ఒక జెఫ్రీ ఎప్ స్టీన్... 55 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు?

Publish Date:Feb 26, 2026

Advertisement

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న..  జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సెక్స్ ట్రేడింగ్ తో రూ. 55 వేల కోట్లు ఎలా పుట్టించాడు? డబ్బు, అధికారం, రాజకీయం.. కలిస్తే న్యాయమూ మూగబోతుందా? జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి  అంత వికారపు సంపద ఎలా వచ్చిందీ? బ్రిటన్ రాజుకి ఉన్న సంబంధమేమిటీ? అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో లింకేంటీ? ట్రంప్ సర్కార్ లేబర్ సెక్రటరీ పదవెందుకు ఊడిందీ? అన్ని తెలిసిన ఆ న్యాయమూర్తి ఆ మదాందుణ్ణి వదిలేసినందుకు ఎంత ముట్టిందీ? చివరికి అతడెందుకు కుక్కచావు చచ్చాడు? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానమే జెఫ్రీ ఎప్‌స్టీన్- ఫిల్తీ రిచ్ అనే డాక్యుమెంటరీ సీరీస్.

ప్రస్తుతం ప్రపంచ కుబేరులను వణికిస్తున్న పేరు జెప్రీ ఎప్‌స్టీన్. ఇతడి చీకటి సామ్రాజ్యంలో ఓలలాడిన వందలాది సుఖ పురుషుల రంకు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఇప్పటికి బయటికొచ్చిన 30 లక్షల పేజీల్లో ఎవరి పేరు ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు. ఎప్‌స్టీన్‌తో పరిచయాల వల్ల ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇండియా ఏఐ సమ్మిట్‌కి వచ్చినా ఎంట్రీ దొరక్క చెప్పా పెట్టకుండానే ఇంటిదారిపట్టారు. ఇండియాకి చెందిన ఓ కేంద్ర మంత్రి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

సరిగ్గా ఇటువంటి దశలో నెట్ ఫ్లిక్స్ ఇండియన్ సెక్షన్‌లో..  జెఫ్రీ ఎప్‌స్టీన్- ఫిల్తీ రిచ్  అనే డాక్యుమెంటరీ సంచలనం రేకెత్తిస్తోంది. ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన భవంతులు, ఎలైట్ క్లాస్ డిన్నర్లు, హైక్లాస్ విందులు, వినోదాలు, వాటి వెనుక దాగి ఉన్న లైంగిక దోపిడీ వంటి  వ్యవహారాలతో నిండి ఉంటుందీ సీరీస్. ఎప్ స్టీన్ జీవితం ఒక వ్యక్తికి సంబంధించిన నేరగాథ కానే కాదు. వ్యవస్థల వైఫల్యానికి ఒక మచ్చు తునక. ఇది కేవలం క్రైమ్ కథ కాదు- ఇదో అధికారపు నీడలో దాగిన చీకటి కోణాల సమాహారం. డాక్యుమెంటరీలు మామూలుగా ఏదైనా ఒక ఘటనను చెబుతాయి. కానీ ఈ ఫిల్తీ రిచ్ సీరీస్ అంతకు మించి  నిజాలను విడమరచి చెబుతుంది. వ్యవస్థల వైఫల్యాన్ని, అధికారం ఎలా రక్షణ కవచంగా మారుతుందో ఎత్తి చూపుతుంది. 

ఈ సిరీస్ లో హీరో, విలన్ రెండూ అతడే. ఎప్‌స్టీనే. యూదు మూలాలున్న ఇతడిది ఒక సాదాసీదా కుటుంబం. తండ్రిది మరీ చిన్న వ్యాపారం, తల్లి ఓ స్కూలు టీచర్. అతనికో అన్న. ఇక ఈ సీరీస్ హీరో- విలన్ ఎప్ స్టీన్- వాక్ చాతుర్యంగల వ్యక్తి. ఇతరులను బురిడీ కొట్టించడంలో దిట్ట. డిగ్రీ కూడా లేకుండానే సైంటిస్ట్ అయిపోతాడు. ఫేక్ స్టాక్ బ్రోకర్ అవుతాడు. అధికార, అనధికార వర్గాల అవసరాలు తీర్చడమే పరమావధిగా బతుకుతుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే  సుఖ భోగ లాలసత్వానికిదో బ్రాండ్ అంబాసిడర్. రెండు ప్రైవేటు విమానాలు, విలాసాలకు సకల సౌకర్యాలున్న రెండు  ఐలాండ్స్ , ఫ్లోరిడా తీరంలో మరెవరికీ లేనటువంటి విలాస సౌదాలు, చీమచిటుక్కుమన్నా పసిగట్టే గూఢచారులు, గోడల్లోనే బిగించిన నిఘా నేత్రాలు..  ఇలా ఒకటేమిటీ.. అతనికి లేనిది లేదంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఈ తళుకు బెళుకుల  వెనుక ఉన్నది మైనర్ బాలికల విన్యాసాలు. వందలాది మంది అభం శుభం తెలియని ఆడపిల్లల శరీరాలు.

