Publish Date:Feb 21, 2026
ఓ దంపతులకు జన్మించిన మగబిడ్డతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ చిన్నారి జీవితంలో ఆరు నెలలు ఎలా గడిచాయో తెలియలేదు. కానీ గడువు ముగిసిన మందు కారణంగా ఆ శిశువు మృతి చెందాడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న దంపతులకు జన్మించిన బిడ్డకు కుటుంబ సభ్యులు రాము అని పేరు పెట్టారు. ఇటీవల ఆరు నెలల రాముకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సన్‌సిటీ పరిధిలోని క్రియాన్స్ హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఏమి జరిగిందో తెలియకముందే, రాము మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) మందు ఇవ్వడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. మందు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించిందని వారు తెలిపారు. బాధిత కుటుంబం ఆసుపత్రి ముందు నిరసన చేపట్టి, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. స్థానికులు కూడా ఘటనపై స్పందించి, ఆసుపత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajendranagar-36-214472.html
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.