ఎవరైనా కల్తీ చేస్తే ఉపేక్షించేది లేదు : సీఎం చంద్రబాబు
Publish Date:Feb 23, 2026
Advertisement
రాజమండ్రి పాల ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు. పాల వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేశామని, బాధ్యులని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 75 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు. పాలతోనే డయాలసిస్ సమస్య వచ్చిందని తెలిపారు. మరోవైపు కల్తీ పాల ఘటనపై హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ శాసన సభలో కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయిని తెలిపారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మరణించిన వారు 58 ఏళ్లు పైబడివాన వారని ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ల్యాబ్ నివేదికల అనంతరం నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి తెలిపారు.
http://www.teluguone.com/news/content/rajahmundry-adulterated-milk-incident-36-214530.html