బాధితుల స్వరం- నిందితుల స్వర్గం కలవడమే ఈ కథనానికి అత్యంత కీలకం.. ఈ డాక్యుమెంటరీలో అత్యంత క్రియాశీలమైనది బాధితుల ప్రత్యక్ష వాంగ్మూలం. ముఖ్యంగా వర్జీనియా జెఫ్రీ వంటి మహిళలు తమ అనుభవాలను నిర్భయంగా వెలిబుచ్చడం సిరీస్‌ వాస్తవితకు అద్దం పడుతుంది . ఈ సీరీస్ ను తెరకెక్కించినందుకు లేడీ డైరెక్టర్ లిసా ప్రయాంట్ ఎంతో శ్రమించినట్టు కనిపించింది ఆ డాక్యుమెంటరీల్లో స్పష్టంగా కనిపిస్తుంది.   సెన్సేషన్ వైపు వెళ్లకుండా ఏ మాత్రం తడబాటు లేకుండా.. బాధితుల అనుభవాలను గౌరవంగా, నెమ్మదిగా చెబుతుంది. ఎందుకంటే నిజం చెప్పడానికి జ్ఞాపకశక్తి అవసరం లేదని ఎలా అంటారో.. మెరుగులు దిద్దడం కూడా అంతే అనవసరంగా చెప్పాలి. 

సరిగ్గా అలాగే ఉంటుందీ సీరీస్. కెమెరా బాధితుల ముఖాలపై ఎక్కువ సేపు నిలిపి, మింగుడు పడని ఓ నిజాన్ని నేరుగా ప్రేక్షకుడికి చెబుతున్నట్టు కనిపిస్తుంది. ఇంత దారుణం  మీ పిల్లలకు జరిగితే..  అనే ప్రశ్న వేయకుండానే మనం జవాబు చెప్పుకునేలా చేస్తుంది. ఈ డాక్యుమెంటరీ ఓ వ్యక్తి పాపాల చిట్టా కాదు. ఇది మూడు వ్యవస్థల దారుణ అవస్థ. డబ్బు, అధికారం, పలుకుబడి ప్రభావం. ఈ మూడు కలిస్తే బాధితుల గొంతు  బొంగురుపోతుంది. ఎప్‌స్టీన్ చావు- అనేక ప్రశ్నలకు జవాబు లేకుండా చేసినా బాధితుల వాంగ్మూలాలను చరిత్రకెక్కించడం ఈ డాక్యుమెంటరీ గొప్పదనం.  

ఈ సీరీస్ నాలుగు ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ సుమారు 55-57 నిమిషాలు. తొలి ఎపిసోడ్ లో ఎప్‌స్టీన్ ఆడపిల్లలకు ఎలా వల వేస్తాడు అనేది డీల్ చేస్తుంది. 1996 నుంచి మొదలవుతుందీ కథ. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మైనర్ బాలికలను టార్గెట్ చేయడం ఇందులో ఉంటుంది. మనకు తెలిసిన పిరమిడ్ యోగం, ధ్యానానికి సంబంధించింది. కానీ ఎప్‌స్టీన్ పిరమిడ్ స్కీమ్ మాత్రం గొలుసుకట్టు రిక్రూట్మెంట్. చైన్ లింక్ మార్కెట్ లాంటిది. ఒకరు ఇంకొకర్ని తీసుకురావాలి. వాళ్లు ఇంకొందర్ని తీసుకురావాలి. బాధితులను ఒకరికొకరు రిక్రూట్ చేయించడం ఇతని వ్యవస్థకు మూలం. ఎప్‌స్టీన్ కబంధ హస్తాల నుంచి బయటపడిన వారి ఇంటర్వ్యూలతో మొదలవుతుంది. ఎలా వంచనకు గురయ్యారో, ఎలా భయపెట్టారో డీల్ చేస్తుంది ఈ భాగం.

