తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్

Publish Date:Mar 23, 2026

Advertisement

 

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత, న్యాయ రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక బిల్లులకు ఆమోదం తెలిపారు.

1. హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్ బిల్లు 2026

విద్వేషపూరిత ప్రసంగాలు, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను అరికట్టేందుకు “తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026”కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోషల్ మీడియా పోస్టులు, అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపొందించారు.

2. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు

“తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్-2026”కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 4.2 లక్షల గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, సామాజిక భద్రత కల్పించనున్నారు. వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో బిల్లును ఆమోదించారు.

3. హైదరాబాద్ మెట్రో స్వాధీనం

హైదరాబాద్‌లోని 69 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.15 వేల కోట్లతో ఫేజ్-1 ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. లావాదేవీల నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)కు అప్పగిస్తూ, దానిని నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

4. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు

న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”కు ఆమోదం లభించింది. వామనరావు దంపతుల హత్య ఘటనల నేపథ్యంలో న్యాయవాదులకు భద్రత కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

5. కులగణన నివేదికకు ఆమోదం

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సమర్పించిన కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక సిద్ధమైంది. నివేదికను మరింత పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించారు.

6. రోహిత్ వేముల చట్టం

విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.

7. తల్లిదండ్రుల మద్దతు బిల్లు

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ.10 వేల వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించే బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది.
 

By
en-us Political News

  
సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇండియా లక్ష్యంగా సాగుతున్న కేంద్రంగా సాగుతున్న పరోక్ష ( ప్రాక్సీ) యుద్ధవ్యూహాలు దక్షిణాసియా భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా.. దక్షిణాసియా మొత్తంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్ఈటీ, జేఈఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కు తూటా తగిలింది.. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ధ్రువీకరించారు.
శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో పరుగుల సునామీ కాదు అంతకు మించి అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంత వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు మ్యాచ్ లలోనూ కలిపి ఏకంగా 986 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించడం ఇదే మొదటి సారి.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను ఏ విధంగా విస్తరిస్తున్నాయో తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా అత్యంత సురక్షితమని భావించే దేశాలలో కూడా పాక్ భూభాగం నుంచి తన కార్యకలాపాలను నిర్వహించే లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్ ఏ విధంగా చొరబడుతున్నాయన్నది ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాది రికార్డు సృష్టించాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీ 51 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 218 పరుగుల భారీ స్కోరు చేసింది.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.