సభకు జగన్ గైర్హాజర్.. పలాయనమేనా?

Publish Date:Feb 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశంలో వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు ముఖం చాటేయడం ద్వారా తమ వాదనలలో పస లేదని వైసీపీ అధినేత జగన్ అండ్ కో అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు ఈ అంశంపై తన వాదనను తెలుగుదేశం కూటమి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ స్పష్టంగా వినిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జగన్ హయాంలో జరిగిందన్న విషయాన్ని ఆధార సహితంగా సభ ముందుంచింది. 

అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తన వాదనను సభలో రికార్డు  చేశారు. ఇక ఈ విషయంపై జగన్ మీడియా ప్రసంగాలు చేసి ఖండించినా ప్రయోజనం ఉండదు.  ఎందుకంటే మీడియా సమావేశం అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ డిబేట్ కు ఎంత మాత్రం సరిపోలదు. పైగా జగన్ ప్రెస్ మీట్ అంటే రాసుకొచ్చిన, లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ చదివి వినిపించడమేనన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆయన ప్రెస్ మీట్ లలో విలేకరులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టే సావకాశం ఉండదు. చరిత్ర అడక్కు చెప్పింది విను చందంగా ప్రెస్ మీట్ లో జగన్ ప్రసంగా సాగుతుందన్నది తెలిసిందే.

 అదే జగన్ అసెంబ్లీకి వచ్చి తన వాదనను వినిపించి ఉంటే ఆయన వాదన కూడా రికార్డ్ అయ్యేది.  దీంతో సభలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై చర్చకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడాన్ని పరిశీలకులు పలాయనంగానే విశ్లేషిస్తున్నారు. సభలో అధికారపక్షాన్ని ఎదుర్కోవడానికి భయపడిందన్న భావనే అందరిలో వ్యక్తం అవుతోంది. సభలో సంఖ్యా బలం లేదు.. నిజమే.. కానీ సభకు హాజరవ్వడం ద్వారా వైసీపీ కల్తీ నెయ్యి విషయంలో తమ వాదన పట్ల విశ్వాసంతో ఉందన్న విషయాన్ని చాటే అవకాశం ఉండేది. అలా కాకుండా సభకు గైర్హాజర్ అవ్వడం ద్వారా  ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకుని వైసీపీ మరోసారి విశ్వసనీయతను కోల్పోయిందన్న చర్చ రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.  

By
en-us Political News

  
తెలుగుదేశం రాజకీయ భిక్ష పెడితే.. ఆ భిక్షతో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలుగుదేశం ప్రాపకంతో ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రంగుమార్చి వైసీపీ గూటికి చేరి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇంతటి రాజకీయ జీవితంలోనూ ఆయనకు ప్రజలలో గుర్తింపు అంటూ వచ్చింది.. ఆయన నోటిదురుసుతోనే.
బీహార్ లో నితీష్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి పెద్ద‌ల స‌భ‌కు వెళ్తున్నార‌న్న‌ది కన్ ఫర్మ్ అయ్యింది. ఆయ‌న త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ నుంచి ఒక‌రు సీఎం ప‌ద‌విని అలంక‌రించ‌బోతున్నారు. ఆ ఒక్క‌రు ఎవ‌రై ఉంటార‌ని చూస్తే.. సామ్రాట్ చౌద‌రి, విజ‌య్ కుమార్ సిన్హా, నిత్యానంద రాయ్ అనే ముగ్గురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసింది. వారిలో ఒకరు పీసీ ఘోష్ క‌మిష‌న్ పిటిష‌న్ పై ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదిస్తున్న సీనియ‌ర్ లాయ‌ర్ అభిషేక్ మ‌ను సింఘ్వీ కాగా, రెండో వ్యక్తి వేం నరేందర్ రెడ్డి.
అయ‌తుల్లా అలీ ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డానికి మొసాద్ త‌న ఆప‌రేష‌న్ ని 2020లో మొద‌లు పెట్టి.. 2026లో ముగించింది.
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మోస్ట్ హై టెక్న‌లాజిక‌ల్ వార్ కి గానూ ఒక రోజుకు ఇరు ప‌క్షాల‌కు క‌లిపి 2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి నాలుగు బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే ప‌ద‌హారు వేల కోట్ల నుంచి 32 వేల కోట్ల వ‌ర‌కూ ఈ ఖ‌ర్చు క‌నిపిస్తోంది.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల వల్ల పశ్చిమాసియాలో అలజడి చెలరేగింది. ఈ ప్రభావం కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే కాకుండా.. ప్రపంచ ఇంధన మార్కెట్లపైనా పడుతుంది. మరీ ముఖ్యంగా భారత చమురు, ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక్క హార్మూజ్ జ‌ల‌సంధి మూసుకుపోవ‌డం వ‌ల్లే.. భార‌త్ ఎంతో న‌ష్టాన్ని చ‌వి చూస్తుంది. మ‌న చ‌మురు దిగుమ‌తి, స‌ర‌కు ఎగుమ‌తులు కూడా ఆల‌స్యం అంతుతాయి. దీని వ‌ల్ల భారీ న‌ష్టాన్ని చ‌వి చూడ‌క త‌ప్ప‌దు. ఈ యుద్ధం వ‌ల్ల ఏర్ప‌డే సందిగ్ధావ‌స్థ కూడా మ‌న ఆయిల్ ధ‌ర‌ల హెచ్చు త‌గ్గుల‌కు కార‌ణమవుతుంది.
1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హ‌యాంలో ఈ ప్ర‌త్యేక‌ ద‌ళం ఏర్పాటైంది. అప్ప‌టి పీపుల్స్ వార్ న‌క్స‌లైట్లు అడ‌వుల్లో గెరిల్లా రీతిలో దాడులు చేస్తూ పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకుని తిరిగేవారు. సాధార‌ణ పోలీసు కెపాసిటీ అడ‌వుల్లో ప‌ని చేయ‌ద‌ని గుర్తించిన కేఎస్ వ్యాస్.. అడ‌విబిడ్డ‌ను అడివిలోనే కొట్టాలి.. అనే ఐడియాతో ఈ ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న.. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సెక్స్ ట్రేడింగ్ తో రూ. 55 వేల కోట్లు ఎలా పుట్టించాడు?
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.