ఇక రెండో ఎపిసోడ్ ఫాలోద మనీ. ఎప్‌స్టీన్ కి సంపద ఎలా వచ్చింది, అది ఎలా అతనికి రక్షణ కల్పించిందనేది విడమరచి చెబుతుంది.. డబ్బుతో దేన్నైనా కొనగలను అనే ధైర్యం రావడానికి కారణమేంటో వివరిస్తుంది. 3వ ఎపిసోడ్- ది ఐలాండ్. ఎప్‌స్టీన్ కి రెండు సొంత ద్వీపాలు ఎలా వచ్చాయో, అవి టార్చర్ హౌసెస్ గా ఎలా రూపు దిద్దుకున్నాయో ఎత్తి చూపు చెబుతుంది. ఇక్కడ ఆడపిల్లలు అరిచే అరుపులు ఎలా ఆర్తనాధాలవుతాయో చూస్తుంటే మనం గిలగిల్లాడాల్సిందే. మరియా ఫార్మర్ లాంటి బాధితులు తమ ఐలాండ్ అనుభవాలను వివరిస్తుంటే మనసున్నఎవరికైనా కళ్ల వెంబడి నీరు కారాల్సిందే. 

ఈ సీరీస్‌ మొత్తంలో మోస్ట్  డిస్ట్రబింగ్ ఎపిసోడ్ ఇది. ఇక ముగింపుగా చూపే 4వ ఎపిసోడ్ ఫైండింగ్ జస్టిస్ లో బాధితుల న్యాయ పోరాటం, 2019లో మియామి హెరాల్డ్ జర్నలిస్ట్ జూలీ  బ్రౌన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఎప్‌స్టీన్‌ను మళ్లీ అరెస్టు చేయించిందీ, న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద చావును చూపుతుంది. ఆశ నిరాశల మధ్య న్యాయం ఇంకా చచ్చిపోలేదన్న సందేశంతో ముగిసినా అంతు చిక్కని ప్రశ్నలు, జవాబులు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో..

ఇన్ని ఘోరాలు చేసినా తాను అమాయకుణ్ణని తప్పించుకునేందుకు ఎప్‌స్టీన్ కోర్టు విచారణలో చూపే హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ మనకు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఒంటి నిండా పట్టిన కొవ్వుతో పాటు పట్టిన డబ్బు మదం, అహంకారంతో గతంలో తప్పించుకున్నట్టే 2019లోనూ తప్పించుకునేందుకు చేసే ప్రయత్నం, అతని చుట్టూ కుక్కపిల్లల్లా తిరిగే అమెరికన్ టాప్ మోస్ట్ లాయర్లు, వాళ్ల భాష చూస్తే మనకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. కోపం కట్టలు తెంచుకుంటుంది. తీవ్ర ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఫిల్తీ రిచ్ సీరీస్ కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు. అధికారం, హోదా, సంపద, న్యాయ వ్యవస్థ కలిసి చేసే దుర్మార్గాలు ఎలా ఉంటాయనే దానికి నిదర్శనం. ఇది చూసిన తర్వాత ప్రేక్షకుల్లో కట్టలు తెంచుకుంటుంది. కీచు గొంతుకలు కూడా పెద్దగా అరిచి చెప్పగలవన్న సత్యం గుండెలను తాకుతుంది.   

అమెరికా న్యాయశాఖ జనవరి 30న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల చేసిన నాటి నుంచి ఆ దేశంతో పాటు.. యూరప్‌లోనూ తీవ్ర అలజడి చెలరేగింది. రూ.30 లక్షల ఇ-మెయిల్‌ సంభాషణలు, లక్షకు పైగా ఫోటోలు, వేయికి పైగా వీడియో క్లిప్పింగులతో కూడిన ఈ పత్రాల విడుదలతో ఘోరమైన నేరమయ చర్యలు బయటపడ్డాయి. అయితే ఈ ఘోరాల పర్వం మొత్తం ఎప్‌స్టీన్‌ పాత్ర చుట్టూనే తిప్పుతూ తనే లక్ష్యంగా చర్చ సాగుతోంది. అయితే ఎప్‌స్టీన్‌ అమానుష  దురాగతాలు అతడేదో వంటరి వ్యక్తిగా చేసినవి కావని తెలుస్తూనే వుంది. ఒక వ్యవస్థీకృత వాతావరణంలోనే ఇవన్నీ జరిగినట్టు కనిపిస్తుంది.  ఈ తప్పులు దశాబ్దాల పాటు సాగుతూ వచ్చాయి.  2008లో వ్యక్తిగత స్థాయిలో చేస్తూ వచ్చిన ఆరోపణలు, తర్వాత ఉన్నత స్థాయిలో వారి వారి నేరాలపై ఒక దర్యాప్తుగా మారింది. తర్వాత ఎప్ స్టీన్ అరెస్టు చేయడం, 2019లో ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.


