుండి తగిన ప్రతిస్పందన రాకపోవడంతో భారతదేశం సైనిక చర్య చేపట్టింది. భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, తూర్పు పాకిస్తాన్ ప్రజలతో ఏర్పడిన స్వాతంత్ర సైన్యమైన ముక్తి బహిని సైన్యానికి పూర్తి మద్దతు అందించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ విజయ్ మొదలైంది.

1971 డిసెంబర్ 3వ తేదీన భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇది 13 రోజులపాటూ  కొనసాగి డిసెంబర్ 16న ముగిసింది. ఇందులో ఆపరేషన్ విజయ్ ద్వారా భారత సైన్యం, ముక్తి బహినిసైన్యంతో కలిసి, తూర్పు పాకిస్థాన్‌లో ఉన్న  పాకిస్థాన్ సైన్యాన్ని ఎదుర్కొని అనేక విజయాలు సాధించింది.  ఈ యుద్దంలో పలు చిన్నచిన్న యుద్దాలు సాగాయి.  వీటిలో లాంగేవాలా యుద్ధం, ఆపరేషన్ ట్రైడెంట్ వంటివి ఉన్నాయి. డాకాలో 93,000 మంది పాకిస్థాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవటంతో ఈ యుద్ధానికి తెర పడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సైనికులు  లొంగిపోయిన యుద్ధంగా ఇది  చరిత్రలో నిలిచింది.

1971,  డిసెంబర్ 16వ తేదీన, బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ యుద్ధంలో సుమారు 3,900 భారత సైనికులు అమరులయ్యారు, 9,851 మంది గాయపడ్డారు. వారు సాదించిపెట్టిన విజయానికి  గుర్తుగా,  సైన్యం చేసిన  త్యాగాలకి స్మరించుకుంటూ  భారతదేశంలో ఈ రోజుని  విజయ్ దివస్‌గా,  బంగ్లాదేశ్‌లో విజయ్ దిబోష్‌గా జరుపుకుంటారు.  ప్రతీ పౌరుడు మానవత్వంతో మన దేశం, సైన్యం చేసిన త్యాగాలని  స్మరించుకుని,  భారతీయుడిగా గర్వపడాలి. వీటి నుంచి ముఖ్యంగా యువత    స్ఫూర్తిని పొందాలి.

                                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
మన ఆరోగ్యానికి పెను సవాలుగా మారిన అనేక వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు. కణాల పెరుగుదల అదుపు తప్పి, ఇతర అవయవాలకు వ్యాపించడమే ఈ సమస్యకు ముఖ్య కారణం...
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
బేరి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ మరియు మధుమేహం అదుపులో పియర్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు.
అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? రీహీటెడ్ రైస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం మరియు పాటించాల్సిన 24 గంటల రూల్ గురించిన పూర్తి వివరాలు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వంట నూనెలు ఉత్తమమైనవి? కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి నూనెలను ఏ విధంగా వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ క్రీమ్స్‌కు బదులుగా 800 ఏళ్ల నాటి ఆయుర్వేద నిపుణులు సూచించిన జాజికాయ, ములేఠీ పేస్ట్ చిట్కాతో సహజంగా మెరిసే కళ్లను సొంతం చేసుకోండి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, డయాబెటిస్ ముప్పును నివారించడానికి కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్న 4 హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.