రజనీ భయపడ్డాడా..? అందుకే ఆ నిర్ణయమా...!.
Publish Date:Nov 23, 2017
Advertisement
గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారో.. పలానా పార్టీలో చేరుతున్నారనో.. అబ్బో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఆ వార్తలను ఖండించారు రజనీ. అయితే ఇటీవలే వార్తలను నిజం చేయాలని రజనీ కూడా త్వరలో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు తన అభిమాన సంఘాలతో ముచ్చటించినప్పుడు కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు. ఇక దీంతో అభిమానులు కూడా అప్పటినుండి ఎప్పుడు రజనీ రాజకీయాల్లో అడుగు పెడతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ముగించి ఆ తర్వాత పార్టీ గురించి మరోసారి అభిమానులతో చర్చిస్తాను అంటూ రజనీ మళ్లీ వాయిదా వేశారు. అయితే దీని వెనుక మరో స్టోరీ వినిపిస్తోంది. రజినీకాంత్ పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి కారణం మాత్రం కమల్ అని తెలుస్తోంది. ఎందుకంటే.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న కొన్ని రోజుల్లోనే కమల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నా అని బహిరంగంగానే ప్రకటించాడు. ఇక అప్పటినుండో ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు కమల్. అంతేకాదు.. కమల్ మరి కొన్ని రోజుల్లో పార్టీని ప్రకటించడం ఖాయమని... 2019 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీకి దిగే అవకాశాలు కూడా ఉందని అంటున్నారు. ఈనేపథ్యంలోనే... కమల్, రజినీకాంత్ కు పోటీ పడే అవకాశం ఉందని.. పార్టీ ఏర్పాటుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని అందుకే.. పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని, కమల్‌తో ఢీ కొట్టడం వల్ల లాభం జరగక పోగా నష్టం ఎక్కువ అవుతుందని రజినీకాంత్ భావిస్తున్నాడట. అందుకే పార్టీ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో కమల్ పార్టీ, కమల్ పని తీరును బట్టి రజినీకాంత్ రాజకీయ పార్టీ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఒకవేళ కమల్ పార్టీకి ప్రజల ఆదరణ ఎక్కువైతే ఇక రజనీ రాజకీయాల్లోకి రావడం డౌటే అని అంటున్నారు. మరి కమల్ నాకు పోటీ ఏంటని రజనీ వస్తాడా..? లేక..? వెనుకడుగు వేస్తాడా..?చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో.
http://www.teluguone.com/news/content/rajinikanth-45-78930.html





