బెంగాల్ ఎన్నికలు 2026.. ముస్లిం వీటో ఒక భ్రమ మాత్రమేనా?

Publish Date:Apr 19, 2026

Advertisement

 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో  ముస్లిం ఓటు బ్యాంక్  అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బెంగాల్ ఎన్నికల విశ్లేషణలు అనగానే  ముస్లింల ఓట్ల ఏకీకరణ  (ముస్లిం ఓట్ కన్సాలిడేషన్) అనే అంశం ప్రధానంగా వినిపిస్తుంది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో 80 నుండి 120 సీట్ల భవితవ్యాన్ని ముస్లి మైనారిటీ ఓటర్లే శాసిస్తారనేది రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్న నమ్మకం. అయితే..  గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు,  ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ  ముస్లిం వీటో  అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం  విస్పష్టంగా తెలుస్తుంది. .

జనాభా లెక్కల ప్రకారం బెంగాల్‌ లో ముస్లిం జనాభా సుమారు 27 శాతంగా ఉంది. కానీ ఈ జనాభా రాష్ట్రమంతటా సమానంగా విస్తరించి లేదు. మొత్తం 23 జిల్లాల్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నది కేవలం మూడు జిల్లాల్లోనే. ముర్షిదాబాద్ లో 66శాతం, మాల్దా జిల్లాలో  51శాతం, ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలో  50 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ మూడు జిల్లాలూ వినా మిగిలిన   20 జిల్లాల్లో హిందువుల జనాభాయే అత్యధికంగా ఉంది. అంటే రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ  251 అసెంబ్లీ స్థానాల్లో హిందువులే మెజారిటీగా ఉన్నారు. రాజకీయంగా ప్రచారం పొందుతున్నట్లుగా 80కి పైగా సీట్లలో ముస్లిం ఓటర్లే విజేతలను నిర్ణయిస్తారనే లెక్క తప్పడానికి కారణమేంటంటే.. జిల్లా స్థాయి జనాభా శాతాన్ని నేరుగా నియోజకవర్గాలకు వర్తింపజేయడమే.  

ఎన్నికల వ్యవస్థలో ఫలితాన్ని ఏకపక్షంగా ప్రభావితం చేయాలంటే ఒక నియోజకవర్గంలో ఒక వర్గం ఓట్లు కనీసం 38 నుండి 40 శాతం పైగా ఉండాలి. ఈ ప్రాతిపదికన చూస్తే, ముర్షిదాబాద్‌ లో 20, మాల్దాలో 8, ఉత్తర్ దినాజ్‌పూర్ లో 5 స్థానాలతో పాటు మిగిలిన జిల్లాల్లోని కొన్ని పాకెట్లను కలుపుకున్నా, ముస్లిం ఓటు నిర్ణయాత్మకంగా ఉండే సీట్లు 47 నుండి 54 మధ్య మాత్రమే ఉంటాయి. ఇది మొత్తం రాష్ట్రంలోని సీట్లలో కేవలం 16 నుంచి 18 శాతం మాత్రమే. అంటే, ముస్లిం ఓటు ఒక పార్టీకి ఎన్నికల రేసులో కొంత ముందంజ (హెడ్ స్టార్ట్) ఇవ్వగలదే తప్ప..  రాష్ట్రవ్యాప్తంగా విజయావకాశాలను  శాసించే  వీటో  శక్తి  కాదని అవగతమౌతుంది.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే  ఓట్ల వృథా. ముస్లిం ఓట్లు ఎక్కువగా కేంద్రీకృతమైన సుజాపూర్ వంటి నియోజకవర్గాల్లో గత ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే.. ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో గెలవడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా వచ్చే ఈ లక్షలాది ఓట్లు సభలో ప్రతినిధుల సంఖ్య పెంచడానికి ఉపయోగపడవు. అలాగని ఈ ఓట్లు ఇతర నియోజకవర్గాలకు బదిలీ కావు, కాబట్టి ఇవి కేవలం సంఖ్యాపరంగా పెద్ద మెజారిటీలుగానే మిగిలిపోతాయి తప్ప సీట్ల సంఖ్యను పెంచవు. దీనికి విరుద్ధంగా, 2021 ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించిన కీలకమైన 13 సీట్లు ముస్లిం ప్రాబల్యం లేని ప్రాంతాల్లోనే ఉన్నాయి, అక్కడ మెజారిటీ   3,000 ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయి. 

ఇక ఇప్పుడు.. 2026 ఎన్నికలలో ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 91 లక్షల ఓటర్ల తొలగింపు జరిగింది, అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో 31,000 ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో అనేక సీట్లలో విజేతలకు వచ్చిన మెజారిటీలు  50వేల లోపే ఉన్నాయి.  ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ఏ సామాజిక వర్గంపై లేదా ఏ పార్టీ మద్దతుదారులపై ఎక్కువ ప్రభావం చూపిందనేది రాబోయే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   కేవలం ముస్లిం ఓట్ల ఏకీకరణపైనే దృష్టి పెట్టడం కంటే, ఈ సూక్ష్మ స్థాయి మార్పులను గమనించడం అవసరం. ఎ:దుకంటే.. పోలరైజేషన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ముస్లిం ఓట్లు ఒక పార్టీ వైపు 100 శాతం మొగ్గు చేపితే.. , అది మిగిలిన   హిందూ మెజారిటీ సీట్లలో   హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దారి తీస్తుంది. అయినప్పటికీ..  అన్ని రాజకీయ పార్టీలు ఈ  ముస్లిం వీటో  కథనాన్ని ప్రచారం చేయడానికే ఇష్టపడుతున్నాయి. అధికార టీఎంసీ మైనారిటీలకు రక్షకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి, బీజేపీ హిందూ ఓట్లను సమీకరించడానికీ, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే దీనిని వాడుకుంటున్నాయి. ఇక చివరిగా  పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రం సాధారణంగా అనుకునే మతపరమైన సమీకరణాల కంటే చాలా లోతైనది. ముస్లిం ఓటర్ల పాత్ర ముఖ్యమైనదే..  అయినా, అది కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం. అసలైన ఎన్నికల పోరాటం మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో, స్వల్ప మార్జిన్ సీట్లలో మాత్రమే ఉంటుంది. 2026 లో బెంగాల్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనేది కేవలం ఒక వర్గం ఓట్లపైనే కాకుండా, ఈ క్లిష్టమైన క్షేత్రస్థాయి సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.

-సీతారాం కంఠంనేని 

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.