సీఎస్కే వరుస వైఫల్యాలు.. అశ్విన్ ఏ మంటున్నాడంటే?

Publish Date:Apr 7, 2026

Advertisement

టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఉరుములేని పిడుగులా ఐపీఎల్ కు తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే.  గత ఏడాది అనూహ్యంగా క్యాష్ రిచ్ లీగ్‌ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన అశ్విన్..  తన నిర్ణయం వెనుక ఉన్న  కారణాలను తొలిసారిగా బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు  క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గత సీజన్ తన కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనకమైన సమయమన్న అశ్విన్   ఫిట్‌నెస్ పరంగా తాను ఆడే స్థితిలో ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాననీ, అందుకే తప్పుకున్నానీ చెప్పాడు.  ఐపీఎల్ 2025లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నఅశ్విన్..  కేవలం వ్యక్తిగత కారణాలతోనే కాకుండా జట్టు ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకోవాలన్న  కఠిన నిర్ణయం తీసుకున్నానన్నాడు.

ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌కు తన వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఆ నిర్ణయం తీసుకు న్నానన్నాడు.   తాను జట్టులో ఉంటే రిటెన్షన్ విషయంలో మేనేజ్‌మెంట్‌ సందిగ్ధంలో పడుతుందని, అదే తాను తప్పుకుంటే సుమారు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని ఫ్రాంచైజీ ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని అశ్విన్ చెప్పాడు. తాను తప్పుకోవడం  వల్ల జట్టుకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని తాను భావించానన్నాడు. 

ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంపై స్పందించిన అశ్విన్.. జట్టులోని యువ ఆటగాళ్లను వినియోగించుకుంటున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు వారి సహజ సిద్ధమైన ప్రతిభకు తగ్గట్టుగా బాధ్యతలు అప్పగించాలన్నాడు.  జెమీ ఓవర్టన్ వంటి బౌలర్లకు అలవాటు లేని యార్కర్లు వేయమని ఒత్తిడి చేయడం ఉపయోగం సంగతి అటుంచి ప్రత్యర్థికి అప్పనంగా పరుగులు ఇచ్చే పరిస్థితి ఎదురౌతుందని అభిప్రాయపడ్డాడు 

యువ ఆటగాళ్లకు సరైన శిక్షణ, ప్రాక్టీస్ వాతావరణం కల్పించకుండా కేవలం ఫలితాలను ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదని అశ్విన్ కుండబద్దలు కొట్టేశాడు.  అశ్విన్  వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎస్కే అభిమానులైతే.. అశ్విన్ మాటలు నూటికి నూరుపాళ్లూ వాస్తవమంటున్నారు.  ఇప్పటికైనా సీఎస్కే టీమ్ మేనేజ్ మెంట్ తన వ్యూహాలకు పదును పెట్టి జట్టును విజయాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

By
en-us Political News

  
రాజధాని పరిధిలో కీ రవాణా వ్యవస్థకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముక వంటిదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఈ కీలక రహదారి నిర్మాణం నిలిచిపోయిందని, దీనివల్ల రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు జాప్యమౌతోందని పేర్కొన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే మధ్యంతర స్టే ఎత్తివేయాలని కోరారు.
ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో  3.6 లక్షల కోట్లు.
నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి.
డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు వచ్చే నెల 1 నుండి రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.