షర్మిలతో కాళ్ల బేరానికి జగన్?

Publish Date:Oct 21, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. తన తీరు మార్చుకోక తప్పదని అర్ధమైంది. వైసీపీకి ఎటూ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అని అవగతమైంది. ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వినా మరో  దిక్కు లేదని అవగతమైంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్ని ప్రకటనలు చేసినా.. అడగకుండానే ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. అటు నుంచి ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలిగా ఉన్న తన సొంత చెల్లి షర్మిల అనే విషయం బోధపడింది. ఇప్పుడు ఆమెతో సఖ్యత ఉంటే తప్ప కాంగ్రెస్ తనను దరి చేయనీయదన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఆమెతో రాయబేరాలకు, రాజీ ప్రయత్నాలకు తెరతీశారు జగన్. అవసరమైతే కాళ్ల బేరానికి దిగైనా సరే షర్మిలతో సఖ్యత పెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.  

నిజానికి  జగన్ నైజం తెలిసిన వారెవరూ జగన్ చెల్లెలితో కాళ్లబేరానికి దిగడం పట్ల ఆశ్చర్యపోరు. ఎందుకంటే జగన్ తీరు అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్లుగానే ఉంటుంది.  ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆద్యంతం అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన    చంద్ర‌బాబు నాయుడుతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు, సొంత చెల్లి, త‌ల్లి ప‌ట్ల‌ కూడా అదే ప‌ద్ద‌తిని అవ‌లంబించారు. అధికార అహంతో త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన వాళ్ల‌పై కేసులు పెట్టి, పోలీసుల‌తో కొట్టించి పైశాచికానందం పొందారు.   ఇప్పుడా అధికారం పోయింది. జనం ఛీకొట్టారు. ఎంతగా అంటే ఆయనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆయన పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చేశారు. ఇంత కాలం తనకు పెట్టని కోటగా ఉన్న కడప జిల్లాలో కూడా ఆయనకు అత్తెసరు మార్కులే వేశారు. అధికారంలో ఉన్నంత కాలం తనకు అన్ని విధాలుగా సహకారం అందించిన కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఇప్పుడు ఆయనకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదు. పైపెచ్చు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడ సాగించాలంటే.. చంద్రబాబు మద్దతు తప్పని సరి. అందుకే  జగన్ కు దూరం పెడుతోంది. దీంతో ఇక ఇప్పుడు ఆయన మెడకు ఇంత కాలం విచారణకు కూడా రాకుండా పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ వేగం పుంజుకోనుంది. కోడికత్తి కేసు, గులకరాయి దాడి కేసులలో కూడా ఆయన ఇక ముందు కోర్టుకు హాజరు కాకతప్పని పరిస్థితి. సో ఇక బీజేపీతో లాంభం లేదు. సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటి బలమైన విపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పంచన చేరితేనైనా ఏదో మేరకు రక్షణ ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

అందుకే ఆ పార్టీ హర్యానా ఎన్నికలలో పరాజయం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందంటూ తనంత తానుగానే ప్రకటించేసి ఆ పార్టీ దృష్టిలో పడేందుకు విఫలయత్నం చేశారు. అయితే జగన్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కాంగ్రెస్ నుంచి మాత్రం స్పందన కనిపించడం లేదు సరికదా.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్  అధ్యక్షురాలు, సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై కంటే.. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా, ఉనికి కోసం వెంపర్లాడుతున్న వైసీపీపైనా, జగన్ పైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జగన్ అరాచకపాలనలోని అన్యాయాలు, అక్రమాలను ఎలుగెత్తి చాటి.. జగన్ పై చర్యలకు చంద్రబాబు సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా షర్మిలను మంచి చేసుకోవడం కోసం కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తానని కూడా రాయబారం నడిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అయితే జగన్ రాయబారాన్ని నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారనీ ప్రచారం జరుగుతోంది. జగన్ ఫార్ములా అందితే జుట్టు అందకుంటే కాళ్లు ఫార్ములా షర్మిల వద్ద ఇసుమంతైనా పని చేసినట్లు కనిపించదు.  

 ఆస్తి విషయంలో అన్న జగన్ తమకు అన్యాయం చేశారని షర్మిల పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు షర్మిలను మంచి చేసుకోవడానికి ఆమెకు జగన్ ఆస్తులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ బెంగళూరులో మకాం వేసి మరీ మధ్యవర్తులద్వారా షర్మిలతో రాయబేరాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. పది అడుగులు కిందకు దిగైనా సరే షర్మిలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటే రాజకీయంగా ఏదో మేరకు నిలదొక్కుకోవచ్చని, కాంగ్రెస్ కు దగ్గర కావచ్చనీ జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో?!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.