మమ్మల్ని భారత్ తీసుకెళ్లండి.. మోడీకి ఇరాన్ లోని ఇండియన్ విద్యార్థుల మొర

Publish Date:Feb 28, 2026

Advertisement

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ లో విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్థులు తమను క్షేమంగా భారత్ తీసుకు వెళ్లాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్రమోడీని కోరుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనల్లో క్షణమొక యుగంగా గడుపుతున్నామంటూ వారు పేర్కొంటున్నారు.    శనివారం (ఫిబ్రవరి 28) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. ఎటు చూసినా బాంబులు, మిస్సైళ్లు, డ్రోన్లు పేలిన శబ్దాలే వినిపిస్తున్నాయి.   

ఈ దశలో పరిస్థితి మరింత క్షీణించకముందే.. భారత్ కు వచ్చేయాలని అక్కడి విద్యార్థులు తహతహలాడుతున్నారు. తమను ఎలాగైనా ఇరాన్ నుంచి ఇండియాకు తీసుకు వెళ్లాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించి టెహ్రాన్ లో ఉంటున్న ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోలో భారీ పేలుళ్ల శబ్దాలు స్పష్టంగా వినిపించాయి.  

ఇలా ఉండగా టెహ్రాన్ లో పలు చోట్ల బాంబుదాడులు జరిగాయి.  ఇరాన్ ను విడిచి వెళ్లాల్సిందిగా ఇండియన్ అంబసీ గతంలోనే సూచించినప్పటికీ పలువురు విద్యార్థులు పరీక్షలు అయిన వెంటనే వెళ్లిపోతామంటూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులను చూసి భయంతో వణికి పోతున్నా ఇండియన్ స్టూడెంట్స్.. యుద్ధంగా ఆగినా కూడా ఇక ఇరాన్ లో మాత్రం ఉండబోమని అంటూ తక్షణమే తమను భారత్ కు తీసుకువెళ్లండంటూ వేడుకుంటున్నారు.  

By
en-us Political News

  
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్)..
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
బినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్‌ బ్రిడ్జిలు రానున్నాయి.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది.
ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.