అసెంబ్లీపై నుంచి అమరావతి మొత్తం కనిపించేలా చర్యలు : మంత్రి నారాయణ

Publish Date:Mar 23, 2026

Advertisement

 

అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు.  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో  నిర్మిస్తున్న ఐకానిక్ కట్టడాల విశిష్టతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం(23-3-26) కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలుగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. 

అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల విశిష్టతను, నిధుల సమీకరణను మంత్రి నారాయణ వివరించారు. అమరావతి అసెంబ్లీ భవనాన్ని 250 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనంపైకి ప్రజలు వెళ్లి మొత్తం అమరావతి నగరాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ అసెంబ్లీ భవనాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, హైకోర్టుతో పాటు మరో ఐదు ఐకానిక్ టవర్లను అత్యద్భుతంగా నిర్మిస్తున్నామని మంత్రి  వెల్లడించారు. ఐకానిక్ భవనాలు కాబట్టి సాధారణ భవనాల కంటే వీటికి ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 

ఇతర రాష్ట్రాల్లోని ఐకానిక్ భవనాల రేట్లతో పోల్చి వీటిని చూస్తున్నామని, ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని పనుల కోసం భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం సమకూర్చుకుంటోందని మంత్రి నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో ద్వారా మరో రూ. 11 వేల కోట్లు సమకూర్చుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

ప్రస్తుతం అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం నిర్మిస్తున్న సుమారు 3,500 ఫ్లాట్లు ఈ మార్చి నెలాఖరు కల్లా పూర్తి కానున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు.
 

By
en-us Political News

  
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్‌ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు తమిళనాడుతో విడదీయలేని సంబంధం ఉంది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల వ్యాపారం నుంచి షాపింగ్ వరకు అంతా తమిళనాడు పట్టణాలతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతర తనిఖీలు సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
గత సీజన్ తన కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనకమైన సమయమన్న అశ్విన్ ఫిట్‌నెస్ పరంగా తాను ఆడే స్థితిలో ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాననీ, అందుకే తప్పుకున్నానీ చెప్పాడు. ఐపీఎల్ 2025లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నఅశ్విన్.. కేవలం వ్యక్తిగత కారణాలతోనే కాకుండా జట్టు ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానన్నాడు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అలాగే.. విమానాశ్రయం సమీపంలోనే ఉన్న ఇరాన్ వైమానిక దళానికి చెందిన కీలక యుద్ధ విమాన స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది.
హార్మూజ్ జలసంధి మీదుగా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలిగించవద్దని, ఒకవేళ దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే.. ఈ బెదిరింపులను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పైపెచ్చు ట్రంప్ పై సామాజిక మాధ్యమం వేదికగా మీమ్స్, సెటైర్లు గుప్పించింది.
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.