20 ఏళ్లకే ముసలితనం!

Publish Date:Jan 17, 2022

Advertisement

ఎవరన్నా పెద్దవారు చురుగ్గా ఉంటే ‘అరవైలో ఇరవై’ ఏళ్లవాడిలా ఉన్నారంటూ పొగిడేస్తాము. కానీ ఇప్పటి తరాన్ని కనుక పరిశీలిస్తే ఇరవైలో అరవై ఏళ్లవాడిలా నిస్సారంగా మారిపోతున్నారని గుండెలు బాదుకోక తప్పదు. వైద్యరంగంలో ప్రతిష్టాత్మకమైన Johns Hopkins University పరిశోధనలో వెలుగు చూసిన విషయమిది...

 

ఏ పనీ చేయకుండా ఉండటం, ఒకవేళ పనిచేసినా కూడా ఒళ్లు అలవకుండా ఉండటం ఇప్పటి జీవనశైలి. దానినే మనం sedentary lifestyle అంటున్నాము. పోనీ ఒళ్లు అలవడం లేదు కదా అని వ్యాయామం అన్నా చేస్తున్నామా అంటే అదీ లేదు కదా! కాబట్టి వయసుని బట్టి మనుషుల శారీరిక శ్రమ ఏ తీరున ఉందో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం 12,529 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరినీ వయసుల వారీగా ఐదు విభాగాలుగా విభజించారు. 6- 11 ఏళ్లు, 12- 19 ఏళ్లు, 20- 29 ఏళ్లు, 31- 59 ఏళ్లు, 60- 84 ఏళ్లు అన్నవే ఆ విభాగాలు. వీరంతా రోజూ ఎన్ని కేలొరీలు ఖర్చు చేస్తున్నారో తెలుసుకొనేందుకు ఓ పరికరాన్ని అమర్చారు.

 

ఒక వారంరోజుల పాటు అభ్యర్థుల జీవనశైలిని గమనించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడ్డాయి. 60 ఏళ్లు పైబడినవారు ఒళ్లు కదపకుండా ఎంత బద్ధకంగా జీవిస్తున్నారో, 19 ఏళ్లవారు కూడా అంతే నిస్సారంగా ఉన్నారట. 20 నుంచి 29 ఏళ్లలోపు ఏదో కాస్త ఒంటిని కష్టపెట్టడం కనిపించింది. కానీ ఆ తర్వాత నుంచీ ఒంటికి అసలు శ్రమ అన్నదే తెలియకుండా జీవిచేస్తున్నారట. ఇక 35 ఏళ్లు దాటినవారి గురించైతే అసలు చెప్పనే అక్కర్లేదు! సాధారణంగా ఆడవారికంటే మగవారు ఎక్కువ శ్రమ చేస్తారని అనుకుంటాం. కానీ ఒక వయసు దాటిన తర్వాత అటు ఆడా, ఇటు మగా కూడా ఒంటికి ఎలాంటి పనీ కల్పించడం లేదనీ తేలింది.

 

పెద్దవారైన తర్వాత పని ఒత్తిడి వల్లనో, అలసట చేతనో, ఆనారోగ్యంతోనో శారీరిక శ్రమకి దూరంగా ఉంటున్నారే అనుకుందాం. కానీ 5 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వారు కూడా ఒంటికి అలవనియ్యకపోవడం ఆశ్చర్యకరం. ప్రపంచ ఆరోగ్యం సంస్థ 5 – 17 ఏళ్ల పిల్లలు రోజులో కనీసం ఓ గంటపాటైనా బాగా అలసట కలిగేలా శ్రమించాలని పేర్కొంటోంది. కానీ 19 ఏళ్లు వచ్చేసరికి... మగపిల్లలలో 50 శాతం మంది, ఆడపిల్లలలో 75 శాతం మంది ఎలాంటి శ్రమా లేకుండా గడిపేస్తున్నారట.

 

ఈ రీసెర్చిలో అమెరికాకు చెందిన వ్యక్తులే పాల్గొన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బహుశా ఇలాంటి గణాంకాలే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఆటలకి సమయాన్ని కేటాయించకుండా, కేవలం చదువుకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడాన్ని గమనిస్తే.... 19 ఏళ్లు ఏం ఖర్మ! బహశా పదేళ్ల వయసులోనే మన పిల్లలు వృద్ధులతో సమానంగా నిస్తేజంగా మారిపోతూ ఉండవచ్చు.

- నిర్జర.

 

By
en-us Political News

  
శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తూ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన మొలకల చాట్ తయారీ విధానం మరియు కావలసిన పదార్థాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పొద్దుతిరుగుడు గింజల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అందే పోషకాలు, విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు అద్భుతమైన శక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కోజీ కార్డియో ట్రెండ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మిల్లెట్ ఇడ్లీలు గట్టిగా కాకుండా దూదిలా మెత్తగా, స్పాంజీలా రావడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు, నానబెట్టే విధానం మరియు సరైన ఉడికించే పద్ధతుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రోజూ ఉదయం పరగడుపున 4 బిల్వ ఆకులు తినడం వల్ల షుగర్ నియంత్రణ, అల్సర్ నివారణ, జీర్ణ సమస్యల తగ్గింపు మరియు రోగనిరోధక శక్తి పెరుగుదల వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
లిపిడ్ ప్రొఫైల్ మరియు కొలెస్ట్రాల్ గురించి సులభంగా తెలుసుకోండి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి మార్పుల పూర్తి వివరాలు.
జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమాజంలో లేదా పని చేసే చోట కొందరు వ్యక్తులు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక శత్రువులుగా మారుతుంటారు.
పండుగ వేళల్లో ఇష్టమైన వంటకాలు ఎక్కువగా లాగించడం వల్ల తీవ్రమైన ఎసిడిటీ మరియు ఛాతీలో మంట వస్తుందా? ఎసిడిటీకి కారణమయ్యే ఆహార పొరపాట్లు మరియు వాటిని నివారించే సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌వాచ్‌లో గుండె వేగం సాధారణంగా ఉన్నప్పటికీ పక్షవాతం (Stroke) వచ్చే అవకాశం ఉందా? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు, స్ట్రోక్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
టీ మరియు కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? రీసెంట్ స్టడీ రిపోర్ట్ ప్రకారం టీ, కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు మరియు ఎముకల ఆరోగ్యంపై పడే ప్రభావం పూర్తి వివరాలు తెలుసుకోండి.
క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ప్రోటీన్లు కంతులను సులువుగా గుర్తించేలా చేసినప్పటికీ, రోగనిరోధక దాడి నుంచి ఎలా తప్పించుకుంటున్నాయో తెలిపే తాజా వైద్య పరిశోధనా విశేషాలు.
చలిగాలులు వీచినప్పుడు కళ్ల నుంచి నీరు ఎందుకు కారుతుంది? ఇది డ్రై ఐ సమస్య లేదా అలర్జీనా అనే పూర్తి వివరాలు, కారణాలు మరియు నివారణ మార్గాలను తెలుసుకోండి.
పిల్లలతో అనుబంధం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాదు. అది పరస్పర నమ్మకం, భావోద్వేగాల కలయికపై ఆధారపడి ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.