బీహార్ సీఎం నితీష్ రూట్లో చంద్రబాబు?.. లోకేష్ కు లైన్ క్లియర్ చేస్తారా?

Publish Date:Mar 5, 2026

Advertisement

ఏపీ, బీహార్ రాజ‌కీయాల్లో పెను మార్పులు   ఖాయ‌మా? ఈ రెండు రాష్ట్రాల్లో అస‌లేం  జ‌రుగుతోంది? గురువారం (మార్చి 5)  బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా, ఏపీలో కూడా చంద్ర‌బాబు ఉప ప్ర‌ధాని  లేదా గ‌వ‌ర్న‌ర్ గా వెళ్ల‌నున్నార‌ని అంటున్నారు. ఇందులో నిజా నిజాలెంత?   లోకేష్ సీఎం అవ్వడానికి మార్గం సుగమం చేస్తూ  ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ కూడా కేంద్ర మంత్రిగా వెళ్లేందుకు అవకాశాలున్నాయంటూ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.    

బీహార్ లో నితీష్ సీఎం ప‌ద‌వికి రాజీనామా  చేసి  పెద్ద‌ల స‌భ‌కు వెళ్తున్నార‌న్న‌ది  కన్ ఫర్మ్ అయ్యింది. ఆయ‌న త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా  బీజేపీ నుంచి ఒక‌రు సీఎం ప‌ద‌విని అలంక‌రించ‌బోతున్నారు. ఆ ఒక్క‌రు ఎవ‌రై ఉంటార‌ని చూస్తే.. సామ్రాట్ చౌద‌రి, విజ‌య్ కుమార్ సిన్హా, నిత్యానంద రాయ్ అనే ముగ్గురు పేర్లు ప్ర‌ముఖంగా  వినిపిస్తున్నాయి. ఇక నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ ప‌రిస్థితి ఏమిటి? ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి  ద‌క్క‌వ‌చ్చు అని చూస్తే.. ఆయ‌న‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో పాటు జేడీయూ ప‌గ్గాలు కూడా అప్ప‌జెప్పేలా క‌నిపిస్తోంది. ఇక్క‌డి వ‌ర‌కూ క్రిస్ట‌ల్ క్లియ‌ర్. 

అయితే ఇక్క‌డ షిండేతో నితీష్ పోలిక ఏంటంటే పూల‌మ్మిన చోటే షిండే క‌ట్టెలు అమ్ముతున్నారు.  ఒక‌ప్పుడు మహారాష్ట్ర సీఎంగా ఒక వెలుగు వెలిగి షిండే.. ఇప్పుడు త‌న సీట్ ప‌వ‌ర్ స‌రిపోక డిప్యూటీ సీఎంగా సద్దుకుని రాజీపడ్డారు. అయితే నితీష్ మాత్రం ఆ ప‌రిస్థితి  తెచ్చుకోకుండా రాజ్యసభకు సీట్ రిజర్వ్ చేసుకున్నారంటున్నారు పరిశీలకులు.  అలాగే బీజేపీ  ముందు ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క‌టీ ఇలా త‌మ  ప్ర‌భ కోల్పోయేలా చేస్తున్నదని విశ్లేషిస్తున్నారు. బీజేపీ తీరు  ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే   విఘాతంగానూ చెబుతున్నారు.  

అయితే ఇలాంటి ప్ర‌భావం  చంద్ర‌బాబునాయుడు, తెలుగుదేశంపై పడనుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్ ను  సీఎం చేయ‌డం కోసం   ఉప  ప్ర‌ధాని  ప‌ద‌వి, లేదా  ఏదైనా  రాష్ట్రానికి గవర్నర్ గా చేపట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఇక్క‌డ లోకేష్ పాల‌న‌కు ఎలాంటి  ఆటంకం క‌ల‌గ‌కుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం కేంద్ర మంత్రిగా వెళ్ల‌నున్నార‌నీ అంటున్నారు. కానీ అదంత తేలిక‌గా  సాధ్య‌మ‌య్యేలా  క‌నిపించ‌డం లేదు. 

