కార్యకర్తలే లోకేష్ ధ్యాస.. శ్వాస!
Publish Date:Apr 17, 2026
Advertisement
సాధారణంగా ఒక్కో నాయకుడికి గ్రౌండ్ ఒక్కోలా పరిచయం అవుతుంది. జగన్ లాంటి కొందరికి స్కాముల ద్వారా రాజకీయాలతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆయన కెరీర్ మొదలైందే క్విడ్ ప్రోకోతో. బడా బాబులకు పనులు చేసి పెట్టి.. వారి ద్వారా ఎలాంటి లబ్ధి పొందాలి? అన్నదే జగన్ మైండ్ సెట్ లో ఎక్కువగా తిరుగుతుంటుందని అంటారు. ఆయనకు నిజమైన కార్యకర్త అంటే ఎవరు? వారి బాగోగులేంటి? వారి సమస్యలేంటి? అన్న విషయమే తెలీదు. తాను అధికారంలోకి వచ్చినా కూడా అదే నిర్లక్ష్యం. దీంతో గత ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఎదురైన పరిస్థితులు. ఇప్పుడు కూడా ఆయనేమీ సుతరాయించలేదు. ఆయనకు అధికారం అంటే కేవలం అక్రమ మార్గంలో సంపాదించే వెసలుబాటు అంతే.. ఇంకేం లేదు. అదే లోకేష్ విషయానికి వస్తే.. ఆయన అలాక్కాదు. ఆయన 2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిందే. కార్యకర్తలకు సంబంధించిన అంశంలో. ఈ విషయంలో లోకేష్ కన్నా కార్యకర్తలే ఎంతో లక్కీ. కార్యకర్తలను, వారి అవస్థలను దగ్గరి నుంచి పరిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొదట కోరుకున్నారు. అది తర్వాతి రోజుల్లో జన్మభూమి కమిటీలకు ప్రేరణగా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్యవస్థకూ ఇదే స్ఫూర్తి. కనీసం వారికి బీమా సౌకర్యం ఉండాలని కోరుకున్నారాయన. దీన్ని వర్కవుట్ చేయగలిగారు. పార్టీ కేడర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కారకుడు లోకేష్. లోకేష్ ఎప్పుడూ ఫోన్లో చూసేది ఏంటో తెలిస్తే షాకై పోతాం. జగన్ అదే ఫోన్లో పబ్జీ గేమ్స్ ఆడుతుంటే లోకేష్ మాత్రం ఏయే కార్యకర్తల నుంచి ఎలాంటి సందేశమొచ్చిందో చూస్తూ ఉంటారు. ఎవరైనా కార్యకర్తకు బాగోలేక పోయినా, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలైనా.. మంచి చెడ్డలు చూడ్డంలో లోకేష్ ముందుంటారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఫస్ట్ ఆ పని చేయమని తన మనుషులను పురమాయిస్తుంటారు. లోకేష్ నోటి నుంచి తరచూ వచ్చే మాట.. నేనున్నా, నేను చూసుకుంటా.. నువ్వేం భయపడకు! ఈ మాటలను నమ్మి ఎందరో వారి వారి ఆశలను తిరిగి పునరుజ్జీవం చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఆలోచనలన్నీ కార్యకర్తల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే మీరు కావాలంటే చూడొచ్చు.. నాయకులతో అయినా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తారేమో తెలీదు కానీ, కార్యకర్తలతో మీటింగ్ అంటే చాలు ఆయనకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. వారిని ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఎదురు చూస్తుంటారు. లోకేష్ నమ్మే సిద్దాంతం అల్లా ఒక్కటే.. కార్యకర్తలు మాత్రమే.. తమ తమ సొంత సొమ్ముతో పార్టీకి విశేష సేవలందిస్తుంటారు. వారికి ఇదేదో వస్తుంది.. అదేదో రాబోతుంది అన్న ఆలోచనలేం ఉండవు. వారి ఆలోచనల్లా ఒక్కటే పేదోడి బతుకు బాగు పడాలి. తన అక్కన పక్కన ఉన్న వారు చల్లగా ఉండాలి. అందుకే వారు ఎంత దూరంలో పార్టీ కార్యక్రమం ఉంటే.. సొంత తిండి ఖర్చు, పెట్రోల్ ఖర్చు పెట్టుకుని వస్తుంటారు. తన యువగళం కూడా అలాగే హిట్ అయ్యిందని లోకేష్ కి బాగా తెలుసు. అందుకే వారంటే ఆయనకు తెగని అనుభంధం, అంతులేని అభిమానం. అంతే కాదు తన కార్యకర్తలను కలుసుకుంటే.. తోబుట్టువులను కలుసుకున్నంత సంబరంగా ఫీలవుతారు. అసలు ఇలాంటి వారి సమస్యలు తీర్చడానికి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ తీసుకొచ్చింది తొలుత లోకేషే. కానీ దాన్ని కూడా తన ఘనతే అని గప్పాలు కొట్టుకుంటారు అవతల పార్టీ ప్రముఖులు. కానీ లోకేష్ ఎక్కడా ఇలాంటి వాటికి స్పందించరు. ఎందుకంటే సగటు కార్యకర్త బాగున్నపుడే పార్టీ బాగుంటుందని ఆయన బలంగా విశ్వసిస్తారు. అందుకు తగినట్టుగానే తన పథక రచన చేస్తారు. ఒక కార్యకర్తకు ఏదైనా పదవి వచ్చే అవకాశముంటే వెంటనే వచ్చేలా చేస్తారు. ఎందుకంటే తన కెరీర్ మొదలైందే అక్కడి నుంచి. వారి తో సావాసం చేసి ఎన్నో గ్రౌండ్ లెవల్ విషయాలను తెలుసుకున్నారాయన. అందుకే ఆ రైతు మట్టిని నమ్మినట్టు.. లోకేష్.. తన పుట్టింటి మనుషులైన కార్యకర్తలను ఎక్కువగా విశ్వసిస్తారు. వారితోటిదే జీవితంగా గడపాలని శతవిధాలా ప్రయత్నిస్తారు. ప్రస్తుతం లోకేష్ కి ప్రమోషన్ లభించింది. జాతీయ కార్యదర్శి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారాయన. ఈ పదవి తనకన్నా మించి తన వాళ్లకు, తన కార్యకర్తలకు ఎక్కువగా ఉపయోగ పడాలని కోరుకుంటారు లోకేష్. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడిగా ఆయన జన్మస్థానం, కర్మస్థానం అదే కాబట్టి.. అందుకే కార్యకర్తంటే కార్యకర్త కాదు.. వారు మన యజమానులని అంటారు లోకేష్. అదీ లోకేష్ కి తెలిసిన రాజకీయ కర్తవ్యం. కాబట్టి ప్రతి కార్యకర్తా.. ఆయనకొచ్చిన ఈ నూతన పదవీ లాభం పై ఆయనకన్నా మించి సంతోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పులకించి పోతున్నారనే చెప్పాలి. అందుకే లోకేష్ అంటారు.. నా కర్త- కర్మ- క్రియ.. వాళ్లే.. కార్యకర్తలే అని!
http://www.teluguone.com/news/content/lokesh-always-stood-for-tdp-workers-45-217572.html




