మనుషులు పోయినందుకు కాదు బాధ

Publish Date:Oct 29, 2013

Advertisement

 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. రెండు నెలల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం బొద్ గయలో బాంబులు పేల్చిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు, మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ పాట్నాలో జరిపిన సభకి ముందుగా బాంబులు పేల్చడం, దానిలో ఆరుగురు చనిపోవడం, అనేకమంది తీవ్రంగా గాయపడటంతో, నితీష్ కుమార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో తరచు విఫలం అవుతున్నారని విమర్శలు మొదలయ్యాయి.

 

ముఖ్యంగా తనకి బద్దశత్రువయిన మోడీ, తన బీహార్ రాష్ట్రం లో సభ పెట్టుకొంటునపుడు, ఉగ్రవాదులు ఏకంగా సభా ప్రాంగణంలోనే ప్రేలుళ్ళకు పాల్పడటంతో శాంతి భద్రతల విషయంలో ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఆయన సంస్కరణలు, అభివృద్ధి పట్ల చూపుతున్నంత శ్రద్ద, శాంతి భద్రతల విషయంలో చూపడం లేదని, రాష్ట్ర పోలీసు, నిఘా వ్యవస్థలపై ఆయనకు సరయిన పట్టు లేకపోవడంతో వలననే తరచు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

ఇక కొద్ది నెలల క్రితం బీహార్ లో శరన్ అనే ప్రాంతంలో చిన్నారులు స్కూలులో విషాహారం తిని మృతి చెందిన కేసు నేటికీ పరిష్కరింపబడలేదు. ఏదయినా ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే, నితీష్ కుమార్ ముందు విచారణకు ఆదేశించడం, ఆ వెంటనే భాదిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం తప్ప, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం ఆయన చూడలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

అయితే ప్రతీ రాష్ట్రంలో ఇటువంటి వ్యవహారాలు తరచు జరుగుతూనే ఉన్నపటికీ, ఆయన అటు ఎన్డీయే కూటమితో కటీఫ్ చేసుకొని, ఇటు యూపీయే కూటమిలోని జేరకపోవడంతో ఆయనకి ఎవరి మద్దతు లేకపోగా అందరు ఆయనపై దాడి చేసేందుకు చేజేతులా అవకాశం కల్పించుకొన్నారు.

 

ఒకవేళ ఆయన పార్టీ జేడీ(యూ) నేటికీ ఎన్డీయే కూటమిలో ఉండి ఉంటే, స్వయంగా బీజేపీయే ఆయనని వెనకేసుకు వచ్చేదేమో. అదేవిధంగా ఎన్డీయే కూటమి నుండి తప్పుకొని చాల కాలం అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపకపోగా ఇప్పుడు ఇంకా ఏర్పడని మూడో ఫ్రంటుతో జత కట్టాలని ఆలోచిస్తుండటంతో, సహజంగానే కాంగ్రెస్ కూడా ఆయన వైఫల్యాన్నిఎండగడుతోంది. మోడీ సభకి ఉగ్రవాదుల బెడద ఉంటుందని తాము ముందే హెచ్చరించినా కూడా, నితీష్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, తత్ఫలితంగా అమాయకులయిన ప్రజల ప్రాణాలు పోయాయని కాంగ్రెస్ దుమ్మెతి పోస్తోంది.

 

అయితే ప్రజలు చనిపోయారనే బాధకంటే , ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన నరేంద్ర మోడీ సభలో ఇటువంటి సంఘటన జరగడం వలన కేంద్ర రాష్ట్రాలు రెండూ ఆయన సభకు తగిన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందాయని, ఆయనకు తగిన రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం వహించి ఆయన ప్రాణాలకే ప్రమాదం తెస్తున్నాయని, రేపటి నుండి బీజేపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలపై అస్త్రాలు సందిస్తే దానికి వారిరువురి వద్ద జవాబు ఉండదు.

 

అది బీజేపీకి సానుభూతి ఓట్లను కురిపించవచ్చని గ్రహించిన కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలు “మీది తప్పంటే మీదే తప్పని” ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.