సరిహద్దుల్లో ఎన్నికల సెగ.. అడుగడుగునా నిఘా!

Publish Date:Apr 7, 2026

Advertisement

ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించే ఎన్నికలు.. సరిహద్దు ప్రజల పాలిట మాత్రం పరీక్షా సమయాలుగా మారుతున్నాయి. అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల మధ్య   భౌగోళిక రేఖ కేవలం పరిపాలన పరమైన విభజన మాత్రమే. కానీ, అక్కడి ప్రజల బంధాలు, వ్యాపారాలు, అవసరాలు   పెనవేసుకుపోయి ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల నగారా మోగడంతో, ఈ అనుబంధాల మధ్య ఎన్నికల నియమావళి ఒక అదృశ్య గోడలా నిలుస్తోంది. నిత్యం రాకపోకలు సాగించే సామాన్యుడు అడుగడుగునా నిఘా నీడలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. 

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు తమిళనాడుతో విడదీయలేని సంబంధం ఉంది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల వ్యాపారం నుంచి  షాపింగ్ వరకు అంతా తమిళనాడు పట్టణాలతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతర తనిఖీలు సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పోలీసులు, ఎన్నికల అధికారులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, పత్రాలు చూపలేక సామాన్యులు గంటల తరబడి చెక్‌పోస్టుల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బట్టలు కొనాలన్నా, బంగారం చేయించాలన్నా ఈ ప్రాంత వాసులకు కాంచీపురం, చెన్నై, వెల్లూరు మొదటి ప్రాధాన్యత. అయితే, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదనే నిబంధన ఇప్పుడు శాపంగా మారింది. తమ కష్టార్జితాన్ని, పొలం అమ్మిన డబ్బునో లేక అప్పు తెచ్చిన మొత్తాన్నో తీసుకెళ్తుంటే.. సరైన ఆధారాలు లేవనే నెపంతో అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా సుమారు రూ. 2.34 కోట్లకు పైగా నగదు పట్టుబడటం అంటే, అందులో అధిక భాగం సామాన్యుల అవసరాల కోసం తీసుకెళ్తున్నదేనని స్థానికులు వాపోతున్నారు. సీజ్ చేసిన నగదును తిరిగి పొందాలంటే కోర్టుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగడం మధ్యతరగతి వర్గాలకు తలకు మించిన భారంగా మారింది.
 
సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారాలు అధికంగా నగదు లావాదేవీల మీదనే ఆధారపడి ఉంటాయి. గొర్రెల వ్యాపారులు, కూరగాయల రైతులు, చిన్న తరహా కాంట్రాక్టర్లు బ్యాంకింగ్ కంటే నగదు రూపంలోనే చెల్లింపులు జరుపుతుంటారు. ఇప్పుడు అధికారులు బ్యాంక్ లావాదేవీలపై, ఏటీఎంల వద్ద కూడా నిఘా ఉంచడంతో వ్యాపార రంగం కుదేలవుతోంది. షాపింగ్ మాల్స్ వెలవెలబోతున్నాయి. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటారో, ఏ వస్తువును సీజ్ చేస్తారో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు షాపింగ్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

ఒక రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, మరో రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వారు సరిహద్దుల్లో వేల సంఖ్యలో ఉన్నారు. వీరిని ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అరికట్టాలనే లక్ష్యంతో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా.. నిత్య అవసరాలైన పెట్రోల్, డీజిల్, చివరికి అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులలో వెళ్లే వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇది మానవీయ కోణంలో చూస్తే బాధితులకు ఒకింత  అసౌకర్యంగా మారుతోంది. 

ఎన్నికల పారదర్శకత కోసం నిబంధనలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మద్యం, ఉచితాల పంపిణీని అరికట్టడం హర్షణీయమే. కానీ, ఆ క్రమంలో అమాయకులు బలికాకూడదని మేధావులు సూచిస్తున్నారు. అధికారులు మానవత్వంతో వృద్ధులు, మహిళలు, రోగుల పట్ల కొంత సానుకూల ధోరణి ప్రదర్శించాలంటున్నారు. ప్రజలకు అనవసరమైన చిక్కులు రాకుండా   బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐడీ కార్డులు, వ్యాపార బిల్లులను వెంట ఉంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు డిజిటల్ పేమెంట్లను ఆశ్రయించడం ఉత్తమమంటున్నారు. మొత్తానికి, ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న సామాన్యుడు.. ఈ ఆంక్షల చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ  సరి‘హద్దు’ కష్టాలు  తప్పేలా లేవు. అధికార యంత్రాంగం నిఘాను కొనసాగిస్తూనే, సామాన్యుడి ప్రాథమిక అవసరాలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.