హర్మూజ్ క్లోజ్ అయితే పరిస్థితేంటి?

Publish Date:Mar 3, 2026

Advertisement

హర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దాన్ని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని  ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని అల్టిమేటమ్ ఇచ్చింది.  ఇంతకీ హర్మూజ్ బ్లాక్ అయితే అంటే మూతపడితే పరిస్థితేంటి?  కెప్లర్ సంస్థ వివరాల ప్రకారం 150 ఆయిల్‌ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హర్ముజ్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.  మరోవైపు హర్ముజ్‌ తూర్పువైపున 60 ట్యాంకర్లు ఎదురు చూస్తున్నాయి. ఇదిలాఉంటే, ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా.. అప్పుడే చమురు ధరలు 6 శాతం మేర పెరిగాయి.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల వల్ల పశ్చిమాసియాలో  అలజడి చెలరేగింది. ఈ ప్రభావం కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే కాకుండా.. ప్రపంచ ఇంధన మార్కెట్లపైనా పడుతుంది. మరీ ముఖ్యంగా భారత చమురు, ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్నదిప్పుడు  చర్చనీయాంశంగా మారింది. భారత్   ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ చమురు రవాణాకు ఏ మాత్రం ఆటంకం ఏర్పడినా.. ఇంధన, సరుకు రవాణా వ్యయాలు భారీగా పెరుగుతాయి. ఇరవై శాతం వాణిజ్యానికి  ఈ మార్గమే కీలకం. దీంతో భారత ఆర్ధిక వ్యవస్థకు హర్మూన్ జలసంధి మూత పెను భారం కానుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 

ఇరాన్ ని ఒమన్, యూఏఈ ల నుంచి వేరు చేసే ఈ హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచ చమురు వాణిజ్యంలోని 20 శాతం రవాణా సాగుతోంది. క్లేపర్ నివేదిక ప్రకారం..  2025 చివరి నాటికి 40 శాతంగా ఉన్న భారత చమురు దిగుమతులు.. 2026 జనవరి- ఫిబ్రవరి నాటికి 50 శాతానికి పెరిగాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించి..  మధ్యప్రాచ్య దేశాలపై భారత్ ఆధారపడ్డం మొదలైంది. దీంతో భారత్ రాక్, సౌదీ అరేబియా, యేఏఈ, కువైట్ నుంచి రోజుకు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఈ జలసంధి గుండానే  దిగుమతి చేసుకుంటోంది. సగటున రోజుకు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను కూడా భారత్ ఈ మార్గం నుంచే ఎగుమతి చేస్తోంది. 
అమెరికా బలగాల మోహరింపుతోనే ముడి చమురు ధరలు సుమారు 10 శాతం మేర పెరిగాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. ఒక వేళ రోజుకు 33 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగితే.. బ్యారెల్ ధర.. 9 నుంచి 15 శాతం పెరిగి.  76 నుంచి 81 డాలర్లకు పెరగొచ్చు. హార్ముజ్ జలసంధికి పాక్షిక ఆటంకం ఏర్పడితే.. అదనంగా 20 నుంచి 40 శాతం పెరిగి ఏకంగా 95 నుంచి 110 డాలర్లకు చేరుకుటుందని అంచనా. 

తాజా పరిణామాలతో భారత్ పై వివిధ రకాల ప్రతికూలతలు ఎదురయ్యేలా కనిపిస్తోంది. అందులో మొదటిది చమురు. మనం వాడే చమురులో ఎక్కువ భాగం విదేశాల నుంచే వస్తోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా దేశం చెల్లించాల్సిన మొత్తం దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది.  యుద్ధ భయాలతో ముడి చమురు బ్యారెల్ ధర 90 డాలర్లు దాటితే మనకు ఇబ్బందే. చమురు ధరలు స్థిరంగా పెరిగితే.. దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. దీంతో   లోటు మరింత తీవ్రతరమవుతుంది. మపం విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసినపుడు చెల్లింపులన్నీ డాలర్లలోనే చేయాలి. చమురు ధరలు పెరిగినపుడు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందువల్ల డాలర్ కి గిరాకీ పెరుగుతుంది. రూపాయపై ఈ ఒత్తిడి పడి విలువ మరింత పతనమవుతుంది.

ఇక భారత్ నుంచి ఇరాన్ కు ఎక్స్ పోర్ట్ అయ్యే బాస్మతీ బియ్యం, ఫార్మా, టీ, సుగంధ ద్రవ్యాలపైనా ప్రభావం పడుతుంది. చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలపైనా ఆ ప్రభావం పడుతుంది. ఇందువల్ల దేశ వ్యాప్తంగా సరకు రవాణా ఖర్చు కూడా పెరిగే ఛాన్సుంది. రెడ్ సీలో భద్రత లేకుంటే, ఓడలన్నీ ఆఫ్రికా మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఇందువల్ల సరకు రవాణా సమయం 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. ఖర్చులు కూడా నలభై నుంచి యాభై శాతం మేర పెరిగి తడిసిమోపెడౌతాయి. ఇవన్నీ  సాధారణ వినియోగ దారుడిపై పెను భారం మోపుతాయి. 

