టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఫైన్.. ఎందుకంటే?
Publish Date:Mar 4, 2026
Advertisement
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి ఫైన్ పడింది. రాంచీ ట్రాఫిక్ పోలీసులు ధోనీకి వెయ్యిరూపాయలు జరిమానా విధించారు. ఓవర్ స్పీడ్ తో వాహనం నడిపినందుకు ధోనీకి ఈ జరిమానా పడింది. తన నివాసం సమీపంలో ధోనీ వాహనాన్ని పరిమితికి మించిన వేగంతో నడిపారు. ఈ విషయాన్ని ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. దీంతో మోటారు వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ధోనీకి జరిమానా విధించారు. స్టార్ క్రికెటర్ ధోనీకి జరిమానా విధించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలోధోనీకి సంబంధించిన విషయం కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న రాంచీ ట్రాఫిక్ పోలీసులపై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన నివాసం కోసం కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నాడన్న ఆరోపణలపై ఇటీవల ధోనీకి జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. మొత్తంగా మిస్టర్ కూల్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ క్రికెటర్ వరుసగా ఇలా వివాదాలలో చిక్కుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ranchi-traffic-police-impose-fine-on-dhoni-36-215028.html





