పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Publish Date:May 15, 2026

Advertisement

పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపు శుక్రవారం (మే 15) ఉదయం నుంచీ అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది.  అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని  గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.  ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77, డీజిల్ రూ. 90.67, ముంబైలో పెట్రోల్ రూ. 106.68, డీజిల్ రూ. 93.14, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 108.74, డీజిల్ రూ. 95.13, చెన్నై పెట్రోల్ రూ. 103.67, డీజిల్ రూ. 95.25కి చేరాయి. 

ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా  సముద్ర మార్గంలో చమురు రవాణా నిలిచిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లు దాటడంతో..  దేశీయంగా ధరలను పెంచక తప్పలేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి.  కాగా ఈ పెంపు వల్ల రానున్న రోజులలో రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.   

By
en-us Political News

  
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది.
ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్ మధ్య కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్షదీప్ తిలక్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమర్యాదగా సంబోధించారు. పంజాబ్ కింగ్స్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది.. కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.