ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ మహమ్మారికి అంతు లేదా!

Publish Date:Nov 6, 2026

Advertisement


మన ఆరోగ్యానికి పెను సవాలుగా మారిన అనేక వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు. కణాల పెరుగుదల అదుపు తప్పి, ఇతర అవయవాలకు వ్యాపించడమే ఈ సమస్యకు ముఖ్య కారణం. ఈ జబ్బు తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన  ఉండాలి. లక్షణాలను మొదట్లోనే  గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకునే అవకాశం లభిస్తుంది. ఇందుకోసమే మన దేశంలో ప్రతి ఏటా నవంబర్ ఏడో తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజల్లో అపోహలు తొలిగించి, ముందస్తు పరీక్షలు, సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడటమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

 చరిత్ర..

మన దేశంలో క్యాన్సర్ విస్తరణను అరికట్టడానికి, ముందుగానే ఈ వ్యాధిని గుర్తించడానికి 2014 సెప్టెంబరులో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, నవంబర్ ఏడో తేదీని జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా ప్రకటించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సేవా విభాగాలు, ఆసుపత్రులు కలిసి వ్యాధి నివారణపై అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి.

మన దేశంలో క్యాన్సర్ పరిస్థితి చూస్తే ఇది ఎంత తీవ్రమైన సమస్యో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఈ వ్యాధితో కన్నుమూస్తున్నారు. భారతదేశంలో ఒకేసారి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారని అంచనా. ప్రతి ఏటా సుమారు ఏడు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయమేమిటంటే, కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు వ్యాధి ముదిరిపోయిన దశలోనే బయటపడుతున్నాయి. దీనివల్ల నయం చేయడం కష్టంగా మారుతోంది. బాధితుల్లో నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ మంది ముప్పై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నవారే కావడం గమనార్హం.

మగవారిలో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు , జీర్ణశయానికి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పొగాకు , దానికి సంబంధించిన ఉత్పత్తులను వాడటం వల్ల మన దేశంలో యాభై శాతం మగవారి క్యాన్సర్లకు, పాతిక శాతం మహిళల క్యాన్సర్లకు ప్రధాన కారణమవుతోందట. మారుతున్న జీవనశైలి వల్ల రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించవచ్చు..

పొగాకు, సిగరెట్లు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం మొదటి మెట్టు. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ,  బరువును మెయింటైన్ చేయాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రమాదకరమైన సూర్యరశ్మి , రసాయన ప్రభావాలకు దూరంగా ఉండటం మంచిది. అన్నింటి కంటే  ముఖ్యంగా, ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే గుర్తించి పూర్తీగా నయం చేసుకోవచ్చు.

వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే సరైన మార్గం. ఎలాంటి చిన్న మార్పు లేదా లక్షణం శరీరంలో కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది.

                                              *రూపశ్రీ.

By
en-us Political News

  
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
బేరి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ మరియు మధుమేహం అదుపులో పియర్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు.
అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? రీహీటెడ్ రైస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం మరియు పాటించాల్సిన 24 గంటల రూల్ గురించిన పూర్తి వివరాలు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వంట నూనెలు ఉత్తమమైనవి? కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి నూనెలను ఏ విధంగా వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ క్రీమ్స్‌కు బదులుగా 800 ఏళ్ల నాటి ఆయుర్వేద నిపుణులు సూచించిన జాజికాయ, ములేఠీ పేస్ట్ చిట్కాతో సహజంగా మెరిసే కళ్లను సొంతం చేసుకోండి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, డయాబెటిస్ ముప్పును నివారించడానికి కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్న 4 హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.