జీవితమనే తుపానులో భయమెందుకు?

Publish Date:Jun 18, 2021

Advertisement

ఆ అమ్మాయిది అందమైన మనసు. ఆ అబ్బాయిది వెనుదిరకని వ్యక్తిత్వం. వాళ్లిద్దిరికీ మధ్య ప్రేమ చిగురించింది. అదో అందమైన ప్రేమకథ! ఆ ప్రేమకి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయ్యింది. పెళ్లయిన కొత్తజంత విహారయాత్రకి బయల్దేరారు. దారిలో నది అడ్డువస్తే, దానిని దాటేందుకు చిన్న నావని తీసుకుని వెళ్లారు. నావ నది మధ్యకి రాగానే అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్తా భీకరంగా మారిపోయింది. సన్నటి చినుకులతో మొదలై పెనుతుపాను చెలరేగింది. అంతటి తుపానుకి నావ అల్లల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఎటు చూసినా కారుమబ్బులు, అన్ని వైపుల నుంచీ సూదుల్లా పొడుస్తున్న చినుకులు. వాటిని చూసి యువతి చిగురుటాకులా వణికిపోయింది. కానీ యువకుడిలో మాత్రం ఎలాంటి కలవరమూ లేదు. పైగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అన్నంతగా అతని మోములో చిరునవ్వు చెక్కుచెదరడం లేదు.

 

యువకునిలోని నిశ్చలత్వం చూసి అతని ప్రేయసికి ఒళ్లుమండిపోయింది. ‘ఇంత ప్రమాదంలో కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా! బెల్లం కొట్టినరాయిలా కదలకుండా కూర్చుండిపోతావేంటి?’ అంటూ అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ప్రేయసి మాటలు విన్న ప్రియుడు ఒక్క ఉదుటున తన ఒరలోంచి కత్తి తీసి ఆమె గొంతు మీద పెట్టాడు. ‘నా చేతిలో ఇంత పదునైన కత్తి నీ గొంతు మీద ఉంటే... నీకు భయం వేస్తోందా!’ అని అడిగాడు. దానికి ప్రియురాలు ‘ఇన్నిరోజులుగా నిన్ను చూస్తున్నాను. నీ స్వభావం ఏమిటో నాకు తెలియదా! చూస్తూ చూస్తూ నా గొంతు కోస్తావని ఎలా అనుకుంటాను. నీ చేతిలో ఎంత ప్రమాదకరమైన ఆయుధం ఉన్నా సరే. అది నా గొంతు మీద ఉన్నా సరే. నువ్వు మాత్రం నాకు హాని తలపెట్టవనే నమ్మకం నాకుంది,’ అంది.

 

‘ఈ తుపాను కూడా ఆ భగవంతుని చేతిలో ఆయుధంలాంటిదే. ఆయన నాకు హాని తలపెట్టడనే నా నమ్మకం. ఒకవేళ నిజంగానే మన ఆయుర్దాయం ఇంతటితో సరి అని ఆయన తలిస్తే మాత్రం, ఇప్పుడు మనమేం చేయగలం! మన నావ నది మధ్యలో ఉంది. మన ఇద్దరికీ ఈత రాదు. చుట్టూ ఆదుకునే వారు లేరు. ఈ ఆపద నుంచి ఎలాగైనా బయటపడితే బాగుండు అని కోరుకుంటూ కూర్చోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి సమయంలో కంగార పడి అటూఇటూ తిరగడం వల్ల నావ కాస్తా బోల్తా పడక మానదు. అందుకని ప్రశాంతంగా కూర్చోవడాన్ని మించి తెలివైన పని మరొకటి ఉందంటావా?’ అని అడిగాడు ఆ యువకుడు. ఆ మాటలకి అతని ప్రియురాలి వద్ద సమాధానం లేకపోయింది.

 

కాసేపటికి తుపాను ఆగిపోయిన. దంపతులు ఇద్దరూ హాయిగా ఆవలి తీరానికి చేరుకున్నారు. కానీ ఆ వీరుడు చెప్పిన మాటలని మాత్రం ఆ యువతి ఎప్పటికీ మర్చిపోలేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు చేయగలిగిన ప్రయత్నం చేయడం, ఫలితాన్ని ఆ ప్రకృతి మీద వదిలి నిబ్బరంగా ముందుకు సాగిపోవడం! ఆనాడు తన వీరుడు చెప్పిన ఈ సూత్రాన్ని జీవితాంతమూ ఆ యువతి మర్చిపోలేదు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.

 

By
en-us Political News

  
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు.
చాయ్‌తో తినడానికి సరికొత్త రుచితో కరకరలాడే బియ్యంపిండి మురుకులను ఇంట్లోనే అత్యంత సులభంగా, నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ప్రతిరోజూ వేరుశెనగలు తినడం వల్ల మెదడు జ్ఞాపకశక్తి మరియు ఇన్సులిన్ పనితీరు ఎలా మెరుగుపడుతుందో తాజా పరిశోధన ఆధారంగా తెలుసుకోండి.
బరువు తగ్గాలనుకునే వారు ఈవెనింగ్ స్నాక్స్‌గా మఖానా లేదా పాప్‌కార్న్ ఏది తినాలి? ఏది ఆరోగ్యకరం, బరువు తగ్గడానికి ఏది బెటర్ అనే పూర్తి వివరాలు తెలుసుకోండి.
నిద్రలో వచ్చే గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఎలాంటి ఖరీదైన మందులు లేకుండా, సహజ పద్ధతుల్లో గురకను ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకోండి.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గును తగ్గించి, గొంతుకు ఉపశమనం అందించే ఆలయ శైలి ట్రెడిషనల్ మిరియాల పులిహోరను సరైన కొలతలతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
మధుమేహంతో బాధపడుతున్నారా? రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా అదుపులో ఉంచే అద్భుతమైన బియ్యం ప్రత్యామ్నాయాలు మరియు పోషకాహార రహస్యాల గురించి తెలుసుకోండి.
పాలకూరతో తయారు చేసే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పాలకూర ఇడ్లీ రెసిపీ విశేషాలు. పోషకాలు, ఐరన్, మరియు కేలరీల వివరాలతో కూడిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తూ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన మొలకల చాట్ తయారీ విధానం మరియు కావలసిన పదార్థాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పొద్దుతిరుగుడు గింజల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అందే పోషకాలు, విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు అద్భుతమైన శక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కోజీ కార్డియో ట్రెండ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మిల్లెట్ ఇడ్లీలు గట్టిగా కాకుండా దూదిలా మెత్తగా, స్పాంజీలా రావడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు, నానబెట్టే విధానం మరియు సరైన ఉడికించే పద్ధతుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రోజూ ఉదయం పరగడుపున 4 బిల్వ ఆకులు తినడం వల్ల షుగర్ నియంత్రణ, అల్సర్ నివారణ, జీర్ణ సమస్యల తగ్గింపు మరియు రోగనిరోధక శక్తి పెరుగుదల వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.