లెక్కలు లేకపోతే చిక్కులే.... జాతీయ గణిత దినోత్సవం2024..!

Publish Date:Dec 22, 2024

Advertisement

 


గణితం…. పుస్తక భాషలో చెప్పుకుంటే లెక్కల శాస్త్రం అనొచ్చు. అసలు ఈ లెక్కలు లేకుండా మన జీవితాన్ని ఊహించగలమా? మనం పుట్టినప్పటి నుంచి, చనిపోయేదాక లెక్కలు మన జీవితంలో భాగంగా ఉన్నాయి.  చిన్న పిల్లల చాక్లెట్ల లెక్క నుంచి సైంటిస్టుల రాకెట్  లాంచింగ్ దాకా ఈ లెక్కలు అన్ని చోట్లా ఉపయోగపడుతున్నాయి. డబ్బు మీద నడిచే ఈ కాలంలో లెక్కలు, గణాంకాలు లేకుండా ఏదీ జరగదు. మరి అలాంటి గణితమంటే మనలో చాలామందికి  అదేదో పెద్ద అర్ధం కానీ మిస్టరీలా అనిపించి, వింటేనే వణుకు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇష్టపడితే దీనంత ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు అంటారు గణిత ప్రియులు.

ప్రపంచ నడకకి అడుగడుగునా అవసరమయ్యే ఈ గణిత శాస్త్రం మీద ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. గణిత శాస్త్ర చరిత్రలో భారత గణిత శాస్త్రజ్ఞులు చేసిన కృషి ఎంతో ప్రత్యేకమైనది. అందులో శ్రీనివాస రామానుజన్ గారిది ప్రత్యేక స్థానం. అందుకే  గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ గారి జ్ఞాపకార్ధం ఆయన పుట్టినరోజయిన  డిసెంబర్ 22వ తేదీని ప్రత్యేక దినంగా  గుర్తించారు. రామానుజన్ గారి  125వ జయంతి సందర్భంగా 2012, డిసెంబర్22వ తేదీన,  భారత ప్రభుత్వం  అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రకటించింది. గణిత శాస్త్రానికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా నంబర్ థియరీ, పార్టిషన్ ఫంక్షన్ లు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.  ప్రత్యేకమైన ఈ రోజున శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవ, ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటే..


గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ ..


శ్రీనివాస రామానుజన్  1887 లో,  తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నాణ్యమైన విద్య అందకపోయినా  తన  12 వ ఏటనే త్రికోణమితిలో తన ప్రావీణ్యాన్ని చూపారు. రామానుజన్  14 వ ఏట మద్రాసులోని పచాయప్ప కాలేజీలో చేరి ఇతర సబ్జెక్టులలో ఫెయిలైనా కూడా, గణితంపై మాత్రం  స్వతంత్ర పరిశోధన చేశారు. 1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్టులో ఉద్యోగం పొందేందుకు రామస్వామి అయ్యర్ సాయం చేశారు. అలా అక్కడ పని చేసుకుంటూనే ఆయన రకరకాల గణిత సిద్ధాంతాలు నోట్సుల్లో  రాసుకునేవారు. 1913 లో ఆయన సిద్ధాంతాలని చూసి ఆశ్చర్యపోయిన కేంబ్రిడ్జ్ గణిత శాస్త్రవేత్త  GH హార్డీ, రామానుజన్‌ను లండన్‌కు ఆహ్వానించారు. అలా అక్కడ  రామానుజన్ గణితం మీద మరింత కృషి చేశారు.  1918 లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన అతితక్కువ వయస్కుల్లో రామానుజన్ ఒకరు. ఆయన రాసిన చాలా గణిత సిద్ధాంతాల  మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రంలో  చేసిన కృషి దేశీయంగా, అంతర్జాతీయంగా గొప్ప  ప్రభావం చూపింది.


 నేటి తరానికి గణిత దినోత్సవం..


జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ కృషిని స్మరించుకోవటానికి మాత్రమే కాకుండా, గణితంపై నేటి తరం వారికి ఆసక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామానుజన్ రూపొందించిన త్రికోణమితి సిద్ధాంతాలు, మన డైలీ లైఫ్ లో వాటి ఉపయోగాలు గురించి తెలుసుకున్నప్పుడు త్రికోణమితి మీద ఆసక్తి పెరగడం ఖాయం. రామానుజన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రాలు  "ది మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ"  లాంటివి చూడడం వల్ల పిల్లలకి   గణితం పట్ల ప్రేమ పెరుగుతుంది.  ప్రతి విద్యార్థిలో కొన్ని బలాలు,  బలహీనతలు ఉంటాయి. వారిలో బలహీనతలని ఎత్తి చూపించకుండా వారికి నచ్చిన దానిలో ప్రోత్సహిస్తే ఎంత మంచి జరుగుతుందో  రామానుజన్ జీవితం సమాజానికి ఒక ఉదాహరణగా, పిల్లలకి ప్రేరణగా నిలుస్తుంది.

2024 థీమ్..

జాతీయ గణిత దినోత్సవం 2024 కు  "గణితం: ఆవిష్కరణ, పురోగతికి వంతెన" అనే థీమ్ ఎంచుకోబడింది. నానాటికీ పెరుగుతున్న సాంకేతికత,  సైన్స్ ద్వారా చేస్తున్న ఆవిష్కరణల డెవలప్మెంటుకి   గణిత సూత్రాలు ఎలా ఆధారం అవుతున్నాయనే విషయాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.  గణితంపై ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ  రామానుజన్ జీవితాన్ని కృషిని స్మరించుకుంటూ.. రామానుజన్ లాంటి గణిత శాస్త్రవేత్తలుగా మారేవైపు నేటి తరం అడుగులు వెయ్యాలి.


                        *రూపశ్రీ. 

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.