పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!

Publish Date:Oct 31, 2026

Advertisement

  పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!


పిల్లలతో అనుబంధం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాదు. అది పరస్పర నమ్మకం, భావోద్వేగాల కలయికపై ఆధారపడి ఉంటుంది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తమ మనసులోని మాటలను, సంతోషాలను, బాధలను ఎలాంటి మొహమాటం లేకుండా తమతో పంచుకోవాలని కోరుకుంటారు. కానీ పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకు దూరమవడం, విషయాలు దాచిపెట్టడం సర్వసాధారణంగా మారుతుంటుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం దాదాపు అరవై శాతానికి పైగా పిల్లలు తమ రోజువారి సమస్యలను లేదా మానసిక ఇబ్బందిని ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో చెప్పుకోవడమూ  లేదా ఒంటరితనానికో పరిమితం అవుతున్నారు. దీనివల్ల వారిలో ఆందోళన స్థాయిలు పెరిగే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు తమ మనసును పూర్తిగా తెరిచి మీతో మాట్లాడాలంటే తల్లిదండ్రులు తమ రోజువారీ ప్రవర్తనలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అవేంటో తెలుసుకుంటే..

కోపంగా నెగిటివ్ గా రియాక్ట్ కావద్దు..

పిల్లలు ఏదైనా విషయం చెప్పిన వెంటనే వారిని కోప్పడటం లేదా చిన్న విషయానికి కూడా పెద్దది చేసి ప్రతిసారీ తప్పు పట్టడం వంటివి చేయకూడదు. ఇలాంటి నెగిటివ్ రియాక్షన్స్ వల్ల  పిల్లలు భవిష్యత్తులో తమకు ఎదురయ్యే సమస్యలను ఇంట్లో చెప్పడానికి చాలా భయపడతారు. అలాగే పిల్లలు చెప్పే చిన్న సమస్యలను పెద్దవారు చాలాసార్లు చిన్నచూపు చూస్తుంటారు. పెద్దల దృష్టిలో అది సాధారణ విషయంగా అనిపించవచ్చు కానీ లేత మనసులున్న పిల్లలకు ఆ సమస్య ఎంతో భారంగా అనిపించే అవకాశం ఉంది. అందుకే వారి ఎమోషన్స్ ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు.

పోల్చకండి..

పిల్లలను పక్కవారితో లేదా తోటి విద్యార్థులతో పోల్చడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడూ వేరేవారితో పోలికలు తేవడం వల్ల పిల్లలలో అసూయతో పాటు తల్లిదండ్రులపై నమ్మకం సన్నగిల్లుతుంది. దీనికి బదులుగా వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మంచిది. ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే గట్టిగా పనిష్మంట్  ఇస్తామని బెదిరించడం  వల్ల పిల్లలు నిజం చెప్పడానికి బదులుగా అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. తప్పులను వివరంగా చెప్పి, వాటి పర్యావసానం ఎలా ఉంటుందో అర్థం చేయించడం ద్వారా  పిల్లలలో మార్పు తీసుకురావచ్చు.

పిల్లలు చెప్పేది వినాలి..

పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు వారి మాట మధ్యలో అడ్డుకోవడం లేదా వెంటనే నీకు ఏమీ తెలియదు అంటూ కొట్టిపడేయడం చేయకూడదు. వారు చెప్పాలనుకున్నది పూర్తిగా విన్న తర్వాతే తల్లిదండ్రులు అభిప్రాయాన్ని చెప్పాలి. పిల్లలు నమ్మి చెప్పిన రహస్యాలను ఇతరుల ముందు లేదా బంధువుల ముందు చెప్పడం వల్ల వారి నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది. పిల్లల వ్యక్తిగత విషయాలకు ఎప్పుడూ భద్రత కల్పించాలి. కేవలం చదువు, మార్కులు, భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడకుండా వారికి ఏ విషయాల పైన ఆసక్తి ఉందో..   ఏం చేయాలని ఆసక్తి ఉందో తెలుసుకుంటూ.. సరదా విషయాల గురించి కూడా ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి మాట్లాడాలి. ఈ చిన్నపాటి మార్పుల ద్వారా పిల్లలతో మంచి బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో అన్నీ షేర్ చేసుకోవచ్చు అని ధైర్యంతో ఉంటారు.

                                                                                                                                  *రూపశ్రీ.
 

By
en-us Political News

  
పండుగ వేళల్లో ఇష్టమైన వంటకాలు ఎక్కువగా లాగించడం వల్ల తీవ్రమైన ఎసిడిటీ మరియు ఛాతీలో మంట వస్తుందా? ఎసిడిటీకి కారణమయ్యే ఆహార పొరపాట్లు మరియు వాటిని నివారించే సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌వాచ్‌లో గుండె వేగం సాధారణంగా ఉన్నప్పటికీ పక్షవాతం (Stroke) వచ్చే అవకాశం ఉందా? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు, స్ట్రోక్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
టీ మరియు కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? రీసెంట్ స్టడీ రిపోర్ట్ ప్రకారం టీ, కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు మరియు ఎముకల ఆరోగ్యంపై పడే ప్రభావం పూర్తి వివరాలు తెలుసుకోండి.
క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ప్రోటీన్లు కంతులను సులువుగా గుర్తించేలా చేసినప్పటికీ, రోగనిరోధక దాడి నుంచి ఎలా తప్పించుకుంటున్నాయో తెలిపే తాజా వైద్య పరిశోధనా విశేషాలు.
చలిగాలులు వీచినప్పుడు కళ్ల నుంచి నీరు ఎందుకు కారుతుంది? ఇది డ్రై ఐ సమస్య లేదా అలర్జీనా అనే పూర్తి వివరాలు, కారణాలు మరియు నివారణ మార్గాలను తెలుసుకోండి.
ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, జీర్ణక్రియ మెరుగుపడటం, హైడ్రేషన్ మరియు కిడ్నీల ఆరోగ్యంపై నిపుణుల సలహాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
మధుమేహాన్ని సహజంగా నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం కానుగ పువ్వు పొడి గురించిన పూర్తి వివరాలు. టైప్ 1, టైప్ 2 షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఈ ఇంటి చిట్కా ప్రయోజనాలు, తయారుచేసే విధానం తెలుసుకోండి.
బెండకాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? షుగర్, కొలెస్ట్రాల్, జీర్ణశక్తిపై డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు మరియు తయారుచేసే సరైన విధానం ఇక్కడ తెలుసుకోండి.
శరీరంపై కొవ్వు గడ్డలు లేదా లిపోమా సమస్యతో బాధపడుతున్నారా? సర్జరీ లేకుండా సహజమైన ఇంటి చిట్కాలు, ఆహారపు అలవాట్లు మరియు ఆయుర్వేద మార్గాల ద్వారా కొవ్వు గడ్డలను ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.