ఇక ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్ తదితర దేశాల గగనతలాలు పాక్షికంగా మూత పడ్డంతో ఎయిరిండియా. ఇండిగో విమాన యాన సంస్థలు అమెరికా, యూరప్ రూట్లను మళ్లించాయి. ఇందువల్ల ఇంధన ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే ఛాన్సుంది. ఇప్పటికే టారీఫ్ తఖరారు నడుస్తుండగా డీలా పడ్డ మార్కెట్లకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరం కానుంది. ఈ ఉద్రిక్తతలు ఎంత కాలం కొనసాగితే.. అంతకాలం మార్కెట్లపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో ఎంత త్వరగా యుద్ధ మేఘాలు వీడితే మార్కెట్లకు అంత మేలు జరుగుతుంది. యుద్ధ భయాల నుంచి బయట పడేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు ఎనలిస్టులు.

ఇక వెండి బంగారం ధరలు కూడా భారీ ఎత్తున ప్రభావితమయ్యేలా కనిపిస్తోంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ దూకుడు పెరిగేలా ఉందని అంటారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినపుడు ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో బంగారు, వెండి ధరలు అమాంతం పెరిగిపోతాయి. లైఫ్ టైం హై రేట్స్ కి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో గోల్డ్ పది గ్రాములు లక్షా 70 వేలు దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక కిలో వెండి కూడా 3 లక్షలకు చేరొచ్చని ఎస్ఎమ్ సీ గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

By
en-us Political News

  
తెలుగుదేశం రాజకీయ భిక్ష పెడితే.. ఆ భిక్షతో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలుగుదేశం ప్రాపకంతో ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రంగుమార్చి వైసీపీ గూటికి చేరి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇంతటి రాజకీయ జీవితంలోనూ ఆయనకు ప్రజలలో గుర్తింపు అంటూ వచ్చింది.. ఆయన నోటిదురుసుతోనే.
బీహార్ లో నితీష్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి పెద్ద‌ల స‌భ‌కు వెళ్తున్నార‌న్న‌ది కన్ ఫర్మ్ అయ్యింది. ఆయ‌న త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ నుంచి ఒక‌రు సీఎం ప‌ద‌విని అలంక‌రించ‌బోతున్నారు. ఆ ఒక్క‌రు ఎవ‌రై ఉంటార‌ని చూస్తే.. సామ్రాట్ చౌద‌రి, విజ‌య్ కుమార్ సిన్హా, నిత్యానంద రాయ్ అనే ముగ్గురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసింది. వారిలో ఒకరు పీసీ ఘోష్ క‌మిష‌న్ పిటిష‌న్ పై ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదిస్తున్న సీనియ‌ర్ లాయ‌ర్ అభిషేక్ మ‌ను సింఘ్వీ కాగా, రెండో వ్యక్తి వేం నరేందర్ రెడ్డి.
అయ‌తుల్లా అలీ ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డానికి మొసాద్ త‌న ఆప‌రేష‌న్ ని 2020లో మొద‌లు పెట్టి.. 2026లో ముగించింది.
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మోస్ట్ హై టెక్న‌లాజిక‌ల్ వార్ కి గానూ ఒక రోజుకు ఇరు ప‌క్షాల‌కు క‌లిపి 2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి నాలుగు బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే ప‌ద‌హారు వేల కోట్ల నుంచి 32 వేల కోట్ల వ‌ర‌కూ ఈ ఖ‌ర్చు క‌నిపిస్తోంది.
ఒక్క హార్మూజ్ జ‌ల‌సంధి మూసుకుపోవ‌డం వ‌ల్లే.. భార‌త్ ఎంతో న‌ష్టాన్ని చ‌వి చూస్తుంది. మ‌న చ‌మురు దిగుమ‌తి, స‌ర‌కు ఎగుమ‌తులు కూడా ఆల‌స్యం అంతుతాయి. దీని వ‌ల్ల భారీ న‌ష్టాన్ని చ‌వి చూడ‌క త‌ప్ప‌దు. ఈ యుద్ధం వ‌ల్ల ఏర్ప‌డే సందిగ్ధావ‌స్థ కూడా మ‌న ఆయిల్ ధ‌ర‌ల హెచ్చు త‌గ్గుల‌కు కార‌ణమవుతుంది.
1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హ‌యాంలో ఈ ప్ర‌త్యేక‌ ద‌ళం ఏర్పాటైంది. అప్ప‌టి పీపుల్స్ వార్ న‌క్స‌లైట్లు అడ‌వుల్లో గెరిల్లా రీతిలో దాడులు చేస్తూ పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకుని తిరిగేవారు. సాధార‌ణ పోలీసు కెపాసిటీ అడ‌వుల్లో ప‌ని చేయ‌ద‌ని గుర్తించిన కేఎస్ వ్యాస్.. అడ‌విబిడ్డ‌ను అడివిలోనే కొట్టాలి.. అనే ఐడియాతో ఈ ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న.. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సెక్స్ ట్రేడింగ్ తో రూ. 55 వేల కోట్లు ఎలా పుట్టించాడు?
మరో వైపు ఈ అంశంపై తన వాదనను తెలుగుదేశం కూటమి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ స్పష్టంగా వినిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జగన్ హయాంలో జరిగిందన్న విషయాన్ని ఆధార సహితంగా సభ ముందుంచింది.
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.