   చంద్ర‌బాబు దృష్టి మొత్తం ఇప్పుడు అమ‌రావ‌తి, పోల‌వ‌రం, క్వాంటం వ్యాలీ, విశాఖ ఇండ‌స్ట్రియ‌ల్ గ్రోత్ పై కేంద్రీకృతమై ఉంది.  ఆయ‌న అంత‌గా ఏపీ  గ్రోత్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక.. ఇప్పటికిప్పుడు ఆయన తన కుమారుడికి లైన్ క్లియర్ చేయడం కోసం తప్పుకుంటారనే   అధికారిక సంకేతాలు కానీ,   ఫీల‌ర్లుగానీ ఏవీ లేవు.  ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అంటున్నారు.  ఆ ట్రాప్ లో ఎవరూ పడవద్దన్న కామెంట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  

By
en-us Political News

  
తెలుగుదేశం రాజకీయ భిక్ష పెడితే.. ఆ భిక్షతో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలుగుదేశం ప్రాపకంతో ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రంగుమార్చి వైసీపీ గూటికి చేరి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇంతటి రాజకీయ జీవితంలోనూ ఆయనకు ప్రజలలో గుర్తింపు అంటూ వచ్చింది.. ఆయన నోటిదురుసుతోనే.
రాజ్యసభ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసింది. వారిలో ఒకరు పీసీ ఘోష్ క‌మిష‌న్ పిటిష‌న్ పై ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదిస్తున్న సీనియ‌ర్ లాయ‌ర్ అభిషేక్ మ‌ను సింఘ్వీ కాగా, రెండో వ్యక్తి వేం నరేందర్ రెడ్డి.
అయ‌తుల్లా అలీ ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డానికి మొసాద్ త‌న ఆప‌రేష‌న్ ని 2020లో మొద‌లు పెట్టి.. 2026లో ముగించింది.
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మోస్ట్ హై టెక్న‌లాజిక‌ల్ వార్ కి గానూ ఒక రోజుకు ఇరు ప‌క్షాల‌కు క‌లిపి 2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి నాలుగు బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే ప‌ద‌హారు వేల కోట్ల నుంచి 32 వేల కోట్ల వ‌ర‌కూ ఈ ఖ‌ర్చు క‌నిపిస్తోంది.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల వల్ల పశ్చిమాసియాలో అలజడి చెలరేగింది. ఈ ప్రభావం కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే కాకుండా.. ప్రపంచ ఇంధన మార్కెట్లపైనా పడుతుంది. మరీ ముఖ్యంగా భారత చమురు, ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక్క హార్మూజ్ జ‌ల‌సంధి మూసుకుపోవ‌డం వ‌ల్లే.. భార‌త్ ఎంతో న‌ష్టాన్ని చ‌వి చూస్తుంది. మ‌న చ‌మురు దిగుమ‌తి, స‌ర‌కు ఎగుమ‌తులు కూడా ఆల‌స్యం అంతుతాయి. దీని వ‌ల్ల భారీ న‌ష్టాన్ని చ‌వి చూడ‌క త‌ప్ప‌దు. ఈ యుద్ధం వ‌ల్ల ఏర్ప‌డే సందిగ్ధావ‌స్థ కూడా మ‌న ఆయిల్ ధ‌ర‌ల హెచ్చు త‌గ్గుల‌కు కార‌ణమవుతుంది.
1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హ‌యాంలో ఈ ప్ర‌త్యేక‌ ద‌ళం ఏర్పాటైంది. అప్ప‌టి పీపుల్స్ వార్ న‌క్స‌లైట్లు అడ‌వుల్లో గెరిల్లా రీతిలో దాడులు చేస్తూ పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకుని తిరిగేవారు. సాధార‌ణ పోలీసు కెపాసిటీ అడ‌వుల్లో ప‌ని చేయ‌ద‌ని గుర్తించిన కేఎస్ వ్యాస్.. అడ‌విబిడ్డ‌ను అడివిలోనే కొట్టాలి.. అనే ఐడియాతో ఈ ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న.. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సెక్స్ ట్రేడింగ్ తో రూ. 55 వేల కోట్లు ఎలా పుట్టించాడు?
మరో వైపు ఈ అంశంపై తన వాదనను తెలుగుదేశం కూటమి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ స్పష్టంగా వినిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జగన్ హయాంలో జరిగిందన్న విషయాన్ని ఆధార సహితంగా సభ ముందుంచింది.
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.