ప్రామిస్ డే.. బంధంలో నమ్మకానికి పునాది ఇదే..!

Publish Date:Feb 11, 2025

Advertisement

 

వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వాలెంటైన్స్  వారంలో ప్రతి రోజు సంబంధాలు,  ప్రేమకు సంబంధించి విభిన్న అంశాలు రోజుకు ఒకటిగా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. వాలెంటైన్స్ వీక్  రోజ్ డే తో ప్రారంభం అవుతుంది  ఇది వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. ప్రేమించే ప్రతి ఒక్కరూ తమకు తమ భాగస్వామి ఎంత ముఖ్యమో, తమ భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలియజేయడానికి,  వ్యక్తం చేయడానికి ఈ వాలెంటైన్స్ వీక్ చాలా మంచి వేదిక అవుతుంది.

ప్రామిస్ డే..

సంబంధాలలో నిబద్ధత,  విధేయత  ప్రాముఖ్యతను ప్రామిస్ డే నొక్కి చెబుతుంది. ప్రామిస్ డే అనేది వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజు. ఇది సంబంధాలలో  బలాన్ని పెంచుతుంది.  ప్రామిస్ డే రోజు భాగస్వామికి వాగ్దానాలు చేయడం, బంధం పట్ల ఉన్న  నిబద్ధతను చాటిచెప్పడం,  బంధానికివిలువ ఇవ్వడం,  కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రామిస్ చేసుకోవడం. ఇది  భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం, అవగాహన,  ఒకరి పట్ల మరొకరు విధేయతగా ఉండటం వంటి విషయాలను ప్రామిస్ తెలుపుతుంది.  ప్రేమను, బంధం పట్ల గౌరవాన్ని  తెలియజేస్తూ హృదయపూర్వకంగా  ఉత్తరాలు రాయడం, లేదా ప్రేమ లేఖలు రాయడం, మనసులో ఉన్న అమితమైన ప్రేమకు అక్షరరూపం ఇవ్వడం లేదా మనసులో ఉన్న ప్రేమను ఏదో  ఒక అందమైన చర్యతో వ్యక్తం చేయడం ద్వారా ప్రామిస్ డే ను అందంగా మార్చుకోవచ్చు.

నమ్మకమే పునాది..

ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది అవుతుంది.  స్నేహం, ప్రేమ,  ఇతర బందాలు ఏవైనా నమ్మకం అనే పునాదుల మీదనే బాగుంటాయి. ఆ పునాది సరిగా లేకపోతే బంధం కుప్పకూలిపోతుంది. ప్రేమికులకు, ప్రేమను మనసులో నింపుకున్నవారికి కూడా అంతే.. నమ్మకం అనే పునాది బాగుంటేనే వారి బంధం వివాహం వరకు వెళ్లగలుగుతుంది.  ఆ నమ్మకాన్ని ప్రామిస్ ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రామిస్ డేకి అంత ప్రాముఖ్యత.  

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.