 

By
en-us Political News

  
తెలుగుదేశం రాజకీయ భిక్ష పెడితే.. ఆ భిక్షతో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలుగుదేశం ప్రాపకంతో ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రంగుమార్చి వైసీపీ గూటికి చేరి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇంతటి రాజకీయ జీవితంలోనూ ఆయనకు ప్రజలలో గుర్తింపు అంటూ వచ్చింది.. ఆయన నోటిదురుసుతోనే.
బీహార్ లో నితీష్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి పెద్ద‌ల స‌భ‌కు వెళ్తున్నార‌న్న‌ది కన్ ఫర్మ్ అయ్యింది. ఆయ‌న త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ నుంచి ఒక‌రు సీఎం ప‌ద‌విని అలంక‌రించ‌బోతున్నారు. ఆ ఒక్క‌రు ఎవ‌రై ఉంటార‌ని చూస్తే.. సామ్రాట్ చౌద‌రి, విజ‌య్ కుమార్ సిన్హా, నిత్యానంద రాయ్ అనే ముగ్గురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసింది. వారిలో ఒకరు పీసీ ఘోష్ క‌మిష‌న్ పిటిష‌న్ పై ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదిస్తున్న సీనియ‌ర్ లాయ‌ర్ అభిషేక్ మ‌ను సింఘ్వీ కాగా, రెండో వ్యక్తి వేం నరేందర్ రెడ్డి.
అయ‌తుల్లా అలీ ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డానికి మొసాద్ త‌న ఆప‌రేష‌న్ ని 2020లో మొద‌లు పెట్టి.. 2026లో ముగించింది.
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మోస్ట్ హై టెక్న‌లాజిక‌ల్ వార్ కి గానూ ఒక రోజుకు ఇరు ప‌క్షాల‌కు క‌లిపి 2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి నాలుగు బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే ప‌ద‌హారు వేల కోట్ల నుంచి 32 వేల కోట్ల వ‌ర‌కూ ఈ ఖ‌ర్చు క‌నిపిస్తోంది.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల వల్ల పశ్చిమాసియాలో అలజడి చెలరేగింది. ఈ ప్రభావం కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే కాకుండా.. ప్రపంచ ఇంధన మార్కెట్లపైనా పడుతుంది. మరీ ముఖ్యంగా భారత చమురు, ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక్క హార్మూజ్ జ‌ల‌సంధి మూసుకుపోవ‌డం వ‌ల్లే.. భార‌త్ ఎంతో న‌ష్టాన్ని చ‌వి చూస్తుంది. మ‌న చ‌మురు దిగుమ‌తి, స‌ర‌కు ఎగుమ‌తులు కూడా ఆల‌స్యం అంతుతాయి. దీని వ‌ల్ల భారీ న‌ష్టాన్ని చ‌వి చూడ‌క త‌ప్ప‌దు. ఈ యుద్ధం వ‌ల్ల ఏర్ప‌డే సందిగ్ధావ‌స్థ కూడా మ‌న ఆయిల్ ధ‌ర‌ల హెచ్చు త‌గ్గుల‌కు కార‌ణమవుతుంది.
1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హ‌యాంలో ఈ ప్ర‌త్యేక‌ ద‌ళం ఏర్పాటైంది. అప్ప‌టి పీపుల్స్ వార్ న‌క్స‌లైట్లు అడ‌వుల్లో గెరిల్లా రీతిలో దాడులు చేస్తూ పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకుని తిరిగేవారు. సాధార‌ణ పోలీసు కెపాసిటీ అడ‌వుల్లో ప‌ని చేయ‌ద‌ని గుర్తించిన కేఎస్ వ్యాస్.. అడ‌విబిడ్డ‌ను అడివిలోనే కొట్టాలి.. అనే ఐడియాతో ఈ ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు.
మరో వైపు ఈ అంశంపై తన వాదనను తెలుగుదేశం కూటమి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ స్పష్టంగా వినిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జగన్ హయాంలో జరిగిందన్న విషయాన్ని ఆధార సహితంగా సభ ముందుంచింది.
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.