తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్

Publish Date:Feb 22, 2026

Advertisement

 

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబేటరీ సేవలు త్వరలో అందుబాటులోనికి తీసుకురాబోతున్నామని  మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భక్తులకు సురక్షితమైన, మంచి నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారం అందించేందుకు వీలుగా ఈ ల్యాబ్ను అత్యాధునిక పరికరాలు/యంత్రాలతో సిద్ధం చేస్తున్నారు. రూ.25 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్లో స్వామి వారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి ఆరవై రకాల ముడిసరకులు, ప్రసాదాల నాణ్యతను పరీక్షిస్తారని చెప్పారు. 

తిరుమలలోని ఫుడ్ ల్యాబ్రేటరీ ఏర్పాటు పనులు 90% వరకు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఈ ల్యాబ్ కార్యకలాపాలు వచ్చేనెల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. కల్తీని నెయ్యిని దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాబ్లో ప్రత్యేకంగా ఈ-టంగ్ అండ్ ఈ- నోస్ (ఎలక్ట్రానిక్ నోరు- ఎలక్ట్రానిక్ ముక్కు) మిషన్లను రూ.3.5 కోట్ల వ్యయంతో సమకూర్చబోతున్నామని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతలో అత్యంత సూక్ష్మస్థాయిలో లోపం ఉన్నా... ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలు పసిగడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోనికి తెచ్చేందుకు మే వరకు సమయం పట్టే అవకాశం ఉందని సూత్రప్రాయంగా మంత్రి సత్యకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

అక్టోబరు, 2024లో ఎఫ్ఎస్ఎస్ఐతో కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి..!

ముఖ్యమంత్రి  చంద్రబాబు ఆదేశాలు అనుసరించి తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుపై  సత్యకుమార్ తనకున్న పరిచయాలతో కేంద్రంతో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు ఫుడ్సేఫీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.23 కోట్లను మంజూరుచేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ మధ్య ఒప్పందం అక్టోబరు 8, 2024న మంత్రి  సత్యకుమార్ సమక్షంలో ఢిల్లీలో జరిగింది. అధికారులు తిరుమలలోని పిండిమిల్లు ఆవరణలో ఉన్న 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన పాత రెండు అంతస్తుల భవనాన్ని కేటాయించారు. దీనిని ఫుడ్ ల్యాబరేటరిగా తీర్చిదిద్దే పనులు కిందటేడాది జులైలో ప్రారంభమయ్యాయి.

50 పరికరాలు/యంత్రాలతో విరివిగా నాణ్యత పరీక్షలు

ఈ ల్యాబ్లో మైక్రో బయాలజీ, కెమిస్త్రీ, సెన్సరీ విభాగాల్లో నమూనాల పరీక్షలు జరగనున్నాయి ప్రసాదాలు, ఆహార పదారాలు, నీరు, ముడిసరకుల నాణ్యతను పరీక్షిస్తారు. ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడిసరకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమీకీటకాలు, యాంటీబయాటిక్స్ వంటి వాటి నమూనాలను ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. ఆహార పదార్థాలు, ప్రసాదాల్లో 200 రకాల పురుగు మందుల అవశేషాలు గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ల్యాబ్ ద్వారా అందుబాటులోనికి వస్తున్నాయి. 

ఈ ల్యాబ్లో టీటీడీ జలప్రసాదాల నమూనాలను కూడా పరీక్షిస్తారు. వీటి అన్నింటి కోసం మొత్తం 50 రకాల పరికరాలు/ యంత్రాలు ఈ ఫుడ్ ల్యాబ్రేటరీలో ఉంటాయి. ఈ ల్యాబ్ నిర్వహణ కోసం వివిధ హోదాల్లో కలిపి 40 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ, టీటీడీ సంయుక్తంగా అందుబాటులోనికి తెస్తున్నాయి. ఈ ల్యాబ్ కార్యకలాపాలపై మరో ఒప్పందం వైద్య ఆరోగ్య శాఖ, టీటీడీ మధ్య త్వరలో జరగనుంది. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ల్యాబ్ల ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ వివిధ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంది. అయితే ఏపీలో మాత్రమే తొలిసారిగా ఓ పుణ్యక్షేత్రంలో ల్యాబ్ అత్యాధునిక వసతులతో రాబోతుంది.

ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలు!

ఫ్రాన్స్‌లో తయారయ్యే ఈ యంత్రాన్ని తిరుమలలోని ఫుడ్ ల్యాబ్స్టరీలోనూ సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్న ల్యాబరేటరీలు దేశ వ్యాప్తంగా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనిషి ముక్కు ద్వారా వాసన, నోటి ద్వారా రుచి ఎలా చూస్తారో ఈ యంత్రాల ద్వారా ప్రసాదాలు, ఆహార పదార్థాలు, వాటి తయారీకి వినియోగించే ముడిసరకులను పరీక్షించేందుకు వీలుంది. తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనను దృష్టిలో ఉంచుకుని మంత్రి సత్యకుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ మిషన్  కొనుగోలుకు అవసరమైన రూ.3.5 కోట్లను అదనంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాల వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు కూడా ప్రాన్స్ నుంచి వస్తాయి.


 

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న ఫాగింగ్ కార్యక్రమంలో భారీ అవినీతి వ్యవహారం బట్టబయలు అయింది.
ర‌సాయ‌నం- ర‌సాయ‌నం- ర‌సాయ‌నం. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో ర‌సాయ‌నం. ఇప్పుడు రాజ‌మండ్రి పాల‌లో ర‌సాయ‌నం.
జ‌గ‌న్ ప‌త‌నం మొద‌లైందే వెంక‌న్న స్వామి కార‌ణంగా. ఈ విష‌యంలో ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు మ‌న‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌.
నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు క్రీడలు ఒక ఆటవిడుపుగా ఉంటూ మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అసెంబ్లీలో తిరుమ‌ల ల‌డ్డూ న‌కిలీ నెయ్యి వ్య‌వ‌హారంలో జ‌రిగిన ఒక చ‌ర్చ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విభిన్న‌మైన శైలిలో ప్ర‌సంగించారు.
భారత్ క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాడు.
ద‌శాబ్దాల త‌మ వాంఛ‌ను నెర‌వేర్చారంటూ ఉద్యోగ, పెన్ష‌న‌ర్‌ సంఘాల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అమ్మ మాతృత్వానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్న నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
2019-24 సంవత్సరంలో 2032 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.