జగన్ పతనం మొదలైందే...వెంకన్న ఇష్యూతోనే!
Publish Date:Feb 24, 2026
Advertisement
జగన్ పతనం మొదలైందే వెంకన్న స్వామి కారణంగా. ఈ విషయంలో రఘురామకృష్ణమరాజు మనకు ఒక ఉదాహరణ. జగన్ తో అసలు మీకొచ్చిన గొడవలేంటని ఆయన్ను ప్రశ్నించగా చెప్పే సమాధానం ఒక్కటే. ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవు. వెంకన్న భూములను అమ్ముతుంటే నేను అడ్డుకున్నా.. వద్దని వారించా.. అక్కడి నుంచి మా గొడవలు మొదలయ్యాయని అన్నారాయన. ఆ తర్వాత ఆయన యాంటీ వైసీపీ వాయిస్ వినిపించడమే చాలా పెద్ద చేటు తెచ్చింది. ఇదిలా ఉంటే అసెంబ్లీలో పవన్ కూడా ఒక మాట అన్నారు. మేము ఈ విషయాన్ని ఇంతగా లాగదలుచుకోలేదని.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా జంతు కొవ్వు కలిసిందని మాత్రమే చెప్పాం. దాని మీద ఇంత పెద్ద రాద్ధాంతం చేసింది వైసీపీ వారేనని అన్నారు. వైసీపీకి కూడా వెంకన్న కేంద్రంగా ఏదో ఒక గొడవ కావాలని ఆశించడం బాగా ఎక్కువ. ఇప్పటి నుంచే కాదు గత చంద్రబాబు పాలనలో కూడా రమణ దీక్షితులను అడ్డు పెట్టి లేని పింక్ డైమండ్ వ్యవహారం వెలికి తీసి రచ్చ రచ్చ చేశారు. అది చంద్రబాబు ప్రభుత్వానికి బాగా ఇరుకున పెట్టింది. ఆ తర్వాత నాటి చంద్రబాబు ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కూడా లడ్డూలో నకిలీ నెయ్యి విషయంలో సుప్రీ కోర్టుకు వెళ్లింది జగన్ వర్గమే. మరీ ముఖ్యంగా సుబ్బారెడ్డి ఈ విషయంలో సుప్రీంకి వెళ్దాం అంటూ మరింత జటిలం చేశారు. ఇప్పుడేమైంది? వారికే బెడిసి కొట్టింది. ఎవరైతే సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్దామని అన్నారో.. ఆయనే చివరికి.. యూటర్న్ తీసుకుని.. తప్పు జరిగింది నిజమే కానీ అది తనకు తెలీదని చేతులెత్తేశారు. ఇక్కడే పాయింట్ లాగారు జ్యోతుల నెహ్రూ. జగన్ అండ్ కోతో తాను గతంలో పని చేశాననీ.. ఇక్కడ తానొక విషయం అడగదలుచుకున్నాననీ.. అన్నారాయన. ఒక బోర్డుకు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి తన అధ్వర్యంలో తప్పు జరిగింది తెలిసినపుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది కదాని నిలదీశారు. ఆయన వదిలేస్తే వదిలేశారు.. ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి అయినా ఈ తప్పిదం గుర్తించి సరిదిద్దాలి కదా? అని ప్రశ్నించారు. ఇక్కడితో వదిలేయకుండా ప్రభుత్వం వన్ మెన్ కమిటీ వేస్తే సుబ్రహ్మణ్య స్వామి చేత పిటిషన్ వేయించారు.. మధ్యలో స్వామికి వచ్చిన నొప్పి ఏమిటో తనకు అర్ధం కాలేదని అన్నారు జ్యోతుల. అయితే జగన్ కి స్వామి ఎంత మిత్రుడో తనకు తెలుసని.. తాను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎరుగుదనని చెప్పారు జ్యోతుల నెహ్రూ. ఇలా తామన్న ఒకే ఒక్క మాటను సుప్రీం కోర్టు వరకూ వెళ్లడం నుంచి మొదలు పెడితే, శ్రీవారి ఫోటోలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని మండలిలో నిరసన వ్యక్తం చేయడం వరకూ మొత్తం ఎపిసోడ్లో జగన్ వర్గపు అత్యుత్సాహమే ఎక్కువ.. మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి చేత పిటిషన్ వేయించడం వరకూ చూస్తే.. ఈ అంశంలో జగన్ అండ్ కో ఏదో ఆశిస్తోందని అంటారు. ఇలా ఒక అంశాన్ని చినికి చినికి గాలి వానగా మార్చుతూ వచ్చింది వారే అంటారు పవన్, నెహ్రూ వంటి వారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని మాత్రమే తాము అన్నామని.. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేసింది మాత్రం జగన్ వర్గం వారేనని అంటారు వీరు.
http://www.teluguone.com/news/content/tirumala-laddu-36-214617.html





